30.05.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక సేవలో బాబాకి సదా సహయోగిగా మరియు ఎవరెడిగా అవ్వండి.

సర్వాత్మలకు జ్ఞానం యొక్క ప్రకాశాన్ని, శక్తిని ఇచ్చేటువంటి లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్, సర్వుల శుభచింతకుడు మరియు ఆత్మిక సేనాపతి శివబాబా మాట్లాడుతున్నారు -

యుద్ధస్థలంలో ఉపస్థితులైన వీరునిగా సర్వ శస్త్రాలతో శృంగారించబడిన, ఎవరెడి, ఒక సెకనులో ఏ రకమైన ఆజ్ఞను అయినా ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే, సదా విజయీగా స్వయాన్నిఅనుభవం చేసుకుంటున్నారా? ఇప్పుడిప్పుడే ఆజ్ఞ లభించగానే అంటే దృష్టిని ఒక సెకనులో ఆత్మీయంగా మరియు దివ్యంగా తయారుచేసుకోండి, దీనిలో దేహాభిమానం కొద్దిగా అంశమాత్రంగా కూడా ఉండకూడదు మరియు సంకల్ప మాత్రంగా కూడా ఉండకూడదు అని అంటే స్వయాన్ని అలా తయారుచేసుకుంటారా? లేదా తయారవ్వటంలో సమయం పడుతుందా? ఒకవేళ ఒక సెకనుకి బదులు రెండు సెకనులు పట్టినా వారిని ఎవరెడి అని అంటారా? మీ శ్రేష్టవృత్తి ఆధారంగా ఇతరాత్మల స్మృతిని పరివర్తన చేసి చూపించండి అని ఆజ్ఞ లభిస్తే ఎవరెడిగా ఉన్నారా? వర్తమాన వాయుమండలాన్ని మీ ఈశ్వరీయ వృత్తితో ఇప్పుడిప్పుడే పరివర్తన చేయండి అని ఆజ్ఞ లభిస్తే చేయగలరా? మీ వర్తమాన సర్వశక్తివాన్ స్థితితో ఇతరాత్మ యొక్క పరిస్థితికి వశమైన స్థితిని పరివర్తన చేయమని ఆజ్ఞ లభిస్తే చేయగలరా? మాస్టర్ రచయితగా అయ్యి రచనను శుభభావనతో లేదా శుభచింతకులుగా అయ్యి బికారీలకు వారి కోరిక ప్రకారంగా సంతుష్టం చేయండి మరియు మహాదాని, వరదాని అవ్వండి అని ఆజ్ఞ లభిస్తే సర్వులను సంతుష్టం చేయగలరా? లేదా కొద్దిమంది సంతుష్టం అవ్వటం లేదా కొద్దిమంది వంచితంగా ఉండిపోతారా? స్వయాన్ని సర్వశక్తుల యొక్క బండారీతో నిండుగా అనుభవం చేసుకుంటున్నారా? సర్వశస్త్రాలు మీకు సదా వెంట ఉంటున్నాయా? సర్వశస్త్రాలు అంటే సర్వశక్తులు. ఒకవేళ ఒక శస్త్రం లేదా ఒక శక్తి తక్కువైనా లేదా బలహీనం అయినా వారిని ఎవరెడి అని అంటారా? ఎలా అయితే బాబా ఎవరెడి అంటే సర్వశక్తులతో సంపన్నుడో అలాగే తండ్రిని అనుసరిస్తున్నారా?

