14.07.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబా సమానంగా సఫలతామూర్తిగా అయ్యేటందుకు సర్వుల పట్ల శుభభావన.

సఫలతా సితారగా తయారుచేసేటువంటి మరియు సంపూర్ణ లక్ష్యం యొక్క ప్రాప్తిని ఇచ్చేటువంటి, ప్రతి ఆత్మ పట్ల శుభచింతకుడైన శివబాబా భూమిపై ఉన్న తన ఆత్మిక సితారల రూపి పిల్లల సన్ముఖంలో ఉచ్చరించిన మహావాక్యాలు -

ఈరోజు ఈ సభ మధ్యలో బాప్ దాదా మూడు రకాలైన సితారలను చూస్తున్నారు. అందరు జ్ఞానసితారలే కానీ జ్ఞానసితారలలో కూడా మూడు రకాలైన వారు ఎవరు? ఒకరు - సఫలతా సితార, రెండవవారు - అదృష్ట సితారలు, మూడవవారు - ఆశాసితార. ప్రతి సితారకు ఎవరి ప్రపంచం వారికి ఉంది. మీరందరు మీ మీ ప్రపంచాన్ని చూసుకున్నారా లేదా కేవలం స్వయాన్నే చూసుకున్నారా? ప్రపంచం అంటే రచన. మీకు మీ రచన కనిపిస్తుందా? రచనలో ఎన్ని మరియు ఏయే విషయాలు చూస్తున్నారో తెలుసా? మీరు అయితే మీ రచనను చూసుకుంటున్నారు కదా? బాబా రచనయే మీ రచన. మీరు మాస్టర్ రచయిత కదా? మీరు బాబా ప్రజలపై రాజ్యం చేయకూడదు కదా? మీరు మాస్టర్ రచయితగా అవ్వటం లేదా ఏమిటి? సదా రచనగానే ఉంటారా ఏమిటి? రచన అంటే మీ రాజధానిని అయితే తయారు చేసుకుంటున్నారు కదా? రాజధానిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా? వారు కూడా ఏ ఆధారంతో ఉంటారు మరియు వారిలో మీ భక్తులు కూడా ఉంటారు, శక్తుల భక్తులు మరియు బాబా భక్తులు వేరు వేరుగా ఉంటారు.

మీ భక్తులుగా ఎవరు అవుతారు? ఏ లెక్కతో మీకు భక్తులుగా అవుతారు? ఏ ఆత్మలకైతే ఏ శ్రేష్ట ఆత్మల ద్వారా లేదా నిమిత్తంగా అయిన ఆత్మల ద్వారా ఏదోక ప్రాప్తి యొక్క అనుభవం అవుతుందో, వారి ద్వారా ఏదోక సాక్షాత్కారం జరుగుతుందో లేదా, ఏదోక వరదానం యొక్క ప్రాప్తి యొక్క అనుభవం అవుతుందో, దాని ఆధారంగా వారు వారికి ప్రజలుగా మరియు భక్తులుగా అవుతారు. ఎవరైతే సమీప ఆత్మలు ఉంటారో, ఏ ఆత్మల సంబంధం బాబాతో జోడింపచేస్తారో మరియు వెనువెంట బాబా ద్వారా వారసత్వానికి కూడా అధికారిగా అవుతారో వారు ఉన్నత కుటుంబంలోకి వస్తారు. ఒకే సమయంలో ప్రతి ఆత్మ తన ఉన్నత కుటుంబాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. అంటే భవిష్య సంబంధాన్ని మరియు రాజ వంశాన్ని కూడా తయారు చేసుకుంటుంది. ప్రజలను కూడా తయారుచేసుకుంటుంది మరియు భక్తులను కూడా తయారుచేసుకుంటుంది. భక్తులు మరియు ప్రజల గుర్తులు ఏమి ఉంటాయి? రాజ్య సంబంధంలోకి వచ్చే విషయం చెప్పాను. కానీ, ప్రజలు మరియు భక్తులలో తేడా ఏమి ఉంటుంది? ప్రజలు కేవలం జ్ఞానం మరియు యోగం యొక్క ప్రాప్తిని పొందే పురుషార్ధిగా ఉంటారు. వారు సంబంధంలో సమీపంగా ఉండరు. కానీ దూర సంబంధంలో తప్పకుండా ఉంటారు. వారు మర్యాదపూర్వక జీవితం తయారు చేసుకోవటంలో యోగ్యతననుసరించి మరియు శక్తిననుసరించి పురుషార్ధిగా ఉంటారు. మిగిలిన రెండు సబ్జక్టులలో అంటే ధారణ మరియు ఈశ్వరీయ సేవలో శక్తిననుసరించి సహయోగిగా ఉంటారు. కానీ సఫలతాపూర్వకంగా ఉండరు. అందువలనే వారు 16 కళా సంపూర్ణంగా అవ్వరు. ఏదోక సంస్కారం లేదా స్వభావానికి వశీభూతమైన కారణంగా నిర్బల ఆత్మ హైజంప్ చేయలేదు. అందువలన వారు రాయల్ పరివారంలో లేదా రాజ్యకులంలో రావడానికి బదులు రాయల్ ప్రజలుగా అవుతారు.

