09.02.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆధ్యాత్మిక శక్తుల ద్వారా విశ్వపరివర్తన ఏవిధంగా అవుతుంది?

నిర్భల ఆత్మలను శక్తివంతులుగా తయారుచేసే వారు, సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -

స్వయాన్ని అశరీరి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ శరీరం ద్వారా ఏది కావాలంటే ఆ కర్మ చేయించే శక్తిశాలి ఆత్మ మీరు. ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ శరీరానికి యజమాని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసేవారు. ఈ కర్మేంద్రియాల నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీత స్వరూపం యొక్క స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? అనగా రాజయోగం యొక్క సిద్ది - కర్మేంద్రియాలకి రాజుగా అయ్యే శక్తిని పొందారా? రాజు లేదా యజమాని కర్మేంద్రియాలకు ఎప్పుడూ వశీభూతం అవ్వరు. వశీభూతం అయ్యేవారిని యజమాని అని అనరు. విశ్వ యజమానికి సంతానం అయిన కారణంగా తండ్రి విశ్వానికి యజమాని అయినప్పుడు పిల్లలు తమ కర్మేంద్రియాలకు యజమానిగా కాకపోతే ఏమంటారు? యజమానికి పిల్లలు అని అంటారా? పేరేమో మాస్టర్ సర్వశక్తివాన్ మరియు స్వయాన్ని యజమానిగా భావిస్తూ నడవలేకపోతే మాస్టర్ సర్వశక్తివంతులు అయినట్లా? మేము మాస్టర్ సర్వశక్తివంతులం ఇదైతే పక్కా నిశ్చయమే కదా! లేక నిశ్చయం కూడా ఇప్పుడే వస్తుందా? నిశ్చయంలో శాతం ఉంటుందా? బాబాకి అయితే పిల్లలే కదా! 90 శాతం పిల్లలమే కాని పదిశాతం కాదు అని అనేవారు ఎవరైనా ఉన్నారా? అలాంటి పిల్లలను ఎప్పుడైనా చూశారా? నిశ్చయం అనగా వందశాతం నిశ్చయం. ఇలా వందశాతం నిశ్చయబుద్ది పిల్లల యొక్క మొదటి గుర్తు ఏమిటి? నిశ్చయబుద్ధి యొక్క మొదటి గుర్తు- విజయీ, నిశ్చయబుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు కూడా. విజయం ఎలా లభిస్తుంది? నిశ్చయంతో. మరైతే నిరంతరం నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే నిశ్చయము మరియు స్మృతి ఉంటుందా? స్మృతి లేకుండా సమర్థత వస్తుందా? విజయీ అయ్యేటందుకు ఆధారం - స్మృతి. ఒకవేళ స్మృతి బలహీనంగా ఉంటే,నిరంతరం లేకపోతే మరియు స్మృతి శక్తిశాలిగా లేకపోతే ఎలా విజయీగా అవుతారు. మొదట ఈ నిశ్చయాన్ని సదా స్మృతి స్వరూపంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ లౌకిక వృత్తి (వ్యాపారం) మరియు లౌకిక సంబంధాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! ఆ స్మృతితోనే సమర్థత వస్తుంది. నేను ఇలాంటి కుటుంబానికి చెందినవాడినని, ఇలాంటి వృత్తి చేసేవాడిని, అలాగే మరజీవ బ్రాహ్మణ జన్మ యొక్క సంబంధాలు లేదా వృత్తి లేదా స్వ స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. స్మృతి బలహీనంగా ఉండడం వలన విజయం కనిపించడం లేదు. విజయం లభించాలి అని ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకండి. విజయీగా అవ్వడానికి పునాది ఏదైతే ఉందో దానిని గట్టిగా చేసుకోండి. మార్గంలో పయనించకుండానే గమ్యానికి చేరిపోతామా, ఆలోచించండి? మార్గంలో తప్పకుండా పయనించాల్సి ఉంటుంది కదా! కనుక విజయము అనేది గమ్యము. నిరంతర స్మృతి అనేది మార్గము. ఈ మార్గంలో పయనిస్తున్నారా లేక గమ్యం కనిపించాలని ఎదురుచూస్తున్నారా? లభించిన ఈశ్వరీయ లాటరీని పూర్తిగా ఉపయోగించుకోకపోతే సంతోషం లేదా శక్తి యొక్క అనుభవం ఎలా