18.06.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశేష ఆత్మల యొక్క విశేషత.

ప్రతీ కష్టాన్ని సహజం చేసేవారు, పర్వతాన్ని దూది వలె చేసేవారు, అసంభవాన్ని సంభవం చేసేవారు, సృష్టి రచయిత, విశ్వ కళ్యాణకారి బాబా మాట్లాడుతున్నారు -

ఈ సమయంలో మీరందరు మీ యొక్క శ్రేష్ఠ స్వమానం అనే సింహాసనంపై స్థితి అయ్యి ఉన్నారా? శ్రేష్ట స్వమానం యొక్క రూపం ఏమిటో తెలుసా? ఈ సమయంలో మీరందరు విశ్వ రచయిత యొక్క డైరెక్ట్ రచన, మొదటి రచన, సర్వ శ్రేష్ట రచన మరియు రచయిత యొక్క పిల్లలు, పిల్లల నుండి యజమానులు, బాప్ దాదా యొక్క నయనరత్నాలు, హృదయసింహాసనాధికారులు, మస్తకమణులు మరియు బాప్ దాదా యొక్క కర్తవ్యంలో సహాయకారులు అనగా విశ్వ కళ్యాణకారులు, విశ్వానికి ఆధారమూర్తులు, విశ్వం ముందు శ్రేష్ట ఉదాహరణ రూపాలు ... ఈవిధంగా సత్యమైన స్వమానం యొక్క స్మృతిలో ఉంటున్నారా? సదా స్వమానం అనే సింహాసనంపై స్థితి అయ్యి ఉంటున్నారా లేక సింహాసనంపై స్థితులు కాలేకపోతున్నారా? పేరే సింహాసనం. దీని అర్థం ఏమిటి? దీనిపై ఎవరు స్థితులు కాగలరు? సర్వశక్తిసంపన్నులే ఈ ఆసనంపై అనగా ఈ స్థితిలో స్థితులు కాగలరు. సింహం అనగా సింహమే. మీరు సింహంగా కాకపోతే సింహాసనంపై స్థితులు కాలేరు. సింహాసనం అనేది ఎవరి కోసం? సర్వశక్తివంతుని యొక్క మొదటి రచన. మరి మొదట రచనలో రచయిత సమానమైన సర్వ శక్తులు స్వరూపంలో కనిపిస్తున్నాయా? మొదటి రచనలో ఉండాల్సిన విశేషతలు ఏమిటో తెలుసా? ఆ విశేషత కారణంగానే మీరు విశ్వ రచయితకి కూడా యజమానిగా అవుతున్నారు. బాబా కంటే కూడా విశేష పూజాయోగ్యులుగా అవుతున్నారు. బాబా కూడా ఇలాంటి రచన యొక్క గుణగానం చేస్తున్నారు. వందనం చేస్తున్నారు. ఆ విశేషత ఏమిటి? బాబా యొక్క మహిమ ఆత్మలు చేస్తారు. కానీ ఇలాంటి సర్వశ్రేష్ట ఆత్మల యొక్క మహిమ స్వయం సర్వశక్తివంతుడు చేస్తున్నారు. అంటే పరమాత్మ ద్వారా ఆత్మలైన మీకు మహిమ జరుగుతుంది. ఇలాంటి ఆత్మలను స్వయంగా పరమాత్మ ప్రతీ రోజూ మాటిమాటికీ స్మరించుకుంటూ ఉంటారు. అలాంటి విశేషాత్మలకి ఉండే ముఖ్య విశేషత ఏమిటి? దాని కారణంగానే వారు అంత శ్రేష్టంగా అయ్యారు. మీలో ఉన్న ఆ విశేషత ఏమిటో తెలుసా? బాబా కంటే కొన్ని విశేషతలు తప్పకుండా మీకే ఎక్కువ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా? ఏ విషయంలో బాబా కంటే ముందు మీరు ఉన్నారు? ఆ విశేషత ఏమిటో చెప్పండి? బాప్ దాదా కంటే ఏ విషయంలో మీరు ముందున్నారు? అష్టరత్నాలలోకి కేవలం శక్తులే వస్తారా లేక పాండవులు కూడా వస్తారా? పరస్పరం సోదరులం అనగా ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే ఆత్మయే అష్టరత్నాల్లోకి వస్తుంది. దీంట్లో శక్తులు