రాయల్ కులం వారిగా కాదు, రాయల్ ప్రజలుగా అవుతారు. భక్తులుగా ఎవరు అవుతారో వారు ఎప్పుడు కూడా స్వయాన్ని అధికారిగా అనుభవం చేసుకోరు. వారిలో అంతిమం వరకు భక్తి సంస్కారం ఉంటుంది, మరియు వారు సదా అడుగుతూనే ఉంటారు - ఆశీర్వాదం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, కృప చూపించండి, బలం ఇవ్వండి లేదా దృష్టి ఇవ్వండి అని. ఇలా అడిగే సంస్కారం లేదా ఆధీన సంస్కారం వారిలో అంతిమం వరకు కనిపిస్తుంది. వారు సదా జిజ్ఞాసువు రూపంలోనే ఉంటారు. వారికి పిల్లల యొక్క నషా, యజమాని స్థితి యొక్క నషా మరియు మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క నషా వారు ధారణ చేయలనుకున్నా వారు ధారణ చేయలేరు. వారు కొద్దిలోనే రాజీ అయిపోయేవారిగా ఉంటారు - ఇవి భక్తుల యొక్క గుర్తులు. ఇప్పుడు వీటి ద్వారా ప్రజలు మరియు భక్తులు ఎంత మంది తయారయ్యారు? అని చూసుకోండి. భక్తులకు ఎప్పుడు కూడా డైరెక్ట్ బాబా యొక్క సంబంధంలోకి వచ్చే శక్తి ఉండదు, వారు సదా ఆత్మల సంబంధంలోనే సంతుష్టంగా ఉంటారు. వారు మాటి మాటికి మీరే మాకు అన్నీ వీరే అనే మాట మాట్లాడతారు. మీ దగ్గరకు ఇటువంటి భక్తులు కూడా వస్తారు. అనుకోనప్పటికీ నిమిత్తంగా అయిన ప్రతి ఆత్మకు ప్రజలు, భక్తులు తయారవుతూనే ఉంటారు. ఇప్పుడు అర్థమైందా! మీ ప్రపంచం లేదా రచన ఏమిటి? ముందు,ముందు ప్రతి ఒక్కరికి నేను ఏ రాజధానిలో రాజ్యపదవి పొందుతాను అనే సాక్షాత్కారం కూడా అవుతుంది.

