23.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంఘటన యొక్క బలం అంటే ఒకే సంకల్పం.

సదా ఒకని సంలగ్నతలోనే నిమగ్నమై ఉండేటువంటి, అలసిపోని సేవాధారి, తపస్వీమూర్తి దీదీ (మన్మోహిని దీదీ) ని సన్ముఖంగా చూస్తూ బాప్ దాదా ఉచ్చరించిన మధుర మహవాక్యాలు -
ఆత్మిక యాత్రికులు డబుల్ యాత్ర చేసేటందుకు వచ్చారు. ఒకటి మధువనం యొక్క యాత్ర, రెండు విశేషంగా మధువనంలో ఆత్మిక యాత్ర. డబుల్ యాత్ర చేసే యాత్రికులు ఎవరైతే వస్తున్నారో వారు విశ్రాంతిగా తమ యాత్రను సఫలం చేసుకుని వెళ్తున్నారు. అందరు సంతుష్టంగా ఉంటున్నారు. మనస్సు విశాలంగా ఉంటే స్థానం కూడా విశాలంగా ఉంటుంది అని మహిమ ఉంది కదా! స్థూల స్థానం భలే తక్కువగా ఉన్నా కానీ నీరు వారి యొక్క స్వాగతం చేసేవారి యొక్క మరియు సెట్ చేసేవారి యొక్క హృదయం విశాలంగా ఉంటే స్థానం యొక్క లోటు అనుభవం అవ్వదు. 63 జన్మల నుండి చేసిన యాత్రల కంటే సంగమయుగంలో అన్ని సాధనాలు ఎక్కువగా లభిస్తాయి. ఆ జడచిత్రాల యొక్క యాత్ర ఎంత కష్టంగా అనిపిస్తుంది!

మీరు కూడా మా సంఘటన ఒకే సంకల్పం కలిగినదిగా ఎంత వరకు తయారయ్యింది అని చూస్తారు కదా! బ్రహ్మకి సృష్టి రచించాలి అని సంకల్పం రాగానే సృష్టి రచించబడిపోయింది అని శాస్త్రాలలో మహిమ ఉంది కదా! ఇది కేవలం ఒంటరిగా బ్రహ్మ ఒక్కరి విషయమే కాదు కానీ బ్రహ్మతో పాటు బ్రాహ్మణులందరికి కూడా ఒకేసారి ఇప్పుడు మేము ఎవరెడి మరియు క్రొత్త ప్రపంచం స్థాపన అవ్వవలసిందే మరియు అవుతుంది. ఇలా ధృడసంకల్పం ఎప్పుడైతే బ్రాహ్మణులలో ఉత్పన్నం అవుతుందో అప్పుడే సృష్టి పరివర్తన అవుతుంది. అంటే క్రొత్త ప్రపంచం యొక్క రచన ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. దీనిలో కూడా సంఘటన యొక్క బలం కావాలి. ఒకరి, ఇద్దరికి లేదా కేవలం 8 మందికి కాదు. కానీ మొత్తం సంఘటన యొక్క ఒకే సంకల్పం కావాలి దీని ద్వారానే సంకల్పం ద్వారా సృష్టి యొక్క రచన అనే రహస్యం వచ్చింది. సంకల్పం ఉత్పన్నం అవుతుంది మరియు సెకనులో సమాప్తి యొక్క నగాఢా మ్రోగటం ప్రారంభం అవుతుంది.

