07.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహారథీ పిల్లల యొక్క అలౌకిక మిలనం.

కర్మబంధనాల నుండి ముక్తి చేయించేవారు, విశ్వసేవలో తత్పరులైన నిరాకార, జనన, మరణ రహిత అమరనాథుడైన శివబాబా మహారథీ పిల్లల సన్ముఖంలో మాట్లాడుతున్నారు -

మహారథీ మరియు మిగతా పిల్లలందరూ అమృతవేళ ఏదైతే ఆత్మిక సంభాషణ చేస్తారో, మహారథీగా ఆత్మిక సంభాషణ మరియు మిలన సంభాషణ, ఇతరాత్మల యొక్క మిలనం మరియు ఆత్మిక సంభాషణలో ఏమి తేడా ఉంటుంది? ఆత్మ పరమాత్మలో లీనం అయిపోతుంది అనే మహిమ ఉంది. ఈ మాట ఏ రకంగా పొరపాటు? ఎందుకంటే ఒకమాటను మధ్యలోనుండి తీసేసారు. కేవలం లీనము అని అనకూడదు లవలీనం అని అనాలి. ఒకటి లీనం అవ్వడం, రెండు ప్రేమలో లీనం అవ్వడం. ఎవరైనా కానీ అతి స్నేహంతో కలుసుకునేటప్పుడు ఆ సమయంలో ఆ స్నేహ మిలనంలో ఏమాటలు వస్తాయి? ఒకరిలో ఒకరు లీనం అయిపోయినట్లు లేదా ఇద్దరూ కలిసి ఒకటైనట్లు అనిపిస్తుంది. అదేవిధంగా స్నేహం యొక్క మాటలను వారు ఈ రూపంలో తీసుకున్నారు. ఒకరిలో ఒకరు లీనం అయిపోయి ఒకటి అయిపోయారని ఏదైతే మహిమ ఉందో అది మహరథీల మిలనానికి సంబంధించింది. బాబాలో లీనం అయిపోయారు. అనగా బాబా స్వరూపంగా అయిపోయారు. ఇలాంటి శక్తిశాలి అనుభవం మహరథీలకు ఎక్కువగా అవుతుంటుంది. ఇక మిగతావారు దీని గురించి ఆకర్షించబడుతుంటారు. స్నేహన్ని, శక్తిని తీసుకునేటందుకు ప్రయత్నిస్తారు. కానీ యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని సమాప్తం చేసుకుంటారు. కానీ మహరథీలు కూర్చోగానే లీనం అయిపోతారు. వారి ప్రేమ ఎంత శక్తివంతమైనదంటే, బాబాని స్వయంలో లీనం చేసేసుకుంటారు. తండ్రి మరియు పిల్లలు సమాన స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు. తండ్రి ఎలాగైతే నిరాకారుడో పిల్లలు కూడా ఆవిధంగానే ఉంటారు. తండ్రి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో మహారథీ పిల్లల యొక్క గుణాలు కూడా తండ్రి సమానంగా ఉంటాయి. అంటే మాస్టర్ అయిపోయారు కదా? కనుక మహారథీ పిల్లల యొక్క మిలనం ఏవిధంగా ఉంటుందంటే లవలీనం అయిపోతారు. బాబాలో లీనం అయిపోతారు. లీనం అయిపోవడం అనగా సమాన స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం, ఆ సమయంలో తండ్రి మరియు మహారథీ పిల్లల యొక్క స్వరూపం మరియు గుణాల్లో తేడా అనుభవం అవ్వదు. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి స్వరూపం యొక్క ప్రేమలో లీనం అయిపోయి ఉంటారు. స్వరూపం కూడా బాబా సమానంగా అయిపోతుంది అనగా మీ నిరాకారి స్వరూపాన్ని ప్రత్యక్షంగా స్మృతిలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే స్వరూపం బాబా సమానంగా ఉంటుందో, గుణాలు కూడా బాబా సమానంగా ఉంటాయి, కనుక మహారథీల మిలనం ఎలా ఉంటుందంటే బాబాలో లీనం అయిపోతారు. ఎలా