28.04.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్థూలంతో పాటు, సూక్ష్మ సాధనాలతో ఈశ్వరీయ సేవలో సఫలత.

లాస్ట్ సో పాస్ట్ సేవాసాధనం చెప్తూ మురళీమనోహరుడైన శివబాబా సేవాధారీ పాండవులతో మాట్లాడుతున్నారు -

ఈరోజు యొక్క ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు? ఈ సంఘటన బాధ్యత యొక్క విశేషత ఏమిటి? మీరు ఈ అన్ని విషయాలను మీ సంఘటనలో స్పష్టం చేసారా? బాధ్యత లభించిందా లేక తీసుకున్నారా? మీ స్థితిని ఉన్నతంగా మరియు పరిపక్వంగా తయారుచేసుకునే బాధ్యత లభించిందా లేక తీసుకోలేదా? గుర్తుగా ఉండటానికి బాధ్యత తీసుకున్నారా లేక మీ స్థితి తయారు చేసుకోవడానికి బాధ్యత లభించింది అని భావిస్తున్నారా?

ఈ రోజుల్లో సమయానుసారం ముఖ్య బాధ్యత ఏమిటి? ఈశ్వరీయ సేవ కోసమైతే రకరకాలైన సాధనాలు మరియు స్వరూపాలు తయారవుతున్నాయి మరియు ఇక ముందు ఇంకా తయారవుతాయి. కానీ లాస్ట్ సో పాస్ట్ యొక్క సాధనం మరియు స్వరూపం ఏమిటి? ఆలోచనలైతే చాలా మంచిగా తయారుచేసారు, బోర్డ్ కూడా పెడతారు మరియు చిత్రం కూడా పెడతారు. మరియు జ్ఞాపికను కూడా తయారుచేసారు, సశ్మానం మరియు గ్రామాలకు కూడా వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీ మస్తకంపై ఏ బోర్డ్ పెడతారు? మీ యొక్క మీ ముఖం మరియు స్వరూపం ద్వారా విశ్వం యొక్క ప్రతి ఆత్మకు ఏ జ్ఞాపికను ఇస్తారు? మీ యొక్క దివ్య, అలౌకికత చరిత్ర మరియు శుభచింతన ద్వారా మరియు హర్షితముఖం యొక్క చిత్రం ద్వారా ఏవిధమైన అలౌకిక చిత్రాన్ని చూపిస్తారు? మీరు ఒకే చిత్రాన్ని తయారుచేస్తారా లేక ఇంతమంది (సంగటనలో ఉన్నటువంటి బ్రహ్మకుమారీలు) మధువన వరదాన భూమి చైతన్య మరియు అలౌకిక చిత్రంగా అవుతారా? ఒకవేళ ఇంత మంది చిత్రాలు ప్రతి స్థానంలో ప్రజలకు చూపిస్తే లాస్ట్ సో పాస్ట్ సేవ అవ్వదా? గ్రామ, గ్రామాలలో మరియు ప్రతి స్థానంలో సదాకాలిక శాంతి లేదా ఆనందం యొక్క అనుభవం ఒక సెకనులో మీ అనుభవీ మూర్తి ద్వారా చూపించటం లేదా అనుభవం చేయిస్తే, ఇది తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ సేవ కదా? (ఉన్నతమైనది కానీ తక్కువ ఖర్చు) సుపుత్రులైన పిల్లలు, సహయోగి పిల్లలు మరియు సేవాధారీ పిల్లల యొక్క ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు వారి యొక్క కర్మలో ఇదే కర్తవ్యం మరియు ఇదే గొప్ప బాధ్యత. పాండవుల సంఘటన లేదా నిమిత్తంగా అయిన ఆత్మల సంగటన కేవలం స్థూల సేవాసాధనాలను ఏర్పాటు చేయటమా లేక వాటిని ప్రత్యక్షంలోకి తీసుకురావటం వరకు ఉంటుందా? స్థూలసాధనాలతో పాటు సూక్ష్మసాధన మరియు ప్లాన్‌తో పాటు స్వచ్చమైన స్థితి మరియు స్మృతి ఉండాలి. ఈ విషయాలకు స్వయం బాధ్యతాధారిగా భావించి నడవటం అంటే కర్మ చేయాలి. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారందరు ఈ విషయాల యొక్క బాధ్యతాధారులుగా, స్వయాన్ని నిమిత్తంగా భావించి తీసుకుంటే కనుక విహంగమార్గం యొక్క సేవారూపం కనిపించదా?

