20.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


త్యాగమూర్తి మరియు తపస్వీమూర్తి అయిన సేవాధారులే యధార్థ టీచర్.

సర్వస్వత్యాగి, అలసిపోని సేవాధారి, విశ్వశిక్షకుడైన శివబాబా మాట్లాడిన మధుర మహాకావ్యాలు -

టీచర్స్ అనగా సేవాధారి. సేవాధారి అనగా త్యాగి మరియు తపస్వీమూర్తులు. టీచర్లు తమను తాము లోతైన రూపంలో పరిశీలించుకోవాల్సి ఉంటుంది, పైపై రూపంలో కాదు. లోతైన రూపంలో ఏమి పరిశీలించుకోవాలంటే రోజంతటిలో అన్నిరకాలుగా త్యాగమూర్తిగా ఉన్నానా లేక త్యాగమూర్తికి బదులు ఏ సాధనాన్ని అయినా లేక ఏ వస్తువునైనా స్వీకరిస్తున్నానా? ఎవరైతే త్యాగమూర్తులుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఏ వస్తువును కూడా స్వీకరించరు. ఎక్కడైతే స్వీకరించాలనే సంకల్పం వస్తుందో అక్కడ తపస్సు కూడా సమాప్తం అయిపోతుంది. త్యాగం తపస్వీమూర్తిగా తప్పక తయారుచేస్తుంది. ఎక్కడ త్యాగం మరియు తపస్సు సమాప్తి అయిపోతాయో అక్కడ సేవ కూడా సమాప్తి అయిపోతుంది. బాహ్యరూపంగా ఎవరు ఎంత సేవ చేసినా కానీ, త్యాగం మరియు తపస్సు లేకుండా సేవలో సఫలత రాదు. కొంతమంది టీచర్లు అనుకుంటున్నారు. సేవలో సఫలత ఎందుకు రావడం లేదని? సేవలో వృద్ధి జరగకపోవడం అనేది వేరే విషయం. కానీ విధిపూర్వకంగా నడవడం ఇదే సేవ యొక్క సఫలత. విధిపూర్వకంగా ఎప్పుడు నడవగలరంటే ఎప్పుడైతే త్యాగం మరియు తపస్సు ఉంటుందో అప్పుడే. నేను టీచర్ ను, నేను ఇన్ చార్జ్ ని, నేను జ్ఞానిని, నేను యోగిని... ఇదే స్వీకరించడం. దీనిని కూడా త్యాగం అనరు. ఇతరులు అనినా కానీ స్వయానికి స్వయం మాత్రం అనుకోకూడదు. ఒకవేళ స్వయానికి స్వయం అనుకుంటే దానిని కూడా " స్వ అభిమానం " అంటారు. కనుక త్యాగం యొక్క పరిభాష సాధారణమైనది కాదు. పైపై త్యాగం ప్రజలు కూడా చేస్తారు కానీ ఎవరైతే నిమిత్తమయ్యారో వారి త్యాగం లోతైనరూపంలో ఉండాలి. ఏ పదవిని లేదా ఏ వస్తువును ఏ వ్యక్తి ద్వారా కూడా స్వీకరించకూడదు, ఇదే త్యాగం.