అయితే నది సాగరంలో కలిసిపోయి సాగర స్వరూపంగా అయిపోతుందో అలాగే బాబా యొక్క సర్వ గుణాలను స్వయంలో అనుభవం చేసుకుంటారు. సాకారంలో బ్రహ్మబాబాకు ఎలాంటి అనుభవం ఉందో మహరథీలకు కూడా అలాగే ఉంటుంది. అలాగే అనుభవం అవుతుంది కదా? ఇదే సాగరంలో లీనం అవ్వడం. అనగా స్వయం యొక్క సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకోవడం, ఈ అనుభవం ఇప్పుడు మరింతగా చేసుకోవాలి. ప్రతి సంకల్పంతో వరదాని, దృష్టితో వరదాని, దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క సమీపతను చూస్తున్నారు. సమీపం అనగా లీనం అయిపోవడం. అమృతవేళ సమయం విశేషమైనది. ఇలాంటి శక్తిశాలి అనుభవం చేసుకునేటందుకు ఈ అనుభవం యొక్క ప్రభావం రోజంతా ఉంటుంది. అతి ప్రియమైన వస్తువు మనసులో సదా నిండి ఉంటుంది కదా! అదేవిధంగా అమృతవేళ మహారథీలు, ఇలాంటి మిలనం చేసుకుంటారు. ఎవరెవరు ఎంతెంత సమీపం బాప్ దాదా కూడా పరిశీలన చేస్తున్నారు. దర్శనం చేయించేటందుకు మందిరంలో పరదాలు తొలగిస్తారు కదా! అమృతవేళ కూడా అలాంటి దృశ్యమే ఉంటుంది. ప్రతి బిడ్డ అమృతవేళ బాబాని కలుసుకునేటందుకు ఫస్ట్ నెంబరులో మిలనం చేసుకునేటందుకు పరుగు పెట్టడంలో తత్పరులై ఉంటున్నారు. బాబా చెకుముకి రాయిలాంటి వారు. కనుక స్వతహగానే ఎవరైతే స్వయం స్వచ్ఛంగా ఉంటారో వారి సమీపంగా వస్తారు. బాహ్య రీతిలో ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కానీ చెకుముకి రాయివైపు ఆకర్షింపబడేవారు స్వచ్చమైన ఆత్మలే ఉంటారు. ఆ దృశ్యం చాలా మజాగా ఉంటుంది. సాక్షిగా అయి ఈ దృశ్యం చూస్తే చాలా మజా వస్తుంది. పిల్లలకు సంకల్పం వస్తుంటుంది బాబా వతనంలో ఏమి చేస్తుంటారని, బ్రహ్మబాబా సాకార రూపం కంటే కూడా అవ్యక్త రూపంలో ఇప్పుడు రేయింబవళ్ళు సేవలో మరింత సహయోగి అయ్యే పాత్ర అభినయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాబా సమానంగా జనన మరణాలతో అతీతులు, కర్మబంధన ముక్తులు, కర్మాతీతులు, సిద్ధి స్వరూపులు. ఈ స్థితిలో ప్రతి సంకల్పంతో సిద్ధి ప్రాప్తిస్తుంది. ఏ సంకల్పం చేస్తే అదే సత్యం. అందువలన నలువైపులా సంకల్ప సిద్ధి రూపంలో సహయోగిగా ఉండాలి. మాట కంటే సంకల్పం యొక్క వేగం తీవ్రంగా ఉంటుంది. సాకారం కంటే ఆకారీ వేగం తీవ్రంగా ఉంటుంది. సంకల్పంతో సేవా పాత్ర. అది కూడా సత్య సంకల్పం, శుద్ధ సంకల్పం. మీరు ఎక్కువగా వాచా ద్వారా సేవ చేస్తున్నారు. మనసు ద్వారా కూడా చేస్తున్నారు, కానీ ఎక్కువగా వాచా ద్వారా చేస్తున్నారు. కానీ బ్రహ్మబాబా ఇప్పుడు సత్య సంకల్పం ద్వారా సేవ చేస్తున్నారు. కనుక దాని యొక్క వేగం తీవ్రంగా ఉంటుంది కదా! ఇప్పుడు సేవ యొక్క పాత్రయే నడుస్తుంది. సేవాబంధన నుండి అయితే ముక్తులు కాలేరు., కర్మ బంధన నుండి మాత్రమే ముక్తులయ్యారు. మంచిది.