06.02.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరిశీలించే శక్తి ద్వా రా మహారథీ యొక్క పరిశీలన.

మాయా మరియు ప్రకృతి యొక్క సర్వ విఘ్నాల నుండి దాటించే విఘ్నవినాశనం, అష్టశక్తుల యొక్క వరదానాన్ని ఇచ్చే శక్తిదాత, తనదంతా పిల్లలకు సమర్పితం చేసేటువంటి సర్వస్వత్యాగి మరియు నిష్కామ ఆత్మిక సేవాధారి శివబాబా మాట్లాడుతున్నారు --

ఎలా అయితే బాబాని ఆహ్వానిస్తున్నారో, అంటే సర్వశక్తివంతుడిని ఆహ్వానిస్తున్నారో, అలాగే మీలో ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ శక్తిని ఆహ్వానిస్తున్నారా? అంటే లోపల ఇమిడి ఉన్న శక్తిని స్వరూపంలోకి తీసుకువస్తున్నారా? ఎలా అయితే బాబాని అవ్వక్తం నుండి వ్యక్తంలోకి తీసుకువస్తున్నారో, అలాగే ప్రతి శక్తిని కార్యంలో వ్యక్తం చేయగలుగుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు సర్వశక్తులను వ్యక్తం చేసేటువంటి మరియు ప్రసిద్ధం చేసేటువంటి సమయం. ఎప్పుడైతే ప్రసిద్ధం అవుతుందో, అప్పుడే శక్తిసేన యొక్క విజయీ నినాదము ప్రసిద్ధం అవుతుంది. దీనిలో సఫలతకు ముఖ్య ఆధారం - పరిశీలనాశక్తి. పరిశీలనాశక్తి ఉన్నప్పుడే ఇతర శక్తుల నుండి కార్యం చేయించుకోగలుగుతారు. పరిశీలనాశక్తి తక్కువగా ఉన్న కారణంగా మరియు శక్తులను యుక్తీయుక్తంగా కార్యంలోకి తీసుకురాని కారణంగా సదా సఫలతామూర్తిగా కాలేకపోతున్నారు. అష్టశక్తులు ఇప్పుడు ప్రత్యక్షరూపంలో కనిపించాలి. మహావీరుల గుర్తు ఇదే. అష్టశక్తులు ప్రతి సమయం ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. అటువంటి ఆత్మలే అష్టరత్నాలలోకి వస్తారు.

పురుషార్ధంలో తేడా ద్వారా మహారథీ స్థితిలో ఉన్నారా లేక గుఱ్ఱపుసవారీ స్థితిలో ఉన్నారా? అనేది పరిశీలించవచ్చు. విశేషమైన తేడా ఏమిటంటే - మహారథీగా ఉండేవారు ఏ సమస్య అయినా లేదా వచ్చే పరీక్షను మొదటే గ్రహిస్తారు, విఘ్నాలను మొదటే గ్రహించిన కారణంగా ఆ తుఫాను లేదా సమస్యను ఎదురుగా రానివ్వరు. ఈ రోజుల్లో విజ్ఞానం యొక్క పరిశుద్ధమైన రూపం ఏమిటి? దూరం నుండే మొదటే తెలుస్తుంది. మొదటే తెలిసిన కారణంగా రక్షణా సాధనాలు ఏర్పాటు చేస్తున్నారు. రావటం మరియు దానితో యుద్ధం చేసి విజయం పొందటం దీనిలో కూడా సమయం పడుతుంది కదా? ఎలా అయితే ఈ రోజుల్లో విజ్ఞానం యొక్క ఆవిష్కరణలు పరిశుద్ధం అవుతూ ఉన్నాయో, అలాగే మహారథీల పురుషార్ధం కూడా పరిశుద్ధం అవ్వాలి. విఘ్నం రావటం మరియు ఒక సెకనులో వెళ్ళిపోవటం. ఇది కూడా మహారథీల స్థితి కాదు. మహారథీలు అసలు విఘ్నాన్ని రానివ్వరు. అంటే ఒక సెకను కూడా దానిలో వ్యర్థం చేయరు. నిరంతర యోగి అంటున్నారు అంటే నిరంతరం అంటే అర్థం ఏమిటి? ఒక సెకను యొక్క తేడా కూడా ఉండకూడదు. ఒకవేళ మాయ వచ్చింది మరియు దానిని తొలగించుకోవటంలోనే నిమగ్నమై ఉంటే, నిరంతరం ఆ సంలగ్నతలోనే నిమగ్నమై ఉంటే, దానిలో తేడా వస్తుంది కదా? మహారథీ అంటే ఇటువంటి మహాన్ పురుషార్ధం చేసేవారు. దూరం నుండే పారద్రోలే పురుషార్థమే మహారథీల గుర్తు. రోజు రోజుకి మీరు కూడా ఏదోక విఘ్నం రానున్నది అని అనుభవం చేసుకుంటారు. ఏదో జరగనున్నది అని బుద్ధిలో సంకల్పం వస్తుంది. ఎంతెంతగా యోగయుక్తంగా మరియు యుక్తీయుక్తంగా అవుతూ ఉంటారో, వారికి అంతగానే రానున్న విఘ్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి దర్పణం తయారైపోతుంది.