ఎలా అయితే ఈశ్వరీయ సేవాకేంద్రాలలో టీచర్స్ మరియు ముఖ్య ఆత్మలు ప్రతి కర్మ యొక్క బాద్యతకు నిమిత్తులు, అలాగే స్వయాన్ని కూడా ఇంత బాధ్యతకు నిమిత్తంగా భావిస్తున్నారా? ఎలా అయితే ప్రతి ఈశ్వరీయ మర్యాదను పాలన చేయటం మరియు చేయించటం టీచర్స్ యొక్క బాధ్యతయో స్వయాన్ని మీరు ప్రతి ఈశ్వరీయ మర్యాదలో నడిచే నిమిత్తులుగా భావిస్తున్నారో లేదా ఇది టీచర్స్ లేదా దాదీ, దీదీల పని అని అనుకుంటున్నారా? టీచర్స్ కంటే ముందు ఈ బాధ్యత నిమిత్తమైన పాండవులైన మీకే ఉంది ఎందుకంటే విశ్వం ముందు ప్రతిజ్ఞ చేసారు కదా! ఇంటిలో, గృహస్థంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉంటాము అని. బురదలో ఉంటూ కూడా కమలం లేదా కలియుగీ సంపర్కంలో ఉంటూ బ్రాహ్మణులు ఈ ప్రతిజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేటందుకు నిమిత్తులు, టీచర్స్ కాదు. ఈ పాఠం పాండవులదే లేదా కుటుంబంలో ఉండేవారిది. టీచర్స్ దగ్గరికి వెళ్ళేముందే ఉదాహరణ రూపంలో మీరే ఉంటారు. ఉదాహరణను చూసి వ్యాపారం చేసే ధైర్యం లేదా ఉల్లాసం వస్తుంది. ఇలా ప్రతి విషయంలో నిమిత్తంగా అయ్యి నడవటమనేది మీ పాత్రగా భావించి నడుస్తున్నారు. కదా? కొంతమంది టీచర్స్ దగ్గరికి వస్తారు, వినిన తర్వాత ప్రత్యక్షరూపం చూపించండి అని అడుగుతారు, ఇది సంభవమా లేక కాదా? అని. దాని ఉదాహరణ అడుగుతారు. కనుక టీచర్స్ కంటే బాధ్యతదారులు ఎవరు అయ్యారు? టీచర్స్ మర్యాదలు టీచర్స్ వి, కానీ మీ మర్యాదలు టీచర్స్ మర్యాదల కంటే తక్కువేమీ కాదు. అమృతవేళ నుండి అన్ని మర్యాదలు స్మృతి, వృత్తి, దృష్టి మరియు కర్మ కొరకు తయారై ఉన్నాయి. కనుక అవన్నీ సదా బుద్దిలో స్పష్టంగా ఉంటున్నాయా? ప్రతి సంకల్పం మర్యాద అనుసరించి ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారా? ఈ ప్రత్యక్షస్వరూపమే లాస్ట్ సో పాస్ట్ సేవకు సాధనం . మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? పవిత్రత యొక్క ప్రతిజ్ఞ. సంపర్కం మరియు సంబంధంలో ఉంటూ కూడా సంకల్పంలో కూడా ఈ మొదటి ప్రతిజ్ఞ యొక్క బలహీనత ఉండకూడదు. మొదటి మర్యాద ఏమిటి? అది ఏమిటంటే - అన్ని సాంగత్యాలు వదిలి ఒకే సాంగత్యంలో ఉంటాను లేదా నీతోనే తింటాను, నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అని విషయమైతే ఒకటే మొదటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, అవి ఒకదాని కొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండింటిపై ఎంత ధ్యాస ఉంటుంది? ఈ మొదటి విషయం యొక్క ఆందోళన ఉంటుంది. ఈ యుద్ధంలో మహారథీలుగా కాలేదు. మహారథీ అంటే ఆందోళనలో ఉండేవారు కాదు. సదా ధ్యాసలో ఉండేవారు. అన్నింటికంటే విశేషమైన ప్రభావం ఈ విషయం ద్వారానే పడుతుంది. ఎందుకంటే అసంభవాన్ని సంభవం విషయం ఇదే. మొదట ప్రభావం వేసేటువంటి పాయింట్స్ గట్టిగా ఉన్నాయా? లేక ఇప్పటి వరకు కూడా సంస్కారాలతో బలహీనంగా ఉన్నారా? స్వయం యొక్క సంస్కారాలతో కూడా బలహీనంగా ఉన్నారో, వారు ఇతరులను బలహీనతల నుండి స్వతంత్రం చేయటం అనేది సదాకాలికంగా ఉండదు. తాత్కాలిక ప్రభావం అయితే పడుతుంది. కానీ నడుస్తూ, నడుస్తూ మరలా ఆ ఆత్మలలో బలహీనతల అల ఉత్పన్నం అవుతుంది. అందువలన ఈ సంఘటన యొక్క మొదటి బాధ్యత ఏమిటంటే - ఎవరి బలహీనతలు అయినా తొలగించాలి. మొదట స్వయం యొక్క తర్వాత ప్రపంచం, కనుక ఈ మొదటి ప్రతిజ్ఞలో ఇన్చార్జ్ గా అవ్వండి. ఇదే బాధ్యత. బాప్ దాదా మరియు ప్రపంచం యొక్క సర్వాత్మలు కూడా ఇదే నవీనత లేదా విశేషత చూడాలనుకుంటున్నారు.

