29.08.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఇప్పుడు విధి యొక్క స్థితిని దాటి సిద్ధి స్వరూపంగా అవ్వాలి.

సర్వ రిద్ది, సిద్ధుల యొక్క దాత, సర్వుల మనోకామనలను పరిపూర్ణం చేసేవారు, మహదాని మూర్తి, వరదాని మూర్తి మరియు అవ్యక్తమూర్తి బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు ఏ సభ కొలువుదీరి ఉంది? వర్తమాన సమయంలో స్వయాన్ని ఏ స్వరూపంలో చూస్తున్నారు. బాప్ దాదా ఎలాగైతే బహురూపియో అదేవిధంగా మీరందరూ కూడా బహురూపి. కానీ ఈ సమయంలో ఏ స్వరూపాన్ని ధారణ చేసి ఈ సభలో కూర్చున్నారు. ఈనాటి సభ ఎవరిదో తెలుసా? వర్తమాన సమయంలో ప్రపంచం వారు శ్రేష్ట ఆత్మలైన మిమ్మల్ని ఏ స్వరూపంతో ఆహ్వనం చేస్తున్నారో చెప్పండి. శ్రేష్ట ఆత్మలైన మిమ్మల్ని అందరినీ ఆహ్వనిస్తున్నారా? లేక ఒక ఆత్మనే ఆహ్వనిస్తున్నారా? ఎవరిని ఆహ్వనిస్తున్నారు? వర్తమాన సమయంలో మిమ్మల్ని ఏ స్వరూపంతో ఆహ్వనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి సమయం నడుస్తుంది. ఎవరి ఆహ్వనం జరుగుతుంది, వర్తమాన సమయంలో రెండు రూపాలతో ఆహ్వనిస్తున్నారు.వారు మిమ్మల్నే ఆహ్వనం చేస్తున్నారు. కాని మీకు తెలియనే తెలియడం లేదు. ఈ సమయంలో చాలా ఎక్కువగా వరదాని లేదా విశ్వ కళ్యాణకారి, దాత రూపంలో శ్రేష్ఠాత్మలైన మిమ్మల్ని అందరినీ నలువైపులా ఆహ్వనం చేస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గం ద్వారా లేదా భక్తి ఆధారంగా శ్రేష్టత కర్మల ద్వారా ఏవైతే అల్పకాలిక సాధనాలు అనగా వైభవాలు ఈ ప్రపంచంలో ప్రాప్తిస్తున్నాయో వాటి అన్నింటి యొక్క అల్పకాలిక ప్రాప్తి యొక్క సింహసనం ఊగడం మొదలైపోయింది. ఆధారమైన సింహసనం ఎవరిదైనా కదలడం మొదలైతే ఆ సమయంలో ఏమి జ్ఞాపకం వస్తుంది? ఆ సమయంలో సదాకాలిక ప్రాప్తిని ఇచ్చేవారు లేదా సుఖశాంతులను ఇచ్చే తండ్రి మరియు వెనువెంట శివశక్తులు లేదా మహదాని, వరదాని దేవీలు స్మృతి వస్తారు. ఎందుకంటే దేవీలు లేదా మాతల యొక్క హృదయం స్నేహీగా లేదా దయాహృదయంగా ఉంటుంది. కనుక వర్తమాన సమయంలో మాత రూపానికి పూజ లేదా ఆహ్వనం ఎక్కువ చేస్తున్నారు. సిద్ది స్వరూపం అనగా సర్వ కార్యాలను సిద్ధితో చేసే ఆత్మల యొక్క ఆహ్వనం వర్తమాన సమయంలో ఎక్కువ ఉంది. ఈ రోజుల్లో అనేక అలజడుల్లో అలజడి అయిపోయిన నిర్భల ఆత్మలు, గమ్యాన్ని వెతికే ఆత్మలు మరియు సుఖ శాంతుల ప్రాప్తుల కొరకు తపించే ఆత్మలు పురుషార్థం యొక్క విధిని కోరుకోవడం లేదు. విధికి బదులు సహజ సిద్ధిని కోరుకుంటున్నారు. సిద్ది తరువాత విధి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి ఆత్మలకు విశ్వ కళ్యాణకారీ ఆత్మలైన ఏ స్వరూపం కావాలి? వర్తమాన