23.09.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వాత్మలకు ప్రకాశాన్ని లేదా శక్తిని ఇచ్చేవారే విశ్వాధికారి.

నవవిశ్వ నిర్మాత, త్రికాలదర్శిగా తయారుచేసేవారు, ప్రతీ పరిస్థితి మరియు ప్రతీ సమస్యను ఎదుర్కునే శక్తినిచ్చేవారు మరియు దివ్యదృష్టి విధాత శివబాబా మాట్లాడుతున్నారు --

మిమ్మల్ని మీరు ఉన్నతోన్నమైన తండ్రి యొక్క ఉన్నత స్థితిలో సదా స్థితులై ఉండేవారిగా అనగా స్వయాన్ని శ్రేష్ట ఆత్మగా భావించి ప్రతీ కర్మ చేస్తున్నారా? బాబా గురించి మహిమ ఉంది - నీ నామం ఉన్నతమైనది, నీ కర్తవ్యం ఉన్నతమైనది, నీ ధామం ఉన్నతమైనది. అదేవిధంగా మిమ్మల్ని మీరు కూడా బాబా సమానంగా ఉన్నతమైన పేరు మరియు ఉన్నతమైన కర్మ చేసే విశేషాత్మగా భావిస్తున్నారా? ఒక్కటి కూడా వ్యర్ధ సంకల్పం లేదా సాధారణ సంకల్పం ఉత్పన్నం అవ్వటం లేదు కదా? ఇంత ధ్యాస పెట్టుకుంటున్నారా? దీనినే ఉన్నత స్థితి అని అంటారు. ఈ విధమైన ఉన్నత స్థితి గలవారిగా భావిస్తున్నారా? ఎప్పటి వరకు సంకల్పం, మాట మరియు కర్మలో వ్యర్థం ఉంటుందో అప్పటి వరకు శ్రేష్టంగా తయారవ్వలేరు. ఉంటే శ్రేష్టత ఉంటుంది లేకపోతే వ్యర్థం ఉంటుంది. ఎలాగైతే పగలు ఉన్నప్పుడు రాత్రి ఉండదు, రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదు. అదేవిధంగా ఎక్కడ వ్యర్థం ఉంటుందో అక్కడ శ్రేష్టంగా లేదా ఉన్నతంగా తయారవ్వలేరు. కనుక ఉన్నతంగా తయారయ్యేటందుకు వ్యర్థాన్ని సమాప్తి చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే వ్యర్ధం సమాప్తి అయిపోతుందో అప్పుడు ఆత్మ ఎటువంటి కార్యం చేస్తున్నా కానీ, ఎలాంటి వాతావరణం లేదా పరిస్థితుల్లో ఉన్నా కానీ మరియు అలజడి ఉన్నా కానీ అన్నింటిలో ఉంటూ విశ్రాంతిగా ఉంటుంది. ఈ రోజుల్లో విజ్ఞానం వారు తమ విజ్ఞానం యొక్క విధ్య ఆధారంగా ఇంజక్షన్ ద్వారా ఎలాంటి దు:ఖాన్ని అయినా అల్పకాలికంగా మరిపించి విశ్రాంతిని అనుభవం చేయిస్తున్నారు కదా! అదేవిధంగా వాతావరణం ఎంత తమోగుణిగా ఉన్నా, ఎంత ధ్వనితో ఉన్నా శాంతిశక్తి ఆధారంగా వ్యర్థాన్ని సమాప్తి చేసుకుని శ్రేష్ట స్థితిలో ఉండటం ద్వారా సదా విశ్రాంతిని అనుభవం చేసుకోగలరు. అంటే సదా స్వయాన్ని సుఖం మరియు శాంతి అనే శయ్యపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనుభవం చేసుకుంటారు. స్మృతిచిహ్న చిత్రం కూడా ఉంది కదా - సాగరంలోని అలల యొక్క అలజడి ఉంటుంది అలాంటి సాగరంలో ఉంటూ కూడా సర్పాలనే శయ్యగా చేసుకున్నట్లుగా చిత్రం ఉంది కదా! అంటే వాతావరణం లేదా పరిస్థితులు దు:ఖమయంగా