27.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహాదాని మరియు వరదానియే మహారథి.

విశ్వకళ్యాణకారి మరియు మహావరదాని శివబాబా మహారథీ పిల్లలను చూస్తూ మాట్లాడుతున్నారు -

బ్రహ్మాబాబా సమానంగా మహారథీలు కూడా సదా స్వయాన్ని నిమిత్తమాత్రంగా అనుభవం చేసుకుంటున్నారా? మహారథీల యొక్క విశేషత ఏమిటంటే వారిలో నేను అనే భావం ఉండదు. నేను నిమిత్తం మరియు నేను సేవాధారిని ఈ స్వభావం స్వతహ:సిద్ధంగా ఉంటుంది. ఈ స్వభావాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్వభావానికి వశమై సంకల్పం, మాట మరియు కర్మ స్వతహాగానే జరుగుతాయి. మహారథీల యొక్క ప్రతి కర్తవ్యంలో విశ్వకళ్యాణం యొక్క భావన స్పష్టరూపంలో కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష రుజువు ప్రతి విషయంలో ఇతరాత్మలు ముందుకు తీసుకువెళ్ళేందుకు ముందు మీరు అనే పాఠం వారికి పక్కాగా ఉంటుంది. ముందు నేను అనరు. మీరు అనడం ద్వారానే ఆ ఆత్మ యొక్క కళ్యాణానికి నిమిత్తం అవుతారు. మహారథీలు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా మరియు శ్రేష్ట స్వభావం కలిగి ఉంటారు. అలాంటివారే బాబా సమానము అని మహిమ చేయబడతారు.

మహారథీ అనగా మహాదాని తమ సమయాన్ని, తమ సుఖసాధనాలను, తమ గుణాలను మరియు తమకు ప్రాప్తించిన సర్వశక్తులను కూడా ఇతరాత్మల యొక్క ఉన్నతి కోసం దానమిచ్చేవారినే మహాదాని అని అంటారు. ఇలాంటి మహాదాని అయిన వారి సంకల్పం మరియు మాట స్వతహాగానే వరదానరూపంలో ఉంటుంది. వారు ఏ ఆత్మ గురించి ఏ సంకల్పం చేస్తారో లేదా ఏ మాట మాట్లాడతారో అది ఆ ఆత్మకు వరదానమైపోతుంది. ఎందుకంటే వారు మహాదాని అనగా త్యాగి మరియు తపస్వీమూర్తులు. అందువలన త్యాగం తపస్సు మరియు మహాదానం యొక్క ప్రత్యక్ష ఫలంగా వారి సంకల్పం వరదాన రూపంగా అయిపోతుంది. అందువలనే మహారథీలకు మహదాని మరియు వరదాని అనే మహిమ ఉంది. ఇలాంటి మహారథీల సంఘటన లైట్‌హౌస్ మరియు మైట్ హౌస్ వలె పనిచేస్తుంది. ఈ విధంగా తయారీలు చేస్తున్నారు కదా! ఇలాంటి సంఘటన తయారవ్వడం అనగా జైజై కారాలు రావడం. ఆ తరువాత హాహాకారాలు వస్తాయి. ఈ దృశ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు అతి హాహాకారాలు మరియు మరోవైపు తిరిగి జైజై కారాలు మంచిది. ఓంశాంతి.