14.09.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అకాల సింహాసనాధికారి మరియు మహాకాలమూర్తులై సర్దుకునే శక్తిని ప్రయోగించండి.

అకాలమూర్తి, మహాకాళేశ్వరుడు, సర్వశక్తివంతుడు, అశరీరి శివబాబా మాట్లాడుతున్నారు--

స్వయాన్ని ప్రతి పరిస్థితి నుండి దాటే శక్తిశాలి స్థితిలో స్థితులై ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? శక్తిశాలి పరిస్థితులను మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి గలవారే సహజంగా దాటగలరు. రోజు రోజుకి ప్రకృతి ద్వారా విరాటరూపంతో పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి సాధారణ పరిస్థితులు, విరాట రూపాన్ని ప్రకృతి ఇప్పుడు ధారణ చేయనున్నది. దీంట్లో విశేషంగా ఆపదల యొక్క యుద్ధం అకస్మాత్తుగా జరుగుతుంది. ఇప్పుడైతే కొద్ది సమయం ముందు తెలుస్తుంది. కానీ ప్రకృతి యొక్క విరాట రూపం ఏవిధంగా ఉంటుంది? ఒకే సమయంలో ప్రకృతిలోని అన్ని తత్వాలు వెనువెంట మరియు అకస్మాత్తుగా యుద్ధం చేస్తాయి. ఏ రకమైన ప్రకృతి సాధనం రక్షించే పనిచేయదు. సాధనాలు మరింత సమస్యారూపంగా అవుతాయి. అలాంటి సమయంలో ప్రకృతి యొక్క విరాట రూపాన్ని ఎదుర్కొనేటందుకు ఏ విషయం అవసరం ఉంటుంది? స్వయం అకాల సింహాసనాధికారి, అకాలమూర్తి అయ్యి మహాకాలుడైన బాబాతో పాటు మాస్టర్ మహాకాల స్వరూపంలో స్థితులైతేనే ఎదుర్కోగలరు. మహావినాశనం చూసేటందుకు మాస్టర్ మహాకాలునిగా అవ్వాల్సి ఉంటుంది. మాస్టర్ మహాకాలునిగా అయ్యేటందుకు సహజ విధి ఏమిటి? అకాలమూర్తిగా అయ్యేటందుకు విధి - ప్రతి సమయం అకాల సింహాసనాధికారిగా ఉండాలి. కొంచెం అయినా దేహాభిమానం ఉంటే అకాలమృత్యువుల అకస్మాత్తు యుద్ధంలో అది ఓడింపచేస్తుంది. ఎలాగైతే ప్రకృతి యొక్క పంచతత్వాలు విరాట రూపాన్ని ధరిస్తాయో, అలాగే పంచవికారాలు కూడా తమ శక్తిశాలి రూపాన్ని ధరించి అంతిమయుద్ధం అతి సూక్ష్మ రూపంలో ప్రయత్నిస్తుంటాయి. అనగా మాయ మరియు ప్రకృతి రెండూ తమ తమ పూర్తి శక్తితో అంతిమ దావా వేస్తాయి. మామూలుగా స్థూల యుద్ధంలో కూడా అంతిమ దృశ్యం సంతోషాన్ని భయంకరంగా మరియు ధైర్యాన్ని పెంచేదిగా కూడా ఉంటుంది. అదేవిధంగా బలహీన ఆత్మల కొరకు భయాన్ని ఉత్పన్నం చేసేదిగా మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల కొరకు ఆ దృశ్యాలు ధైర్యం మరియు ఉల్లాసం ఇచ్చేవిగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏదైతే స్థితి వినిపించానో దాని కొరకు విశేషంగా ఏ శక్తి అవసరం? సెకెనులో గెలుపు ఓటమి యొక్క ఆటలో విశేషంగా ఏ శక్తి అవసరం? ఇలాంటి సమయంలో సర్దుకునే శక్తి అవసరం. మీ యొక్క దేహాభిమాన సంకల్పాలను దేహ ప్రపంచం యొక్క పరిస్థితులతో సంకల్పాలను, ఏమవుతుందో అనే అలజడి యొక్క సంకల్పాలన్నింటినీ సర్దుకోవాలి. శరీరం మరియు శరీరం యొక్క సర్వ సంప్రదింపులు, వస్తువులను కూడా అవసర సాధనాల ప్రాప్తి యొక్క సంకల్పాన్ని కూడా సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళాలనే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాలు విస్తారం ఉండకూడదు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళిపోతున్నాం - ఇదే సంకల్పం ఉండాలి. శరీరం యొక్క ఏ సంబంధం లేదా సంప్రదింపులు క్రిందికి తీసుకురాకూడదు. ఎలాగైతే ఈ సమయంలో ధ్యానంలోకి వెళ్ళేవారు సాక్షాత్కారం ఆధారంగా అనుభవం చెబుతారు - నేను ఆత్మ, ఈ ఆకాశతత్వం కంటే అతీతంగా ఎగిరి వెళ్తున్నాను. ఈ విధంగా జ్ఞానీ లేదా యోగీ ఆత్మలు అనుభవం చేసుకుంటారు. ఆ సమయంలో ధ్యానం (ట్రాన్స్) యొక్క సహాయం లభించదు. జ్ఞానము మరియు యోగం యొక్క ఆధారం కావాలి. దీని కోసం ఇప్పటి నుండి అకాల సింహాసనాధికారి అయ్యే అభ్యాసం కావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరి స్థితిని అనుభవం చేసుకోగలగాలి. బుద్ధియోగం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారంలోకి రావాలి. అశరీరి భవ! అనే వరదానాన్ని ఇప్పుడు కార్యంలో ఉపయోగించండి.