సమర్పణ మరియు సర్వస్వత్యాగం అని దేనిని అంటారు? వికారాల యొక్క సర్వ వంశాన్ని కూడా త్యాగం చేయాలి. పెద్ద రూపంలో అయితే వికారాలను త్యాగం చేయగలుగుతున్నారు. కానీ వికారాల వంశం చాలా సూక్ష్మమైనది. వాటిని వంశ సహితంగా త్యాగం చేసేవారే మహారథీ అంటే సర్వస్వత్యాగి అవుతారు. ఎప్పుడైతే ఇక్కడ వంశ సహితంగా అన్ని వికారాలను త్యాగం చేస్తారో, అంతగా అక్కడ 21 జన్మలు వంశ సహితంగా నిర్విఘ్న మరియు నిర్వికారి వంశావళి నడుస్తుంది. అర్ధకల్పం దేవవంశం నడుస్తుంది మరియు అర్థకల్పం వికారాల యొక్క శూద్రవంశం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ వంశాన్ని సమాప్తి చేసుకునేవారే 21 వంశాలు దైవీ రాజ్యభాగ్యాన్ని పొందుతారు. ఒకవేళ వంశాన్ని త్యాగం చేసే సమయంలో కొద్దిగా అయినా లోపం ఉండిపోతే అక్కడ 21 వంశంలో కొద్దిగా లోపం ఉండిపోతుంది. మహారథీ యొక్క గుర్తు ఇదే - సర్వస్వం ఎప్పుడైతే అర్పణ చేసారో దానిలో తనువు, మనస్సు, ధనం, సంబంధం మరియు సంపర్కం అన్నీ సమర్పణ చేసారు కదా? ఒకవేళ సమయం అయినా మీ పట్ల ఉపయోగించుకున్నారు మరియు బాబా స్మృతిలో లేదా బాబా కర్తవ్యంలో ఉపయోగించుకోలేదు అంటే, ఎంత సమయం స్వయం పట్ల ఉపయోగించుకున్నారో అంత సమయం కట్ అయిపోతుంది.

ఎలా అయితే భక్తి మార్గంలో కూడా దానం చేసిన వస్తువు స్వయం పట్ల ఉపయోగించుకోరు ఇది కూడా లెక్కల ఖాతా. స్వయం యొక్క బలహీనతల పట్ల లేదా స్వయం యొక్క పురుషార్ధం పట్ల వస్తువు ఉపయోగించటం అనేది తాకట్టు వస్తువులో నాది అనేది కలపటం. ఇటువంటి లోతైన పురుషార్ధం మహారథీలకు గుర్తు. మహారథీలు ఇప్పుడు స్వయానికి సంబంధించినవి అన్నీ విశ్వకళ్యాణంలో ఉపయోగించాలి. అప్పుడే మహాదాని మరియు వరదాని అని అంటారు. ఎలా అయితే లైట్‌హౌస్ యొక్క ప్రభావం దూరం నుండే కనిపిస్తుంది మరియు అది నలువైపుల వ్యాపిస్తుందో అలాగే మహారథీల స్థితి యొక్క ప్రభావం కూడా ఆవిధంగా ఉంటుంది. కానీ కార్యవ్యవహారంలో ఎవరైతే అనుభవీగా ఉంటారో, వారి ప్రభావం వారి ముఖం మరియు నడవడిక ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు మహారథీలు మరియు మహావీరుల ప్రభావం ఈ విధంగా పడాలి. ముఖం ద్వారానే తెలివి యొక్క అనుభవం అవుతుంది. ఇప్పుడు ఈ గుర్తుల ద్వారానే మా నెంబర్ ఎక్కడ ఉంటుంది? అనేది అర్ధం చేసుకోండి. మంచిది.