ఉన్నా కానీ, సర్పాలు దు:ఖదాయి కదా, అంటే కాటు వేస్తాయి కదా! అలాంటి పరిస్థితుల్లో కూడా విశ్రాంతిని అనుభవం చేసుకుంటారు. దాని యొక్క భావం ఏమిటంటే కాటు వేసేలాంటి పరిస్థితులు వాతావరణం ఉన్నా కానీ, అవి కదిలించేవిగా ఉన్నా కానీ, తమ విషం ద్వారా మూర్చితులుగా చేసే విధంగా ఉన్నా కానీ అలాంటి వాతావరణాన్ని కూడా సుఖం శాంతి యొక్క శయ్యగా తయారుచేసుకున్నారు. అంటే విశ్రాంతి స్థానంగా తయారు చేసుకున్నారు. అంటే ఆత్మ సదా తన విశ్రాంతిలో తాను ఉంది. మరి స్మృతిచిహ్న చిత్రం ఎలాగైతే ఉందో ఆవిధంగా ప్రత్యక్ష జీవితంలోని అనుభవం చేసుకుంటున్నారా? శీతలతలో శీతలంగా ఉండటం గొప్ప విషయమేమీ కాదు, విశ్రాంతి సాధనాలు ఉన్నప్పుడు విశ్రాంతిగా ఉండటం ఇది కూడా సాధారణ విషయమే. కానీ అవిశ్రాంతిలో కూడా విశ్రాంతిగా ఉండటం, వారినే పదమాపద భాగ్యశాలి అని అంటారు. ఇలా విషయ సాగరం మధ్యలో ఉంటూ పంచవికారాలను మీ విశ్రాంతికి లేదా సుఖం మరియు శాంతి యొక్క శయ్యగా చేసుకోవాలి. అంటే ఇప్పటి నుండే వికారాలపై సదా విజయీ అయ్యి సదా జ్ఞాన మననంలో మరియు బాబా యొక్క మిలనంలో నిమగ్నమై ఉంటున్నారా? ఎవరైతే ఇలాంటి స్థితిలో స్థితులై ఉంటారో అంటే సదా మగ్న స్థితిలో ఉంటారో వారే సదా నిర్విఘ్నలు. మగ్న స్థితి లేకపోతే తప్పకుండా ఏదోక విఘ్నం ఉంటుంది. ఇప్పుడు విఘ్నం అనేది మీపై యుద్ధం చేయటంతో ఓడిపోయిందా లేక మీరు విఘ్నాలతో ఓడిపోతున్నారా? ఇప్పటి వరకు ఓడిపోతూనే ఉండటం, ఇది అసంభవమేనా! ఓడింపచేసేవారా లేక ఓడిపోయేవారా? ఈవిధంగా స్వయం నిర్విఘ్నంగా అయిపోతే నిర్విఘ్నం అయిపోయినవారి కర్తవ్యం ఏమిటి? కొందరు అయితే ఆవిధంగా ఇప్పుడు తయారవుతున్నారు. కొందరు తయారైపోయారు. ఎవరైతే తయారవుతున్నారో వారు స్వయంలోనే బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి వరకు స్వయం తయారవ్వరో అప్పటి వరకు ఇతరులను తయారు చేయటంలో శక్తిననుసరించి మాత్రమే కార్యం చేయగలరు. కానీ ఎవరైతే తయారైపోయారో వారి కర్తవ్యం ఏమిటి? వారి కర్తవ్యం - ఇతరులను తయారు చేయటం. మరయితే తయారు చేస్తున్నారు కదా! మొదట ఇంటి నుండి ఉద్దరణ ప్రారంభించాలి. అంటే మీ తోటి సహయోగులను తయారు చేయాలి. ఆ సహయోగులు ఎవరు? బ్రాహ్మణ పరివారంలో మీతో పాటు ఎవరైతే ఉంటారో ఆ సహయోగులను మొదట మీ సమానంగా తయారు చేయాలి. ఆ తర్వాత బాబా సమానంగా తయారు చేయాలి. మొదటి స్థితిలో వారిని మీ సమానంగా తయారు చేసినా కానీ అదే ఎక్కువ. కనుక ఎవరైతే తయారైపోయారో వారి కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు వారి