23.05.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వకళ్యాణానికి నిమిత్తంగా అయిన ఆత్మల యొక్క మాట కూడా సదా కళ్యా ణకారి.

తన మధురమహావాక్యాల ద్వారా ఆత్మలను మహాన్‌గా చేసి విశ్వపరివర్తన చేసేటువంటి, ఆత్మల యొక్క కర్మ కథను తెలుసుకునేటువంటి మరియు దయాహృదయుడు విశ్వపిత శివబాబా మాట్లాడుతున్నారు -

మాటలలోకి రావటం మరియు మాటలకు అతీతంగా అవ్వటంలో ఎంత తేడా ఉంది. దీని అనుభవీగా అందరు అయ్యారా? (అక్కడ మైక్ లో మాట స్పష్టంగా లేదు) మాట యదార్థంగా లేకపోతే మంచిగా అనిపించదు కదా? యంత్రంలో ఏదైనా తేడా ఉంటే అటువంటి మాట ఇష్టపడరు కదా? అలాగే మీ యొక్క నోరు కూడా మాట యొక్క యంత్రం. ఈ నోటి ద్వారా కూడా ఎప్పుడైనా యదార్ధమైన లేదా యుక్తియుక్తమైన మాటలు రాకపోతే ఆ సమయంలో అందరికీ ఏమి అనుభవం అవుతుంది లేదా ఆ సమయంలో మీకు తెలియటం లేదా? స్థూల యంత్రం యొక్క మాటనే ఇష్టపడటం లేనప్పుడు స్వతహాగా నోటి ద్వారా వచ్చే మాట లేదా ధ్వని స్వయానికి మరియు ఇతరులకి కూడా అలానే అనుభవం అవ్వాలి. అలా అనుభవం అయినప్పుడు ఈ ఘడియ నుండి ఏమి పరివర్తన వస్తుందో తెలుసా? ఈ ఘడియ నుండి సదాకాలికంగా వ్యర్థ మాటలు, విస్తారం చేసే మాటలు, సమయాన్ని వ్యర్థం చేసే మాటలు మరియు మీ బలహీనతల ద్వారా ఇతరాత్మలను సాంగత్యదోషంలోకి తీసుకువచ్చే మాటలు అన్నీ సమాప్తి అయిపోతాయి. మహాన్ ఆత్మల ప్రతి మాటను మహావాక్యం అని అంటారు. మహావాక్యం అంటే మహాన్ గా తయారుచేసే మహావాక్యం. మహావాక్యాలు విస్తారంగా ఉండవు. ఎలా అయితే వృక్షంలో బీజం మహాన్ గా ఉంటుంది మరియు విస్తారంగా ఉండదు. కానీ దానిలోనే మొత్తం సారం ఉంటుంది. అలాగే మహావాక్యంలో విస్తారం ఉండదు. దానిలో సారం ఉంటుంది. కనుక ఇలా సారయుక్తమైన, యుక్తియుక్తమైన, యోగయుక్తమైన, శక్తియుక్తమైన, స్నేహయుక్తమైన మాటలు మాట్లాడుతున్నారా?

ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో వినాశి పదవి ధారణ చేసే విశేషాత్మలు కూడా వారి ప్రతి మాటను పరిశీలన చేసుకుని అప్పుడు మాట్లాడతారు. నా మాట ద్వారా దేశానికి మరియు సహయోగులకు సంఘర్షణకు ఆధారం కాకూడదు, నా ద్వారా అటువంటి ఒక మాట కూడా రాకూడదు అని ధ్యాస పెట్టుకుంటారు. అలాగే విశ్వకళ్యాణం చేసే శ్రేష్ట కార్యానికి నిమిత్తంగా అయిన శ్రేష్టాత్మలు మీకు విశ్వంలో విశేష స్థితి ఉంది. కనుక మీరు నా ద్వారా ఏ మాట వస్తుందో అది స్వయానికి మరియు సర్వులకు కళ్యాణకారిగా ఉందా? అని పరిశీలన చేసుకోవాలి. వ్యర్ధం యొక్క విషయాన్ని అయితే వదిలేయండి. కానీ ఇప్పుడు స్థితి అనుసరించి దేనిలో కళ్యాణం లేదో అటువంటి మాటలు నోటి నుంఢి రాకూడదు. మొదట కూడా చెప్పాను - మీ విశేషాత్మల యొక్క ప్రతి మాటకు స్మృతిచిహ్నంగా ఇప్పటి వరకు కూడా భక్తి మార్గంలో నడుస్తూ వచ్చింది. అది ఏమిటి? మీ ప్రతి మాట యొక్క మహత్వానికి భక్తిమార్గంలో ఏ స్మృతిచిహ్నం ఉంది? గీత - జ్ఞానానికి స్మృతిచిహ్నం. ప్రత్యక్ష జీవితంలో దాని యొక్క గొప్పతనాన్ని వర్ణన చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో మహాన్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి మాట వెనుక సత్యవచన మహారాజ్ అని అంటారు. అది వ్యర్ధమైనా, గొప్పలు చెప్తున్నట్లు అనిపిస్తున్నా ఇది మహాన్ ఆత్మల మాట అని భావిస్తారు. ఈ గొప్పతనం ఉంచుకుంటారు. సత్యవచన మహారాజ్ అనే స్మృతిచిహ్నం ఎప్పటి నుండి ప్రారంభం అయ్యింది? మొదట యదార్థంగా ప్రత్యక్ష రూపంలో జరుగుతుంది. తర్వాత అది భక్తిమార్గంలో స్మృతిచిహ్నంగా ఉండిపోతుంది. ఎప్పుడైతే భక్తిమార్గంలో ప్రతి మాటకు ఇప్పటి వరకు గొప్పతనం ఉంది. అంటే అంతిమ ఘడియ వరకు కూడా ఇలా సత్యత మరియు విశ్వకళ్యాణం యొక్క మహత్వం కలిగిన మాటలు నోటి నుండి వస్తున్నాయా? రోజు రోజుకి నెంబర్ వారి పురుషార్థం అనుసరించి ఎవరైతే మహారథీ, మహావీరులుగా అవుతున్నారో వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యం అయిపోతుంది. ఇప్పుడు అవ్వటంలేదు ఎందుకంటే ఇప్పటి వరకు వ్యర్ధం మరియు సాధారణ మాటలు ఎక్కవగా వస్తున్నాయి.

ఎలా అయితే ఎవరైనా ఏదైనా లేఖ లేదా ఆర్టికల్ వ్రాసేటప్పుడు లేదా ఏదైనా పత్రికలలో ప్రసారం చేసేటప్పుడు అది వ్రాసిన తర్వాత ఏది వ్రాసారో అది మంచిగా ఉందా లేదా ప్రభావశాలిగా ఉందా ఏదైతే లక్ష్యం మరియు టాపిక్ ఉందో దాని ప్రకారం ఉందా? అని పరిశీలన చేసుకుంటారు. అలాగే మీరు కూడా అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రత్యక్షంగా మనసా, వాచా, కర్మణా మూడింటి యొక్క ఒక అంశం లేదా లేఖ వ్రాస్తున్నారు అంటే డ్రామాలో కర్మ ద్వారా నిర్ణయం చేసుకుంటున్నారు. రాత్రి మీ యొక్క ప్రతి రోజు యొక్క పాత్ర లేదా లేఖ ఎంత యదార్ధంగా మరియు ప్రభావశాలిగా ఉంది మరియు ఎంత వ్యర్ధంగా ఉంది అనే పరిశీలన చేసుకోండి. ఈ పరిశీలన చేసుకుంటున్నారా?

