03.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశాలబుద్ది.

నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసేవారు, సర్వ సంతోష ఖజానాల తాళంచెవి ఇచ్చేవారు, శివబాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు --

విధాత అయిన తండ్రి ద్వారా విధి మరియు విధానం తెలిసినవారిగా స్వయాన్ని భావిస్తున్నారా? విధి మరియు విధానం తెలిసినవారు ప్రతి సంకల్పం మరియు ప్రతి కర్మలో సిద్ధి స్వరూపంగా ఉంటారు. ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? సిద్ది స్వరూపం అనగా నిశ్చింత చక్రవర్తి భవిష్య రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవవడానికి ముందు వర్తమాన సమయంలో కూడా నిశ్చింత చక్రవర్తులు. అనగా సంకల్పంలో కూడా చింత లేదా దు:ఖం యొక్క అల ఉండకూడదు. ఎందుకంటే దు:ఖధామం నుండి తొలగి ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు సంగమయుగి నిశ్చింత చక్రవర్తిగా స్వయాన్ని భావిస్తున్నారా, నిశ్చింత చక్రవర్తి అనగా సంతోష ఖజానాలన్నింటికి యజమాని. సంతోషాల ఖజానా బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారం. ఈ అధికారం కారణంగానే ఈనాటి వరకు శ్రేష్టాత్మల యొక్క నామాలకు మరియు రూపాలకు సత్కారం జరుగుతూ ఉంది. మీరు ఎలాంటి నిశ్చింత చక్రవర్తులంటే మీ పేరుతోనే అనేక ఆత్మల అల్పకాలిక దు:ఖం దూరం అయిపోతుంది.. మీ చిత్రాలను చూసి చరిత్రను పాడుతున్నారు. దు:ఖీ ఆత్మ సంతోషాన్ని అనుభవం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ విధంగా మీరు చైతన్య నిశ్చింతా చక్రవర్తియేనా? మీ ఖజానాలు ఏమిటో తెలుసా? ఖజానాలన్నింటినీ స్మృతిలో ఉంచుకుని సదా హర్షితంగా అనగా సదా ప్రకృతి మరియు పంచతత్వాల ఆకర్షణకు అతీతంగా ఉండాలి. ఇదే సంతోష ఖజానాతో సంపన్న స్వరూప ఆత్మ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాల తాళంచెవి జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు కదా, తాళం చెవిని పోగొట్టుకోవడం లేదు కదా? సమయానుసారంగా ఆత్మల యొక్క సూక్ష్మ పిలుపు వినబడుతుందా? లేదా స్వయంలోనే సదా బిజీగా ఉంటున్నారా? కల్పపూర్వపు మీ భక్తాత్మలు తమ తమ ఇష్ట దేవతలను ఆహ్వానిస్తున్నారు, రండి రండి.. అంటున్నారు. ప్రతి రోజు తమ పిలుపుల యొక్క పాటలతో అలంకరిస్తూ అనగా బాగా బాజాలు మ్రోగిస్తూ గట్టిగా పిలవడం ప్రారంభిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ రాజీ చేసుకునేటందుకు అనేక సాధనలు అవలంబిస్తున్నారు. మరి చైతన్యంలో గుప్త రూపంలో వాటిని వింటూ చూస్తూ దయ రావడం లేదా? లేదా ఇప్పటి వరకు మీపై మీరు దయ చూపించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారా? విశ్వకళ్యాణకారి, మహదాని, వరదాని స్వరూపంలో స్థితులవ్వడం ద్వారానే దయ వస్తుంది. స్వయాన్ని జగన్మాతగా లేదా జగత్ పిత యొక్క స్వరూపంలో అనుభవం చేసుకోవడం ద్వారానే దయ ఉత్పన్నం అవుతుంది. ఏ ఆత్మ యొక్క దు:ఖాన్ని లేదా భ్రమించడాన్ని సహించలేరు. కానీ ఈ స్వరూపంలో చాలా తక్కువ సమయం ఉంటున్నారు. సమయాన్ని అనుసరించి సేవ యొక్క స్వరూపం బేహద్ గా మరియు విశాలంగా ఉండాలి. బేహద్ స్వరూపం ఏది? