30.01.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సెకనులో వ్యక్తం నుండి అవ్యక్తం అయ్యే వేగం.

సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -

అందరూ ఈ సమయంలో ఒకే సంలగ్నతలో, ఒకే సంకల్పంలో కూర్చుని ఉన్నారు. ఆ ఒకే సంకల్పం లేదా సంలగ్నత ఏమిటి? బాబాని ఆహ్వానం చేయటం లేదా తండ్రి పిల్లల మిలన మేళా జరుపుకోవడం? స్నేహం మరియు దృఢ సంకల్పంతో సర్వశక్తి వంతుడైన బాబాని ఆహ్వానిస్తున్నారు. అలాంటప్పుడు స్వయంలో ఏ శక్తి అయితే లోటుగా లేదా బలహీనంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారో, ఆ శక్తిని స్వయంలో ఆహ్వానం చేయలేరా? కేవలం స్మృతితో, స్నేహబలంతో, ప్రాప్తించిన అధికార బలంతో మరియు సమీప సంబంధం యొక్క బలంతో బాబాని అవ్యక్తం నుండి వ్యక్తంలోకి తీసుకురాగలుగుతున్నప్పుడు, ప్రతి శక్తిని తీసుకురాలేరా? లేదా స్వయాన్ని కూడా వ్యక్తం నుండి అవ్యక్తంగా తయారు చేసుకోలేరా? బాబాని అవ్యక్తం నుండి వ్యక్తంలోకి తీసుకురావడం సహజం అయినప్పుడు స్వయాన్ని అవ్యక్తంగా తయారుచేసుకోవడంలో కష్టమెందుకు! పాత రోజుల్లో ప్రసిద్ధ కథల్లో చప్పట్లు కొట్టగానే వస్తువు లేదా వ్యక్తి హాజరైనట్లు లేదా దేవదూతలు ప్రత్యక్షం అయినట్లు చెబుతారు. దేవదూతల కథ చాలా ప్రసిద్ధమైనది. ఈ కథలు ఎవరి గురించి, జ్ఞాన ఫరిస్తాలు లేదా మూడు లోకాల్లో ఎగిరే ఫరిస్తాలు ఎవరు? స్వయాన్ని ఈ విధంగా భావిస్తున్నారా? జ్ఞానం మరియు యోగం అనే రెండు రెక్కలు జోడించబడి ఉన్నాయా? మీరు జ్ఞానం మరియు యోగ బలం ద్వారా ఒక్క సెకెనులో ఈ రెక్కల ఆధారంగా సాకార లోకం నుండి నిరాకార లోకం వరకు చేరుకుంటున్నారు కదా? అలాంటి ఫరిస్తాలకు ఒక్క సెకెనులో ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి సంకల్పం చేయగానే ఆ ఆహ్వానాన్ని అందుకుని స్వరూపంలోకి వచ్చేయాలి. ఇలా చప్పట్లు కొట్టడం వస్తుందా, ఇలాంటి ఫరిస్తాలుగా అయ్యారా? వీరికే కల్పం అంతా మహిమ చేయబడుతూ వచ్చింది. వర్తమాన సమయంలో పురుషార్థం యొక్క వేగం ఒక్క సెకెను అయి ఉండాలి. అప్పుడే సమయం మరియు స్వయం రెండింటి వేగం సమానము అని అంటారు. దీనినే తీవ్ర లేదా మొదటి స్థితి అని అంటారు.

సంగమయుగంలో సర్వశక్తులు ఇలా మీ అధికారంలో ఉండాలి. శస్త్రాల వలె స్వయంలో శక్తులుండాలి. ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్తవ్యంలో ఉపయోగించగలిగి ఉండాలి. అర్ధమైందా? మంచిది.