బాప్ దాదా దగ్గర ప్రతి బిడ్డ యొక్క ప్రతి ఘడియ యొక్క మూడు రూపాలలో అంటే మనసా, వాచా, కర్మణా ద్వారా తయారు చేసుకున్న పాత్ర ప్రత్యక్షం అవుతుంది. దీని ద్వారా ఏమి ఫలితం కనిపిస్తుంది? ఇప్పటి వరకు 75 శాతం పిల్లల యొక్క సగం ఫలితం వ్యర్థ మాటలు మరియు సాధారణ మాటలలో కనిపిస్తుంది. ఈ లెక్కతో ఒకవేళ ఇప్పటి నుండే సత్యవచన మహారాజులుగా అయిపోతే కొంతమంది ఆత్మల పురుషార్థం తేలిక అయిపోతుంది. కొన్ని ఆత్మల పురుషార్థం తేలిక చేయటం లేదా పురుషార్థాన్ని సాధారణంగా చేయటానికి నిమిత్తంగా అవ్వండి.అందువలనే ఈ వరదానం డ్రామానుసారం అందరికి లభించలేదు. చాలా కొద్దిమంది ఆత్మలు వారిలో కూడా చాలా కొద్దిమంది అంటే 25 శాతం వారికే ఈ శ్రేష్ట వరదానం లభించటం ప్రారంభం అయ్యింది. అందువలన మీ యొక్క బాధ్యత లేదా గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి మాటపై ఇంత ధ్యాస పెట్టుకోండి. మీరు సాధారణంగా మాట్లాడితే మహాన్ ఆత్మలైన మీ మాట సత్యం అవుతుంది. కనుక కొంతమంది ఆత్మలకు అకళ్యాణం జరుగుతుంది. అందువలనే భక్తిమార్గంలో కూడా వరదానంతో పాటు వెనువెంట శాపానికి కూడా మహిమ ఉంది. మీరు శాపం ఇవ్వటం లేదు. కానీ మీ వ్యర్థ నడవడిక లేదా వ్యర్థ మాటలు స్వతహాగానే అకళ్యాణానికి నిమిత్తం అవుతున్నాయి. అంటే వినేవారు మరియు చూసే సాధారణ ఆత్మలు మీ మాట మరియు కర్మ ద్వారా పడిపోయే కళలోకి అంటే పురుషార్థహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రకంగా వారు మీ ద్వారా శ్రాపితం అయిపోతున్నారు.

విశ్వకళ్యాణానికి నిమిత్తమైన ఆత్మలు అనుకోనప్పటికి లేదా ఆలోచించకుండా, సాధారణ రీతిలో ఏ ఆత్మనైనా శ్రాపితం చేసే కార్యానికి నిమిత్తమైతే వారిని ఏమంటారు? వరదాని అని అంటారా? ఇంత లోతైన పరిశీలన మరియు ధ్యాస వర్తమాన సమయంలో చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క శ్రేష్టజీవితం విశ్వసేవ కోసం ఉంది. ఇప్పటి వరకు స్వయం యొక్క సేవ పట్ల లేదా స్వయం యొక్క పరివర్తన పట్ల స్వయం యొక్క స్వభావాలు మరియు సంస్కారాలకు వశమై స్వయాన్ని తయారు చేసుకోవటంలో మరియు పరివర్తన చేసుకోవటంలో ఉపయోగించే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ప్రతి శ్వాస, ప్రతి సంకల్పం, ప్రతి సెకను, ప్రతి కర్మ, సర్వశక్తులు, సర్వ ఈశ్వరీయ సంస్కారాలు, శ్రేష్ఠస్వభావం మరియు లభించిన సర్వ ఖజానాలు సేవ కోసం లభించాయి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా స్వయం పట్లే ఉపయోగిస్తూ ఉంటే మరలా ప్రాలబ్దం ఎలా లభిస్తుంది? మాస్టర్ రచయిత అవుతారా లేదా రచన అవుతారా? రచన స్వయం పట్లే ఉపయోగించుకుంటారు. కానీ రచయిత రచన పట్ల ఉపయోగిస్తారు. ఎవరైతే ఇప్పుడు మాస్టర్ రచయితగా అవ్వరో వారు భవిష్యత్తులో కూడా విశ్వయజమానిగా కాలేరు.

ఇప్పుడు సంపూర్ణ స్థితి యొక్క స్థితి లేదా సంపూర్ణ పరిణామం యొక్క సమయం సమీపంగా వస్తుంది. బాప్ దాదా ఫలితాన్ని నోటి ద్వారా చెప్పరు లేదా ఏ కాగితంపై లేదా బోర్డ్ పై వ్రాయరు. కానీ రిజల్ట్ ఎలా అవుట్ అవుతుంది? మీరు స్వయానికి స్వయమే తమ యోగ్యతల అనుసరించి తమ నిశ్చిత నెంబర్ కి యోగ్యంగా భావిస్తారు మరియు సిద్ది చేస్తారు. స్వతహాగానే వారి నోటి నుండి స్వయం పట్ల అంతిమ ఫలితం యొక్క నెంబర్ ఆలోచించనప్పటికీ చెప్తారు మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాయల్ పురుషార్థుల యొక్క రాయల్ భాష నడుస్తుంది. కానీ కొద్ది సమయంలో రాయల్ భాష రియల్ (సత్యం) అయిపోతుంది. కల్పపూర్వం యొక్క మహిమ కూడా ఉంది-రాయల్ పురుషార్థులు స్వయాన్ని తయారు చేసుకునే పురుషార్ధం చేసినా కానీ సత్యత రూపి దర్పణం ముందు రాయల్ కూడా రియల్ గా కనిపిస్తుంది. ఇక ముందు ఈ విధమైన సత్యమైన మాట, సత్యమైన వృత్తి, సత్యమైన దృష్టి, సత్యమైన వాయుమండలం, సత్య వాతావరణం మరియు సత్య సంఘటన ప్రసిద్ధం అవుతుంది. అంటే బ్రాహ్మణ పరివారం ఒక అద్దాల మహల్ గా అయిపోతుంది. ఇలా అంతిమ ఫలితం స్వతహాగా అవుట్ అవుతుంది.

