27.12.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


యోగీభవ మరియు పవిత్రభవ ద్వారా వరదానాల యొక్క ప్రాప్తి.

సర్వ వరదానాలు ఇచ్చేటువంటి వరదాత శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు సభ వరదాత ద్వారా సర్వ వరదానాలు పొందిన ఆత్మల సభ. వరదాత ద్వారా లభించిన సర్వ వరదానాలలో ముఖ్యంగా రెండు వరదానాలు ఉంటాయి. వాటిలో సర్వ వరదానాలు నిండి ఉన్నాయి. ఆ రెండు వరదానాలు ఏమిటి? వాటిని మంచిగా తెలుసుకుంటున్నారా లేదా స్వయం వరదాని స్వరూపంగా, వరదాని మూర్తిగా అయిపోయారా? వరదానిమూర్తులు స్వయం స్వరూపంగా అయ్యి ఇతరులకు ఇచ్చే దాతగా అవుతారు. కనుక ముఖ్యమైన రెండు వరదానాల స్వరూపంగా అయ్యానా? అని స్వయాన్ని అడగండి. అంటే యోగీభవ మరియు పవిత్రభవ యొక్క ఈ విశేషకోర్స్ యొక్క స్వరూపంగా అయ్యారా? ఈ కోర్స్ సమాప్తి చేసారా లేదా ఇప్పటి వరకు చేస్తున్నారా? 7 రోజుల కోర్స్ యొక్క రహస్యం కూడా ఈ రెండు వరదానాలలో నిండి ఉంది. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారందరు ఈ కోర్స్ సమాప్తి చేసారా లేదా, ఇప్పటి వరకు ఈ కోర్స్ నడుస్తుందా? కోర్స్ అంటే ఫోర్స్ (శక్తి) నింపుకోవటం. సదా యోగీభవ మరియు పవిత్రభవ యొక్క ఫోర్స్, అంటే శక్తిస్వరూపం యొక్క అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ ఒక సంకల్పంలో అయినా శక్తిస్వరూపం యొక్క అనుభవం అవ్వటం లేదు, అంటే వారిని శక్తి స్వరూపం అని అనరు. కానీ వారిని శక్తి స్వరూపంగా అయ్యే అభ్యాసి అనే అంటారు. ఎందుకంటే స్వయం యొక్క స్వరూపం సదా మరియు స్వతహగా స్మృతిలో ఉంటుంది. ఎలా అయితే మీ సాకార స్వరూపం సదా మరియు స్వతహగా స్మృతి ఉంటుందో మరియు దాని అభ్యాసం అయితే చేయటం లేదు, ఇంకా దానిని మర్చిపోయే అభ్యాసం చేస్తున్నారు. అలాగే మీ నిజ స్వరూపం లేదా వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు ఉండకూడదు. దీనినే వరదానాల యొక్క కోర్స్ అంటారు. ఇటువంటి కోర్స్ చేసారా?

