15.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మ హత్య చేసుకుని మహాపాపిగా అవ్వకుండా డబుల్ అహింసకులుగా అయ్యేటందుకు యుక్తులు.

తమ గుణాలను మరియు తన శక్తులను వరదాన రూపంలో ఇచ్చి మనుష్య ఆత్మలను సర్వ శ్రేష్ట మహాన్ గా తయారు చేసే విశ్వ కళ్యాణకారి శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. గుణగానం చేస్తూ ఏమి చూశారంటే డ్రామాలో పిల్లల యొక్క పాత్ర ఎంత ఉన్నతమైనది మరియు సర్వ శ్రేష్టమైనదో, కల్పమంతటిలో ఈ సంగమయుగంలో మహిమాయోగ్యంగా అవుతారు. ఈ యుగంలోనే స్వయం పరమాత్మ కూడా శ్రేష్టాత్మలైన మీ యొక్క మహిమ చేస్తారు. ఈ సమయంలోనే మీరు డబల్ మహిమకు అధికారిగా అవుతున్నారు. ఒకటి బాబా సమానంగా మాస్టర్ సాగరులుగా అవుతున్నారు మరియు బాబా గుణాలు లేదా శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిలో కూడా మాస్టర్ అవుతున్నారు. దాంతో పాటు ఆత్మ యొక్క శ్రేష్ట స్థితికి మహిమ ఉంది - సర్వ గుణ సంపన్నం. 16 కళా సంపూర్ణం. ఈ మహిమను కూడా ప్రత్యక్షంలో ఇప్పుడే అనుభవం చేసుకుంటున్నారు. 16 కళలు ఏవి? మర్యాదలు ఏవి? ఈ అన్ని విషయాల యొక్క జ్ఞానం ఈ సమయంలోనే ధారణ చేస్తున్నారు. కనుక డబల్ మహిమకు యోగ్యులుగా అవుతున్నారు. అదేవిధంగా రెండు ప్రపంచాలకు యజమానులుగా అవుతున్నారు. డబుల్ పూజకు యోగ్యులుగా అవుతున్నారు. ముక్తి మరియు జీవన్ముక్తి అనే డబుల్ వారసత్వానికి అధికారిగా అవుతున్నారు. డబుల్ కిరీటధారిగా అవుతున్నారు. డబుల్ అహింసకులు అవుతున్నారు మరియు ఇద్దరి తండ్రులకు గారాభమైన ప్రియమైన పిల్లలుగా అవుతున్నారు. ఈ విధంగా పిల్లల యొక్క శ్రేష్టతను గుణగానం చేస్తున్నారు. విశ్వయజమానికి పిల్లలుగా అయి తిరిగి ఆ యజమానికే యజమానిగా అయిపోతున్నారు. మీ యొక్క ఈ మహిమను స్వయం కూడా స్మరణ చేసుకుంటూ హర్షితంగా ఉంటున్నారా? ఈ స్మరణతో మాయ యొక్క యుద్ధం ఎప్పుడు కూడా జరుగదు. బాబా ఈ రోజు చూస్తున్నారు ఏయే పిల్లలు ఏ స్థితి వరకు చేరుకున్నారు? ముఖ్యంగా బాబా సమానంగా సర్వ గుణాలలో మాస్టర్ సాగరులుగా ఎంత వరకు అయ్యారు? సర్వ శక్తుల యొక్క వారసత్వాన్ని ప్రత్యక్ష జీవితంలో ఎంత వరకు అనుభవం చేసుకున్నారు? దాంతో పాటు ఆత్మ యొక్క శ్రేష్ట లేదా మహాన్ స్థితి అనగా సంపూర్ణ నిర్వికారి సర్వగుణ సంపన్నం, 16 కళా సంపన్నం, మర్యాదా పురుషోత్తములు మరియు సంపూర్ణ అహింసకులు ఈ మహానతను ఎంత వరకు జీవితంలోకి తీసుకువచ్చారు? గుణ సంపన్న స్థితికే ఈ మహిమ ఉంది. సర్వ గుణ సంపన్న స్థితిలో ఒకవేళ ఒక్క గుణమైనా లోటుగా ఉన్నట్లయితే వారు పూర్తి మహిమకు యోగ్యులుగా పిలువబడరు. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సర్వ గుణాలలో ఎన్ని గుణాలు మరియు ఎంత శాతంలో ఉన్నాయి మరియు ఎంత లోపం ఉంది. 