02.09.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


హృదయ సింహసనాధికారులే సత్యయుగీ విశ్వరాజ్యా ధికారులు.

భక్తులకు భక్తి యొక్క ఫలాన్నిచ్చేవారు, ప్రకృతిని తమ ఆధీనం చేసుకునేవారు, సత్యన్నారాయణుని యొక్క సత్యకథను వినిపించి సత్యయుగాన్ని స్థాపన చేసేవారు, సత్యశివబాబా త్రిమూర్తి సింహసనాధికారి పిల్లలను సంబోధిస్తూ చెప్పారు -

పిల్లలైన మీరందరూ స్వయాన్ని త్రిమూర్తి సింహసనాధికారులుగా భావిస్తున్నారా? ఈనాటి ఈ సభ త్రిమూర్తి సింహసనాధికారుల సభ. 1) అకాలమూర్తి ఆత్మ యొక్క భ్రుకుటి రూపి సింహసనం. 2) విశ్వం యొక్క రాజ్య సింహసనం 3) సర్వ శ్రేష్ట బాప్ దాదా యొక్క హృదయమనే సింహసనం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని మూడు సింహసనాధికారులగా అనుభవం చేసుకుంటున్నారా? కేవలం తెలుసుకున్నారా? మీరు జ్ఞాన స్వరూపులేనా లేక అనుభవీ స్వరూపులు కూడానా? నేను శ్రేష్టాత్మను, అనేకసార్లు ఈ సింహసనాలను అధిష్టించాను. ఈ విధంగా అనేకసార్ల యొక్క స్మృతి స్పష్ట రూపంలో మరియు సహజ రూపంలో అనగా ఇప్పటి విషయంలాగే అనుభవం అవుతుందా?ఎప్పటి విషయమో కాదు, ఇప్పటి విషయమే. ఇలా అనుభవం చేసుకునేవారు బాప్ దాదాకి అతి స్నేహి మరియు అతి సమీపం. ఈ అన్ని సింహసనాలకు ఆధారం - బాప్ దాదా యొక్క హృదయ సింహసనాధికారిగా అవ్వడం. దాని కోసం ముఖ్య సాధనం ఏమిటో తెలుసా? హృదయ సింహసనం. ఎవరైతే స్వయం సింహసనాధికారిగా అవుతారో వారికి తెలుస్తుంది. బాప్ దాదాకి అందరికంటే ఎటువంటి పిల్లలు ప్రియమనిపిస్తారు, బాబాని ప్రపంచం వారు ఏమని భావిస్తున్నారు? భగవంతుడు అంటే ఎవరు? సత్యమే భగవంతుడు, సత్యాన్నే భగవంతుడిగా భావిస్తారు. బాప్ దాదా వినిపించేది కూడా సత్యనారాయణుని కథ మరియు స్థాపించేది కూడా సత్యయుగం. బాబా సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువుగా ప్రత్యక్ష పాత్ర అభినయిస్తున్నారు. అలాంటి సత్యమైన తండ్రికి ఏది ప్రియం అనిపిస్తుంది? సత్యత. ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ స్వచ్చత లేదా శుభ్రత తప్పకుండా ఉంటుంది. సత్యమైన హృదయానికి యజమాని రాజీ అవుతారని మహిమ కూడా ఉంది. హృదయ సింహసనాధికారులు తప్పకుండా సేవాధారిగా ఉంటారు. కానీ సేవాధారికి గుర్తు - సంబంధము, సంప్రదింపుల్లో ప్రతి సంకల్పము, ప్రతి మాటలో సత్యత మరియు స్వచ్ఛత కనిపిస్తుంది. అనగా ఇలాంటి హృదయ సింహసనాధికారి శ్రేష్ట ఆత్మ యొక్క ప్రతి సంకల్పం సత్యం అవుతుంది, ప్రతి మాట సత్యం అవుతుంది. సత్యము అనగా నిజము మరియు సత్యము, అనగా సఫలం కూడా అనగా ఏ సంకల్పము లేదా మాట వ్యర్థం లేదా సాధారణంగా ఉండదు. వారు ఎలాంటి సేవాధారులంటే