సమర్ధ రోజు రూపంలో స్మృతిరోజు.
సర్వాత్మల పరమ స్నేహి పరమపిత శివబాబా మాట్లాడుతున్నారు
-
ఈరోజు బాప్ దాదా తన యొక్క లవలీన పిల్లలందరినీ చూసి
పిల్లల స్నేహానికి జవాబు (రెస్పాన్స్) ఇస్తున్నారు. " సదా బాబా సమానంగా విధాత
మరియు వరదాత భవ! సదా విశ్వకళ్యాణకారి, విశ్వరాజ్యాధికారి భవ! సదా మాయ మరియు
ప్రకృతి, సర్వ పరిస్థితులలో విజయీ భవ! ఈ రోజు బాప్ దాదా విజయీ పిల్లలందరి
మస్తకంలో విజయీ తిలకం మెరుస్తున్నట్లు చూస్తున్నారు. పిల్లలందరి చేతిలో విజయీ
జెండాను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్సు నుండి ఇదే మాట - విజయం మా జన్మ
సిద్ధాధికారం. ఇదే సూక్తి (స్లోగన్) మారుమ్రోగటం వింటున్నారు. ఈరోజు అమృతవేళ
పిల్లలందరి యొక్క స్నేహం మరియు ఆహ్వానం యొక్క మధురాతి మధుర ఆలాపన వింటున్నారు.
దూరదూరాల నుండి విడిపోయిన, దప్పికగొన్న, గోపికలు నదుల వలె సముద్రునిలో
కలుస్తున్నారు. బాప్ దాదా కూడా పిల్లల యొక్క స్నేహ స్వరూపంలో కలిసిపోయారు. ప్రతి
ఒక్కరి మధురాతి మధురమైన ముత్యాలు హృదయహారమై బాప్ దాదా కంఠాన్ని అమరి ఉన్నాయి.
ప్రతీ ఒక్కరి యొక్క విభిన్న సంకల్పాలు, విభిన్న మధుర గీతాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే నలువైపుల అందరూ స్మృతి అనే మాలలు బాప్ దాదాకి వేస్తున్నారు. ఈ
రోజు స్మృతిరోజుగా జరుపుకుంటున్నారు. బాప్ దాదా ఈ రోజుని స్మృతిరోజుతో పాటు
సమర్థరోజు అని కూడా అంటున్నారు. ఈ స్మృతిచిహ్న రోజున బాప్ దాదా ఎలాగైతే ఆదిలో
పిల్లల శిరస్సుపై జ్ఞాన కలశాన్ని ఉంచారో, సాకారుని ద్వారా శక్తులకు తనువు,
మనస్సు, ధనాలను అర్పణ చేసారో అదేవిధంగా సాకార తనువు ద్వారా సాకార పాత్ర యొక్క
అంతిమ సమయంలో శక్తి సేనకి విశ్వకళ్యాణం కోసం ఆత్మికశక్తిని అర్పణ చేసారు. తాను
సూక్ష్మవతనవాసియై సాకారంలో పిల్లలను నిమిత్తం చేసారు. అందువలన ఇది సమర్ధరోజు.
ఈరోజు బాబా పిల్లలందరి స్నేహంలో, ధ్వనికి అతీతంగా
స్వయంలో కలుపుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో నలువైపులా అందరు పూర్తిశక్తితో
నిందలు మరియు ఆహ్వానాలతో కూడిన మనస్సు యొక్క మాటలు వినవస్తున్నాయి. వాటన్నింటినీ
స్వయంలో నింపుకుంటూ వెళ్తున్నారు. మీ అందరికీ వినిపిస్తున్నాయా? క్రొత్త
క్రొత్త పిల్లలకు విశేష రూపంలో బాప్ దాదా స్మృతికి బదులు ఇస్తున్నారు. పాత
పిల్లలకి ఎలా అయితే డబుల్ ఇంజన్ యొక్క సహాయం లభించిందో అలాగే క్రొత్త పిల్లలకు
గుప్త సహాయం లభించిన అనుభవం యొక్క సంతోష ఖజానా అనే విశేష సహాయాన్ని బాప్ దాదా
కానుకగా ఇస్తున్నారు. వారి యొక్క అనేక నిందలను సేవ మరియు సదా తోడు యొక్క అనుభవం
ద్వారా నిందలను ఉత్సాహ ఉల్లాసాల రూపంలోకి పరివర్తన చేస్తున్నారు. ఏవిధంగా అయితే
క్రొత్త పిల్లలకి విశేషంగా బాబా పైన, సేవ పైన తగుల్పాటు ఉందో అలాగే బాప్ దాదాకి
కూడా విశేషంగా సహయోగం యొక్క దృష్టి క్రొత్త పిల్లలపై ఉంది. బాబా కూడా ఈ పిల్లల
యొక్క అద్భుతాన్ని గుణగానం చేస్తున్నారు. మంచిది సర్వ స్నేహీ, సదా ఒకే బాబా
యొక్క ప్రేమలో లీనమై ఉండేవారికి, బాప్ దాదాని ప్రఖ్యాతి చేసేవారికి, సర్వాత్మల
ద్వారా జై జై ధ్వనుల మాలలు ధరించే నిమిత్తులకు, విజయీలు మరియు బాబా సమానులు,
సర్వ గుణాలను సాకార రూపంలో ప్రత్యక్షం చేసేవారికి, సర్వ సిద్ధులను సేవ కోసం
ఉపయోగించేవారికి, విశ్వకళ్యాణకారి బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకి
బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ మురళి యొక్క సారం :-
1. ఇది కేవలం స్మృతిరోజు కాదు. సమర్థరోజు కూడా. ఎందుకంటే బాబా స్వయం సూక్ష్మవతన
నివాసియై సాకారంలో పిల్లలని బాబా నిమిత్తం చేసారు.
2. ఏవిధంగా అయితే పాతవాళ్ళకి డబుల్ ఇంజన్ యొక్క సహాయం
లభించిందో అదేవిధంగా క్రొత్త పిల్లలకి గుప్త సహాయం, ప్రాప్తి యొక్క అనుభవాల
సంతోష ఖజానాను విశేష సహాయంగా(లిఫ్ట్) బాప్ దాదా కానుక (గిఫ్ట్) ఇస్తున్నారు.
3. ఎలా కావాలంటే, ఏ ఘడియ కావాలంటే ఆవిధంగా మీ
స్వరూపాన్ని ధారణ చేయాలి. దానినే ఆత్మబలం (విల్ పవర్) అంటారు. ప్రేమ స్వరూపంతో
పాటు శక్తి స్వరూపం కూడా ఉండాలి. ఇదే అలౌకికత. కేవలం ప్రేమ స్వరూపులుగా ఉంటే అది
లౌకికత.