యొక్క స్వరూపం ఏవిధంగా ఉండాలి? విఘ్న వినాశకులుగా ఉండాలి అని ఎవరో సమాధానం చెప్పారు. మంచిది. విఘ్నవినాశకులుగా కూడా ఏవిధంగా అవుతారు? సహజంగా విశ్వ సేవ జరగాలంటే ఏ రూపంలో సంహారం చేయాలి? ఆ రూపం ఏమిటి? అదేమిటంటే డబల్ లైట్ మరియు మైట్ హౌస్. డబల్ అనే మాట ఎందుకు అన్నారు, ఎందుకంటే మీరు రెండు పనులు చేయాలి. కొందరికి ముక్తికి దారి చూపించాలి, మరికొందరికి జీవన్ముక్తికి దారి చెప్పాలి. ఒకేదారి కాదు, రెండు దారులు మీరే చెప్పాలి. ప్రతీ ఒక్క ఆత్మని తమతమ గమ్యాలకు చేర్చాలి. మరి ఈ కార్యంలో బిజీగా ఉన్నారా? ఇప్పుడు లైట్ మరియు మైట్ రెండింటి యొక్క సమానత ఉండాలి. కేవలం లైట్ ద్వారా కూడా పని అవ్వదు, కేవలం మైట్ ద్వారా కూడా పని అవ్వదు. రెండింటి యొక్క సమానత ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడు అంధుని యొక్క వారసులు ఎవరైతే అంధులు ఉన్నారో (శాస్త్రాలలో కౌరవుల గురించి ఈ విధంగానే చెప్పారు కదా - అంధుని యొక్క వారసులు అంధులు,) వారికి మీ యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఏమి వరదానం ఇస్తారు? వరదానంగా ఏమి పొందుతారు వారు? దివ్యనేత్రం అనగా మూడవ నేత్రాన్ని వరదానంగా ఇవ్వండి. మామూలుగా కూడా నేత్రదానాన్ని అన్నింటికంటే శ్రేష్టంగా చెప్తారు. నేత్రాలు లేకపోతే ప్రపంచమే లేదు. కనుక అన్నింటికంటే గొప్ప ప్రాణదానం, వరదానం లేదా మహాదానం అదే. ఇప్పుడు అంధులకు దివ్యనేత్రాన్ని అనగా మూడవ నేత్రాన్ని దానంగా ఇవ్వండి. దాని ద్వారా వారు ముక్తి మరియ జీవన్ముక్తి యొక్క గమ్యాన్ని చూడగలగాలి. ఒకవేళ వారు చూడలేకపోతే ఎలా చేరుకుంటారు అందువలన డబల్ లైట్ మరియ మైట్ హౌస్ అయ్యి రెండింటి సమానతను సరిగ్గా పెట్టుకుని ప్రతీ ఆత్మకి మూడవనేత్రాన్ని వరదానంగా ఇవ్వండి. ఇది శ్రేష్ఠాత్మల యొక్క కర్తవ్యం. కేవలం మీ కోసమే లైట్ మరియు మైట్ పెట్టుకోవటం కాదు, అలా పెట్టుకుంటే వారిని మైట్ హౌస్ అని అనరు. మీలో లైట్ మరియు మైట్ ఉన్నట్లయితే మీ సహయోగులకు మరియు విశ్వంలోని సర్వాత్మలకు మహాదానం ఇవ్వండి మరియు వరదానం ఇవ్వండి. ఏదైనా బల్బ్ నలువైపుల ప్రకాశాన్ని ఇవ్వకుండా ఎక్కడ వెలుగుతుందో అక్కడే కొంచెం ప్రాంతానికి వెలుగునిస్తూ ఉంటే ఇది పని చేయదు అని అంటారు కదా! అదేవిధంగా మిమ్మల్ని మీరు కూడా చూస్కోండి - నేను కూడా కేవలం నా వరకే లైట్ మైట్ ఇచ్చే విధంగా ఉన్నానా లేదా విశ్వమంతటికీ లైట్ మెట్ ఇచ్చే విధంగా ఉన్నానా? ఇప్పుడు ఎంతగా అయితే లైట్ ఇవ్వటానికి మీరు నిమిత్తంగా అవుతారో, అంతగానే చిన్న లేదా