ఇది సితారల ప్రపంచం అంటే వారి రచన. సితారలలో మొదటి నెంబర్ సితార సఫలతా సితార, సఫలతా సితార యొక్క గుర్తులు ఏమిటి? వీటి ద్వారా నేను సఫలతా సితారనా లేదా తెలివైన సితారనా? అని పరిశీలించుకోండి. అదృష్ట సితారలు మరియు ఆశా సితారల యొక్క గుర్తులు ఏమిటి? స్వయం గురించి తెలిసినప్పటికి బాప్ దాదా జ్ఞానరూపి దర్పణం ద్వారా మూడు స్థితుల యొక్క సాక్షాత్కారం చేయిస్తారు. అందరు సాక్షాత్కారం కావాలి అని కోరుకుంటారు కదా? దివ్యదృష్టి ద్వారా కాదు జ్ఞానరూపి దర్పణం ద్వారా చేసుకుంటున్నారు కదా? సఫలతా సితారల గుర్తు ఏమిటంటే - వారి ప్రతి సంకల్పంలో అనేక సార్లు సఫలత లభించింది మరియు ఇప్పుడు కూడా నిర్ణమై ఉంది అనే ధృడత ఉంటుంది. అవ్వాలి, అవుతుందా లేక అవ్వదా అనేది కలలో కూడా వారికి స్మృతిలోకి రాదు. మాకు సఫలత లభించే ఉంది అని వారికి పూర్తి నిశ్చయం ఉంటుంది. వారి ప్రతి మాటలో ఇదే విశేషత ఉంటుంది - ప్రతి మాటలో నిశ్చయబుద్ధిగా ఉంటారు. మరియు వారి మాటలో ఈశ్వరీయ సంతానం యొక్క నషా కనిపిస్తుంది. వారిలో దేహభిమానం యొక్క నషా కనిపించదు. వారి మాట ద్వారా సంశయబుద్ధిగా ఉన్నవారు కూడా నిశ్చయబుద్ధిగా అయిపోతారు. ఎందుకంటే వారికి ఒకటి ఈశ్వరీయ నషా ఉంటుంది. మరియు రెండవది, వారి ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది. వారి మాట సాధారణంగా లేదా వ్యర్ధంగా ఉండదు మరియు వారి కర్మ అయితే శ్రేష్టంగా అయితే ఉంటుంది. కానీ వారిలో ఉండే విశేషత ఏమిటంటే - వారి ప్రతి కర్మ ద్వారా అనేక ఆత్మలకు మార్గం చూపించేదిగా ఉంటుంది. మనం ఎటువంటి కర్మ చేస్తామో మనల్ని చూసి అందరు చేస్తారు అనే మహిమ ఏదైతే ఉందో, అలా ప్రతి కర్మ అనేకాత్మలకు ఒక పాఠం చదివించడానికి నిమిత్తం అవుతారు మరియు వారి ప్రతి కర్మ శిక్షణా స్వరూపంగా ఉంటుంది. దీనినే సమర్ధ కర్మ అని అంటారు. ఇటువంటి సంకల్పం, మాట మరియు కర్మ కలిగినవారే ప్రతి విషయంలో సదా స్వయంతో సంతుష్టంగా ఉంటారు, సంతుష్టంగా ఉన్న కారణంగా సదా హర్షితంగా కూడా ఉంటారు. కానీ వారిని హర్షితంగా చేయాల్సిన అవసరం ఉండదు. వారు స్వతహగానే హర్షితంగా ఉంటారు.

ఇటువంటి సఫలతామూర్తులతో ఇతర ఆత్మలు కూడా సదా సంతుష్టంగా ఉంటారు. అంటే వారికి సర్వుల సంతుష్టత యొక్క ఫలం ప్రత్యక్ష ఫలం రూపంలో కనిపిస్తుంది. భవిష్యఫలం కాదు, ప్రత్యక్షఫలంగా అనుభవం అవుతుంది. ఇలా సదా హర్షితంగా ఉండే ఆత్మను చూసి ఇతరాత్మలు కూడా వారి ప్రభావం ద్వారా దు:ఖం లేదా అలజడి యొక్క అల నుండి హర్షితంగా అయిపోతారు. అంటే అటువంటి ఆత్మ యొక్క సంపర్కంలోకి మరియు వారి సమీపంగా రావటం ద్వారా ఇతరాత్మలపై కూడా హర్షితం యొక్క ప్రభావం పడుతుంది. ఎలా అయితే సూర్యుని సమీపంగా మరియు ఎదురుగా వెళ్ళేవారిపై అనుకోనప్పటికీ కిరణాలు పడుతూ ఉంటాయి. అలాగే సఫలతామూర్తి యొక్క హర్షిత కిరణాలు ఇతరాత్మలపై కూడా పడతాయి. అంటే ఎలా అయితే బాబా సాంగత్యం యొక్క రంగు ఒక సెకనులో అనుభవం చేసుకుంటున్నారో అంటే ఎప్పుడైతే యోగయుక్తంగా అవుతారో అప్పుడు బాబా సాంగత్యం యొక్క రంగు అంటుకుని అది అనుభవం అవుతుంది కదా? ఇలా సఫలతా సితారల సాంగత్యం యొక్క రంగు ఇతరాత్మలకు కూడా అనుభవం అవుతుంది. ఇదే సఫలతామూర్తుల లేదా సఫలతా సితారల గుర్తు.

