08.02.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిశ్చయమనే ఆసనంపై అచంచల స్థితి.

ప్రతి పరిస్థితిలో అచంచలంగా లేదా స్థిరంగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు -

అందరూ స్వయాన్ని నిశ్చయమనే ఆసనంపై స్థితులైనట్లు అనుభవం చేసుకుంటున్నారా? నిశ్చయం అనే ఆసనం ఎప్పుడూ కదలడం లేదు కదా? ఏవిధమైన పరిస్థితి అయినా లేదా ప్రకృతి లేదా ఎవరైనా వ్యక్తి నిశ్చయం యొక్క ఆసనాన్ని కదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా కానీ వారు కదపలేకుండా ఉండాలి. అలాంటి అచంచల స్థిరమైన ఆసనమేనా! నిశ్చయమును ఆసనంపై సదా అచంచలంగా ఉండేవారు, నిశ్చయబుద్ధి విజయంతి అని మహిమ చేయబడ్డారు. అచంచలంగా ఉన్నదానికి గుర్తు - ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో సదా విజయీ.ఇలాంటి విజయీ రత్నంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఏ విషయంలోనూ కదిలేవారు కాదు కదా? అప్పుడప్పుడు ఏదోక విషయంలో అలజడి అవుతున్నాము లేదా అనేక రకాలు సంకల్పాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి అనే పురుషార్థీలు చేతులెత్తండి, అవును అలా అవుతుంది అని ఎవరైనా భావిస్తున్నారా? చేయి ఎత్తకపోతే పెద్ద పెద్ద పరీక్షలు రానున్నవి అప్పుడేం చేస్తారు? ఎంత పెద్ద పరీక్ష వచ్చినా అందరూ పాస్ అయిపోతారా? అయితే పరీక్ష యొక్క తారీఖు ప్రకటించమంటారా! అందరూ తయారేనా? ఈ విషయం అని మాకు తెలియదు, అనుకోలేదు కూడా, ఇది కొత్త విషయం అని అనరు కదా! ఏ విషయాలైతే సంభవం అని భావిస్తున్నారో అవి అసంభవ రూపంలో పరీక్ష అయ్యి వస్తాయి. అప్పుడే నిశ్చయానికి పరీక్ష జరుగుతుంది, అయినా కానీ అచంచలంగా ఉంటారా? నిశ్చయబుద్ధి అయ్యేటందుకు ముఖ్యంగా .నాలుగు విషయాలున్నాయి. నాలుగింటిలో పూర్తి శాతం ఉండాలి. ఆ నాలుగు విషయాలు మీకు తెలుసు కూడా, వాటిపై నడుస్తున్నారు కూడా. మొదటి విషయం బాబాపై నిశ్చయం - బాబా ఎవరో, ఎలాంటి వారో, ఏ స్వరూపంతో పాత్ర అభినయిస్తున్నారో వారిని ఆవిధంగానే తెలుసుకోవాలి మరియు అంగీకరించాలి. రెండు - బాబా ద్వారా ప్రాప్తించిన జ్ఞానాన్ని అనుభవం ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలి మరియు అంగీకరించాలి. మూడు - స్వయం కూడా ఎవరో ఎలాంటివారో అనగా మీ అలౌకిక జన్మ యొక్క శ్రేష్ఠ జీవితాన్ని లేదా ఉన్నత బ్రాహ్మణ జీవితాన్ని, మీ శ్రేష్ఠ పాత్రను, మీ శ్రేష్ఠ స్థితి మరియు స్థానం యొక్క గొప్పతనం ఏమిటో ఆవిధంగా స్వయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, అంగీకరించాలి మరియు ఆవిధంగా నడవాలి. నాలుగో విషయం - వర్తమాన శ్రేష్ఠ పురుషోత్తమ కళ్యాణకారి ఎక్కే కళ యొక్క సమయాన్ని తెలుసుకోవాలి మరియు తెలుసుకుని ప్రతి అడుగు వేయాలి. ఈ నాలుగు విషయాల్లో పూర్తి నిశ్చయం ప్రత్యక్ష జీవితంలో ఉండాలి. అలాంటి వారినే నిశ్చయబుద్ది విజయంతి అని అంటారు. నాలుగు విషయాల్లో శాతం కావాలి. నిశ్చయముంది అని కేవలం ఈ విషయంలోనే సంతోషం అయిపోవడం కాదు. శాతం కూడా ఎక్కువగా ఉందా? ఒక్క విషయంలో అయినా శాతం తక్కువ అయితే నిశ్చయం యొక్క ఆసనం ఏ సమయంలో అయినా లేదా ఏ చిన్న పరిస్థితి అయినా అలజడి చేయగలదు.అందువలన శాతాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు సంపన్నంగా అయ్యే సమయం సమీపంగా వస్తూ ఉంది, కనుక చిన్నలోపం సమయానికి పెద్ద నష్టం చేస్తుంది. ఎందుకంటే ఎంతెంత అతి స్వచ్ఛంగా, సతో ప్రధానంగా అవుతున్నారో ఆ అతి స్వచ్చము అనే స్థితి అనుసారంగా ఈరోజు ఏదైతే చిన్న లోపం లేదా సాధారణ మచ్చ అని అనుభవం అవుతుందో అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందువలన ఇప్పటి నుండి ఇటువంటి సూక్ష్మ పరిశీలన చేసుకోండి మరియు లోపాన్ని సంపన్నం చేసుకునే తీవ్ర పురుషార్థం చేయండి. రోజు రోజుకీ ఎంతెంత శ్రేష్టంగా తయారవుతుంటారో, అంతగా విశ్వంలో ప్రతి ఆత్మ యొక్క దృష్టిలో ప్రసిద్ధమవుతుంటారు. అందరి దృష్టి మీ వైపుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు - స్థాపనకు నిమిత్తం అయిన వీరు సుఖ, శాంతిమయ కొత్త ప్రపంచం యొక్క కార్యాన్ని ఎప్పుడు సంపన్నం చేస్తారో అని. ఆ స్థాపన ఆధారంగా ఈ దు:ఖ దాయీ ప్రపంచం పరివర్తన అయిపోతుంది. వారి దృష్టి స్థాపన చేసేవారిపై ఉంది, కానీ స్థాపన చేసేవారి దృష్టి ఎక్కడ ఉంది? తమ పనిలో తాము నిమగ్నమై ఉన్నారా లేక వినాశకారులవైపు దృష్టి పెడుతున్నారా? వినాశన సాధనాల యొక్క సమాచారం వినటం ఆధారంగా నడవడం లేదు కదా? వారు డీలా అయిపోతే మీరు కూడా డీలా అయిపోవడం లేదు కదా? స్థాపన ఆధారంగా వినాశనం అవుతుందా లేక వినాశనం ఆధారంగా స్థాపన అవ్వాలా? స్థాపన చేసేవారు వినాశనం యొక్క జ్వాలను ప్రజ్వలితం చేయడానికి నిమిత్తం అయ్యారు. అంతేకాని వినాశనం చేసేవారు స్థాపన చేసేవారి పురుషార్ధం యొక్క జ్వాలను ప్రజ్వలితం చేయడానికి నిమిత్తం అవ్వలేదు. స్థాపన చేసేవారు ఆధారమూర్తులు, అలాంటి ఆధారమూర్తులు వినాశనం యొక్క విషయాల వలన చలించడం లేదు కదా? అలజడిలో అయితే లేరు కదా? అవుతుందో, అవదో, ప్రజలు ఏమంటారో లేదా ప్రజలు ఏం చేస్తారో, ఈ వ్యర్థ సంకల్పాలు నిశ్చయం అనే ఆసనాన్ని కదపడం లేదు కదా? అందరూ నిశ్చయబుద్ది మేము అని చేయి ఎత్తారు, నిశ్చయం అనగా ఏ విషయంలోనూ ఎందుకు, ఏమిటి మరియు ఎలా అనే సంకల్పంతో ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే సంశయం యొక్క సూక్ష్మ రూపం సంకల్పాల రూపంలో ఉంటుంది. సంశయం లేదు కానీ సంకల్పం వస్తుంది, కానీ ఆ సంకల్పం ఏ వంశం యొక్క అంశం? ఈ సంకల్పం సంశయానిదా లేదా వంశానిదా? నాలుగు విషయాలలో సంపూర్ణ నిశ్చయబుద్ధి అయితే ఇలాంటి సంకల్పాలు ఉత్పన్నం అవుతాయా? ఇది కళ్యాణకారీ యుగం, కళ్యాణకారీ తండ్రి యొక్క శ్రీమతంపై నడిచే ఆత్మలు కళ్యాణం యొక్క లేదా ఎక్కే కళ యొక్క సంకల్పాలు తప్ప మరే ఇతర సంకల్పాలైనా చేయవచ్చా? వారి యొక్క ప్రతి సంకల్పం ప్రతి కార్యం గురించి వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి సమర్ధ సంకల్పాలే ఉంటాయి, కానీ వ్యర్థంగా ఉండవు. భయపడడం లేదు కదా? ఎదుర్కోవలసి ఉంటుంది, పరీక్షలో ఎదుర్కోవడం అంటే ముందుకు వెళ్ళడం అనగా సంపూర్ణతకు అతి సమీపం అవ్వడం. ఇప్పుడు ఈ పరీక్ష రానున్నది, స్వయం స్పష్టమైన బుద్ధి గలవారిగా ఉంటే ఇతరులకు కూడా స్పష్టం చేయగలరు. అంటే అవ్వకూడదు అని కాదు దీని అర్థం డ్రామాలో ఏదైతే జరుగుతుందో సమయానుసారం వాటిలో వెన్న నుండి వెంట్రుక అయితే తీయాల్సిందే. ఏదైనా కష్టం వచ్చిందా? బాప్ దాదా నయనాల్లో కూర్చోబెట్టుకుని హృదయ సింహసనంపై కూర్చోపెట్టుకుని, వాటిని దాటిస్తూ వస్తున్నారు కదా!ఎవరైనా కానీ అంతిమం వరకు తోడు ఉంటాము లేదా ఎలాంటి పరిస్థితి అయినా దాటిస్తాము అనే ప్రతిజ్ఞ లేదా కార్యం చేయగలరా? చేయలేరు కదా? వెంటే తీసుకువెళ్ళాలి కదా! సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నా కానీ ఇలాంటి సంకల్పాలు ఉత్పన్నం అవ్వడాన్ని ఏమంటారు? కనుక ఇలాంటి వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసుకుని ఏ స్థాపన కార్యం కోసం నిమిత్తం అయ్యారో బాప్ దాదాకి సహయకారులో ఆ కార్యంలో నిమగ్నం అవ్వండి. మీ సంలగ్నత అనే అగ్నిని పెంచుకోండి. ఈ సంలగ్నత అనే అగ్ని ద్వారా వినాశనాన్ని తీవ్ర వేగం యొక్క స్వరూపాన్ని ధారణ చేస్తుంది. మీరు రచించిన అవినాశీ జ్ఞాన యజ్ఞంలో యజ్ఞానికి నిమిత్త బాహ్మణులుగా ఏదైతే అయ్యారో ఈ యజ్ఞంలో మొదట స్వయం యొక్క సర్వ బలహీనతలను లేదా లోపాలను ఆహుతి అవ్వండి. అప్పుడే పాత ప్రపంచం అంతా ఆహుతి అయిన తరువాత సమాప్తి అవుతుంది. ఇప్పుడు దృఢ సంకల్పం అనే నిప్పును అంటించండి. అప్పుడే అది సంపన్నం అవుతుంది. మంచిది.

ఈవిధంగా సంలగ్నతలో నిమగ్నం అయ్యేవారికి, సదా నిశ్చయం యొక్క ఆసనంపై స్థితులై కార్యం చేసేవారికి, ప్రతి పరిస్థితిలో అచంచలంగా మరియు స్థిరంగా ఉండేవారికి, బాప్ దాదాకి సదా సమీప మరియు సహయోగులకు ఇలాంటి స్నేహీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.