వర్తమాన సమయంలో బాబాకి సహయోగుల యొక్క ఎవరెడి గ్రూప్ కావాలి. ప్రతి గ్రూప్ కి ఏదోక గుర్తు లేదా విశేషత ఉంటుంది కదా! అలాగే ఎవరెడి గ్రూప్ యొక్క విశేషత ఏమిటో తెలుసా? లౌకిక మిలట్రీకి గుర్తు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గ్రూపుకి ఎవరి మెడల్ వారికి ఉంటుంది. ఈ ఆత్మిక మిలట్రీకి లేదా గ్రూప్ కి మెడల్ ఏమిటి? ఈ స్థూల బ్యాడ్జీయా? ఇదైతే సేవకు సహజ సాధనం మరియు సదా వెంట ఉండే సాధనం. కానీ మొదటి గ్రూప్ యొక్క మెడల్ లేదా గుర్తు - విజయామాల. విజయామాలలో పూసలే ఎవరెడి గ్రూప్. మొదటిది ఈ నిశ్చయం మరియు నషాలో సదా విజయామాల వేసే ఉంది. సదా విజయీ - ఇదే మాల యొక్క మొదటి గుర్తు. ఇలా ఎవరెడీ పిల్లలు ఈ స్మృతిలో సదా శృంగారించబడి ఉంటారు. రెండవ గుర్తు - సదా సాక్షి మరియు సాథీ స్థితి యొక్క కవచధారిగా ఉంటారు. ఇటువంటి ఎవరెడి ఆత్మలకు సర్వశక్తులు ప్రతి సమయం ఆజ్ఞను పాటించే సిపాయిలుగా మరియు సాథీలుగా ఉంటాయి. ఆజ్ఞాపించగానే ప్రతి శక్తి హాజరవుతుంది. వారి మస్తకం సదా మస్తకమణి అంటే ఆత్మక మెరుపు మెరుస్తూ కనిపిస్తుంది. వారి నయనాలు ఆత్మిక ప్రకాశం మరియు శక్తి ఆధారంగా సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గం చూపించడానికి నిమిత్తం అవుతాయి. వారి హర్షితముఖం అనేక జన్మల యొక్క అనేక దుఃఖాలను మరిపింపచేసి ఇతరాత్మలను కూడా హర్షితంగా చేస్తుంది. కనుక ఇటువంటి ఎవరెడి గ్రూపే కదా? మెడలో విజయామాల ఉందా? లేదా ఇతరుల నుండి ఇతర యుక్తులను తీసుకుంటూ ఉన్నారా? లేదా శస్త్రాలను తొలగించేసుకుని సమయానికి శస్త్రాలను అడుగుతూ ఉన్నారా? ఈ శక్తి ఇవ్వండి, ఈ సహయోగం చేయండి లేదా ఈ ఆధారం లభించాలి, ఈ సంకల్పం చేయటం కూడా అడుక్కోవటం. ఇటువంటి బికారీలు మహాదానిగా మరియు వరదానిగా ఎలా అవుతారు? బికారి, బికారీకి ఏమి ఇస్తారు? ఎవరెడి గ్రూపుకి యోగ్యంగా అయ్యానా? అని స్వయాన్ని చూసుకోండి. ఆజ్ఞాపించింది ఒకటైతే ప్రత్యక్షంలోకి రావటం వేరేది ఇలా ఉండకూడదు. ఇటువంటి బలహీన ఆత్మలు కాదు కదా! ఇప్పుడింకా కొంచెం గ్రూప్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు స్వయాన్ని ఏ గ్రూప్ లోకి అయినా పరివర్తన చేసుకోవచ్చు. కానీ కొంచెం సమయం తర్వాత ఈ మారే సమయం కూడా అయిపోతుంది మరియు ఎవరు ఎలాంటి మరియు ఎంత పురుషార్థం చేసారో వారు అక్కడే ఉండిపోతారు. మరలా ఇక ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నా కానీ మంజూరు అవ్వవు, బలహీనం అయిపోతారు. అందువలనే బాప్ దాదా కొంచెం సమయం ముందే వార్నింగ్ (హెచ్చరిక) ఇస్తున్నారు. దీని ద్వారా బాబాపై వెనుక వచ్చేవారి నింద కూడా ఉండదు. అందువలన ప్రతి సెకను మరియు ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని స్వయాన్ని మహాన్ గా చేసుకోండి. పరిశీలించే శక్తిని స్వయం పట్ల మరియు సేవ పట్ల ప్రయోగం చేయండి. అప్పుడే స్వయం యొక్క బలహీనతలను తొలగించుకోగలరు మరియు సర్వుల పట్ల వారి కోరిక ప్రకారంగా వారిని సంపన్నంగా చేసి మహాదాని మరియు మహావరదానిగా అవుతారు.

మంచిది, ఇలా సదా శుభచింతకులకు, సదా శుభచింతనలో ఉండేవారికి, సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారికి, సదా మస్తకమణి ద్వారా సర్వాత్మలకు జ్ఞానం యొక్క ప్రకాశాన్ని మరియు శక్తిని ఇచ్చేవారికి మరియు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ బాప్ దాదాకు సదా సహయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, శుభరాత్రి మరియు నమస్తే.