27.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


క్వశ్చన్ (ప్రశ్న), కరెక్షన్ (దిద్దుబాటు) మరియు కొటేషన్ (ఇతరులను ఉదాహరణ తీసుకోవటం) ద్వారా పురుషార్థంలో డీలా స్థితి.

ఆత్మిక పూలతోట యొక్క తోటమాలి అయిన శివబాబా తోటలోని పూలని చూస్తూ మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా బేహద్ పూలతోటను విశేష రూపంలో చూస్తున్నారు. ప్రతి ఒక్క పుష్పంలో రంగు, రూపం మరియు సువాసన ఎంత ఉన్నాయని. రూపము అనగా సాకారీ స్వరూపంలో అనగా నయనాల్లో మరియు ముఖంలో బ్రాహ్మణత్వం లేదా ఫరిస్తా స్థితి యొక్క శ్రేష్ట పాత్రధారీ ఆత్మ యొక్క స్మృతి యొక్క నషా మరియు సంతోషం ప్రత్యక్ష రూపంలో ఎంత కనిపిస్తుంది? రంగు అనగా నిరంతరం బాబా సాంగత్యం అనే రంగు అనగా సదా తోడుగా అయ్యే రంగు ఎంత అంటింది? సువాసన అనగా సదా ఆత్మిక వృత్తి మరియు దృష్టి ఎంత వరకు ధారణ చేశారు? ప్రతి ఒక్కరిలో ఈ మూడు విశేషతలను చూశారు. ఈ విశేషతలను చూస్తూ మరొక విచిత్ర విశేషతను చూశారు. అదేమి చూసారంటే ఏ విశేష పూలపై అయితే బాప్ దాదా యొక్క దృష్టి ఉందో, ఉల్లాసము మరియు ఉత్సాహము యొక్క మెరుపు కూడా ఉందో, ఆశావాదులుగా ఉన్నారు, సర్వబ్రాహ్మణ పరివారం యొక్క స్నేహం కూడా ఉంది, లక్ష్యం కూడా చాలా శ్రేష్టంగా ఉంది మరియు అడుగులు కూడా తీవ్రవేగంతో వేస్తున్నారు. కానీ ఆ పుష్పాలు ఇప్పుడిప్పుడే బాబా ఏదైతే వర్ణన చేశారో ఆ రూపంలో కనిపిస్తున్నాయి మరియు కొంచెం సమయం తరువాత బాబా యొక్క దృష్టిలో ఉండే ఈ పుష్పాలపై మాయ యొక్క రాయల్ రూపం యొక్క దృష్టి తగులుతున్న కారణంగా ఆ పుష్పాల రూపం, రంగు మారిపోతుంది. యదార్ధ మార్గంలో అడుగులు తీవ్ర వేగంతో వేయడానికి బదులు వ్యర్ధమార్గంలో తీవ్రవేగంతో పడుతున్నాయి, ఫరిస్తా స్థితి యొక్క నషాకు బదులు మరియు ఈశ్వరీయ సంతోషానికి బదులు అనేకరకాలైన వినాశీ నషాలు మరియు వెనువెంట సాధనాల ఆధారంగా ఏదైతే సతోషం లభిస్తుందో ఆ నషాలో నిమగ్నమైపోతున్నారు. అనగా సదా బాబా సాంగత్యం అనే రంగుకు బదులు, ఒక్క బాబా యొక్క తోడును తీసుకోవడానికి బదులు సమయానుసారం ఏ ఆత్మల ద్వారా అల్పకాలిక తోడు లభిస్తుందో ఆ ఆత్మలనే సాకారీ తోడుగా తయారుచేసుకుంటున్నారు. అంటే సాంగత్యం యొక్క రంగులోకి వెళ్ళిపోతున్నారు. దీంట్లో కూడా ఎక్కువమంది పిల్లలు ఒక విషయం కనిపించింది. ఎక్కువమంది ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఆదిలో అనగా మొట్టమొదట ఎప్పుడైతే బాబా ద్వారా