13.06.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక యుద్ధవీరులు.

సర్వ బంధన్ముక్తులు, త్రికాలదర్శి, సర్వశక్తివంతుడు, విశ్వకళ్యాణ కారి, శ్రేష్ట కర్మను నేర్పించేవారు, శ్రేష్ట జీవితాన్ని తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు -

స్వయాన్ని ఆత్మిక సైన యొక్క మహారథీగా భావిస్తున్నారా? సేన యొక్క మహారథీ అని ఎవరిని అంటారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? మహారథీ అనగా రధంపై స్వారీ చేసేవారు. స్వయాన్ని రథికునిగా భావించేవారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయాన్ని రథికునిగా భావించి ఈ రథాన్ని నడిపించేవారిగా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ యుద్ధమైదానంలో ఏ మహారథీ అయినా తన రథానికి అనగా స్వారీ చేసే రథానికి వశం అయిపోతే ఆ మహారథీ విజయీగా కాగలరా లేక తన సేన విజయం పొందటానికి విఘ్న రూపంగా అవుతారా? అలజడిని వ్యాపింపచేయడానికి నిమిత్తమవుతారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఆత్మిక సేన యొక్క యుద్ద వీరులు ఉన్నారో, మీరు మీ రథానికి రథికులుగా అయ్యారా? ఎలాగైతే యుద్ధవీరుడు వ్యక్తులందరినీ మరియు వైభవాలన్నింటినీ విడిచి యుద్ధం మరియు విజయం అనే రెండు విషయాలపై ధ్యాస పెట్టి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి నిమిత్తమవుతారు. అదేవిధంగా మిమ్మల్ని మీరు అడగండి నాకు కూడా ఈ రెండు విషయాలే లక్ష్యంగా ఉన్నాయా లేక మరే ఇతర విషయాలు అయినా స్మృతిలో ఉంటున్నాయా? ఇలాంటి యుద్ధ వీరులుగా తయారయ్యారా? మీరు ఎక్కడైనా ఉండండి, కానీ స్మృతి ఉంచుకోండి - మేము యుద్ధమైదానంలో ఉపస్థితులై ఉన్న యుద్ధవీరులం. యుద్ధ వీరులు ఎప్పుడూ కూడా విశ్రాంతిని ఇష్టపడరు. యుద్ధవీరులు ఎప్పుడూ కూడా సోమరిగా లేదా నిర్లక్ష్యంగా ఉండరు. యుద్ధవీరులు ఎప్పుడూ కూడా శస్త్రాలు లేకుండా ఉండరు, సదా శస్త్రధారిగా ఉంటారు. యుద్ధవీరులు ఎప్పుడూ కూడా భయానికి వశీభూతం అవ్వరు, నిర్భయులుగా ఉంటారు. యుద్ధవీరులు యుద్ధం తప్ప మరే ఇతర విషయాన్ని బుద్ధిలో పెట్టుకోరు. సదా యుద్ధస్థితి మరియు విజయీగా అయ్యే స్మృతిలో ఉంటారు. అలాగే మీరందరు కూడా పరస్పరంలో విజయీ అవుతున్నారా? ఈ దృష్టితో ఒకరినొకరు చూసుకుంటున్నారా? ఆత్మిక యుద్ధవీరులు సదా ఇదే దృష్టిలో ఉంటారు - మేమందరం పరస్పర మహావీరులం, విజయీలం. ప్రతీ సెకను, ప్రతీ అడుగు యుద్ధమైదానంలో స్థితి అయ్యి ఉన్నారు. విజయీ అవ్వాలనే ఒకే సంలగ్నత ఉంటుంది. మీరందరు కూడా సర్వసంబంధాలను లేదా సర్వ ప్రకృతి సాధనాల నుండి మీ బుద్ధిని అతీతం చేసేశారా? వాటిని దూరం పెట్టేశారా? మీరు ఉండడానికి యుద్ధమైదానంలో ఉన్నారు, కానీ బుద్ధి రూపి తీగ ఇతర సంబంధీకుల వైపు లేదా ఏదైనా ప్రకృతి సాధనం వైపు తగుల్కుని లేదు కదా! మిమ్మల్ని మీరు సంపూర్ణ స్వతంత్రులుగా భావిస్తున్నారా లేక ఏ విషయంలోనైనా పరతంత్రత కూడా ఉందా? సంపూర్ణ స్వతంత్రత అనగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాభిమానానికి అతీతం అయిపోవాలి. కొంచెం కూడా ఈ దేహం మిమ్మల్ని తన వైపుకి ఆకర్షించుకోకూడదు, ఈ విధంగా దేహాభిమానం అనగాని దేహంపై తగుల్పాటు నుండి స్వతంత్రులు అయ్యారా? మీ యొక్క పాత స్వభావాలతో స్వతంత్రులు అయ్యారా? మీ స్వభావంతో కూడా మీరు బంధించబడకూడదు. మీ సంస్కారాలతో కూడా మీరు స్వతంత్రులుగా ఉండాలి. మీ లౌకిక సంప్రదింపులు లేదా అలౌకిక సంప్రదింపుల యొక్క బంధన నుండి కూడా మీరు స్వతంత్రులుగా ఉండాలి. ఇలాంటి స్వతంత్రులుగా తయారయ్యారా? అలాంటి వారినే సంపూర్ణ స్వతంత్రులు అని అంటారు. ఇలాంటి స్థితికి చేరుకున్నారా? లేక ఇప్పటి వరకు ఏ చిన్న కర్మేంద్రియం అయినా కానీ మిమ్మల్ని తన బంధనలో బంధిస్తుందా?