చేసుకుంటారు? ఎవరి దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించడం ద్వారానే సుఖం యొక్క ప్రాప్తిని పొందగలుగుతారు. ఉపయోగించుకోకపోతే ధనాన్ని చూసుకుని కేవలం సంతోషమే ఉంటుంది. కానీ దాని ద్వారా ఏదైతే సుఖం ప్రాప్తించాలో దానిని అనుభవం చేసుకోలేరు. అలాగే లాటరీ అయితే లభించింది, కానీ దానిని ఉపయోగించుకోవాలి, అనగా జీవితంలోకి తీసుకురావాలి. అలా చేయకపోతే సుఖము, ఆనందం లేదా విజయీ అయిన సంతోషాన్ని అనుభవం చేసుకోలేరు. అనుభవీగా అవ్వాలి కదా! అనుభవం అనేది జీవితం యొక్క ముఖ్య ఖజానా. లౌకిక పద్దతిలో కూడా అనుభవీ ఆత్మలు గొప్పవారిగా భావించబడతారు.ఈ ఈశ్వరీయ మార్గంలో కూడా అనుభవీ ఆత్మగా అవ్వాలి. ఏదైతే చెప్పారో అది అనుభవం చేసుకున్నారా? నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని భావిస్తున్నారు. కానీ దానిని అనుభవం కూడా చేసుకున్నారా? నడుస్తున్నాం కదా, దానికదే అనుభవం అవుతుంది అనుకోకండి. ఏ పని అయినా దానిని చేసే తారీఖు నిర్ణయించుకోనంత వరకు ఆ పని అవ్వదు. పురుషార్థం తీవ్రమవ్వదు. ఏదైనా లౌకిక లేదా అలౌకిక పని అయినా కానీ తారీఖు నిర్ణయించుకున్న తరువాత కర్మలో కూడా స్వతహగానే బలం వస్తుంది. ఫలానా తారీఖుకు ఈ పని పూర్తి చేయాలని అర్ధమవుతుంది. ఆ తారీఖుని స్మృతిలో ఉంచుకోవడం ద్వారా కర్మలో వేగం కూడా వస్తుంది. రేపటికి పూర్తి చేయాలంటే వేగం కూడా అలాగే ఉంటుంది. ఈ జ్ఞానం యొక్క ముఖ్య సూక్తి - ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. దీనికి రేపు లేదా ఎల్లుండి కాదు. దీనికోసం తారీఖు ఏమిటంటే - ఇప్పుడే, గంట తరువాత కూడా కాదు. చేస్తాము అనటం కాదు, చేయాల్సిందే అనే నిశ్చయం పెట్టుకోవాలి. చేయాల్సిందే ఇదే దృఢ సంకల్పం.దృఢ సంకల్పం లేకుండా దృఢత రాదు. పురుషార్ధం యొక్క సమయం ఎంత తక్కువగా ఉంది? చాలా సమయం ఉన్నట్లుగా కనిపిస్తుందా? సమయం యొక్క ధ్యాస అయితే పెట్టుకోవాలి కదా! ప్రాలబ్దం ఎంత సమయం పొందాలి. రెండు యుగాల ప్రాలబ్దం మరి పురుషార్ధం చేసి ప్రాలబ్దం చేసే సమయం ఎంత తక్కువగా ఉంది. ఇది సదా స్మృతిలో ఉంచుకోవాలి. చాలాకాలం యొక్క ప్రాలబ్దం పొందాలంటే చాలాకాలం యొక్క పురుషార్థం కూడా కావాలి కదా! చివరి సమయంలో పురుషార్ధం చేస్తే ప్రాలబ్దం కూడా చివరలోనే లభిస్తుంది. పురుషార్ధం మొదట చేయరు కానీ మొదటి ప్రాలబ్దం కావాలి. చివరిలో మిగిలిందేదో పొందితే ఏమవుతుంది? మొదటి నెంబర్ ప్రాప్తి కావాలనే లక్ష్యం ఉన్నప్పుడు పురుషార్థం కూడా అలాగే చేయండి. ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ దానిని మార్గమధ్య దృశ్యంగా భావించండి. మార్గంలో పయనిస్తున్నప్పుడు అనేక రకాలైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ గమ్యాన్ని చేరాలనుకునేవారు వాటిని చూడరు. వారి బుద్ధిలో గమ్యం చేరుకోవాలనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా బుద్ధిలో గమ్యాన్ని పెట్టుకోండి, కానీ విషయాలను పెట్టుకోకండి. చిన్న విషయాన్ని చూడడంలోనే సమయాన్ని పోగొడితే సమయానికి గమ్యానికి చేరుకోగలరా? కనుక ఇప్పుడు దృఢత తీసుకురావాల్సిన సమయం. లేకపోతే కొంచెం సమయం తరువాత ఈ సమయం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏదైతే చేయాలో అది చేయలేకపోయామని ...