08.06.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ శ్రేష్ట శక్తి - పరిశీలనాశక్తి.

సర్వశక్తులను నింపే సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -

సర్వశక్తులలో విశేష శక్తి ఏమిటో తెలుసా? స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారా? సర్వశక్తులలో సర్వ శ్రేష్ట శక్తి ఏది? మామూలుగా కూడా చదువులో అనేక సబ్జక్టులు ఉంటాయి. కానీ వాటిలో ఒకటి విశేషంగా ఉంటుంది. అదేవిధంగా సర్వశక్తులు అవసరమే కానీ ఈ అన్ని శక్తులలో అన్నింటికంటే శ్రేష్ట శక్తి ఏది? ఆ శక్తి చాలా అవసరం, అది లేకుండా మహారథీ లేదా మహావీరులు అవ్వటం కష్టం. వాస్తవానికి అన్ని శక్తులూ అవసరమే, పరస్పర సంబంధం ఉంటుంది. అయినప్పటికీ మొదటి నెంబర్ శక్తి ఏది? ఆ శక్తి సర్వశక్తులను తీసుకొస్తుంది. ఆ శక్తి ఏది? (పరీశీలనా శక్తి) స్వయాన్ని అనుభూతి చెందటం కూడా పరిశీలనాశక్తియే. స్వ అనుభూతి అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం మరియు తెలుసుకోవటం అని అర్థం. మొదట బాబాని పరిశీలించారు, అప్పుడే బాబాని తెలుసుకున్నారు లేదా గ్రహించారు. గ్రహించిన తర్వాత బాబాకి సమీపంగా అయ్యారు లేదా బాబా సమానంగా కాగలుగుతున్నారు. కనుక పరిశీలనా శక్తి నెంబర్ వన్ శక్తి, పరిశీలించటం అనగా సాధారణ భాషలో గ్రహించటం అని అంటారు. జ్ఞానానికి మొట్టమొదటి ఆధారం కూడా తండ్రిని గ్రహించటం. అంటే పరిశీలించటం. బాబా యొక్క కర్తవ్యం నడుస్తుంది అని తెలుసుకోవటం. కనుక మొదట పరీశీలనాశక్తి అవసరం. పరిశీలనా శక్తిని జ్ఞాన సాగర స్థితి అని అంటారు. పరిశీలనాశక్తి యొక్క విస్తారం ఏమిటి మరియు పరిశీలనా శక్తి ద్వారా ఏమేమి ప్రాప్తిస్తాయి? ఈ విషయంపై పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవచ్చు. ఇద్దరు ఆటగాళ్ళు పరస్పరం సమానులు అయితే ఆటలో కూడా చాలా మజా వస్తుంది. సమానంగా ఉన్నప్పుడు ఆటలో కూడా మిలనం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆట ఆడుకుంటూ ఆడుకుంటూ పరస్పరం స్నేహితులు అయిపోతారు. అది స్థూల ఆట, ఇక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆత్మలలో సమీపత యొక్క మిలనం జరుగుతుంది. అంటే ఆత్మల యొక్క స్వభావ సంస్కారాలు కలుస్తాయి. ఆడేటటువంటి ఆటగాడు తన సాథీ చాలా పక్కాగా ఉన్నట్లయితే జీవితాంతం ఆ తోడుని నిలుపుకుంటారు. అదేవిధంగా ఆత్మిక ఆటతో పాటు అంతిమం వరకు పరస్పరం కలిసే ఉంటారు. ఇలా మీరు కలిసి ఉన్న దానికి గుర్తుగానే మాల తయారవుతుంది. అన్ని విషయాలలో అంతిమం వరకు ఒకరికొకరు సమీపం అవుతారు. ఒకరికొకరి స్వభావ సంస్కారాలు కలిసినప్పుడే పూసపూసతో కలిసి మాలగా తయారవుతుంది. ఇలా మీరందరు కలిసి ఉన్న దానికి గుర్తుయే మాల.