చిన్న చీమ పెద్దపులిని లేదా మహారథీని అలజడి చేస్తుందంటే అలాంటి మహారథీని లేదా పెద్దపులిని ఏమంటారు? పెద్దపులి అని అంటారా? అంటే ఒక్క వ్యర్ధ సంకల్పం మాస్టర్ సర్వశక్తివంతులైన మిమ్మల్ని అలజడి చేస్తుందంటే లేదా 84 జన్మల యొక్క ఒక పాత జడజడీభూత సంస్కారం మాస్టర్ సర్వశక్తివంతులు, మహావీరులు, విఘ్నవినాశకులు, త్రికాలదర్శి, స్వదర్శనచక్రధారి అయిన మిమ్మల్ని అలజడి చేసేస్తుంది లేదా పురుషార్థాన్ని బలహీనం చేస్తుంటే, అలాంటి మాస్టర్ సర్వశక్తివంతులను ఏమంటారు? ఏ సమయంలో ఇలాంటి స్థితిలో ఉంటారో ఆ సమయంలో మీ గురించి మీకే ఆశ్చర్యం అనిపించటం లేదా? నాకు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. పాత స్వభావ సంస్కారాలు నన్ను వశీభూతం చేసేస్తున్నాయి, బాబా స్మృతిలో నాకు అనుభవం అవ్వటం లేదు, బాబా ద్వారా నాకు ఏదీ ప్రాప్తించటం లేదు, చిన్న విఘ్నానికి కూడా భయపడిపోతున్నాను, నిరంతరం అతీంద్రియసుఖంలో హర్షితంగా ఉండలేకపోతున్నాను, సంతోషం అనుభవం అవ్వటం లేదు... ఇలాంటి మాటలు బ్రాహ్మణ కులభూషణులు మాట్లాడతారా? ఇలాంటి బ్రాహ్మణులను ఎలాంటి బ్రాహ్మణులు అని అంటారు? వీరిని నామధారి బ్రాహ్మణులు అని అంటారు. సత్యమైన బ్రాహ్మణులు మరియు నామధారి బ్రాహ్మణులు మరియు ద్వాపరయుగి బ్రాహ్మణులు, ఇలాంటి మాటలు మాట్లాడే బ్రాహ్మణులు... వీరిలో తేడా ఏమిటి? వర్తమాన సమయంలో బ్రాహ్మణులుగా తయారైన ఆత్మలు మిమ్మల్ని మీరు చూసుకోండి - బ్రాహ్మణత్వం యొక్క మొదటి లక్షణం నా జీవితంలోకి తీసుకువచ్చానా? బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి లక్షణం ఏమిటి? ఇతర సాంగత్యాలన్నింటినీ త్రెంచుకుని ఒక్క సాంగత్యాన్నే జోడించాలి. కానీ మీరు మీ కర్మేంద్రియాల వైపు జోడిస్తూ ఉంటే ఇది బ్రాహ్మణుల యొక్క మొదటి లక్షణమా? బ్రాహ్మణులైన మీ యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ లేదా మరజీవ జన్మ యొక్క మొట్టమొదటి మాట ఏమిటి? నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు - ఇదే మీ మొదటి ప్రతిజ్ఞ కదా! ఇదే మొదటి లక్షణం కూడా. మరి ఈ మొదటి లక్షణాన్ని లేదా ఈ మొదటి ప్రతిజ్ఞని లేదా మొదటి మాటని నిలుపుకున్నారా? ఒక్కరు అని చెప్తూ అనేకులతో జోడిస్తున్నారా? ఇలాంటి నామధారి బ్రాహ్మణులు విజయీగా పిలవబడతారా? ఇంత పెద్ద విశ్వంలో బ్రాహ్మణులైన మీది ఒక చిన్న ప్రపంచం, ఈ చిన్న ప్రపంచంలో ప్రతీ కార్యం చేస్తూ విశ్వంలో ఏ ఆత్మలనైతే మీరు చూస్తున్నారో వారందరినీ కేవలం కళ్యాణ భావంతోనే చూస్తున్నారా? సంబంధం లేదా తగుల్పాటు యొక్క భావన లేదు కదా! కేవలం ఈశ్వరీయ సేవాభావంతో చూస్తున్నారా? పంచతత్వాలను చూస్తూ ప్రకృతిని చూస్తూ ప్రకృతికి వశం అవ్వటం లేదు కదా! ప్రకృతిని కూడా సతోప్రదానంగా చేసే కార్యంలో స్థితి అవుతున్నారా? ప్రకృతిని పరివర్తన చేసే మీరు ప్రకృతికి వశం అవుతారా? ఇప్పుడు ప్రకృతిని వశం చేసుకోలేకపోతే భవిష్యత్తులో సతోప్రదాన ప్రకృతి యొక్క సుఖాలను ఏవిధంగా పొందుతారు? కనుక