పెద్ద రాజ్యానికి అధికారిగా భవిష్యత్తులో అవుతారు. కేవలం కొంతమంది ఆత్మలకే లైట్ మైట్ ఇవ్వటానికి నిమిత్తం అయితే అక్కడ కూడా కొంతమంది ఆత్మల పైనే రాజ్యం చేసే రాజ్యాధికారిగా అవుతారు. ఇక్కడ విశ్వ సేవాధారిగా ఉంటే అక్కడ విశ్వ రాజ్యాధికారిగా ఉంటారు. ఒకరు రాజ్యాధికారిగా తయారు చేసేవారు వారిని టీచర్ అని అంటారు. వారు రాజ్యకార్యవ్యవహారాన్ని నేర్పించేవారిగా అవుతారు. కానీ రాజ్యం చేసేవారిగా అవ్వరు. ఇప్పుడు మీరు నేర్పించేవారిగా అవుతారా లేక రాజ్యం చేసేవారిగా అవుతారా? అక్కడ సత్యయుగంలో కూడా నిమిత్తమాత్రంగా చదివిస్తారు కదా! రాజ్య కార్యవ్యవహారాన్ని నేర్పించే శిక్షకులు ఎవరైతే ఉంటారో వారిని రాజ్యధారి అని అంటారు. కానీ రాజ్యాధికారి అని అనరు. అయితే రాజ్యధారిగా అవుతారు లేకపోతే రాజ్యాధికారి అవుతారు. కానీ అధికారిగా ఎవరు అవుతారంటే ఇప్పటి నుండి ఎవరైతే తమ స్వభావానికి, సంస్కారాలకు మరియు సంకల్పాలకు ఆధీనం అవ్వరో వారే అధికారి అవుతారు. ఎవరైతే ఇప్పుడు కూడా తమ సంకల్పాలకు ఆధీనం అయిపోతారో వారు అధికారి అవుతారా? సంకల్పాలకే ఆధీనం అయిపోయారు కదా! అందువలన ఇప్పుడు సంకల్పాలకు కూడా ఆధీనం అవ్వకూడదు. స్వభావానికి మరియు సంస్కారానికి కూడా ఆధీనం అవ్వకూడదు. ఇప్పటి నుండే వీటన్నింటికీ అధికారి అయితేనే వారే అక్కడ కూడా రాజ్యాధికారి అవుతారు. ఇప్పుడు మీ లెక్క మీరు చూసుకోండి. ఎంత ఆధీనంగా ఉంటున్నాను మరియు ఎంత అధికారిగా ఉంటున్నాను. ఆ ఫలితం ఆధారంగా మీ భవిష్యత్తు మీకే సాక్షాత్కారం అవుతుంది. అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకునే అద్దంలో మీ వర్తమానం మరియు భవిష్య 21 జన్మల కొరకు మీ భవిష్య ముఖకవళికలు ఏవిధంగా ఉంటాయో వాటన్నింటినీ మీరు చూడగలరు. 21 జన్మల ముఖకవళికలను కూడా మీరు చూడగలరు. దీని కొరకు స్వయాన్ని పరిశీలించుకునే దర్పణం శక్తివంతంగా ఉండాలి. స్థూలమైన అద్దంలో అయితే కేవలం వర్తమానాన్నే చూడగలరు. అద్దం ఎంత శక్తివంతమైనది అయినా కానీ దాని ద్వారా చాలా దూరంలోని వస్తువులు చూడగలరు. కానీ అవన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవే, ఆ అద్దంలో భవిష్యత్తుని అయితే చూడలేరు కదా! కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకునే శక్తి అనే దర్పణం ఎంత శక్తివంతమైనదంటే దాని ద్వారా భవిష్య ఒక్క జన్మయే కాదు, 21 జన్మలను చూసుకోగలరు. ఆ 21 జన్మల ఆధారంగా, భవిష్యత్తులో మీరు పొందే పదవి ఆధారంగా మీ పూజారి పాత్రను కూడా చూసుకోవచ్చు. ఇంత శక్తిశాలి అద్దం