20.06.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంలగ్నతకి సాధనం - విఘ్నం.

వరదాత, సర్వుల కళ్యాణకారి, విఘ్న వినాశక శివబాబా మాట్లాడుతున్నారు -

వరదాన భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తింప చేసుకుని తీవ్ర పురుషార్ధి అయ్యి వెళ్తున్నారా? పురుషార్ధంలో ఏదైతే పరివర్తన చేసుకున్నారా, అది అవినాశిగా చేసుకున్నారా లేక అల్పకాలికంగా మాత్రమే చేసుకున్నారా? ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ విఘ్నం మిమ్మల్ని కదిలించడానికి వచ్చినా, కానీ ఎవరి తోడు స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో వారి ఎదురుగా ఆ విఘ్నం ఏమి అయిపోతుంది? విఘ్నం పరివర్తన అయిపోయి ఏవిధంగా అయిపోతుంది? విఘ్నం అనేది సంలగ్నతని పెంచే సాధనంగా అయిపోతుంది. హర్షితంగా ఉంటారు కదా! ఒకవేళ ఏ పరిస్థితి అయినా లేదా వ్యక్తి అయినా విఘ్నం వేసేటందుకు నిమిత్తం అయినా కానీ వారి పట్ల ద్వేషము లేదా వ్యర్ధ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. వారి గురించి కూడా ఓహో ఓహో అని రావాలి. మీరు ఇలాంటి దృష్టిని పెట్టుకున్నట్లయితే మీ అందరి దృష్టి చాలా ఉన్నతంగా అయిపోతుంది. ఎవరు ఏవిధంగా ఉన్నా కానీ మీ దృష్టి మరియు వృత్తి సదా శుభ చింతకులుగా మరియు కళ్యాణభావన కలిగి ఉండాలి. ప్రతీ విషయంలో కళ్యాణం కనిపించాలి. కళ్యాణకారి తండ్రి యొక్క సంతానం మీరు, కళ్యాణకారులు కదా! కళ్యాణకారిగా అయిన తర్వాత అకళ్యాణ విషయం అనేది ఏదీ ఉండదు. ఈ నిశ్చయం మరియు ఇలాంటి స్మృతి స్వరూపంగా అవ్వండి. అప్పుడు మీరు ఎప్పుడూ అలజడి అవ్వరు. ఎలాగైతే ఎవరైనా కానీ ఆకుపచ్చని లేదా ఎర్రని కళ్ళద్దాలు ధరించినట్లయితే వారికి అంతా ఆకుపచ్చగా లేదా ఎరుపు కనిపిస్తుంది. అలాగే మీరు కూడా మీ మూడవనేత్రానికి కళ్యాణకారి అనే కళ్ళజోడు పెట్టుకోండి. మూడవ నేత్రమే కళ్యాణకారి, దాంట్లో ఏదీ అకళ్యాణకారిగా కనిపించదు. అది జరగనే జరగదు. ఏదయితే అజ్ఞాని ప్రజలు అకళ్యాణంగా భావిస్తారో మీకు ఆ అకళ్యాణంలో కూడా కళ్యాణమే నిండి ఉంటుంది. ఉదాహరణకి ప్రజలు వినాశనాన్ని అకళ్యాణంగా భావిస్తారు. కానీ మీరు ఏమని భావిస్తారు? వినాశనం ద్వారానే గతి సద్గతి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి అని భావిస్తారు. ఈ విధంగా ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ అన్నింటిలో కళ్యాణం నిండి ఉంటుంది. ఈ విధంగా నిశ్చయబుద్ది అయ్యి నడవండి, అప్పుడు మీకు ఏమి ప్రాప్తిస్తుంది? ఏకరస స్థితిలో స్థితులైపోతారు. ఏ విషయంలోను మీరు ఆగిపోకూడదు. ఎవరైతే ఆగిపోతారో వారు బలహీనులు. మహావీరులు ఎప్పుడూ ఆగరు. విఘ్నం రాగానే ఆగిపోరు.