ప్రకృతికి వశం అవ్వటం లేదు కదా! ఒకవేళ వశం అయితే అది ఎలా ఉంటుందంటే వైద్యుడు రోగిని రక్షించడానికి బదులు వైద్యుడే రోగిగా అయినట్లు. అలాగే మీ కర్తవ్యం ప్రకృతిని పరివర్తన చేయటం, దానికి బదులు మీరు ప్రకృతికి వశం అయిపోతున్నారు. అలాంటి వారిని బ్రాహ్మణులు అని అంటారా? బ్రాహ్మణులుగా అయితే అందరు అయ్యారు కదా! నేను బ్రాహ్మణాత్మను కాదు అని ఎవరూ అనరు కదా! బ్రాహ్మణులుగా అవ్వటం అంటే ఇలాంటి లక్షణాలను ధారణ చేయటం. మరి మీరు ఇలాంటి లక్షణధారియేనా లేక నామధారియా? ఈ విధంగా మిమ్మల్ని మీరు అడగండి - బ్రాహ్మణ జన్మకి ఉన్న విశేషత మరే ఇతర జన్మల్లోను ఉండదు. బ్రాహ్మణ జన్మ యొక్క విశేషత ఏమిటంటే ఇతర జన్మలన్నీ ఆత్మల ద్వారా ఆత్మలకి జరుగుతుంది. కానీ ఈ ఒక్క బ్రాహ్మణ జన్మయే పరంపిత పరమాత్మ ద్వారా స్వయంగా జన్మిస్తారు. దేవతాజన్మ కూడా శ్రేష్టాత్మల ద్వారా జరుగుతుంది, పరమాత్మ ద్వారా కాదు. కనుక బ్రాహ్మణ జన్మకున్న విశేషత కల్పమంతటిలో మరే ఇతర జన్మకీ లేదు. అలాంటి విశేషతా సంపన్న జన్మ ఇది, మరి అలాంటి జన్మ తీసుకున్నవారి విశేషత కూడా ఏవిధంగా ఉండాలి? తండ్రి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణాత్మల యొక్క గుణాలుగా ఉండాలి. ఆ గుణాలు కూడా ఈ బ్రాహ్మణ జన్మలో తప్ప మరే ఇతర జన్మలోను రావు. ఈ బ్రాహ్మణ జీవితంలో త్రికాలదర్శిగా, త్రినేత్రిగా, జ్ఞాన స్వరూపంగా అవుతున్నారు. ఆవిధంగా ఇతర జన్మల్లో అవుతారా? మరయితే కేవలం బ్రాహ్మణ జీవితం యొక్క గుణాలు లేదా విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బ్రాహ్మణ జీవితంలో అనుభవం చేసుకోకపోతే మరెప్పుడు చేసుకుంటారు? బ్రాహ్మణులు అయ్యి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతను అనుభవం చేసుకోకపోతే బ్రాహ్మణులుగా అయ్యి ఏమి చేసినట్లు? మీరు ఇతర ఆత్మలకి చెప్తారు కదా - పరమాత్మ సంతానం అయ్యి ఉండి పరమాత్మను తెలుసుకోకపోతే మీరు గుడ్డిగవ్వతో సమానమని. అందరికీ మీరు ఇలా చెప్తారు కదా! కానీ మీరు వజ్ర తుల్యజన్మ తీసుకుని కూడా జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవటం లేదు. చేతికి వజ్రం దొరికింది. కానీ దానిని రాడుగా భావించి దాని విలువను గ్రహించకుండా ఉంటే అలాంటి వారిని ఏమంటారు? గొప్ప తెలివైనవారు అని అంటారా? మరో రకంగా అయితే చెప్పలేము కదా! ఇలా వ్యతిరేక అతితెలివైన వారిగా ఎప్పుడూ అవ్వటం లేదు కదా! బ్రాహ్మణ జన్మ యొక్క విలువను తెలుసుకోండి. ఇది సాధారణ విషయం కాదు. మేమే బ్రాహ్మణులుగా అయిపోయాము అని అనుకోకండి. సదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బ్రాహ్మణ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నానా? మంచిది.

ఈవిధంగా శ్రేష్ట జన్మ, శ్రేష్ట కర్మ, శ్రేష్ట జీవితం, శ్రేష్ట సేవలో సదా నడిచే శ్రేష్ఠాత్మలకు, విశ్వకళ్యాణకారి ఆత్మలకు, సర్వ బంధనాల నుండి సంపూర్ణ స్వతంత్రంగా ఉండే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే...