22.09.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వమానంలో స్థితులవ్వడమే సర్వ ఖజానాలు మరియు సంతోషానికి తాళంచెవి.

సర్వాత్మల యొక్క శుభ చింతకులు, అవినాశి ఙ్ఞానం, శక్తి మరియు సంతోషం యొక్క ఖజానా ఇచ్చే విదేహీ శివబాబా మాట్లాడుతున్నారు -

ఈనాటి ఈ సభ స్వమానంలో స్థితులయ్యే వారిని, సర్వులను స్వ భావనతో చూసేవారిని లేదా ప్రతి ఆత్మ పట్ల శుభకామన పెట్టుకునేవారికి. ఈ మూడు విషయాలు, స్వయం పట్ల స్వమానం, ఇతరుల పట్ల స్వయం యొక్క భావన మరియు సదా శుభకామన. ఇలాంటి స్థితి, సదా సహజంగా ఉంటుందా? సహజంగా ఆ స్థితిలో ఉండడం మరియు కష్టంగా ఆ స్థితిలో స్థితులవ్వడం. వీటి యొక్క తేడా తెలుసు కదా! వర్తమాన సమయంలో ఈ స్థితి సదా సహజంగా మరియు స్వతహగా ఉండాలి. సదా మరియు స్వతహగా ఆ స్థితి ఎందుకు ఉండడం లేదో స్వయాన్ని పరిశీలించుకోండి. దీనికి ముఖ్య కారణం స్వమానంలో స్థితులవ్వడం లేదు. స్వమానం అనే ఒక మాట ప్రత్యక్ష జీవితంలో ధారణ అయిపోతే సహజంగానే సంపూర్ణత పొందగలరు. స్వమానంలో స్థితులవ్వడం ద్వారా స్వతహగానే సర్వుల పట్ల స్వ భావన లేదా శుభ కామన ఉంటుంది. స్వమానంలో స్థితులవ్వడమే మొదటి పాఠం. స్వమానంలో స్థితులవ్వడమే జీవితం యొక్క సమస్యకు పరిష్కార సాధనం. ఆది నుండి ఇప్పటి వరకు నేనెవరు అనే ఈ చిక్కు ప్రశ్నను సమాధానపరచడంలోనే ఉన్నారు. ఆదిలో ఎప్పుడైతే స్థాపనా కార్యం ప్రారంభమైందో అప్పుడు అందరికీ ఏం చెబుతుండేవారు. నేనెవరు? ఈ విషయం ఎంత పక్కాగా స్మృతిలో ఉండేదంటే, వీరందరి పాఠం ఒక్కటే అది నేనెవరు? అని అందరికీ తెలుసు. ఆ ఒక్క పాఠమే ఇప్పటికీ నడుస్తుంది. అందువలనే దీనిని చిక్కు ప్రశ్న అని అంటారు. ఇంత చిన్న ప్రశ్న ఉన్నతోన్నత బ్రాహ్మణులను కూడా పరాజీతులను చేసింది. భ్రమించేవారిగా చేసింది, పజిల్ అయిపోయింది అంటే సంపూర్ణరీతిగా ఎవరూ పరిష్కరించలేకపోయారు దీనిని. స్వమానానికి బదులు దేహాభిమానం లేదా ఇతరాత్మల పట్ల అభిమాన దృష్టి ఉంటుంది, ఎందుకని? ఈ సమస్యను పరిష్కరించారా లేదా ఇప్పటి వరకు పరిష్కరిస్తూ ఉన్నారా? నేనెవరు. ఈ ఒక్క మాట యొక్క సమాధానంలోనే జ్ఞానం అంతా ఇమిడి ఉంది. ఈ ఒక్క మాటే సంతోష ఖజానాకి, సర్వశక్తులలో ఖజానాకి, జ్ఞాన ధన ఖజానాకు, శ్వాస మరియు సమయం యొక్క ఖజానాకి తాళంచెవి. తాళంచెవి అయితే లభించింది కదా. ఏరోజైతే మీరు జన్మించారో అంటే సర్వ బ్రాహ్మణుల యొక్క జన్మదినాన బహుమతి లభిస్తుంది కదా! అయితే జన్మదినోత్సవ బహుమతిగా బాబా ఏదైతే ఇచ్చారో దానిని సదా ఉపయోగించుకుంటూ ఉండండి. అప్పుడు సర్వ ఖజానాలతో సంపన్నంగా, సదాకాలికంగా సంపన్నంగా తయారుకాగలరు. ఈ విధంగా సర్వ ఖజానాలకు సంపన్న ఆత్మ యొక్క మనసులో సంతోషంతో, ఉల్లాసంతో ప్రతి సమయం ఏ మాట వెలువడుతుంది. నోటి యొక్క మాట కాదు, మనసు యొక్క మాట ఏమి వినబడుతుంది? ఆదిలో బ్రహ్మబాబా మనసు యొక్క ధ్వని ఏమిటి? ఓహో నేను.. ఎలాగైతే ఇతరుల కోసం ఓహో.. ఓహో అంటారో అలాగే ఓహో నేను... ఇది స్వమానం యొక్క మాట, దేహాభిమానం యొక్క మాట కాదు. నేనెవరు అనే తాళంచెవి మీకు ఉపయోగించడం వస్తుందా? తాళంచెవిని జాగ్రత్త చేసుకోవడం వస్తుందా, సమయానికి గుర్తు రావడం లేదు. ఈ తాళంచెవిని దొంగిలించేందుకు మాయ కూడా నలువైపులా తిరుగుతూ ఉంటుంది. ఒక్క సెకను అయినా కాని సోమరితనం యొక్క కునికిపాటులోకి వెళ్లే ఈ తాళంచెవిని దొంగిలిద్దామని మాయ చూస్తుంటుంది. ఎలాగైతే ఈరోజుల్లో దొంగలు స్పృహ తప్పేలా చేసి దొంగిలిస్తారో అదేవిధంగా