వర్తమాన అంతిమ సమయం యొక్క తీవ్ర పురుషార్ధం.
విశ్వకళ్యాణకారి, విశ్వసేవాధారి మరియు ఆత్మలను
పదమాపదమ్ సౌభాగ్యశాలిగా తయారుచేసే భాగ్యవిధాత పరమాత్మ శివుడు మాట్లాడుతున్నారు
-
ఈ రోజు విశేషంగా అతి స్నేహీ, గారాబమైన, బాబాని కలుసుకునేటందుకు ఎదురుచూసే
చైతన్య ఛాత్రకులైన పిల్లల ముఖాన్ని చూసేటందుకు బాప్ దాదా వచ్చారు. ఈ విధంగా సదా
మిలనం యొక్క సంకల్పంలో, సదా ఇదే సంలగ్నతలో నిమగ్నమై ఉన్న పిల్లలు ఎంతగా బాబాని
స్మృతి చేస్తారో బాప్ దాదా కూడా అంతగానే బదులు ఇస్తున్నారు. ఇటువంటి పదమాపదమ్
భాగ్యశాలి
ఆత్మలు బాబాకు కూడా ప్రియం మరియు విశ్వానికి కూడా ప్రియం. ఎలాగైతే పిల్లలు
బాబాని ఆహ్వానిస్తారో అలాగే విశ్వాత్మలు సర్వ శ్రేష్ట ఆత్మలైన మిమ్మల్ని అందరినీ
ఆహ్వానం చేస్తూ ఉన్నారు. ఈ ఆహ్వానపు పిలుపు చెవులకు వినిపిస్తుందా? విశేషంగా
సాయం సంధ్య వేళలో సూర్యాస్తమయం అయిన తర్వాత జ్ఞాన సూర్యునితో పాటు అదృష్ట
సితారలైన మిమ్మల్ని అంధకారాన్ని తొలగించే జ్యోతి స్వరూపులుగా భావించి హద్దులోని
లైట్ కి నమస్కారం చేస్తారు.
ఇది ఎవరి స్మృతిచిహ్నం? శ్రేష్టాత్మలైన మీకు రోజూ
నమస్కారం పెడుతున్నారని అనుభవం అవుతుందా? ఎందుకంటే బాబా కూడా ఇటువంటి
శ్రేష్టాత్మలకి విశ్వానికి లేదా బ్రహ్మాండానికి యజమానులైన ఆత్మలకి రోజూ నమస్కారం
చేస్తారు. అందువలనే విశ్వంలోని ఆత్మలు కూడా రోజూ నమస్కారం చేయాలనే నియమాన్ని
తయారుచేసుకున్నారు. స్వయాన్ని ఇటువంటి నమస్కారయోగ్యులుగా భావిస్తున్నారా? ఈ
మహిమ లేదా పూజ పాతవాళ్ళది లేదా సాటిలేని పిల్లలది అని అనుకోవటం లేదు కదా?
క్రొత్తగా వచ్చి తీవ్ర పురుషార్ధం చేసేవారు బాప్ దాదా నయనాలలో నిండి ఉన్నారు.
ఏవిధంగా అయితే పిల్లల నయనాలలో సదా బాబాయే నిండి ఉంటారో, బాబా సదా తోడుగా
ఉన్నట్లు, సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారో అలాగే ఆలస్యముగా వచ్చినా కానీ
దూరంగా అయితే లేరు, సమీపంగా ఉన్నారు. అందువలన చివర్లో వచ్చిన పిల్లలకు
డ్రామనుసారం తీవ్ర పురుషార్థంతో తీవ్రంగా అంటే ముందుకు వెళ్ళిపోయే స్వర్ణిమ
అవకాశం విశేషంగా లభించింది. ఈ స్వర్ణిమ అవకాశాన్ని సదా స్మృతిలో ఉంచుకుని పూర్తి
ధ్యాస పెట్టండి. బాప్ దాదా కూడా క్రొత్త పిల్లల ఉత్సాహ ఉల్లాసాలను, ధైర్యాన్ని
చూసి హర్షిస్తున్నారు మరియు దాంతోపాటు సహయోగాన్ని, విశేష స్నేహాన్ని కూడా
ఇస్తున్నారు.
ఇప్పుడు ఈ సంవత్సరం విశ్వాత్మల యొక్క అనేక రకాల
కోరికలను అనగా మనోకామనలను పూర్తి చేయాలనే ధృడ సంకల్పం తీసుకోండి. ఇతరుల కోరికలను
పూర్తిచేయటమంటే స్వయం ఇచ్చామాత్రం అవిద్యాగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారు)
అవ్వటం. ఇవ్వటం అంటే తీసుకోవటం అని ఎలా అంటారో అలాగే ఇతరుల కోరికలను పూర్తి
చేయటం అంటే స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోవటం. వర్తమాన అంతిమ సమయం యొక్క
తీవ్ర పురుషార్ధం ఇదే - ఒకే సమయంలో రెండు కార్యాలు చేయాలి. అవి ఏవి? ఇతరులకు
ఇవ్వటం అంటే స్వయంలో ఆ లోటును పూడ్చుకోవటం. అంటే ఇతరులను తయారు చేయటమే తయారవ్వటం.