సమయంలో కావాల్సింది ప్రేమ స్వరూపం, నియమ స్వరూపం కాదు, ప్రేమ స్వరూపం. మొదట ప్రేమను ఇవ్వండి తరువాత నియమం చెప్పండి. ప్రేమ ఇచ్చిన తరువాత నియమాన్ని కూడా స్నేహ సాధనంగా వారు అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే బాహ్య రూపంగా మెరిసే ప్రపంచంలో లేదా విజ్ఞాన యుగంలో విజ్ఞానం యొక్క సాధనాలు అనేకం ఉన్నాయి. కానీ ఎంతెంతగా రకరకాల అల్పకాలిక ప్రాప్తినిచ్చే సాధనాలు వస్తున్నాయో అంతగానే సత్యమైన స్నేహము లేదా ఆత్మిక ప్రేమ, స్వార్థ రహిత ప్రేమ సమాప్తి అయిపోతూ ఉంది. ఆత్మలతో స్నేహం సమాప్తి అయిపోయి సాధనాలతో ప్రేమ పెరిగిపోతూ ఉంది. అందువలన అనేక రకాలైన ప్రాప్తులున్నా కానీ స్నేహం అప్రాప్తిగా ఉన్న కారణంగా (లోటుగా ఉన్న కారణంగా) సంతుష్టత లేదు. రోజు రోజుకీ ఈ అసంతుష్టత పెరుగుతుంది. ఈ సాధనాలు గమ్యాన్ని దూరం చేసేవి, మనల్ని భ్రమింపజేసేవి అని అనుభవం చేసుకుంటారు. ఇవి ఆత్మను తపింపచేసేవి. కల్పపూర్వపు మహిమ ఉంది కదా - గుడ్డివారి సంతానం గుడ్డివారని. అలాగే మృగతృష్ట సమానంగా సర్వప్రాప్తుల నుండి వంచితం అయిపోయినట్లు సమాయానుసారం నలువైపులా అనుభవం చేసుకుంటారు.

అలాంటి సమయంలో ఇలాంటి ఆత్మల యొక్క సర్వ మనోకామనలను పూర్తి చేసేవారు లేదా మనసు కోరుకున్న ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేటందుకు ఎలాంటి ఆత్మలు నిమిత్తం అవుతారు? ఎవరైతే స్వయం సిద్ధి స్వరూపంగా ఉంటారో వారు నిమిత్తమవుతారు. రాత్రి పగలు విఘ్నాలను తొలగించే విధిలో ఉండకూడదు. స్వయం బాబా ద్వారా లభించిన ప్రత్యక్ష ఫలం( భవిష్య ఫలం కాదు) అతీంద్రియ సుఖం లేదా సర్వశక్తుల యొక్క వరదానాన్ని పొందిన వరదానిమూర్తులైన ఆత్మలే నిమిత్తం అవుతారు. బాబా ఇది చేయండి, అది చేయండి ఇలా స్వయం అడిగే వారు కాదు. రాయల్ రూపంగా కూడా అడిగే సంస్కారం అంశమాత్రంగా కూడా ఉండదు. బాబా ఇది మీ పని కనుక మీరు చేస్తారు. ఇలా బాబాకి స్మృతి ఇప్పిస్తూ బాబాని కూడా తమ వలె మానవునిగా చేయరు. ఎందుకంటే చెబితే చేసేవారు మనుష్యులుగా లెక్కించబడతారు. చెప్పకుండా చేసేవారు దేవతలుగా లెక్కించబడతారు. దేవతలకు రచయిత అయిన బాబాని ఏవిధంగా తయారు చేసేస్తున్నారు. ఇలాంటి మాస్టర్ సర్వశక్తివాన్, సర్వాధికారి ఆత్మలు ఇతరులకు కూడా సహజ ప్రసిద్ధిని ప్రాప్తింపచేయగలరు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సాధారణ పరిశీలన కాదు, సమయానుసారం పరిశీలన కూడా సూక్ష్మ రూపంలో ఉండాలి. ప్రతి సబ్జెక్టులో విధి స్వరూపంగా ఎంత వరకు అయ్యాను మరియు సిద్ది స్వరూపంగా ఎంత వరకు అయ్యాను అని పరిశీలించుకోండి, అనగా ప్రతి సబ్జెక్టులో విధిలో ఎంత సమయం వెళ్తుంది, సిద్ధి