16 కళలు అనగా సర్వ విశేషతలలో సంపన్నులు అంటే ఎలాంటి సమయమో అలాంటి స్వరూపం తయారు చేసుకోగలగాలి, ఎలాంటి సంకల్పమో అలాంటి స్వరూపం తెచ్చుకోగలగాలి, బాబా ద్వారా లభించిన పురుషార్ధం యొక్క విధి ద్వారా సర్వ సిద్ధులను సమయానుసారం స్వయం కోసం లేదా సర్వాత్మల సేవ కోసం కార్యంలో ఉపయోగించగలిగి ఉండాలి. సర్వశక్తులను అనుభవంలోకి తీసుకువస్తూ సర్వాత్మల పట్ల వారి అవసరం అనుసారంగా వరదాని రూపంలో వారికి ఇవ్వగలగాలి, అన్ని విషయాలలో సమానత పెట్టుకోగలగాలి అనగా ఇప్పుడిప్పుడే ప్రేమ స్వరూపంగా మరియు ఇప్పుడిప్పుడే నియమ స్వరూపంగా అవ్వగలగాలి. ఇప్పుడిప్పుడే మహాకాళి రూపంగా మరియు ఇప్పుడిప్పుడే శీతల రూపంగా అవ్వగలగాలి. ఇలా అన్ని విశేషతలు కలిగి ఉండడమే 16 కళా సంపన్నంగా అవ్వడం. దీని కొరకు సర్వ కర్మేంద్రియాలు మరియు సర్వ ఆత్మిక శక్తులు అనగా మనసు, బుద్ధి, సంస్కారాలు అన్నింటిపై అధికారం ఉండాలి. అలాంటి అధికారులే 16 కళా సంపన్నులుగా కాగలరు. ఏదైనా బలహీనత ఉన్నవారు కళను చూపించలేరు. అనగా విశేషతలను చూపించలేరు లేదా అనుభవం చేయించలేరు. ఈవిధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి విశేషతలన్నీ ధారణ చేశానా, అనగా 16 కళా సంపన్నంగా అయ్యానా? అదేవిధంగా సంపూర్ణ నిర్వికారి అనగా సర్వ వికారాలు సర్వ వంశ సహితంగా అంశమాత్రం కూడా అనగా సంకల్పం మరియు స్వప్న మాత్రంగా కూడా ఉండకూడదు. అలాంటి వారినే సంపూర్ణ నిర్వికారి అంటారు. మర్యాదా పురుషోత్తమ అనగా ప్రతి సంకల్పం, ప్రతి సెకెండు మరియు ప్రతి అడుగు శ్రీమతానుసారం అనగా మర్యాద అనుసారంగా ఉండాలి. సంకల్పం లేదా ఒక్క అడుగు కూడా ఈశ్వరీయ మర్యాదకు ఆవల ఉండకూడదు. అమృతవేళ నుండి రాత్రి నిద్రించేవరకు ప్రతి అడుగు మర్యాదానుసారంగా ఉండాలి. స్మృతి, వృత్తి మరియు దృష్టి కూడా సదా మర్యాద అనుసారంగా ఉండాలి. ఇలాంటి మర్యాదా పురుషోత్తములుగా ఎంత వరకు తయారయ్యారు? డబుల్ అహింసకులు అనగా అపవిత్రత అంటే కామము అనే మహాశత్రువు కలలో కూడా యుద్ధం చేయకూడదు. సదా సోదరులు అనే స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇలాంటి డబుల్ అహింసకులు ఆత్మహత్య యొక్క మహాపాపం కూడా చేయలేరు. ఆత్మహత్య అనగా తమ యొక్క సంపూర్ణ సతో ప్రధాన స్థితి నుండి క్రిందికి పడిపోయి తమను తాము హత్య చేసుకోరు. పై నుండి కిందికి పడిపోవడమే హత్య, ఆత్మ యొక్క అసలైన గుణ స్వరూపము మరియు శక్తి స్వరూప స్థితి నుండి కిందికి రావడం అనగా విస్మృతిలోకి రావడం ఇది కూడా పాపఖాతాలోకి జమ అవుతుంది. అందువలనే ఆత్మహత్య చేసుకున్న వారు మహాపాపి అని అంటారు. దాంతో పాటు అహింసక ఆత్మ ఎప్పుడూ హత్య కూడా చేయదు. హత్య చేయడం అనగా హింసించడం. మీలో ఎవరైనా హత్య చేస్తున్నారా? అనగా బాబా ద్వారా లభించిన దివ్యబుద్ది లేదా దివ్య వివేకాన్ని లేదా ఈశ్వరీయ వివేకాన్ని మాయకు వశమై, పరమతానికి వశమై, చెడు సాంగత్యానికి వశమై, పరిస్థితులకు వశమై ఈ ఈశ్వరీయ వివేకాన్ని అణిచి పెడుతున్నారంటే ఆ వివేకాన్ని హత్య చేస్తున్నట్లే. దివ్యబుద్ధిని హత్య చేస్తున్నారు. ఆ తరువాత అరుస్తున్నారు అనుకోలేదు కాని