మాయ కూడా స్వమానం యొక్క స్పృహ అనగా స్మృతిని మాయం చేసి స్పృహ లేని వారిగా తయారుచేసేస్తుంది. అందువలన సదా స్వమానం యొక్క తెలివిలో ఉండండి. అమృతవేళ స్వయానికి స్వయమే ఈ పాఠాన్ని పక్కాచేసుకోండి అనగా రివైజ్ చేసుకోండి, నేనెవరు? అమృత వేళ నుండి ఈ తాళంచెవిని ఉపయోగించండి మరియు అనేక రకాలైన ఖాజానాల గురించి ఏదైతే చెప్పానో వాటి గురించి మాటిమాటికి తెలుసుకోండి, ఏమేమి ఖజానాలు లభించాయి మరియు సమయప్రమాణంగా ఈ అన్ని ఖజానాలను మీ జీవితంలో ఉపయోగించండి. నిన్న చెప్పాను కదా - కేవలం బ్యాంకు బాలన్సుగా పెట్టుకోవడం కాదు, కానీ దానిని కర్మలో ఉపయోగించాలని. అప్పుడు సహజంగానే ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి తయారవుతుంది. కల్పపూర్వపు స్మృతిచిహ్నం శాస్త్రాలలో రాయబడి ఉంది, బాబా గురించి చెబుతారు. నేనెవరు? సర్వులలో శ్రేష్టం అని వర్ణన చేసారు కదా! బాబా గురించి, అదేవిధంగా ఎలా అయితే బాబాకి ఉన్నతోన్నతమైన భగవంతుడు అని మహిమ ఉందో, అలాగే భగవంతుడైన తండ్రి ఏమి మహిమ చేస్తున్నారు? ఉన్నతోన్నతమైన పిల్లలు అని అంటున్నారు. ఇలాంటి మీ ఉన్నతమైన అనగా శ్రేష్ట స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఉన్నతమైన తండ్రికి పిల్లవాడిని మరియు యజమానిని, స్వయం తండ్రి శ్రేష్టాత్మలైన మన యొక్క మాలను స్మరిస్తున్నారు. బాబా మహిమ, ఆత్మలు చేస్తారు. కానీ శ్రేష్టాత్మలైన మీ యొక్క మహిమ స్వయం బాబా చేస్తున్నారు. సర్వ శ్రేష్టాత్మల యొక్క సహయోగం లేకుండా బాబా కూడా ఏమీ చేయలేరు. కనుక మీరు ఇంత శ్రేష్ట స్వమానం కలిగినవారు. బాబాని సర్వ సంబంధాలతో ప్రఖ్యాతి చేసేవారు లేదా బాబా పరిచయాన్నిచ్చే శ్రేష్టాత్మలు మీరు. ప్రతి కల్పంలో ఉన్నతోన్నతమైన తండ్రితో పాటు ఉన్నతోన్నతమైన పాత్ర అభినయించేవారు మీరు. అన్నింటికంటే గొప్ప స్వమానం యొక్క విషయం ఏమిటంటే సంగమయుగంలో తండ్రిని కూడా మీ స్నేహం మరియు సంబంధం అనే త్రాడుతో బంధించేవారు, బాబాని కూడా మీ సమానంగా సాకారిగా తయారుచేసేవారు, బాబా నిరాకారి రూపంలో తన సమానంగా తయారు చేస్తారు మరియు మీరు నిరాకారుని సాకారంలోకి వచ్చే విధంగా మీ సమానంగా తయారు చేస్తున్నారు. స్వయం కూడా బాబా యొక్క సర్వ మహిమలతో సమానంగా తయారవుతున్నారు. అందువలన బాబా అంటున్నారు - మీరు మాస్టర్. ఇప్పుడు అర్ధమైందా నేనెవరు? అనేది. ఎవరు ఎలాంటివారో ఆవిధంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ద్వారా సదా స్వమానంలో ఉంటారు. మరియు దేహభిమానం నుండి స్వతహగానే దూరంగా ఉంటారు. స్వమానం నుండి దేహభిమానం రాలేదు. మీ జన్మదిన కానుకలను సదా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి, సోమరితనంలో మర్చిపోకండి. దీని ద్వారా స్వతహగా, సహజంగా మరియు సదా సర్వుల పట్ల స్వ భావన మరియు శుభ కామన ఉంటుంది. అర్ధమైందా! సమస్య సహజమైనదే కదా! తెలివైనవారికి సహజమైనది మరియు సోమరితనం ఉన్న ఆత్మలకు గుహ్యమైనది. మీరందరూ బెహద్ తెలివైన పిల్లలు కదా! కేవలం తెలివైనవారు కాదు, బేహద్ తెలివైన పిల్లలు. మంచిది.


ఈవిధంగా విశాల బుద్ధి, అన్నింటిలో బేహద్ బుద్ధిని ధారణ చేసేవారు, సర్వ ఆత్మలను అనేక రకాలైన హద్దుల నుండి తొలగింపచేసేవారు, బేహద్ బుద్ధిమంతులు, బేహద్ తెలివైనవారు, బేహద్ వైరాగ్య వృత్తి కలవారు, సదా బేహద్ స్థితిలో మరియు స్థానంలో ఉండే సర్వ శ్రేష్ట ఆత్మలకు బేహద్ తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.