ఇలాంటి సమయంలో శ్రీమతాన్ని ఏవిధంగా తీసుకుంటారు? టెలిఫోన్ లేదా టెలిగ్రామ్ ద్వారానా? వైర్లెస్ సెట్ కావాలా? వైర్‌లెస్ (ఎలాంటి వైరు లేకుండా విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా సమాచారాన్ని పంపే యంత్రం) ఉంది, కాని అది సెట్ అయి ఉందా? వైర్‌లెస్ యొక్క సెటింగ్ ఎలా అవుతుంది? పూర్తిగా వైర్‌లెస్(పాపరహితంగా) అనగా నిర్వికారీగా అవ్వటమే, ఆ వైర్‌లెస్ సెట్ యొక్క సెట్టింగ్. అంశానికి కూడా అంశమాత్రంగా అయినా వికారాలుంటే వైర్‌లెస్ సెట్ పనికిరాకుండా చేస్తాయి. అందువలన లోతైన రూపంతో స్వయాన్ని స్వయమే పరిశీలించుకునేవారిగా అవ్వండి. అప్పుడే ప్రకృతి మరియు పంచవికారాల యొక్క అంతిమ వీడ్కోలు యుద్ధంలో విజయీ అయ్యి ఎదుర్కోగలరు. అప్పుడు ప్రకృతి యుద్ధం చేయడానికి బదులు శుభాకాంక్షల యొక్క దృశ్యాలను ఎదురుగా తీసుకువస్తుంది. జై జై కారాల యొక్క బాజాలు నలువైపులా మ్రోగించబడతాయి మరియు బాప్ దాదా యొక్క విజయీమాలలోని మణులు విశ్వం మధ్యలో ప్రత్యక్షం అవుతారు. విశ్వమంతా అమర భవ! అనే నినాదాలు చేస్తారు. ఇలాంటి సమయం కోసం తయారుగా ఉన్నారా? లేక సమయం మిమ్మల్ని తయారు చేస్తుందా? లేదా సమయాన్ని మీరు ఆహ్వానిస్తారా? సమయానికి మేల్కొనే వారికి ఏమి బిరుదు ఇస్తారు? సమయం వచ్చినప్పుడు మేల్కొన్నది ఎవరు? సమయానికి మేల్కొంటాము, సమయం తయారు చేస్తుంది లేదా సమయానికి అన్ని అయిపోతాయి అని ఆలోచించేవారు బ్రాహ్మణ వంశానికి బదులు క్షత్రియ వంశంలోని వారిగా అయిపోతారు. అందువలన ఈ ఆధారాన్ని కూడా తీసుకోకూడదు. అర్ధమైందా! ఇక ముందు ఏమి జరుగనున్నదని ప్రశ్నిస్తున్నారు. వినాశనం అవుతుందా, అవ్వదా? వినాశన జ్వాలను ప్రజ్వలితం చేసేవారే ఇలా అలజడిలో ఉంటే వినాశనానికి నిమిత్తం అయిన వినాశకారి ఆత్మలు తయారుచేసిన వినాశనం యొక్క ప్లాన్లో కూడా అలజడి వచ్చేస్తుంది. ఎలాగైతే నిమిత్త ఆత్మలు అవుతుందా, అవ్వదా? ఇప్పుడు అవుతుందా లేక ఎప్పుడు అవుతుందని ఆలోచిస్తున్నారో, అలాగే వినాశకారీ ఆత్మలు ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా? చేద్దామా వద్దా అనే అలజడిలో ఉన్నారు. కలియుగ పర్వతానికి వ్రేలు ఇస్తున్నట్లు స్మృతిచిహ్న చిత్రం ఉంది కదా! అదేవిధంగా వినాశనం చేయించడానికి నిమిత్తమైన సర్వాత్మలలో అవ్వాల్సిందే అనే సంకల్పం దృఢంగా ఉండాలి. ఈ సంకల్పం రూపీ వ్రేలు ఎప్పటి వరకు అందరూ ఇవ్వరో అప్పటి వరకు వినాశన కార్యం కూడా ఆగి ఉంది. ఈ వ్రేలుతోనే కలియుగీ పర్వతం సమాప్తి కానున్నది. మంచిది.

ఈవిధంగా విరాటరూపాన్ని మాస్టర్ మాహాకాలుని స్థితి ద్వారా ఎదుర్కొనే వారికి, సదా అకాల సింహాసనాధికారులకు, ప్రకృతిని ఆధీనం చేసుకునేవారికి, బాబా యొక్క సర్వప్రాప్తులకు అధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.