వారి యొక్క ప్రతి అడుగులో ప్రతి సమయం వారి దృష్టిలో సర్వాత్మల వల్ల నిస్వార్థ సేవయే కనిపిస్తుంది. నిద్రపోతున్నా కానీ, మేల్కొన్నా కానీ, సేవ మరియు నడుస్తున్నా కానీ సేవ. కలలో కూడా కేవలం సేవ తప్ప మరే విషయం రాదు. ఇలాంటి సేవాధారులు అచంచలంగా మరియు అలసిపోనివారిగా ఉంటారు. అలాంటి వారే బాప్ దాదాకు హృదయ సింహసనాధికారిగా ఉంటారు. అర్థమైందా వారి గుర్తులేమిటో? ఇలాంటి హృదయ సింహసనాధికారులకు విశ్వం యొక్క రాజ్య సింహసనం ప్రాప్తించడం నిశ్చితం అయిపోయింది. ఎలాగైతే ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటారో, అలాగే కల్పకల్పము వారికి సింహసనం నిశ్చితం. ప్రకృతిని ఆధీనం చేసుకుని విజయీగా అయ్యే పిల్లలకు రాజ్యాధికారిగా అవుతామో లేదో అనే సంకల్పం కూడా రాదు. ఇలాంటి విజయీ లేదా యుజమానుల ముందు ప్రకృతి కూడా దాసి వలె ముందు, వెనుక వంగుతూ ప్రణామం చేస్తుంటుంది. అలాంటి శ్రేష్ఠాత్మల ముందు ప్రతి సమయం సేవాధారి అయి సదా సేవ చేస్తుంది. మీ యొక్క ఇలాంటి శ్రేష్ఠ స్వరూపం కనిపిస్తుందా? ఇప్పుడు ప్రకృతి మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. తమ యజమానికి సేవ చేసుకోవాలని. సాగరం, భూమి, విశ్వ యజమాని యొక్క సేవార్థం ఎదురు చూస్తున్నాయి. కనుక స్వయాన్ని ఇప్పుడు సంపన్నంగా తయారుచేసుకోండి. భక్తులు దేవీదేవతలను, శక్తులను, సాలిగ్రామ రూపంలో పూజిస్తూ పెద్దగా ఆహ్వనిస్తున్నారు. తమ ప్రియమైన నిద్రను కూడా త్యాగం చేసి అరచి అరచి మిమ్మల్ని అందరినీ ఆహ్వనిస్తున్నారు. మా వరదాని, మహదాని ఆత్మలు లేదా మా ఇష్టదేవత మా ఆహ్వనం వినాలని, అప్రాప్తి నుండి ప్రాప్తినివ్వాలని. అదేవిధంగా ఇప్పుడు సమయం కూడా సమీపంగా వస్తున్న కారణంగా భక్తులతో పాటు ప్రకృతి కూడా మిమ్మల్ని ఆహ్వనిస్తూ ఉంది. ఎప్పుడు మా యొక్క సతో ప్రధాన యజమాని మాకు రాజి అయి మాపై రాజ్యం చేస్తారని. ప్రకృతి కూడా సతో ప్రధాన శరీరం ధరిస్తుంది. మరైతే ప్రకృతి యొక్క ఆహ్వనం లేదా భక్తుల యొక్క ఆహ్వనం కనిపిస్తుందా లేదా వినిపిస్తుందా? వీరి యొక్క ఆహ్వనంతో పాటు మరోవైపు బాప్ దాదా కూడా ఆహ్వనం చేస్తున్నారు - సమానంగా మరియు సంపూర్ణంగా అయి సూక్ష్మవతన నివాసి ఫరిస్తాగా అయి బాబాతో పాటు ఇంటికి వెళ్ళాలా లేక సంగమయుగం ఎక్కువగా ఇష్టం అనిపిస్తుందా? ఎవరెడీగా అయిపోయారా? ఎక్కడ కూర్చో పెట్టినా ఏ రూపంలో కూర్చోపెట్టినా ఎంత వరకు కూర్చోపెట్టినా కూర్చుంటాము అనే సదా స్థితిలో ఉంటున్నారా? ఆత్మిక సైన్యానికి అంతిమ ఆజ్ఞ ఎంత సమయంలో లభిస్తుంది. ఆజ్ఞ ఒక్క సెకెనులో లభిస్తుంది. ఒక గంట ముందు కూడా తెలియదు. అప్పుడే అష్టరత్నాలు వస్తారు. తారీకు