23.01.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వమానం అనే ఆసనంపై స్థితులై కర్మ చేసేవారే మహాన్ (గొప్పవారు).

సర్వాత్మల పరమపిత శివపరమాత్మ మాట్లాడుతున్నారు -

ఎలాగైతే బాప్ దాదా యొక్క గొప్పతనం బాగా తెలుసో, అలాగే ఈ సంగమయుగి బ్రాహ్మణ జన్మ గురించి లేదా శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క శ్రేష్ఠ పాత్ర గురించి అంటే బాగా తెలుసా? ఎలాగైతే బాబా గొప్పవారో అలాగే బాబాతో పాటు ఏ ఆత్మల యొక్క ప్రతి అడుగు లేదా ప్రతి చరిత్ర యొక్క అలాగే బాబాతో పాటు ప్రతి అడుగు, ప్రతి చరిత్రతో ఏ ఆత్మలకైతే సంబంధం లేదా పాత్ర ఉందో వారు కూడా గొప్పవారు. ఈ గొప్పతనాన్ని మంచిగా తెలుసుకుని ప్రతి అడుగు వేయడం ద్వారా ప్రతి అడుగులో కోటానుకోట్ల ప్రాప్తి స్వతహగానే అవుతుంది. ఎందుకంటే అంతా స్మృతిపై ఆధారపడి ఉంది. స్మృతి సదా శక్తిశాలిగా మరియు మహన్ గా ఉంటుందా? లేక అప్పుడప్పుడు మహాన్ గా, అప్పుడప్పుడు సాధారణంగా ఉంటుందా? ఎవరు ఎలా ఉంటారో, వారు అలాగే సదా స్వయాన్ని స్వతహగానే భావించి నడుస్తారు. వారు ఒక్కొక్కసారి స్మృతి ఒక్కొక్కసారి విస్మృతిలోకి రారు. అదేవిధంగా మీరు ఉన్నతమైన బ్రాహ్మణులు, విశ్వంలో సర్వ శ్రేష్టాత్మలు మరియు విశేష పాత్రధారులు, మీ అంతిమ జన్మ యొక్క ఈ రూపాన్ని ఈ స్థితిని, ఈ వృత్తి యొక్క స్మృతి ఒక్కొక్కసారి విశేషంగా, ఒక్కొక్కసారి సాధారణంగా ఎందుకు ఉంటుంది? మాటిమాటికి దిగిపోవడం మరియు ఎక్కడం ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏమిటో తెలుసా? ఇది మీ నిజ స్వరూపం మరియు మీ జన్మయే గొప్పదైనప్పుడు మీ జీవితం యొక్క మరియు జన్మ యొక్క గొప్పతనాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? పాత్ర అభినయించడం కోసం తాత్కాలిక రూపాన్ని తయారు చేసుకున్నప్పుడే మరిచిపోతారు, నిజరూపం కాదు. కనుకనే మాటిమాటికి స్మృతి, విస్మృతిలోకి వస్తుంటారు. ఇక్కడ మీరు ఎందుకు మరిచిపోతున్నారు? దేహభిమానం కారణంగా, దేహభిమానం ఎందుకు వస్తుంది? ఈ కారణాలన్నింటి గురించి చాలా సమయం నుండి మీకు తెలుసు కదా, తెలిసి ఉండి కూడా నివారణ చేయలేకపోతున్నారు. దీనికి కారణం శక్తి యొక్క లోపం మరియు దృఢత లేదు. ఇలాగని కూడా చాలా సమయం నుంచి తెలుసు. అయినా కానీ నివారణ ఎందుకు చేసుకోలేకపోతున్నారు, అదే విషయం మాటిమాటికి అనుభవంలోకి వస్తున్న కారణంగా పరివర్తన