బాబా పరిచయం లేదా జ్ఞాన ఖజానా ప్రాప్తించిందో, తమ జన్మసిద్ధ అధికారం ఏమిటో తెలిసిందో, స్మృతి ద్వారా అనుభవాన్ని పొందారో, దుఃఖం సుఖంలోకి మారిందో, అశాంతి శాంతిలోకి మారింది మరియు భ్రమించడం సమాప్తమై గమ్యం దొరికింది. ఆ మొదటి స్థితిలో చాలామంచిగా తీవ్ర ఉత్సాహ ఉల్లాసాలు కలిగినవారిగా సంతోషంలో ఊగేవారిగా సేవలో రాత్రిపగలను ఒకటిగా చేసుకునేవారిగా, సంబంధాలు మరియు శరీరం యొక్క వ్యవహారాలు కూడా మరిచిపోయి ఫస్ట్ క్లాస్ సేవాధారిగా జ్ఞానసాగరులుగా మరియు శక్తిశాలిగా స్వయాన్ని అనుభవం చేసుకునేవారు మరియు ఇతర బ్రాహ్మణులు కూడా వారిని ఆవిధంగానే అనుభవం చేసుకునేవారు. కానీ ఆది తరువాత ఎప్పుడైతే మధ్యలోకి వస్తున్నారో అప్పుడు పురుషార్ధంతో, తమ సేవతో, సంతోషము మరియు ఉల్లాసంతో సంతుష్టంగా ఉండడం లేదు. అప్పుడు తమతో తాము ప్రశ్నించుకుంటున్నారు - మొదట్లో ఇలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా ఎందుకు? మొదట్లో ఉండే ఉల్లాసము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, మొదట్లో ఉండే సంతోషం ఎందుకు మాయమైపోయింది? ఎక్కే కళకు బదులు ఎందుకు ఆగిపోయాము? జ్ఞానం గుహ్యమవుతూ ఉంది, సమయం సమీపంగా వస్తూ ఉంది, సేవాసాధనాలు కూడా చాలా ప్రాప్తిస్తున్నాయి. అయినా కానీ మొదట్లో అయినట్లుగా అనుభవం ఎందుకు అవ్వడం లేదు? ఎక్కువమంది యొక్క అనుభవం ఇప్పుడు చూశారు. దీనికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే సేవలో మరియు బ్రాహ్మణ పరివారం యొక్క సంప్రదింపుల్లో లేదా సేవ ద్వారా ఏదైతే ప్రత్యక్ష ఫలం లభిస్తుందో వాటిలో నడుస్తూ నడుస్తూ ఏదోక హద్దులోని పదవిలోకి వచ్చేస్తున్నారు మరియు అసామాన్య సేవాసహయోగులు లేదా సంప్రదింపుల్లోకి వచ్చే తమ సహయోగులతో వ్యతిరేకం చేయడంలో నిమగ్నం అయిపోతున్నారు. కొందరు స్థూల సౌకర్యాలు తీసుకోవడంలో లీనం అయిపోతున్నారు. అనగా సౌకర్యాల ఆధారంగా సేవ మరియు పురుషార్ధం చేస్తున్నారు. కొందరు ప్రశ్నించడంలో మరియు సరిదిద్దడంలో నిమగ్నం అయిపోతున్నారు. మరికొందరు ఇతరులకు ఉదాహరణ ఇవ్వడంలో నిమగ్నం అయిపోతున్నారు అనగా ఇతరులను ఉదాహరణగా తీసుకుని తమ సిద్ధాంతాలను తయారుచేసుకోవడంలో ఉన్నారు. ఈ ఐదింటిలో ఏదోక వ్యతిరేక మార్గాన్ని అనుసరిస్తున్నారు. బాబా ఏమి చెప్పారంటే సదా తపస్వీ అయి సదా ఈశ్వరీయ బ్రాహ్మణ జీవితం యొక్క సర్వస్వ త్యాగీ పదవిలో స్థితులై ఉండాలని, కానీ హద్దులోని పదవులు అనగా నేను అందరికంటే