బాప్ దాదా ద్వారా ప్రాప్తించింది. మరి దాంట్లో చూసుకుంటూ ఉంటున్నారా? మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోగలుగుతున్నారా లేక చూడడానికి మరొకరు అవసరం అవుతున్నారా? త్రికాలదర్శులకి మరొకరి అవసరం ఉంటుందా? త్రికాలదర్శి అయిన వారు ఇతరుల యొక్క భవిష్యత్తుని తెలుసుకోగలరు. మరి మీరు మీ భవిష్యత్తుని మీరే తెలుసుకోలేరా? త్రికాలదర్శిగా అయ్యారా లేక ఏకదర్శిగా అయ్యారా? ఏకదర్శి అంటే కేవలం వర్తమానాన్ని మాత్రమే చూసేవారు. ఇప్పుడు త్రికాలదర్శి అయ్యి అందరికీ సందేశం ఇవ్వండి. ఏకదర్శి అయ్యి సందేశం ఇస్తున్నారు. అందువలన ఫలితం కొంతశాతమే వస్తుంది. త్రికాలదర్శి అయ్యి సందేశం ఇవ్వండి. అప్పుడు మూడు వంతులు ఫలితం వస్తుంది. అంటే 75% ఫలితం వస్తుంది. ఇప్పటి ఫలితం కేవలం 25% మాత్రమే. మరయితే ఇప్పుడు ఏమి చేస్తారు? పాండవసేన యొక్క విజయీ జెండా ఎగరవేస్తారా? కేవలం ఈ జెండాయే ఎగరవేస్తారు? రెండూ ఎగురవేస్తారా? ఈ జెండా ఎన్ని అయినా ఎగరవేయండి. ఒకటికి బదులు వంద ఎగురవేయండి. ప్రతీ ఒక్కరూ మీ మీ స్థానాలలో, మీ మీ ప్రాంతాలలో ఎన్ని కావాలంటే అన్ని ఎగురవేయండి. కానీ ఈ జెండా ఎగరవేయటంలో అర్ధం ఏమిటి? విజయీ జెండా ఎగరవేయాలని, అందరూ కలిసి తనువు - మనస్సు - ధనాలు ఉపయోగిస్తున్నారు. ఏ లక్ష్యంతో చేస్తున్నారు. కేవలం శివుని చిత్రం యొక్క జెండా ఎగురవేయడానికేనా? ఇప్పుడు ఈ లక్ష్యం పెట్టుకోండి - అందరం కలిసి మన రాజధానిపైన విజయీ జెండా ఎగురవేస్తాం.. అన్నింటిపై విజయం పొందుతామని. ఇప్పుడు శాంతిగా అయితే లేరు, మాట్లాడటంలో కూడా తెలివైనవారిగా ఉన్నారు. చూడండి, విశ్వానికి నోరు ఏది? పత్రికలు, మ్యాగ్ జైన్లు. ఇప్పుడు విశ్వం యొక్క నోటి ద్వారా అయితే మాట్లాడుతూ ఉన్నారు కదా! కానీ శాంతి అయిపోవాలి. చంపలేకపోయినా కానీ మూర్చితులుగా అయినా చేయండి. మూర్చితం అయిన వారు కూడా ఏమీ మాట్లాడలేరు కదా! ఇప్పుడు ఫలితం ప్రకటించబడనున్నది. బూడిదగా ఎవరు అవుతారు, ఎంతమంది అవుతారు? కోట్ల నుండి, లక్షల నుండి ఒకరు ఎవరు వెలువడతారో చూస్తాను. కానీ అది ఎలా అవుతుంది? దీని కొరకు రెండు విషయాలు వదలాలి, ఒక విషయం ధారణ చేయాలి. వదలవలసిన రెండు విషయాలు ఏవి? (రెండు మతాలను వదిలి ఏకమతాన్ని ధారణ చేయాలి) అసలు రెండు మతాలు ఎందుకు? ఒక మతాన్ని వదిలి రెండవ మతంలోకి రావడానికి గల కారణం ఏమిటి? వదలవలసిన రెండు విషయాలు ఏవి? మరియు ధారణ చేయవలసిన ఒక విషయం ఏది? వదలవలసినవి 1. స్తుతి 2. పరిస్థితి. అనేక పరిస్థితుల కారణంగా అలజడి అవుతున్నారు మరియు