భక్తి మార్గంలో ఏ వస్తువు లోటుగా ఉంటే ఆ వస్తువుని దానం ఇస్తారు. దానం ఇస్తే అది
ఎప్పుడు లోటు ఉండదు. కనుక ఇవ్వటం అంటేనే తీసుకోవటం. అదేవిధంగా ఏ సబ్జక్టులో, ఏ
విశేషతలో లేదా ఏ గుణంలో స్వయాన్ని బలహీనంగా అనుభవం చేసుకుంటున్నారో ఆ విశేషతని
లేదా గుణాన్ని దానం చేయండి. అనగా ఇతరాత్మల కోసం సేవలో ఉపయోగిస్తే ఆ సేవకి
ఫలితంగా ప్రత్యక్షఫలం రూపంలో దానిని మీలో అనుభవం చేసుకోగలరు. సేవ అనగా ఫలం
లభించటం. మొదట్లో స్వయానికి ఎంతో సమయం ఇచ్చేవారు, ఇప్పుడు ఎక్కువ సమయం లేదు,
మొదట స్వయానికి సమయం ఇచ్చి తర్వాత ఇతరాత్మలకి సమయం ఇవ్వటానికి. కనుక తీవ్ర
పురుషార్ధం అంటే స్వయం మరియు ఇతరాత్మల సేవ రెండూ వెనువెంట జరగాలి. ప్రతీ సెకండు,
ప్రతీ సంకల్పంలో స్వ కళ్యాణం, విశ్వకళ్యాణ భావన రెండూ వెనువెంట ఉండాలి. ఒక
సెకనులో రెండు కార్యాలు చేయాలి, అప్పుడే డబల్ కిరీటధారులుగా కాగలరు. ఒకవేళ ఒక
సమయంలో ఒక కార్యమే చేస్తే దానికి ప్రాలబ్దంగా క్రొత్త ప్రపంచంలో కూడా ఒక లైట్
కిరీటం అంటే పవిత్ర జీవితం, సుఖ సంపన్న జీవితం ప్రాప్తిస్తుంది. అంతేకానీ రాజ్య
సింహాసనం లేదా కిరీటం లభించదు. అంటే ప్రజాపదవిని ప్రాలబ్దంగా పొందుతారు. కానీ
డబుల్ కిరీటధారులుగా అవ్వాలంటే ప్రతీ సమయం డబుల్ సేవ అనగా స్వయం మరియు ఇతరాత్మల
సేవ చేయండి. ఆఖరున వచ్చినా కానీ చేయాల్సిన తీవ్ర పురుషార్ధం ఇదే. ఈ విధమైన
తీవ్ర పురుషార్ధం చేస్తున్నారా? విశేషంగా వర్తమాన సమయంలో ఈ పరిశీలన చేసుకోండి.
ఈ సాధన ద్వారానే స్వయం మరియు సమయం యొక్క పరివర్తన చేయగలరు. మంచిది.
ఈవిధంగా సదా ఆశావంతులు, స్వ మరియు విశ్వ పరివర్తకులకు,
బాప్ దాదా సమానంగా సదా విశ్వకళ్యాణం యొక్క శుభ బావనలో ఉండేవారికి, సర్వాత్మల
కోరికలన్నింటినీ పూర్తి చేసే తీవ్ర పురుషార్థులకు, సమయం మరియు సంకల్పాలను సేవలో
ఉపయోగించే విశ్వ సేవాధారులకు, విశ్వకళ్యాణకారీ సర్వ శ్రేష్ట ఆత్మలకి బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ మురళి సారం :-
1. సదా మిలనం యొక్క సంకల్పంలో, అదే సంలగ్నతలో ఉండే
పిల్లలు ఎంత బాబాని స్మృతి చేస్తున్నారో అంత బాప్ దాదా కూడా దానికి ఫలితం
ఇస్తున్నారు. అటువంటి పదమాపదమ్ భాగ్యశాలి ఆత్మలు బాబాకి మరియు విశ్వానికి కూడా
ప్రియం.
2. తీవ్ర పురుషార్థం అంటే ఒకే సమయంలో రెండు కార్యాలు చేయాలి. అంటే స్వయం మరియు
ఇతరాత్మల సేవ చేయాలి. ప్రతి సెకండు, సంకల్పం స్వయంపట్ల మరియు విశ్వం పట్ల
కళ్యాణకారీ భావన ఉంచుకోవాలి.