06.09.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మూడు కంబైండ్ స్వరూపాలు.

బాబా మరియు దాదా కంబైండ్ రూపంలో తమ ప్రతిజ్ఞను సదా నిలుపుకునేవారు, స్వచ్ఛమైన ఆత్మిక సహచరి అయిన త్రిమూర్తి శివబాబా మాట్లాడుతున్నారు -

ప్రతి ఒక్కరికి మీ యొక్క మూడు రూపాల కంబైండ్ స్వరూపాలు తెలుసా? 1)అనాది కంబైండ్ రూపం 2) సంగమయుగ కంబైండ్ రూపం 3) భవిష్య కంబైండ్ రూపం. ఈ మూడు తెలుసా? మనుష్య ఆత్మలైన మీ యొక్క అనాది కంబైండ్ రూపం ఏది? పురుషుడు లేదా ప్రకృతి అనండి లేదా ఆత్మ మరియు శరీరం అనండి. ఈ అనాది కంబైండ్ రూపం, ఈ అనాది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. భవిష్య కంబైండ్ రూపం ఏమిటి? చతర్భుజ విష్ణు రూపం. మీ యొక్క సంగమయుగీ కంబైండ్ రూపం ఏది? శివుడు మరియు శక్తి. శక్తి, శివుడు లేకుండా ఏం చేయలేదు మరియు శివబాబా కూడా శక్తులు లేకుండా ఏమీ చేయలేరు. కనుక అందరి యొక్క సంగమయుగ కంబైండ్ రూపం - శివశక్తి. కేవలం మాతలే కాదు, పాండవులు కూడా స్వరూపులు. స్మృతిచిహ్న రూపంలో ఈనాటి జగద్గురువులు కూడా మీ యొక్క కంబైండ్ రూపాన్ని అనగా శివశక్తులను పూజచేస్తున్నారు. మీకు కంబైండ్ శివశక్తి అనే స్మృతి సదా ఉండాలి. కలిసి ఉన్నప్పుడు మర్చిపోగలరా, మరెందుకు మరిచిపోతున్నారు? స్వయాన్ని ఒంటరిగా భావిస్తున్నారు, అందువలనే మరిచిపోతున్నారు. కల్పపూర్వపు స్మృతిచిహ్నంలో కూడా అర్జునుడు బాబా యొక్క తోడును మరిచిపోయినప్పుడు అనగా సారథిని మరిచిపోయినప్పుడు ఏ విధంగా అయిపోయాడు? నిర్బలంగా, బలహీనంగా అయిపోయాడు. ఎప్పుడైతే నా తోడు లేదా సారథి బాబా అని స్మృతి వస్తుందో అప్పుడు విజయీ అవుతాడు. నిరంతరం సహజ స్మృతికి సహజ యుక్తి ఇదే - సదా మీ యొక్క కంబైండ్ రూపాన్ని తోడు పెట్టుకోండి లేదా స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు ఎప్పుడూ కూడా బలహీన సంకల్పాలు కలలో కూడా రాలేవు. మేల్కొంటూ నిద్రపోతూ కూడా కంబైండ్ రూపంలో ఉండండి. తండ్రి సదా పిల్లల తోడు ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నారు మరియు నిలుపుకుంటున్నారు కూడా; మరి మీరు ఆ ప్రతిజ్ఞ యొక్క లాభం పొందాలి కదా! ఇలాంటి సాంగత్యం కాని, ఇలాంటి స్నేహితుడు గాని మరలా ఎప్పుడైనా దొరుకుతారా? అనేక జన్మలుగా ఆత్మల సాంగత్యం చేస్తూ దు:ఖాన్ని అనుభవం చేసుకుని, ఇప్పుడు కూడా ఆత్మల సాంగత్యము మంచిగా అనిపిస్తుందా? బాబా సాంగత్యాన్ని మరిచిపోయి ఇతరుల సాంగత్యంలో వెళ్ళిపోతున్నారా? కొందరు వైభవాలను, కొందరు వ్యక్తులను సహచరులుగా తయారు చేసుకుంటున్నారు అనగా వారి సాంగత్యాన్ని నిలుపుకోవడంలో ఎంతగా నిమగ్నం అయిపోతున్నారంటే బాబాకి చేసిన ప్రతిజ్ఞ గురించి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ ఆట ఆడుతున్నారో తెలుసా? ఆట ఆడే సమయంలో చాలా లీనం అయిపోతున్నారు.