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానిని బేహద్ అంటారా? బేహద్ మేళా జరిగింది, ఇక ముందు అనగా గతంతో పోలిస్తే ఇప్పుడు బేహద్ గా భావిస్తున్నారు. కానీ అంతిమ బేహద్ స్వరూపం ఏమిటి? సమయం యొక్క వేగాన్ని అనుసరించి కేవలం సందేశం ఇచ్చే కార్యంలో కూడా ఇప్పటి వరకు ఎంత శాతం మందికి సందేశం ఇచ్చారు? సత్యయుగ ఆదిలోని 9లక్షల ప్రజలు మీ ముందు కనిపిస్తున్నారా ఆదిలోని ప్రజలకు కూడా కొన్ని విశేతలుంటాయి కదా! ఇలాంటి విశేషత సంపన్న ఆత్మలో సేవాకేంద్రాలు అన్నింటిలో కూడా కనిపిస్తున్నారా లేక వారు ఇప్పుడు కూడా పరదా లోపలన ఉన్నారా? 16వేల మాల కనిపిస్తుందా, టీచర్స్ 16వేల మాల తయారుచేసారా? పరదా తెరిచే తారీఖు ఏది? సమయప్రమాణంగా ఇప్పుడైతే అవ్వాల్సిందే కానీ ఇలా భావించి కూడా సోమరిగా అవ్వకూడదు. ఇప్పుడు బేహద్ ప్లాన్స్ తయారు చేయండి. బేహద్ ప్లాన్ అనగా ఏ ఆత్మలకైతే మీరు సేవ చేస్తున్నారో ఆ ఒక్కొక్క ఆత్మ అనేకులకు నిమిత్తం అయ్యేదిగా ఉండాలి. ఒక్కొక్క ఆత్మ బేహద్ ఆత్మల సేవ కోసం నిమిత్తమయ్యే విధంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఒక్కొక్క ఆత్మ కోసం సమయం ఇస్తున్నారు, ఇప్పుడు మీరు ఎలాంటి ఆత్మల సేవ చేయాలంటే ఆ ఆత్మయే అనేకుల సేవార్థం నిమిత్తం అవ్వాలి. వారి పేరు ద్వారా సేవ జరగాలి. ఏవిధంగా అయితే కొంతమంది ఆత్మలు తమ సంబంధ సంప్రదింపులు మరియు సేవ ఆధారంగా ప్రసిద్ధులుగా ఉంటారు. అనగా వారి గుణాలు మరియు కర్తవ్యం యొక్క ముద్ర అనేకులపై ముందు నుండి ఉంటుంది. ఇలాంటి వారిలో కేవలం ధనవంతులు అనే విషయం విషయమే కాదు. కేవలం పదవిలో ఉన్నవారు అన్న విషయం కూడా కాదు. వీరిలో కొంతమంది సాధారణమైన వారు కూడా ఉంటారు. కానీ వారి గుణాలు మరియు సేవ ఆధారంగా తమ తమ క్షేత్రాల్లో ప్రసిద్దులుగా ఉంటారు. రాజకీయంలో కాని, ధార్మికంలో కాని వారు ప్రభావశాలిగా ఉంటారు. అలాంటి ఆత్మలను ఎంచుకోండి. వారు మీ తరపున అనేకమంది ఆత్మల సేవార్థం నిమిత్తమవుతూ ఉండాలి. ఇలాంటి క్వాలిటీ సేవ ఇప్పుడు మిగిలి ఉంది. ప్రసిద్ధమైన పేరు గలవారు రెండు రకాలు. ఒకరు పదవిలో ఉన్న కారణంగా, ఇంకొకరు వారి గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా, పదవి ఆధారంగా పేరున్న వారి ప్రభావం అల్పకాలికంగానే పడుతుంది. గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా పేరున్న ఆత్మల యొక్క ప్రభావం సదాకాలికంగా పడుతుంది. కనుక ఆత్మిక సేవార్థం నిమత్తమయ్యేటందుకు ఇలాంటి ప్రసిద్ధ ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు కొంచెం సమయంలో బేహద్ సేవ చేయగలరు.దీనినే విహంగ మార్గం అని అంటారు. అంటే ఒకరి ద్వారానే అనేకులకు బాణం తగులుతుంది. ఇలాంటి ఆత్మలు రావడం ద్వారా అనేక ఆత్మలు స్వతహగానే వస్తారు. ఇప్పుడు ఇలాంటి సేవ కోసం రూపురేఖ తయారు చేయండి. ఇలాంటి సేవకు నిమితమయ్యే ఆత్మలు మీ వలె ఈశ్వరీయ విద్యార్థులుగా ప్రతి రోజూ వచ్చేవారిగా ఉండరు, వారి సంబంధం, సంప్రదింపులు సమీపంగా మరియు స్నేహయుక్తంగా ఉంటాయి. ఇలాంటి ఆత్మలకు విశాలబుద్ధి గలవారిగా అయ్యి వారి కోరికననుసరించి వారి ప్రాప్తి యొక్క ఆధారాన్ని తెలుసుకుని వారి అనుభవం ద్వారా అనేకుల సేవకు నిమిత్తంగా చేయవలసి ఉంటుంది.