స్తుతి వచ్చేయటం కారణంగా స్థితి తయారవ్వటం లేదు. కనుక ఇప్పుడు స్వ స్థితిని ధారణ చేయాలి. స్తుతి మరియు పరిస్థితి ఈ రెండింటినీ వదిలేయాలి. సంకల్పంలో కూడా వదిలేయాలి. పరిస్థితి కారణంగా స్వ స్థితి లేదు మరియు స్తుతి కారణంగా స్థితి లేదు. అందువలన స్తుతిలోకి ఎప్పుడూ కూడా రాకూడదు. ఒకవేళ ఇక్కడ మీ స్తుతి యొక్క సంకల్పం పెట్టుకున్నట్లయితే అర్దకల్పం మీకు ఏదైతే స్తుతి జరగాలో దాని నుండి 100 రెట్లు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటి అల్పకాలిక స్తుతి సదాకాలిక స్థితిని కట్ చేసేస్తుంది. అందువలన ఇప్పుడు పరిస్థితి అనే మాట అనకూడదు. స్తుతి అనే సంకల్పం కూడా చేయకూడదు. ఎంత నిర్మాణంగా ఉంటారో అంత నిర్మాణ కార్యాన్ని సఫలం చేయగలరు. నిర్మాణత లేకపోతే నిర్మాణం చేయలేరు. నిర్మాణం చేసేటందుకు మొదట నిర్మానంగా అవ్వవలసి ఉంటుంది. అందువలన సదా ఒక స్లోగన్ ని జ్ఞాపకం ఉంచుకోండి - ఏ కార్యమైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అజ్ఞాన కాలంలో కూడా అంటారు కదా - మొదట మీరు అని, అంటే ఇతరులను ముందు పెట్టటమే మీరు ముందుకి వెళ్ళటం. స్వయం వంగటమే విశ్వాన్ని మీ ముందు వంగింప చేసుకోవటం. అందువలన పరస్పరంలో సదా ఇదే వృత్తి దృష్టి మరియు మాట ఉండాలి - అదేమిటంటే ముందు మీరు, ఈ సూక్తిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. బాప్ దాదా ఎప్పుడూ కూడా సంకల్పంలో కానీ, మాటలో కానీ, కర్మలో కానీ మొదట నేను అని అయితే అనలేదు కదా! సదా పిల్లలని ముందు పెట్టారు. పిల్లలు ముందుండాలి ఇదే దృష్టి లేదా వృత్తితో ముందు పెట్టారు. అదేవిధంగా మీరు కూడా తండ్రిని అనుసరించేవారిగా అయ్యి ప్రతీ ఆత్మ ఈ విషయంలో తండ్రిని అనుసరించినట్లయితే 100% సఫలత మీ కంఠహారంగా అవుతుంది. మొదట మీరు అనడానికి బదులు మొదట నేను అనే సంకల్పం చేసినట్లయితే; ఒక్క ఆత్మ అయినా ఈ సంకల్పం చేసినా లేదా మాట్లాడినా లేదా కర్మలోకి తీసుకువచ్చినా సఫలత అనే మాల నుండి ఒక మణి పడిపోయింది అని భావించండి. మాల నుండి ఒక్క మణి అయినా తెగి పడిపోతే ఆ ప్రభావం మాల అంతటిపైన పడుతుంది. అందువలన స్వయాన్ని ఈ విషయంలో పక్కా చేసుకోవాలి మరియు స్వయంతో పాటు సంఘటనని కూడా ఈ పాఠంలో లేదా ఈ స్లోగన్లో సదా సఫలులుగా తయారు చేసేటందుకు ప్రయత్నించాలి. దీని ద్వారా విజయీ మాలలో ఒక్క మణి కూడా వేరు అవ్వకూడదు. ఎప్పుడైతే ఇలాంటి పురుషార్ధం చేస్తారో లేదా ఈ కార్యం చేస్తారో అప్పుడు విజయీ జెండాను మీ రాజధానిపై నిలబెట్టగలరు. ఈ పాత్ర అభినయించే