ముందు ముందు ఎంతగా సేవాసాధనాల ద్వారా సేవను పెంచుతారో లేదా మైదానంలో ప్రసిద్ధం అవుతూ ఉంటారో, అంతగా అన్ని రకాలైన ప్రజలు మీ యొక్క ప్రతి విషయాన్ని మంత్రాల ద్వారా లేదా తమ సిద్ధుల ద్వారా పరిశీలించే ప్రతిజ్ఞ చేస్తారు. సంకల్పాలను మరియు కర్మలను కూడా పరిశీలించడానికి మీ వెనుక సి.ఐ.డి ఉంటారు. సహజంగా అందరు అంగీకరించరు. ఋజువు లేకుండా తెలివైన ప్రజలు అంగీకరించరు. ప్రతిజ్ఞ చేయటంతో పాటు లేదా సేవ యొక్క స్థూలసాధనాలతో పాటు ఇలా తయారవుతున్నారా? మనస్సు యొక్క అదుపుకి కూడా పరిక్ష పెడతారు. యోగంలో కూర్చున్నప్పుడు పరిశీలించరు. విశేషంగా పరిస్థితుల సమయంలో మనస్సు ఎలా అదుపులో ఉంది లేదా స్థితి ఎలా ఉంది అనేది పరిశీలిస్తారు. మాయా సి.ఐ.డి ఆఫీసర్స్ చాలా తెలివిగా ఉంటారు. ఇలా తయారయ్యే బాధ్యత లేదా స్వరూపంగా అయ్యి ఉదాహరణగా ముందుకు వచ్చే బాధ్యత ఈ గ్రూప్ కి ఉంది. కనుకనే పాండవుల స్మృతిచిహ్నం ఉన్నతంగా చూపించారు. ఉన్నత స్థితికి ఋజువే - స్మృతిచిహ్నం. మరోసారి వచ్చేసరికి ఈ విషయంలో పాస్ విత్ ఆనర్‌గా అయ్యి రండి. అప్పుడే పాండవసేన అని అంటారు. ఇప్పుడైతే ఒకే టాపిక్ మరియు ఒకే సబ్జక్ట్ ఇస్తున్నాను. దీనిని ఏకరసస్థితి వరకు తీసుకురండి. అప్పుడు అవకాశం లభిస్తుంది. సహజమే కదా?