ఎక్కువ సేవాధారిని, నాది ప్లానింగ్ బుద్ది, నేను ఆవిష్కరణ కర్తను, నేను ధన సహయోగిని, రాత్రి, పగలు తనువును ఉపయోగించేవాడిని అనగా హార్డ్ వర్కర్ ని లేదా నేను నా ఛార్జిని ఇలాంటి హద్దులోని పేరు, గౌరవం మర్యాదల యొక్క వ్యతిరేక పదవులను పట్టుకుంటున్నారు. అనగా యదార్ధ గమ్యం నుండి వ్యర్ధ మార్గాల్లో తీవ్ర వేగంతో నడుస్తున్నారు. బాబా అన్నారు మీరు అందరికీ ముక్తినిచ్చేసేన అనగా ఇతరాత్మలకు సౌకర్యాలు కల్పించేవారు కాని హద్దులోని సౌకర్యాలు లేదా సాధనాలు ఉంటే సేవ చేస్తాం, మొదట సాధానాలు ఇవ్వండి, ఆ తరువాత సేవ చేస్తామంటున్నారు. ఆ సాధనాలు కూడా సేవార్ధం కాదు కానీ తమ సుఖం కోసం అడుగుతున్నారు. ఒకవేళ ఇలా చేసినట్లయితే మేము చాలా సేవ చేయగలం అంటున్నారు. అదనపు స్నేహాన్ని, గౌరవాన్ని ఇస్తే, అదనపు మర్యాద ఇస్తే, మా పేరును విశేషంగా తీసుకుంటే... ఈ విధంగా అనేక రకాలైన పదవుల ఆధారంగా పురుషార్థం చేయడంలో ఉన్నారు. ఈ ఆధారాలన్నీ పొరపాటు ఆధారాలు. అందువలన స్వ ఉన్నతిని అనుభవం చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా బాబా చెబుతున్నారు - మాయను వ్యతిరేకించండి అని కానీ మాయకు మిత్రులుగా అయిపోతున్నారు. అనగా అసురీ సంస్కారాలు అనే అసురీ సాంప్రదాయానికి వ్యతిరేకం అవ్వడానికి బదులు ఈశ్వరీయ సాంప్రదాయంలో ఒకరికొకరు వ్యతిరేకం అయిపోతున్నారు. వీరిలా చేస్తున్నారు, నేను వీరి కంటే ఎక్కువ చేసి చూపిస్తాను. వీరు సేవాధారి అయితే నేను కూడా సేవాధారినే, వీరు ముందుంటే నేను వెనుక ఎందుకు ఉండాలి, నేను గుప్త పురుషార్థిని నన్ను ఎవరూ గ్రహించడం లేదు, నిమిత్త టీచర్ కంటే ఎక్కువ సేవాధారిని ఇలా టీచర్ కూడా వ్యతిరేకం చేసున్నారు. మీరు అనుభవీ కాదు నేను అనుభవీని, మీరు చదువుకోలేదు, నేను చదువుకున్నాను. ఇలా పరస్పరంలో వ్యతిరేకం చేసుకోవడంలో మీయొక్క సదాకాలిక శ్రేష్ట పదవిని పోగొట్టుకుంటున్నారు. పరస్పరం వ్యతిరేకించుకుంటున్న కారణంగా మాయను వ్యతిరేకించడంలో బలహీనం అయిపోతున్నారు. అనగా విజయీ కాలేకపోతున్నారు. ఈ విధంగా ప్రశ్నించడంలో ఇతరులను సరిదిద్దడంలో, ఇతరులను ఉదాహరణగా తీసుకోవడంలో చాలా తెలివైనవారిగా ఉన్నారు. న్యాయవాదిగా మరియు న్యాయమూర్తిగా కూడా అయిపోతున్నారు. బాబాకే తప్పుఒప్పులు చెబుతుంటారు. తాము తప్పించుకునేటందుకు అనగా తమ పొరపాటును దాచుకునేటందుకు ఇతరుల గురించి ఉదాహరణ చెబుతుంటారు - నాకంటే పెద్ద మహారథీలు కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఈ సమస్య గురించి బాప్ దాదా ఇలా చెప్పారు. అందువలనే నేను కూడా ఆ శ్రీమతాన్నే పాటిస్తున్నాను. ఫలానా తారీఖు మురళిలో బాబా ఈ విషయాన్ని చెప్పారు. దాని ఆధారంగా నేను చేస్తున్నాను అని అంటారు. సమయాన్ని మరియు పరిస్థితిని చూడరు కాని మాటలను పట్టుకుంటారు. ఈ పొరపాటు కారణంగా ఒక్క పొరపాటుతో అనేక పొరపాట్లు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్య సంస్కారం పెరిగిపోతోంది. పురుషార్ధం యొక్క వేగం కూడా తీవ్రం నుండి మధ్యమంగా అయిపోతుంది. బాబా చెప్పారు మీరు మాస్టర్ త్రికాలదర్శి అనగా మూడు కాలాలు తెలిసినవారు. దీనిని ధారణ చేసి స్వయాన్ని సరిదిద్దుకోవడానికి బదులు ఇతరులను సరిదిద్దుతుంటారు. ఇలా ఇతరులను సరిదిద్దడంలో బాబాతో సంబంధాన్ని త్రేంచేసుకుంటారు. అందువలన శక్తిహీనం అయిపోయి అలజడి అయిపోతుంటారు. సుఖం, శాంతి లేదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అనే గమ్యం కనిపించడం లేదు. పరచింతన పతనం వైపుకు తీసుకువెళ్తుంది. అర్థమైందా! ఈ విషయాల్లోకి వచ్చేస్తున్న కారణంగా ఆదిలో ఉండే నషా మరియు సంతోషం ఏదైతే అనుభవం అవ్వాలో అది సమాప్తం అయిపోతుంది. అందువలన మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ ఐదింటిలో ఏదో ఒక వ్యతిరేకమార్గంలో నడిచి సమయాన్ని నాశనం చేసుకోవడం లేదు కదా? పరిశీలించుకోండి మరియు తిరిగి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. అప్పుడు మరలా వృద్ధికళ వైపునకు నడవగలుగుతారు. ఇలా ఎక్కువమంది ఆత్మల యొక్క అనుభవాన్ని బాప్ దాదా చూశారు. ఇది మేళా యొక్క అంతిమం కనుక అంతిమంలో అంతిమ ఆహుతి చేయండి అనగా సదాకాలికంగా మిమ్మల్ని మీరు సమర్ధంగా తయారుచేసుకోండి. ఫలితం చెబుతాను. వర్తమాన సమయంలో పురుషార్థీలు నడుస్తూ.. నడుస్తూ ఆగిపోతున్నారు అనే సమాచారం చెప్పాను; ఇకముందు పరివర్తన భూమి యొక్క పరివర్తనను సదా మీ వెంట ఉంచుకోండి. దీనినే మేళా జరుపుకోవడం అని అంటారు. మేళా జరుపుకోవటము అనగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవడం మంచిది.

ఈవిధంగా సెకెండులో స్వయాన్ని దృఢ సంకల్పంతో పరివర్తన చేసుకునేవారికి, తమ వృత్తి ద్వారా వాయుమండలాన్ని సతో ప్రధానంగా తయారుచేసేవారికి, మరియు దృష్టి ద్వారా అద్భుతం చేసేవారికి, బాబాకి సదా తోడుగా సహయోగిగా మరియు శక్తిశాలిగా ఉండే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.