రెండవవారు - అదృష్ట సితారలు. వీరి గుర్తు ఏమిటి? అదృష్ట సితారలు విశేషంగా బాబాకి స్నేహిగా, బాబా యొక్క చరిత్ర, బాబా ద్వారా సర్వ సంబంధాల యొక్క రసంలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. వారి సంకల్పం కూడా ఎక్కువ శక్తిశాలిగా ఉండదు, కానీ స్నేహిగా ఉంటుంది. వారి స్మృతి రూపంలో కూడా బాబా యొక్క మిలనం, మరియు బాబా యొక్క చరిత్రను ఎక్కువగా వర్ణన చేస్తారు. వారికి బీజరూపస్థితి తక్కువగా ఉంటుంది. కానీ అవ్యక్త కలయిక, అవ్యక స్థితి మరియు స్నేహంతో నిండిన ఆత్మిక సంభాషణ వీరిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆత్మలు స్నేహం కారణంగా ఇతర సాంగత్యాలు వదిలి ఒకని సాంగత్యంతో సర్వ సంబంధాలు నిలుపుకుంటున్న కారణంగా సహయోగం లభిస్తూ ఉంటుంది. వారికి బాబా సహయోగం ఉన్న కారణంగా శ్రమ తక్కువగా చేయాల్సి ఉంటుంది మరియు ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. వారు సదా నా అదృష్టం మంచిది, నాకు బాబా యొక్క అదనపు సహయోగం లభిస్తుంది మరియు నేను అన్నీ దాటేస్తాను, నా వంటి స్నేహం ఎవ్వరికీ లేదు అని అనుభవం చేసుకుంటారు. సహయోగిగా ఉన్న కారణంగా వారి మాటలు నిశ్చయంతో ఉంటాయి. మొదటి నెంబర్ వారిలో మెరుపు ఉంటుంది. రెండవ నెంబర్ వారిలో మెరుపు ఉండదు, కానీ నిశ్చయం ఉంటుంది. వారు బాబా సమానంగా ఉంటారు మరియు వీరు బాబాకి స్నేహిగా ఉంటారు. కానీ ఆ సహయోగం కూడా ఎందుకు మరియు ఏ ఆధారంగా అభించింది లేదా వారు అదృష్టవంతులుగా కూడా ఎందుకు అయ్యారు? దీనికి మూల కారణం ఏమిటంటే - సర్వ సంబంధాలు ఇతరులతో త్రెంచుకుని ఒకే బాబాతో జోడిస్తారు. ఈ సంబంధంలో వారు తెగిపోనివారిగా మరియు స్థిరంగా ఉంటారు. దీని కారణంగా వారిని అదృష్టవంతులు అని అంటారు. ఇది జరిగే ఉంది అనే మాట సఫలతామూర్తులు అంటారు మరియు అదృష్ట సితారలు అది తప్పకుండా అవుతుందని అనుకుంటున్నాము. బాబా సహయకారి అవుతారు అని అంటారు - ఇది రెండవ స్థితి.
మూడవవారు - ఆశాసితారలు. అటువంటి ఆత్మలు సదా సఫలత లభించని కారణంగా తప్పకుండా చేస్తాము, తప్పకుండా చేరుకుంటాము, లేదా తప్పకుండా తయారవుతాము అనే ఆశ పెట్టుకుంటారు. కానీ మద్య,మధ్యలో అక్కడక్కడ ఆగిపోతారు కూడా, తగుల్కుని కూడా ఉండిపోతారు మరియు అప్పుడప్పుడు బలహీనంగా కూడా అయిపోతారు. అనేక రకాలైన రకరకాలైన విఘ్నాలు వస్తున్న కారణంగా అప్పుడప్పుడు వారే భయపడతారు మరియు అప్పుడప్పుడు వారే మహావీరులుగా అవుతారు. అప్పుడప్పుడు వారికి బాబా కలయిక యొక్క నెంబర్ లభిస్తుంది మరియు అప్పుడప్పుడు శ్రమ చేసిన తర్వాత లభిస్తుంది. అందువలనే వారిని మూడవనెంబర్ అని అంటారు. వారు సదా హర్షితంగా ఉండరు మరియు వారు సదా సంతుష్టంగా కూడా ఉండరు కానీ ఆశ ఎప్పుడు వదలరు. వారు నేను బాబా వాడిని అనే ఈ నిశ్చయంలో కూడా ఎప్పుడు అలజడి అవ్వరు. కానీ నిర్బలంగా ఉన్న కారణంగా వారు అప్పుడప్పుడు బలహీనంలో అవుతారు. వీరు ఆశా సితారలు. అర్ధమైందా! ఇప్పుడు జ్ఞానమనే దర్పణంలో నేను ఎవరు? అనేది చూసుకోండి. సఫలతా సితారగా అయ్యే లక్ష్యం పెట్టుకోవాలి, ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలి. కేవలం బాబాకి స్నేహి అవ్వటంలో సంతోషపడకూడదు.