ఎలా అయితే మీరు 7 రోజుల కోర్స్ వినకుండా ఎవ్వరిని క్లాస్ లోకి రానివ్వరు కదా! అలాగే బ్రాహ్మణపిల్లలు ప్రత్యక్ష కోర్స్ పూర్తి చేయకపోతే బాప్ దాదా లేదా డ్రామా కూడా వారిని ఏ క్లాస్ లోకి రానివ్వరు? ఫస్ట్ (మొదటి) క్లాస్ లోకి రానివ్వరు. ఫస్ట్ క్లాస్ ఏమిటి? వారు సత్యయుగం ఆదిలోకి రారు. మీరు ఎలా అయితే వారిని క్లాసులోకి రానివ్వరో అలాగే డ్రామా కూడా మిమ్మల్ని ఫస్ట్ క్లాసులోకి వెళ్ళే అధికారిగా అవ్వనివ్వదు. ఫస్ట్ క్లాసులోకి వచ్చేటందుకు ఈ ముఖ్య వరదానం ప్రత్యక్ష రూపంలో ఉండాలి. విస్మృతి మరియు అపవిత్రత అంటే అవిద్యాగా ఉండాలి. మీరు సంగమంలో ఉపస్థితులై ఉన్నారు కదా? ఈ సంస్కారం లేదా స్వరూపం నాది కాదు, నా వెనుకటికి జన్మది ఇప్పటిది కాదు అని అనుభవం అవుతుందా! మీరు బ్రాహ్మణులు అవి శూద్రుల సంస్కారాలు మరియు వారి స్వరూపం. ఇలా మనకి భిన్నంగా అంటే ఇతరుల సంస్కారాలుగా అనుభవం అవ్వటాన్నే అతీతం మరియు అతి ప్రియం అని అంటారు. ఎలా అయితే దేహం మరియు దేహి(ఆత్మ) వేర్వేరు కానీ అజ్ఞానానికి వశమై ఈ రెండింటిని కలిపేసారు. అలాగే నాది అనే దానిని నేనుగా భావించారు. ఈ పొరపాటు కారణంగా ఎంత అలజడి లేదా దు:ఖం, అశాంతి పొందారు! అలాగే అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారం నాది అంటే బ్రాహ్మణ స్థితి కాదు కానీ శూద్రస్థితిని నాది అని భావించటం ద్వారా మాయకు వశమై అలజడి అయిపోతున్నారు. అంటే బ్రాహ్మణస్థితి యొక్క గౌరవం నుండి దూరం అయిపోతున్నారు. ఇది చిన్న పొరపాటు, కనుక ఎక్కడ నా సంస్కారం అనేది లేదు కదా లేదా ఎక్కడ నా స్వరూపం అనేది లేదు కదా? అని పరిశీలన చేసుకోండి. అర్ధమైందా! కనుక మొదటి పాఠమైన పవిత్రభవ మరియు యోగీభవను ప్రత్యక్షస్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా మరియు బాబాకి సమీపంగా వచ్చే అధికారిగా అవుతారు.

ఈరోజు కల్పపూర్వం చాలా సమయం నుండి విడిపోయిన, బాబా స్మృతిలో తపించేటువంటి లేదా అవ్యక్త కలయిక జరుపుకునే శుద్ధసంకల్పంలో రమించేటువంటి, తమ స్నేహమనే దారంతో బాప్ దాదాని కూడా బంధించేటువంటి, మరియు అవ్యక్తుడిని కూడా మీ సమానంగా వ్యక్తంలోకి తీసుకువచ్చేవారికి, క్రొత్త క్రొత్త పిల్లలు లేదా సాకారి దేశంలో దూరదేశవాసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకునేటందుకు బాప్ దాదా విశేషంగా రావల్సి ఉంటుంది. కనుక ఎవరు శక్తిశాలి అయ్యారు? బంధించబడినవారా లేదా బంధించినవారా? బాబా చెప్తున్నారు - ఓహో! పిల్లలూ, శభాష్ పిల్లలూ! అని. క్రొత్త పిల్లలంటే బాప్ దాదాకి విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకు? నిశ్చయానికి సదా విజయం లభిస్తుంది. విశేష స్నేహనికి ముఖ్య కారణం ఏమిటంటే - క్రొత్త పిల్లలు సదా అవ్యక్త మిలనం జరుపుకునే శ్రమలో ఉంటారు. అవ్యక్తరూపం ద్వారా వ్యక్తరూపం ద్వారా చేసిన చరిత్రలను అనుభవం చేసుకునే శుభ ఆశల దీపం సదా వెలిగి ఉంటుంది. ఇలా శ్రమ చేసేవారు ఫలం ఇచ్చేటందుకు విశేషంగా బాప్ దాదాకి కూడా స్వతహగా స్మృతి వస్తారు. అందువలనే ఈరోజు ప్రియస్మృతులు, శుభోదయం మరియు నమస్తే విశేషంగా క్రొత్త పిల్లలకు మొదట ఇస్తున్నారు. తర్వాత పిల్లలందరు ఉంటారు. ఇప్పుడు వ్యక్తం ద్వారా అవ్యక్త మిలనం సదాకాలికంగా ఉండదు. అందువలనే వచ్చిన తర్వాత వెళ్ళిపోవల్సి ఉంటుంది. అవ్యక్తరూపంలో అవ్యక్త సంభాషణ సదాకాలికంగా ఉంటుంది.
ఈ విధమైన వరదాని పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.