ఇప్పుడైతే పెద్ద పెద్ద మచ్చలు కూడా దాగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అద్దాల మహల్ తయారవ్వలేదు. కనుక నలువైపుల మచ్చలు కనపడటం లేదు. వాటిని తొలగించేస్తున్నారు. కనుక మచ్చ దాగిపోతుంది అంటే స్వయాన్ని దర్పణం ముందుకి తీసుకురావటం ద్వారా దానిని తొలగించేసి దాచేస్తున్నారు. అది దాగటంలేదు కానీ తొలగిపోయింది మరియు దాగిపోయింది అని భావించి స్వయాన్ని సంతోషం చేసుకుంటున్నారు. బాబా కూడా పిల్లల కళ్యాణకారిగా అయ్యి ఏమీ తెలియని వారిగా అయిపోతున్నారు. ఒకవేళ బాబా ఈ మచ్చ ఇంత సమయం నుండి ఉంది. లేదా ఈ రూపంతో ఉంది. అని బాబా చెప్తే చెప్పేవారి స్వరూపం ఎలా ఉంటుంది? వినిపించాలనుకున్న వారి నోరు బంద్ అయిపోతుంది. ఎందుకంటే వినిపించడానికి కూడా విధి పెట్టబడి ఉంది. బాబాకి అన్నీ తెలిసినప్పటికీ ఎందుకు వింటారు? ఎందుకంటే స్వయం ద్వారా చేసిన కర్మ లేదా సంకల్పం స్వయం వర్ణన చేయటం ద్వారానే అనుభూతి అనే మెట్టుపై పాదం పెట్టగలరు. అనుభూతి చేసుకోవటం లేదా క్షమించమని అడగటం రెండూ ఒకటే. అందువలనే వినిపించేటువంటి అంటే స్వయాన్ని తేలికగా చేసుకునేటువంటి లేదా పరివర్తన చేసుకునేటువంటి విధి తయారయ్యింది. ఈ విధితో పాపాల వృద్ధి తక్కువ అయిపోతూ ఉంటుంది. అందువలన ఒకవేళ అద్దాల మహల్ తయారయిన తర్వాత స్వయాన్ని స్పష్టంగా చూసుకుని స్పష్టం చేస్తే ఫలితం ఏమి వస్తుందో తెలుసా? బాప్ దాదా కూడా డ్రామానుసారం ఆ ఆత్మలకు స్పష్ట ప్రతిజ్ఞ చేస్తే అప్పుడేమి చేయగలరు? అందువలన ఎప్పుడైతే అనుభూతి ఆధారంగా స్పష్టం చేసుకుని బరువు నుండి స్వయాన్ని తేలికగా చేసుకోండి, అప్పుడే డబుల్ లైట్ స్వరూపం అంటే ఫరిస్తాగా లేదా ఆత్మిక స్థితి స్వరూపంగా అయిపోతారు.

దయాహృదయుడైన బాబా యొక్క దయాహృదయ పిల్లలకు, శ్రేష్టంగా మరియు సదా స్పష్టంగా, దర్పణ రూపంగా, దివ్యమూర్తిగా, జ్ఞానమూర్తిగా, సదా హర్షితమూర్తిగా, సర్వ ఆకర్షణలకు దూరంగా ఉండే ఆత్మిక ఆకర్షణా మూర్తులకు, దివ్యగుణమూర్తి సర్వాత్మలకు, కళ్యాణకారి కళ్యాణానికి ఆధారమూర్తులకు, ఇటువంటి మహాన్ ఆత్మలకు మరియు సేవాధారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు శుభరాత్రి మరియు నమస్తే.