ఎంత సమయం అనుభవం అవుతుంది? నాలుగు సబ్జెక్టులలో మనసా, వాచా, కర్మణా మూడు రూపాలు ఏ స్థితి వరకు చేరుకున్నాను? ఇది పరిశీలించుకోవాలి. మహారథీల కొరకు ఇప్పుడు ఇది విధి యొక్క సమయం కాదు, సిద్ది స్వరూపాన్ని అనుభవం చేసుకునే సమయం. లేకపోతే వర్తమాన సమయం యొక్క అనేక అలజడులు ఇప్పటి వరకు విధిలోనే నిమగ్నం అయి ఉన్న ఆత్మను తన స్థితి నుండి అలజడిలోకి సహజంగా తీసుకువచ్చేలా ప్రభావితం చేస్తాయి. అందువలనే మహిమ ఉంది. పాండవులు అంతిమ సమయంలో ఉన్నత పర్వతాలపై శరీరం వదిలారు. అనగా దేహభిమానం లేదా దు:ఖమయ ప్రపంచం యొక్క ప్రభావాలన్నింటితో అతీతంగా స్వయం ఉన్నత స్థితిలో స్థితులయ్యారని అర్థం. ఉన్నత స్థితిలో స్థితులై క్రింద ఉన్న వారి యొక్క ఆటను సాక్షిగా చూడండి. ఇలాంటి స్థితిలో ఉండేవారే సమస్యా స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవుతారు. కనుక వర్తమాన సమయంలో ఇలాంటి స్థితి కావాలి. ఈ విధంగా ఉన్నారా? కొంచెం కూడా అలజడిలోకి రావడం లేదు కదా? ఏమవుతుందో, ఎలా అవుతుందో మాకేమవుతుందో, ఇలా అలజడిలోకి రావడం లేదు కదా? అచంచల స్వరూపులే కదా? అచంచలంలో ఏ అలజడి ఉండదు. అలాంటి స్థితి గలవారే విజయీ రత్నం అవుతారు. బాప్ దాదా ఈ రోజు పిల్లల ఆజ్ఞానుసారం ఆజ్ఞాకారి యొక్క పాత్ర అభినయిస్తున్నారు. కార్యక్రమం ప్రకారం రాలేదు. కనుక మీరు కూడా తండ్రిని అనుసరించండి. రేపు ఆత్మల యొక్క ఆహ్వనం, బాబా యొక్క ఆహ్వనం కాదు. మీరు కూడా మీ విశ్వమహరాజ స్వరూపంలో లేదా విశ్వ యజమాని యొక్క బాల్య స్వరూపంలో (శ్రీ కృష్ణుడు) మంచిగా స్థితి అయి ఉండండి. దీని ద్వారా మీ యొక్క భక్తులు అల్పకాలికంగా కూడా దర్శనంతో ప్రసన్నం అయిపోతారు. రోజంతటిలో ఎంత మంది భక్తులకు బాబా ద్వారా భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చారో తరువాత మరలా అనుభవం చెప్పాలి. మీ భక్తులను రాజీ చేసుకున్నారు కదా? ఒకరి స్మృతిచిహ్నమే లేదు, ఒకరితో పాటు మీరందరూ కూడా ఉన్నారు. కనుక రేపు మీ అందరి యొక్క జన్మాష్టమి జరుపుకుంటారు. అందరు కృష్ణుని సమానంగా దేవతా స్వరూపంలో ఉంటారు కదా! మీ అందరి దేవతా స్వరూపం యొక్క స్మృతిదినం ప్రపంచం వారు జరుపుకుంటారు. మరి మీరేం చేస్తారు? వారు జరుపుకుంటారు, మీరు జరుపుకునే వారి పట్ల మహదాని, వరదాని అవుతారు.

సదా బాబా సమానంగా సర్వసిద్ధి స్వరూపులకు , ప్రతి సెకెను సర్వుల పట్ల విశ్వకళాణకారి, వరదాని అయిన వారికి స్వయం ద్వారా బాబాని సాక్షాత్కారం చేయించేవారికి, సాక్షాత్తు తండ్రి స్వరూప సాక్షాత్కార మూర్తులకు, సదా నిరాకారి మరియు సదా సదాచారి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.