ఇలా తరువాత ఆలోచించడం కంటే ముందుగా ఈ సమయాన్ని పరివర్తన చేయండి. విశ్వపరివర్తనకు నిమిత్తులు, బాబా కార్యం ఏదైతే ఉందో ఆ కార్యానికి బాబాతో పాటు స్వయాన్ని కూడా నిమిత్తంగా భావించండి. విశ్వంలో స్వయం కూడా ఉన్నారు కదా! విశ్వాన్ని పరివర్తన చేసేవారు మొదట స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను విశ్వాన్ని పరివర్తన చేయడానికి నిమిత్తం అయినప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కష్టమేముంది అని సదా అనుకోవాలి. అప్పుడు ఏ విధంగా అవుతుంది, ఏమవుతుంది, అవుతుందా, అవ్వదా? అనే ప్రశ్నలు రావు. రెండవ విషయం ఏమి స్మృతిలో ఉంచుకోవాలంటే ఈ విశ్వపరివర్తన అనే కార్యం ఎన్నిసార్లు చేశాను? లెక్కలేనన్నిసార్లు చేసారు. ఇది పక్కాయే కదా! బాబాతో పాటు నేను కూడా అనేకసార్లు నిమిత్తమయ్యాను. అనేకసార్లు చేసిన విషయంలో కష్టం ఏమైనా ఉంటుందా? అతి పురాతన విషయాన్ని కేవలం నిమిత్తంగా అయ్యి తిరిగి చేయాలంతే. తిరిగి చేయడం అనేది సహజంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కనుక ఇది కూడా స్మృతిలో ఉండాలి. కొంచెం అయినా కష్టం అనే సంకల్పం వస్తే ధైర్యాన్నిచ్చే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అనేకసార్లు చేశాను అనే విషయం స్మృతిలోకి రావడం ద్వారా సమర్ధత వచ్చేస్తుంది. నేను బాబా సమానంగా శక్తులను స్వరూపంలో చూపించేవాడిని అనగా శక్తి స్వరూపాన్ని. ఈ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి. సంబంధం పెట్టుకోవడం ద్వారా ఇక్కడి వరకు చేరుకున్నారు. కానీ ఇప్పుడు బాబాపై స్నేహం, బాబా కార్యంతో స్నేహం, బాబా ద్వారా లభించిన జ్ఞానంతో స్నేహం ఈ మూడింటి సమానత పెట్టుకోండి. బాబాపై స్నేహంలో ఎక్కువగా ఉన్నారు.మిగతా రెండింటిలో తేలికగా ఉన్నారు. జ్ఞానం ద్వారా శక్తి వస్తుంది. ఒక్కొక్క వాక్యం కోటానుకోట్లకు అధిపతిగా తయారుచేసేది. ఇంత గొప్పతనాన్ని ఇస్తూ ఆ వాక్యాలను ధారణ చేయండి. గొప్పతనం తెలుసుకుంటే స్నేహం ఉంటుంది. గొప్పతనం తెలుసుకోనంత వరకు స్నేహం ఉండదు. గొప్పతనం తెలుసుకోవడం ద్వారా స్నేహం స్వతహగానే ఉంటుంది. నిశ్చయబుద్ది విజయంతి కదా! అలౌకిక జన్మ లభించింది నేను బాబా సంతానాన్ని అని నిశ్చయబుద్ధి అయ్యారు. కనుక తండ్రి యొక్క వారసత్వమే విజయం. మాస్టర్ సర్వశక్తివంతులకు వారసత్వం ఏమిటి? శక్తులు. కనుక పిల్లలుగా అవ్వటం అంటే విజయీగా అవ్వడం. విజయం యొక్క తిలకం స్వతహగానే పెట్టబడుతుంది. పెట్టుకోనక్కర్లేదు.అది అవినాశి. అధికారి అయిపోయారు కదా! స్నేహీ మరియు సహయోగి అయ్యే అదృష్టం మంచిగా ఉంది. కుటుంబం అంతా ఏకమతంగా ఉండడం ఇది అదృష్టానికి గుర్తు. కుటుంబ సభ్యులందరూ పురుషార్థం యొక్క పోటీలో ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్ళే సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు. ధైర్యంతో సహయం స్వతహగానే ప్రాప్తిస్తుంది (వీర్ చంద్ కోసం) వీరిది మోహజీత్ కుటుంబం, ఇలాంటి మోహజీత్ కుటుంబాలు ఎన్ని తయారు చేశారు. శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటి కుటుంబాల యొక్క పుష్పగుచ్చం తయారు చేయండి. పది, పదకొండు ఇలాంటి కుటుంబాలు తయారయితే అహ్మదాబాద్ యొక్క నెంబరు ముందుకు వెళ్ళిపోతుంది. గుజరాత్ వారికి కుటుంబాలు నడిపించే వరదానం డ్రామానుసారం లభించింది. కానీ మోహజీత్ కుటుంబం మరియు అందరూ ఒకే సంలగ్నతలో శ్రేష్ఠ పురుషార్థం యొక్క వరుసలో ఉండాలి. అలాంటి పుష్పగుచ్ఛాన్ని తయారుచేయండి. మంచిది.