చేసేసాను, వద్దనుకున్నా అయిపోయింది అంటే ఇది ఈశ్వరీయ వివేకాన్ని హత్య చేయడం అయింది కదా! అలాగే అసత్యం మాట్లాడడం, దొంగతనం చేయడం, మోసం చేయడం వీటిని కూడా హింస లేదా మహాపాపం అని అంటారు. అయితే బ్రాహ్మణులైన మీరు ఏ దొంగతనం చేస్తున్నారు? శూద్రుల సంస్కార స్వభావాలు లేదా మాటలు లేదా ఎవరి పట్లయినా భావనలు బ్రాహ్మణులుగా అయిన తరువాత కార్యంలోకి వస్తున్నాయంటే శూద్రుల వస్తువులను దొంగతనం చేసినట్లే కదా! ఇది బ్రాహ్మణుల వస్తువులు కాదు. ఇతరుల వస్తువులు ఉపయోగించుకోవడం అనగా బ్రాహ్మణులు అయిన తరువాత అశురీ లేదా శూద్ర స్వభావ సంస్కారాన్ని ధారణ చేయడం కూడా హింస చేయడమే., అదేవిధంగా అసత్యం ఎలా మాట్లాడుతున్నారు? మేము నిమిత్తులము అన్నీ మీవే తనువు, మనసు, ధనం అన్నీ మీవే అంటున్నారు మరలా నేను అనే మోహనికి వశమై నడుస్తున్నారు. నేను అనుకోవడము, లేదా నాది అనుకోవడం ఇది అసత్యమైందా లేదా నీది అంటున్నారు కానీ నాది అని చేస్తున్నారు అసత్యమైంది కదా? నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను నీతోనే మాట్లాడతాను మరియు నీతోనే సర్వ సంబంధాలు నిలుపుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంలో ఇతరాత్మలతో కూడా సంబంధ సంప్రదింపులు పెట్టుకుంటున్నారు. బాబా స్మృతికి బదులు ఇతరుల స్మృతి కూడా వెనువెంట చేస్తున్నారు. ఇది కూడా హత్య అయింది కదా! నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇది ప్రతిజ్ఞ ఈ నిలుపుకోవడం లేదంటే అసత్యం చెప్పినట్లే కదా! అదేవిధంగా మోసం ఎలా చేస్తున్నారు? అన్నింటికంటే పెద్ద మోసం స్వయానికి స్వయం చేసుకుంటున్నారు. తెలిసి ఉండి అంగీకరిస్తూ కూడా స్వయాన్ని శ్రేష్ఠ ప్రాప్తి నుండి వంచితం చేసుకుంటున్నారు. ఇది స్వయాన్ని మోసగించుకోవడమే కదా! మోసపోయిన దానికి గుర్తు - దాని ద్వారా దు:ఖం ప్రాప్తిస్తుంది. దీంతో పాటు బ్రాహ్మణ పరివారంలో కూడా మోసం చేస్తున్నారు. చెప్పడం ఒకటి మరియు చేయడం ఒకటి తమ బలహీనతలు దాచుకుంటున్నారు బయటకు తమ పేరును గొప్పగా చేసుకోవడానికి లేదా స్వయాన్ని మంచి పేరు వారిగా రుజువు చేసుకుంటున్నారు. ఇలా ఇతరులను మోసం చేస్తున్నారు ఏదైనా పొరపాటు చేసి దాచి పెట్టడం కూడా మోసమే. కనుక డబుల్ అహింసకులు అనగా పుణ్యాత్మ లేదా మహాన్ ఆత్మ వీరి ద్వారా ఏ రకమైన పాపం జరుగదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఆత్మ యొక్క సర్వశ్రేష్ట స్థితి గురించి ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఎంత వరకు ధారణలోకి వచ్చింది. ఇలాంటి సర్వశ్రేష్ట ఆత్మలను బాబా కూడా మహిమ చేస్తారు. ఈ రోజు బాబా అలాంటి పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. లేదా మాలను స్మరిస్తున్నారు. మంచిది..

ఈవిధంగా సర్వ మహాన్, సర్వ యోగ్యతలతో సంపన్నులు మహిమ మరియు పూజా యోగ్యులు, డబుల్ అహింసక పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.