చేసుకోవడం సహజంగా మరియు సదాకాలికంగా ఉండాలి కదా! లౌకిక రీతిలో కూడా ఈ విషయం కారణంగా నష్టం జరుగుతుంది, ఫలితం మంచిగా రావడం లేదు అని తెలిస్తే ఒకసారి మోసపోయిన తరువాత స్వతహగానే జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగానే ఉంటారు కదా? లేక మాటిమాటికి మోసపోతారా? దేహభిమానం కారణంగా లేదా ఏదోక బలహీనతకు వశీభూతం అయిపోవడం వలన ఏమి పరిణామం వస్తుంది? ఈ విషయం గురించి అనేకసార్లు అనుభవీ అయిపోయారు. అనుభవీ అయిన తరువాత కూడా మోసపోతున్నారు. అలాంటివారిని ఏమంటారు? దీని ద్వారా ఏమి రుజువు అయ్యిందంటే మీ గొప్పతనాన్ని తెలుసుకుని కూడా సదా ఆవిధంగా నడవడం లేదు. మీ గొప్పతనాన్ని మీరే ఎందుకు మరిచిపోతున్నారు. కారణం ఏమిటి? ఎందుకంటే విఘ్న వినాశకులు, సర్వ పరిస్థితులను తొలగించేవారు, స్వ స్థితి లేదా శేష్ఠ స్థానంలో మరియు బాప్ దాదా సంగమయుగంలో ఏదైతే స్వమానం ఇచ్చారో, ఆ స్వమానం అనే ఆసనంపై సదా స్థితి అయి ఉండడం లేదు. మీ ఆసనాన్ని వదిలేసి మాటిమాటికి క్రిందికి వచ్చేస్తున్నారు. ఆసనంపై ఉండడం ద్వారా స్వమానం కూడా స్వతహగానే స్మృతిలో ఉంటుంది. లౌకిక రీతిలో కూడా ఏ సాధారణ ఆత్మకైనా పదవి లభిస్తే, స్వమానం స్వతహాగానే పెరిగిపోతుంది. స్వతహగానే ఆ నషాలో స్థితులవుతారు. అదే విధంగా సదా మీ ఆసనంపై మీరు స్థితి అయి ఉండండి. అప్పుడు స్వమానం నిరంతరం స్కృతిలో ఉంటుంది. అర్థమైందా! ఆసనం నుండి క్రిందకి రావడం అంటే స్మృతి నుండి క్రిందకి అనగా విస్మృతిలోకి రావడం. ఉన్నతాసనంపై స్థితి అయి ఉండడం యొక్క పరిశీలన చేసుకోండి. ఆసనంపై స్థితి అవ్వడం ద్వారా స్వతహగానే ఆ సంస్కారాలు మరియు కర్మలో పరివర్తన వస్తుంది. అరమైందా? బలహీన మాటలు బ్రాహ్మణుల భాష కాదు. శూద్రత్వం యొక్క భాషను ఎందుకు ఉపయోగిస్తున్నారు? స్వదేశం మరియు మాతృభాష యొక్క నషా ఉంటుంది కదా! మరి మీ భాషను వదిలేసి పరభాషను ఎందుకు మాట్లాడుతున్నారు? కనుక ఇప్పుడు ఇది పరివర్తన చేసుకోండి. మొదట పరిశీలించుకోండి, తరువాత మాట్లాడండి. ఆసనంపై స్థితులై సంకల్పం లేదా కర్మ చేయండి. ఈ ఆసనంపై ఉండడం ద్వారా స్వతహగానే మహానత యొక్క వరదానం ప్రాప్తిస్తుంది. మరైతే వరదాని ఆసనాన్ని వదిలి శ్రమ ఎందుకు చేస్తున్నారు? శ్రమ చేసి చేసి తిరిగి అలసిపోతున్నారు కూడా మరియు మానసికంగా బలహీనం అయిపోతున్నారు. అందువలన ఇప్పుడు సహజ సాధనాన్ని ఉపయోగించండి. మంచిది.