పాండవులు అనే విషయం ఏమీ ఉండదు. ఆత్మిక స్థితి అనే విషయమే లెక్కించబడుతుంది. ఇరువురు వస్తారు. అష్టరత్నాలలో పాండవులకి కూడా అవకాశం ఉంటుంది. మంచిది. మొదటి విశేషత ఏమిటి? బాబాకి కూడా యజమానిగా చేస్తుంది. ఆ విశేషత, బాబా కంటే కూడా శ్రేష్టంగా చేస్తుంది, ఆ విశేషత ఏమిటంటే తండ్రిని ప్రత్యక్షం చేయటం, తండ్రి యొక్క సంబంధానికి సమీపంగా తీసుకురావటం, తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా తయారు చేయటం, ఇది మొదటి రచన అయిన మీ యొక్క కర్తవ్యం. తండ్రి పిల్లల ద్వారానే ప్రత్యక్షమవుతారు. నిరాకార తండ్రి మరియు సాకార బ్రహ్మాబాబా ఇద్దరినీ కూడా మీ నిశ్చయం, మీ బ్రాహ్మణ జీవితం, మీ అనుభవం ఆధారంగా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారా? అప్పుడే మీరు విశేషాత్మలుగా పిలవబడతారు. తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషత పిల్లలదే. అందువలన బాబా దానికి ఫలితంగా స్వయం గుప్తంగా ఉండి, విశ్వం ముందు శక్తిసేన, పాండవసేన అయిన మిమ్మల్ని ప్రఖ్యాతి చేస్తున్నారు. ఈ విశేషత పిల్లలదే. అందువలన బాబా కంటే కూడా ఎక్కువ పూజ్యనీయులుగా ఉంటున్నారు. మీ యొక్క ఈ విశేషత స్మృతిలో ఉంటుందా లేక మర్చిపోతున్నారా? సంగమయుగి బ్రాహ్మణుల యొక్క విశేషత - సదా స్మృతి స్వరూపులుగా ఉండటం. మరి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అనుభవం అవుతుందా? విస్మృతియే శూద్రత్వం. బ్రాహ్మణులుగా అయ్యి ఉండి కూడా విస్సృతిలోకి వచ్చేస్తూ ఉంటే శూద్రులు మరియు బ్రాహ్మణులలోతేడా ఏమిటి? మరజీవ జన్మ యొక్క అలౌకికత ఏమి ఉంది? విస్మృతి అనేది లౌకికత అనగా ఈ లోకం యొక్క ఆచారం. బ్రాహ్మణుల యొక్క ఆచారం - సదా స్మృతి స్వరూపంగా ఉండటం. ఎప్పుడైనా మీ లౌకిక కులం యొక్క ఆచారాలు లేదా మర్యాదలు మర్చిపోతారా? మరి బ్రాహ్మణ కులం యొక్క ఆచారాలు లేదా మర్యాదలు మర్చిపోవటం అనేది సంభవమైన విషయమేనా? బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు అలౌకికమైనవి. ఆ ఆచారాల్లో నడవటం మీకు సర్వ సాధారణం మరియు సహజం ఎందుకంటే మీరే బ్రాహ్మణులు కనుక. ఇతర కులం యొక్క ఆచారాలు పాటించాలంటే కష్టంగా ఉంటుంది, కానీ ఇవి మీ యొక్క ఆది ఆచార వ్యవహారాలు. కనుక ఇవి మీ సహజ జీవితం. బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు ఇవి, మరి ఇవి మీకు కష్టంగా ఎందుకు అనిపిస్తాయి! బ్రాహ్మణజీవితం యొక్క స్వభావం లేదా సంస్కారం ఏమిటి? సర్వ దివ్యగుణాలే బ్రాహ్మణుల స్వభావం, దీనినే దివ్య స్వభావం అని అంటారు. దివ్యగుణాలు బ్రాహ్మణుల యొక్క స్వభావికత. అనగా బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావమే సర్వ దివ్యగుణాలు. గంభీరత, రమణీయత, హర్షితముఖత, సహనశీలత, సంతోషం... ఇవన్నీ బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావ సంస్కారాలు. మీరు విశ్వ సేవాదారులు. బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావ సంస్కారాలే ఇవి అయినప్పుడు ఏ గుణాన్ని అయినా ధారణ చేయటం లేదా సేవాధారిగా చేసుకునేటందుకు కష్టం ఏమి ఉంది? నేను అనేది త్యాగం చేసి నిరంతర తపస్వి స్వరూపులుగా లేదా స్మృతి స్వరూపులుగా అవ్వటం సహజమైన మరియు సాధారణమైన విషయమే కదా! ఇతర జన్మ యొక్క సంస్కారాలు ఏవైనా మిగిలిపోతే వాటిని పరివర్తన చేసుకోవటం కష్టం అనిపిస్తుంది. మీరు కూడా బలహీనతకు వశమై సాకులు చెప్తారు - ఇది నా స్వభావం లేదా సంస్కారం అని అంటారు. అదేవిధంగా బ్రాహ్మణ జీవితం యొక్క ఆది స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటి ప్రకారంగా నడవటం సహజమా లేక కష్టమా? ఈ దివ్యగుణ సంస్కారాలకి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేయమని ఎవరైనా చెప్తే అది బ్రాహ్మణులకి కష్టం అనిపించాలి. ఇప్పుడు మీ ప్రత్యక్ష జీవితంలో ఏమి ఉన్నాయి? శూద్రత్వం యొక్క స్వభావ సంస్కారాలు సహజ రూపంలో ఉన్నాయా లేక బ్రాహ్మణత్వం యొక్క స్వభావ సంస్కారాలు సహజ రూపంలో ఉన్నాయా? వీటి కోసం పురుషార్థం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి మీ జీవితం యొక్క నిజ సంస్కారాలు. ఇంతకు ముందు చెప్పాను కదా - మీ స్వమానం అనే సింహాసనంపై స్థితి అవ్వటం లేదు. మీ సింహాసనాన్ని వదిలేస్తున్నారు, తయారైన మీ భాగ్యాన్ని మర్చిపోతున్నారు. అందువలనే నిజ స్వభావ సంస్కారాలు కూడా కష్టంగా అనుభవం అవుతున్నాయి. అర్థమైందా! పిల్లలలో ఉన్న ఈ విషయం గురించి బాబా కూడా చెప్తారు. కష్టాన్ని సహజం చేసేవారు, పర్వతాన్ని రాయిగా లేదా దూదిగా చేసేవారు, దూది అనగా తేలికగా మరియు స్వచ్చంగా తయారుచేసేవారు, సర్వతం అనగా కష్టంగా, బరువుగా ఉండేది. ఈ మహిమ బాబాకి ఉంది. ఎక్కడ పర్వతం, ఎక్కడ దూది మరియు రాయి. మరి బాబాకి ఏదైతే మహిమ ఉందో అది మీది కాదా? కష్టాన్ని సహజం చేసేవారే బ్రాహ్మణులు అయినప్పుడు వారికి ఏవిషయం అయినా కష్టంగా అనుభవం అవుతుందా? సంభవమేనా? కనుక మీ స్వమానంలో స్థితిలో మీ విశేషతని ప్రతీ సమయం స్మృతిలో ఉంచుకోండి. విశేషాత్మలు ప్రతీ సంకల్పం, ప్రతీ కార్యం విశేషంగా చేస్తారు మరియు శ్రేష్టంగా చేస్తారు. మంచిది.

ఈవిధంగా సదా కష్టాన్ని సహజం చేసేవారు, సదా స్మృతి స్వరూపులు, బాబా సమానంగా ప్రతి సంకల్పం, ప్రతి సెకను విశ్వ కళ్యాణం యొక్క విశేష కార్యంలో ఉపయోగించేవారు, విశ్వకళ్యాణకారి మరియు బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.