ముందు ప్రయత్నించి చూడండి. పాత్రకి ముందు దుస్తులు అలంకరణ మొదలైనవి చూసుకుంటారు కదా! అప్పుడే ఆ పాత్రని విజయవంతంగా అభినయించగలరు. అలాగే ముందు మీరు వీటిని ధారణ చేయాలి. ఈ విధంగా అలంకరించుకుని ఎవరెడీ అయ్యి ఎప్పుడైతే మీరు వేదికపైకి వస్తారో అప్పుడు అందరి నోటి నుండి మరోసారి, మరోసారి ... అనే ధ్వని వెలువడుతుంది. మరి అన్ని తయారీలతో పాటు ఈ తయారీలు కూడా చేస్తున్నారా? కేవలం స్థూలమైన తయారీలు చేయటంలోనే బిజీ అయిపోలేదు కదా! మొదట మీ దుస్తులను తయారు చేసుకోండి. ఆ తర్వాత అలంకరణా సామాగ్రిని తయారు చేసుకోండి. అలంకరించుకోవటం అంటే మీ స్థితిలో స్థితులవ్వటం. మరి వీటిని కూడా తయారు చేసుకుంటున్నారు కదా! వీటి కొరకు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా! మీటింగ్ సమయంలో ఈ విషయాలను మర్చిపోకండి. స్టాల్ ని అలంకరించటంలో సమయం అయిపోయి స్వయం ఎలా ఉన్నారో అలాగే ఉండిపోవటం లేదు కదా! కొన్నిసార్లు సేవాకేంద్రంలో కార్యక్రమం కోసం తయారీలు చేస్తూ స్వయం అలాగే నిల్చోవలసి వస్తుంది, స్వయం తయారవ్వలేరు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ రకంగా చేయకండి. దానం తీసుకునేటందుకు వచ్చారు కానీ మీరు వీరికి ఇవ్వటానికి ఏమి తీసుకురావాలి! అని ఆలోచించకూడదు. అందువలన ముందు నుండే స్టాకు జమ చేసుకుని పెట్టుకోండి. ఆ సమయంలో జమ చేసుకునేటందుకు ప్రయత్నించినట్లయితే వారు వంచితులు అయిపోతారు. ఎలాగైతే ఇతర వస్తువుల యొక్క స్టాకుని జమ చేసుకుని పెట్టుకుంటున్నారో అలాగే ఈ స్టాకుని కూడా జమ చేసుకుని పెట్టుకోండి. ఎవరికి ఏది కావాలంటే అది సుఖము, శాంతి అలాగే ప్రజా పదవి లేదా షావుకారు పదవి లేదా నమస్కారం చేసేవారిగా అవ్వటం ఇలా ఏది కావాలంటే అది ఇవ్వగలగాలి. కొందరు విశ్వ మహారాజుకి కేవలం చరణదాసిగా ఉంటే చాలు అని అనుకుంటారు. అలా భక్తులు అయ్యి ఎవరైతే నమస్కరించాలి అని అనుకుంటారో వారి కోసం కూడా స్టాకు నింపుకోండి. ఎవరికి ఏది కావాలంటే, ఎవరు ఏది కోరుకుంటే వారి కోరికను అవినాశిగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ మట్టి ప్రపంచంలోని కోరికలు కాదు, బంగారు ప్రపంచంలోనివి. ఇలా స్టాకు ఎప్పుడైతే జమ అయ్యి ఉంటుందో అప్పుడు త్వరగా మీ స్టాకు నుండి ఆ ఆత్మలకు ఇవ్వగలరు. మరి ఈ తయారీలు చేసుకున్నారా; దీని లెక్కాచారం చూశారా? లేక ప్రతీ జోన్ వారు ఎంత తనువు, ధనాలు ఇస్తారు, ఎన్ని బేనర్స్ ఇస్తారు, ఎన్ని పట్టాలు మొదలైనవి ఇస్తారు. ఇలా ఈ లెక్కయే తీస్తున్నారా? మీ మస్తకంపై కూడా బ్యానర్ పెట్టుకోవాలి. మొదట మీ మూర్తిని చైతన్య ప్రదర్శినిగా తయారు చేసుకోవాలి. మీ నయనాలు కమలం సమానంగా కనిపించాలి. పెదవులపై ఆత్మిక చిరునవ్వు కనిపించాలి. మస్తకంలో ఆత్మ కనిపించాలి. ఇలా మీ మూర్తిని అలంకరించుకున్నారా? ఈ ప్రదర్శినిని కూడా తయారు చేస్తున్నారా లేక కేవలం స్టాల్ యొక్క ప్రదర్శినిని తయారు చేస్తున్నారా? దీనికి కూడా బహుమతి లభిస్తుంది. స్టాల్ ఎంత బాగా అలంకరిస్తే అంత బహుమతి లభిస్తుంది కదా! అలాగే చైతన్య ప్రదర్శినిని ఎవరు ఎంతగా అలంకరించుకుంటే అంతగా వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. అందువలన ఇప్పుడు మీకు డబల్ బహుమతి లభిస్తుంది. ఎవరెవరు తమ చైతన్య ప్రదర్శిని లేదా తమ మస్తకంలోని బ్యానర్ ద్వారా సేవ చేస్తారో వారికి బహుమతి ఇస్తారు. అప్పుడు ఫలితం చూస్తాను, ఫలితం రానున్నది కదా! ముగ్గురుకి బహుమతి లభిస్తుంది. మొదటి నెంబరు, రెండవ నెంబరు, మూడవ నెంబరు ... ఇలా బాప్ దాదా మూడు బహుమతులు ఇస్తారు. ప్రతీ ఒక్కరు ఇప్పుడు అనుకుంటున్నారు - మొదటి నెంబరులోకి వస్తాం, మొదటి బహుమతి తీసుకుంటామని, అందరూ మొదటి నెంబరులోకి వచ్చేసినా కానీ బహుమతి ఇస్తారు. ఇదేమీ పెద్ద విషయం కాదు. ఇంతమంది విజయీగా అయిపోతే ఈ విజయీరత్నాల ముందు బహుమతి ఇవ్వటం ఏమైనా పెద్ద విషయమా? అందరూ మొదటి నెంబరుగా తయారవ్వండి, అందరికీ బహుమతి లభిస్తుంది. స్థూలంగా కూడా లభిస్తుంది. సూక్ష్మంగా అయితే అది పెద్ద విషయమేమీ కాదు. సాకార సృష్టి నివాసీయులు కనుక సాకార బహుమతి కూడా ఇస్తారు. ఏమి ఇస్తారో అది ఇప్పుడు చెప్పబడదు, అది ఆ సమయంలోనే తెలుస్తుంది. ఎలాంటి యోగ్యతయో ఆ యోగ్యత అనుసారంగా బహుమతి ఉంటుంది. బంగారం కూడా గొప్ప విషయమా ఏమిటి? కొద్ది సమయం తర్వాత ఈ బంగారం అంతా మీ చరణాల ముందుకి రానున్నది. విశ్వయజమానులకి ఇదంతా గొప్ప విషయమా? అది బాప్ దాదా యొక్క బహుమతి కదా! ఎంతమంది ఉంటే అన్ని బహుమతులు. ఎంత బాగా సేవలో సఫలత చూపిస్తే అంత పెద్ద బహుమతి లభిస్తుంది. ఇక స్టాలుని అలంకరించిన వారికి వీరు (దాదీ, దీదీ) బహుమతి ఇస్తారు. ఆ బహుమతి బాప్ దాదా ఇస్తారు. కేవలం మిమ్మల్ని ఉల్లాస పరచడానికే కాదు, నిజంగా కూడా ఇస్తారు. మంచిది.

ఈ విధంగా సదా విజయీ, సదా సఫలతామూర్తి, సదా స్వ స్థితి ద్వారా పరిస్థితిని ఎదుర్కునేవారికి, సదా నిర్మానం ద్వారా విశ్వ నవ నిర్మాణం చేసేవారికి, అడుగడుగులోను ఒకే బాబా యొక్క స్మృతిలో ఏకమతంగా ఉండేవారికి, ఒకని పేరునే ప్రసిద్ధం చేసే ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.