బాబా సమానంగా అయ్యేటందుకు లేదా సఫలతా మూర్తిగా అయ్యేటందుకు ఈరోజు మీకు కేవలం రెండు విషయాలు చెప్తున్నాను. రెండు మాటలు ధారణ చేయటం సహజమే కదా? సదా సర్వాత్మల పట్ల, సంపర్కంలోకి వస్తూ మరియు సేవలోకి వస్తూ శుద్ద భావన పెట్టుకోండి. శుభభావన మరియు శుద్ధకామన, మీ ఎదురుగా ఎవరైనా పరీక్ష రూపంలో వచ్చినా మరియు అలజడి చేయటానికి నిమిత్తంగా అయ్యి వచ్చినా కానీ ప్రతి ఆత్మ పట్ల మీరు శుభభావన మరియు శుద్ధకామన ఈ రెండు విషయాలు ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలోకి తీసుకురండి. అప్పుడు మీరు సఫలతాసితారగా అయిపోతారు. సహజమే కదా? ఇదే బ్రాహ్మణుల ధర్మం మరియు కర్మ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కర్మ ఉంటుంది. బాబాకి ప్రతి బిడ్డ పట్ల ఇదే శుభబావన మరియు శుద్దకామన ఉంటుంది - బాబా కంటే ఉన్నతంగా అవ్వాలి అని. దీని కారణంగానే చిన్న చిన్న విషయాలు చూస్తూ లేదా వింటూ ఇప్పుడు ఈ ఘడియ నుండి అందరు సంపన్నం అయిపోవాలి అనే భావన ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివంతులు దృష్టి మరియు వృత్తి యొక్క విషయం గురించి చెప్తే శోభిస్తుందా? అంటే సర్వశక్తివంతుడైన బాబా ముందు మాస్టర్ సర్వశక్తివంతులు బలహీన విషయాలు చెప్తున్నారు. అందువలనే ఇప్పుడు బాబా సైగ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్‌గా అవ్వండి, ఎందుకంటే స్వయాన్ని తయారు చేసుకుని మరలా విశ్వాన్ని కూడా తయారుచేయాలి. అర్థమైందా!

ఇలా తెలివైన పిల్లలకు, వినటం మరియు చేయటం సమానంగా చేసుకునేవారికి, ప్రతి సంకల్పం మరియు ప్రతి మాటలో బాప్ దాదాని అనుసరించే సఫలతా సితారలకు, అదృష్ట మరియు ఆశా సితారలకు, సంపూర్ణ లక్ష్యాన్ని పొందే అధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు, శుభరాత్రి మరియు నమస్తే.