నిర్ణయించి చెప్పి పరీక్ష పెట్టరు, అనగా అంతిమ తారీఖు ఏదైతే డ్రామాలో నిశ్చితమై ఉందో ఆ తారీఖు లేదా సమయం చెప్పబడదు, సుమారుగా చెప్తారు. అంతే కానీ అంతిమ పరీక్షలో ఒకటే ప్రశ్న ఉంటుంది మరియు ఒకే సెకెను సమయం ఉంటుంది, అందువలన పిల్లలు ఎవరెడి అవ్వాలి. ప్రతి సమయం స్వయాన్ని పరిశీలించుకోండి. సర్దుకునే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి రెండు శక్తులతో సంపన్నం అయ్యారా? సర్దుకునే శక్తిని చాలా సమయం నుండి కర్తవ్యంలోకి తీసుకువచ్చే అభ్యాసం ఉండాలి. అంతిమ సమయంలో సర్దుకోవడం మొదలు పెట్టకూడదు. అలాగైతే సర్దుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. కనుక సర్దుకునే కార్యాన్ని ఇప్పుడే సంపన్నం చేయాలి. అప్పుడే ఒకే నమ్మకం లేదా నిరంతరం నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడతాను మరియు నీవు చెప్పిందే వింటాను అని చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోగలరు. ఎనిమిది గంటలు నీతో మాట్లాడతాను లేదా వింటాను. మిగతా గంటలు ఆత్మలతో మాట్లాడతాను లేదా వింటాను అని అయితే ప్రతిజ్ఞ చేయలేదు కదా! నిరంతరం అని ప్రతిజ్ఞ చేశారు. కనుక దీంట్లో చతురులు అవ్వకండి. బాబా ఇచ్చిన పాయింట్లు బాబా ముందుకి న్యాయవాది రూపంలో పెట్టకూడదు. అమృతవేళ కొందరు న్యాయవాది అయి వస్తున్నారు. సత్యయుగంలో న్యాయస్థానం ఉండదు. అందువలన బాప్ దాదా ముందు ఇలాంటి తుంటరితనం చేయకండి. న్యాయవాదికి బదులు న్యాయమూర్తి అవ్వండి. కానీ ఎవరికి? స్వయానికి. స్వయం న్యాయమూర్తి అవ్వండి, ఇతరులకు కాదు. రోజంతటిలో అమృతవేళ సమయంలో పిల్లల యొక్క విచిత్రమైన ఆటలు చూసి నవ్వుకునే అవకాశం బాప్ దాదాకి లభిస్తుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి ఫోజు మరియు పొజిషన్ ఫొటో తీసే విధంగా ఉంటుంది. సాక్షి అయ్యి ఒక్క రోజు మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా చాలా నవ్వుకుంటారు. కొందరు యుద్ధవీరులై వస్తున్నారు, బాబా ఇచ్చిన శస్త్రాలను బాబా ముందు ఉపయోగిస్తున్నారు. బాబా మీరు ఇలా చెప్పారు, జ్ఞానం ఇలా చెబుతుంది అంటున్నారు. బాబా నవ్వుకుంటూ ఆటను చూస్తుంటారు. యుద్ధవీరులకు బదులు విజయీగా అవ్వండి, అప్పుడే త్రిమూర్తి సింహసనాధికారులుగా కాగలుగుతారు. అర్థమైందా! మంచిది.

ఈవిధంగా సదా విజయీ సర్వ ప్రతిజ్ఞలను నిలుపుకునేవారికి, బాప్ దాదా యొక్క అతి స్నేహి మరియు సమీపంగా ఉండేవారికి, ప్రకృతిని దాసిగా తయారుచేసుకునేవారికి మరియు సర్వాత్మల యొక్క సర్వ మనోకామనలను పూర్తి చేసేవారికి శ్రేష్ఠ ఆత్మలకు బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.