ఇప్పుడైతే మరిచిపోయారు. గారడి ఆట కంటే చాలా రమణీయమైన ఆట ఆడుతున్నారా? చెప్పిన వారు ఆడుతున్నారని కాదు, చూసేవారు కూడా చెప్పవచ్చు. ఈ సాకార ప్రపంచంలో మీ గురించి ఒక ఆట చూపిస్తారు. ఆడకోతి, మగకోతి యొక్క ఆట. ఆడకోతిని మగకోతితో నిశ్చితార్థానికి పట్టుకుని తీసుకువస్తారు. కానీ ఆ ఆడకోతి తుంటరిగా పరదా తీసేసి దూరంగా పోతూ ఉంటుంది. వెనక్కి తిరిగి పోతూ ఉంటుంది. కోతి ముందుకు వస్తుంటుంది, ఆడ కోతి వెనక్కి వెళుతూ ఉంటుంది. ఈ రమణీయమైన ఆటను మనోరంజనం కోసం చూపిస్తారు. పిల్లలు కూడా ఆ సమయంలో తుంటరి అయిపోతున్నారు. బాబా ఎదురుగా వస్తున్నారు, పిల్లలు నిరక్ష్యంగా బాబాని చూస్తూ కానీ చూడడం లేదు, వింటూ కానీ వినడం లేదు. ఇలాంటి ఆట ఇప్పుడు ఆడకండి. మీ యొక్క మూడు రూపాలను స్మృతిలో ఉంచుకోండి. అప్పుడే సదాకాలికంగా సదా సాథీ అయిన బాబా తోడును నిలుపుకోగలరు. మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించడం ద్వారా నడుస్తూ నడుస్తూ జీవితంలో ఉదాసీనత వచ్చేస్తుంది. అతీంద్రియ సుఖమయ జీవితం, సర్వ సంబంధాలతో సంపన్న జీవితం మరియు సర్వ ప్రాప్తులతో సంపన్న జీవితం ఆ సమయంలో నిస్సారంగా లేదా పూర్తి అసారంగా, నీరసంగా లేదా పూర్తి నిస్సారంగా అనుభవం అవుతుంది. త్రినేత్రులు అయినా కానీ ఏ దారి కనిపించదు. ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏమి తెలీదు. జీవన్ముక్తి ద్వారాలు తెరిచే వారికి ఏ దారి కనిపించదు. త్రికాలదర్శి అయి ఉండి కూడా తమ వర్తమానాన్ని తెలుసుకోలేరు. సృష్టిలోని సర్వాత్మల భవిష్య పరిణామాన్ని తెలిసినవారు, ఆ సమయంలో తమ కర్మల యొక్క పరిణామాన్ని తెలుసుకోలేరు. ఇలాంటి సమయంలో బాప్ దాదా ఏమి చేస్తారు? చాలా సంతోషపరుస్తారు మరియు అలక తీరుస్తారు. అయినా కానీ పిల్లలు తుంటరితనం చేస్తారు. సమయం అయిపోయిన తరువాత మరలా బాబాని సంతోష పరుస్తారు. పిల్లలు కూడా చాలా చతురులు, జ్ఞాన స్వరూపునికి స్మృతి ఇప్పిస్తూ ఉంటారు. ఏం చేస్తారో మీకు తెలుసు కదా? బాబా మీరు క్షమాసాగరులు, కృపాళువు, దయా సాగరులు... ఇలాంటి మాటలతో సంతోషపరుస్తారు. అప్పుడు బాబా మరలా ఏమి చేస్తారు? బాబా అప్పుడు ప్రేమ మరియు నియమం యొక్క సమానత పెట్టుకుంటారు. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క కథ. కథ వినడంలో అందరూ సంతోషపడుతున్నారు. కానీ ఈ కథను మార్చండి. ఎలాగైతే బాబా వినమ్ర సేవాధారి అయి సేవలో ఉపస్థితి అయి ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరూ బాబాకి తోడు మరియు సహయోగి పిల్లలందరూ బాబా సమానంగా వినమ్ర సేవాధారిగా అవ్వాలి. వినమ్ర సేవాధారులు నిర్లక్ష్యంగా ఉండరు. రేయింబవళ్లు సేవలో తత్పరులై ఉంటారు. ఎలాగైతే బాబా పిల్లల ముందుగా విశ్వాసపాత్రులుగా తోడు నిలుపుకుంటున్నారో అలాగే పిల్లలు కూడా విశ్వాసపాత్రులై ప్రతి ఆజ్ఞపై నడిచి తోడు నిలుపుకోవాలి. ఇలా సదా తోడుగా అవ్వాలి. మంచిది.

సదా ఈవిధమైన సత్యమైన సాథీలకు, ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని బలిహారం చేసుకునే వారికి, విశ్వాసపాత్రులకు బాబా ఆజ్ఞపై నమ్మకంగా నడిచేవారికి, బాబా సమానంగా శ్రేష్టంగా తయారుచేసేవారికి, శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.