ఒకవైపు సమాప్తి యొక్క నగాడా, రెండవ వైపు క్రొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు వెనువెంట కనిపిస్తాయి. అక్కడే వినాశనం యొక్క అతి ఉంటుంది మరియు అక్కడే జలమయం మధ్యలో నలువైపుల వినాశనంలో ఒక వంతు భూమి మరియు మిగిలిన మూడు వంతులు జలమయం అయిపోతాయి కదా? ఇక్కడ వెనుక అనేక ధర్మాలు వచ్చిన కారణంగా అనేక దేశాలు తయారయ్యాయి. ఇక ఎప్పుడైతే అనేక ధర్మాలు సమాప్తి అయిపోతాయో అనేక దేశాలు కూడా విహర స్థానాలుగా జలమయం మధ్యలో ద్వీపంగా మిగిలిపోతాయి. ఒకవైపు వినాశనం యొక్క నగాఢా మ్రోగుతుంది, రెండవ వైపు మొదటి రాజకుమారుడు (శ్రీకృష్ణుడు) జన్మ యొక్క ధ్వని ప్రసిద్ధం అవుతుంది. ఆయన ఆకుపై రాడు. జలమయం మధ్యలో ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చారు అని చెప్తారు కదా! మూడు వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశం స్వర్గంగా మారుతుంది. దీనినే జలమయంగా చూపించారు. ఆ జలమయం మధ్యలో మొదటి ఆకు అంటే మొదటి ఆత్మ జన్మ యొక్క ధ్వని నలువైపుల ప్రసిద్ధం అవుతుంది. మొదటి రాజకుమారుడు ప్రత్యక్షం అయ్యారు, జన్మ తీసుకున్నారు అని. అది కూడా అతిగా ఉంటుంది. అంటే మూడు వంతులు జలమయం యొక్క దృశ్యం కనిపిస్తుంది మరియు ఒక వంతు భారతదేశం స్వర్గంగా ప్రత్యక్షం అవుతుంది. బంగారపు ద్వారక నీటి నుండి వచ్చింది అని చూపిస్తారు కదా! కానీ నీటి నుండి కాదు, మూడు వంతులు నీటిలో ఉంటుంది. అందువలనే నీటి మధ్యలో బంగారపు ద్వారకను చూపించారు. అందువలనే బంగారపు ద్వారక నీటి నుండి వచ్చింది అని ఆ విషయాన్ని పూర్తిగా వర్ణన చేయలేదు మరియు ఆ సమయంలోనే మెదటి ఆత్మ జన్మ యొక్క జయజయకారాలు వస్తాయి. పాత ప్రపంచం యొక్క మహవినాశనం యొక్క నగాఢా మరియు క్రొత్త మొదటి రాజకుమారుని జన్మ యొక్క దృశ్యాలు వెనువెంట కనిపిస్తాయి. ఎలా అయితే నగాఢా మ్రోగించేటప్పుడు మొదట నగాఢాను వేడి చేస్తారు. అప్పుడే ధ్వని ప్రసిద్ధం అవుతుంది. ఇక్కడ కూడా యోగాగ్నితో నాగాఢా మ్రోగించే ముందు తయారు చేసుకోవాలి. అప్పుడే నగాఢాలో ధ్వని ప్రసిద్ధం అవుతుంది. తయారీ చేయటంలో నిమగ్నమై ఉన్నారు కదా? ఎదురు చూడటానికి బదులు తయారవ్వటంలో నిమగ్నమై ఉన్నప్పుడే జయజయకారాలు వస్తాయి.

ఎప్పుడైతే శరీరాన్ని నడిపించటం వస్తుందో అప్పుడే రాజ్యం నడిపించటం కూడా వస్తుంది. శరీరాన్ని నడిపించటం అంటే రాజ్యం చేయటం. రాజ్యం చేసే సంస్కారం నింపుకోవాలి కదా? జ్ఞానసాగరులు అంటే తనువు, మనస్సు, ధనం మరియు జనం అన్నింటి పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది. ఒకవేళ ఒక దాని జ్ఞానం తక్కువైనా జ్ఞానసాగరులు అని అనరు. అర్ధమైందా? సదా సఫలతామూర్తిగా అయ్యేటందుకు ఆధారం కూడా జ్ఞానస్వరూప స్థితి. జ్ఞానం లేకపోతే సఫలతామూర్తిగా కూడా కాలేరు. సమయానుసారం పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రంగా ఉండాలి. సమయం యొక్క వేగం తీవ్రంగా మరియు నడిచేవారి వేగం బలహీనంగా ఉంటే సమయానికి ఎలా చేరుకుంటారు? ఒకే బలం, ఒకే నమ్మకం ఇదే ముఖ్య సబ్జక్ట్. ప్రతి సమయం ఒకని స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థంలో సదా సఫలం అయితే గమ్యానికి చేరుకుంటారు. ఎవరైతే తెగిపోని స్నేహంలో ఉంటారో వారికి స్వతహగా సహయోగం కూడా లభిస్తుంది.
మురళి అనేది లాఠీ. ఈ లాఠీ ద్వారా ఏదైనా లోపం ఉంటే అది నిండిపోతుంది. ఈ ఆధారమే మీ ఇంటి వరకు మరియు మీ రాజ్యం వరకు చేరుస్తుంది. కానీ లక్ష్యంతో వినాలి, నియమపూర్వకంగా కాదు, సంలగ్నతతో వినాలి. సంలగ్నతతో మురళి చదువుకోవటం లేదా వినటం అంటే మురళీధరుని సంలగ్నతలో ఉండటం. మురళీధరునితో స్నేహానికి గుర్తు - మురళి. ఎంత మురళీతో స్నేహం ఉంటుందో అంత మురళీధరునితో స్నేహం ఉన్నట్లు. మురళీ ద్వారానే సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించగలము. మురళీతో సంలగ్నత ఉన్నవారే సత్యమైన బ్రాహ్మణులు. మురళీపై సంలగ్నత తక్కువగా ఉండటం అంటే సగం కులం బ్రాహ్మణులు. మంచిది.