ఎంత సమయం నుండి శ్రమ పడుతున్నారు? జన్మ నుండి పడుతున్నారా? జన్మ నుండి ప్రయత్నించే విషయం కష్టంగా అనిపిస్తుందా? ఇతరులకు చెప్తున్నప్పుడు స్వయం యొక్క జన్మసిద్ధ అధికారం పొందటం కష్టంగా అనిపిస్తుందా? బ్రాహ్మణుల మొదటి ధర్మం మరియ కర్మ ఏదైతే ఉందో అది చేయటం బ్రాహ్మణులకు కష్టమా? మరజీవగా అయిపోయారు కదా! చనిపోయి మరలా జీవించేస్తున్నారా? శూద్ర స్థితితో చనిపోవాలి మరియు బ్రాహ్మణ స్థితిలో జీవించాలి. ఇదే బ్రాహ్మణుల యొక్క అలౌకిక జీవితం. బ్రాహ్మణులకు ఏదైనా కష్టమనేది ఉంటుందా? బ్రాహ్మణ జీవితం యొక్క జీవితానికి ఆధారం ఏమిటి? మురళి. చదువుకి కూడా ఆధారం - మురళి. ప్రాణానికి ఆధారమైన దానిని మంచిగా స్నేహంతో ప్రయత్నంలోకి తీసుకువస్తున్నారు. నియమప్రమాణంగా కాదు. కానీ జీవితానికి ఆధారంగా భావించి స్నేహరూపంతో స్వీకరిస్తున్నారు. ప్రాణానికి ఆధారంతో ఎంత స్నేహం ఉంటుందో, అంతగా జీవనదాతతో ఉంటుంది. ఇటువంటి స్నేహీలు ఇతరాత్మలను కూడా స్నేహిగా లేదా నిర్విఘ్నంగా తయారుచేస్తారు. ఇప్పుడు ఈ విధమైన ఆధారరూపంగా భావించి అందరి ముందు ఉదాహరణ రూపంగా అవ్వండి. ఇది కూడా బాధ్యత. పాండవులు నోటి నుండి నడుస్తూ, తిరుగుతూ మురళి యొక్క ఆత్మిక సంభాషణ లేదా చర్చ తక్కువగా వినిపిస్తుంది. గోపికల నోటి ద్వారా మురళి యొక్క చర్చ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు? పరస్పరంలో జ్ఞానచర్చ చేసుకోవటం బ్రాహ్మణుల కర్తవ్యం. ఏ విషయంలో అయితే ఎవరికి సంలగ్నత ఉంటుందో వారికి సమయం లోటుగా అనిపించదు.

ఈ రెండు విషయాలపై ధ్యాస పెట్టుకోండి - ఒకటి - పవిత్రత, రెండు - ప్రాణదానం యొక్క గొప్పతనం. సూక్ష్మ సాధన కొరకు వేరుగా సమయం తీయాల్సిన అవసరం లేదు. ఎలా అయితే ప్రపంచం వారు గృహస్థాన్ని మరియు ఆశ్రమాన్ని వేరుగా చేసేసారు. కానీ మీరు రెండింటిని కలిపి ఒకటిగా చేస్తున్నారు. అలాగే స్థూల మరియు సూక్ష్మ సాధనాలను వేరుగా చేస్తున్నారు. అందువలన ప్రత్యక్షఫలం లభించటం లేదు. రెండు వెనువెంట ఉండటం ద్వారా ప్రత్యక్షఫలాన్ని చూస్తారు. వాణీతో పాటు మననం కావాలి మరియు కర్మతో పాటు వెనువెంట మనస్సు కూడా ఉండాలి. ఎందుకంటే చివరి సమయం కదా? చివరి సమయంలో ఏవైతే అస్త్రశస్త్రాలు ఉంటాయో అవన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ తర్వాత చేద్దాము అనుకుంటే సమయం గడిచిపోతుంది. ఎప్పుడైతే అష్టశక్తులను వెనువెంట సేవలో ఉపయోగిస్తారో అప్పుడే అష్ట దేవతగా ప్రసిద్ధం అవుతారు. అంటే స్థాపనా స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదట స్టూలం చేసి తర్వాత సూక్ష్మం చేస్తాము అని ఆలోచించకండి. రెండు వెనువెంట లేకపోతే కనుక సఫలత రాదు.