22.01.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరివర్తనకి ముఖ్య ఆధారం - ప్రతి సెకండు సేవలో తత్పరులై ఉండటం.

విశ్వ సేవాధారి, మహాదానిగా తయారు చేసే వరదాత శివబాబా అన్నారు -

మహారథీల ఆత్మిక సంభాషణలో విశేషంగా ఏ విషయం ఉంటుంది? ఎక్కువమంది మహారథీల ఆత్మిక సంభాషణలో విషయం ఏమిటంటే సమయానుసారంగా ఏవిధంగా పరివర్తన కావాలి? సమయం మరియు స్వయాన్ని చూసుకుని ఏమవుతుందో అనే ప్రశ్న వస్తుంది. కానీ పరివర్తనకి ముఖ్య ఆధారం - ప్రతి సెకండు సేవలో తత్పరులై ఉండటం. ఏదైతే సమయం ఉందో అది అంతా సేవార్థమే ఉపయోగించాలని ప్రతి మహారథికి సదా ఇదే సంకల్పం ఉంటుంది. తమ దేహం లేదా శరీరం యొక్క అవసర కర్మలలో సమయం ఉపయోగించినా కానీ అలా స్వయం కోసం ఉపయోగించుకుంటూ కూడా మనస్సు ద్వారా విశ్వకళ్యాణం యొక్క సేవను వెనువెంట చేయగలరు. వాచా లేదా కర్మణా ద్వారా చేయలేకపోయినా కానీ మనస్సులో కళ్యాణకారి భావన యొక్క సంకల్పం ఉంటే అది కూడా సేవా సబ్జెక్టులో జమ అవుతుంది.

భక్తిమార్గంలో మహాదాని అని ఎవరిని అంటారు? ప్రతి వస్తువు, ప్రతి సమయం స్వయం కోసం కాకుండా ఇతరుల దానపుణ్యాల కోసం ఉపయోగిస్తారో అటువంటి వారిని మహాదాని అని అంటారు లేదా దాత అని అంటారు. ఎవరైతే అవినాశిగా ఎల్లప్పుడూ దానం చేస్తూనే ఉంటారో అటువంటి వారినే మహాదాని అని అంటారు. అదేవిధంగా స్వయం కోసం సమయం ఉపయోగిస్తూ కూడా నేను విశ్వసేవార్థం ఉన్నాను అని సదా భావించండి. వేదికపై కూర్చున్నప్పుడు ఎలాగైతే విశేష ధ్యాస ఉంటుందో, నేను ఈ సమయంలో సేవావేదికపై ఉన్నాను అని భావించటం ద్వారా సాధారణత ఉండదు. సేవ యొక్క పూర్తి ధ్యాస ఉంటుంది. అదేవిధంగా సదా స్వయాన్ని సేవావేదికపై ఉన్నట్లుగా భావించండి. దీని ద్వారానే పరివర్తన వస్తుంది. సేవాకార్యంలో నిరంతరం తత్పరులై ఉండటం ద్వారా స్వయంలో ఉండే బలహీనతలు కూడా తొలగిపోతాయి మరియు సేవకి ఫల స్వరూపంగా అనేకాత్మల మనస్సుతో ఆశీర్వదిస్తారు లేదా గుణగానం చేస్తారు. ఆ ప్రాప్తి లేదా సంతోషం ఆధారంగా ఇంకా బిజీగా ఉండటం వలన లోపాలన్నీ సమాప్తి అయిపోతాయి. కనుక పరివర్తన అవ్వడానికి సాధనం ఇదే కనుక దీనికోసమే ఒకరికొకరు ధ్యాసను ఇప్పించుకుంటూ ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. స్మృతియాత్రలో స్థితులవ్వటం కూడా వర్తమాన సమయాన్ని అనుసరించి విశ్వకళ్యాణకారి స్థితిని అనుసరించి సేవాఖాతాలోనే జమ అవుతుంది. ఎందుకంటే మహారథీల యొక్క స్మృతియాత్ర ఇప్పుడు స్వయం కోసం కాదు, స్మతియాత్ర యొక్క సమయం కూడా స్వయంతో పాటు సర్వుల కళ్యాణం లేదా సర్వుల సేవార్థం.స్వయం అనుభవం చేసుకోవడానికి చాలా సమయం లభించింది కానీ ఇప్పుడు మహాదాని మరియు వరదానిగా అయ్యే స్థితి. అవ్యక్త బాప్ దాదా తిరిగి అడుగుతున్నారు - మహారథీ యొక్క భాష ఏమిటి? మహారథి అంటే డబల్ కిరీటధారి అంటే డబుల్ సేవాధారి. స్వయం మరియు సర్వుల సేవ యొక్క సమానత ఉండాలి. అటువంటి వారినే మహారథి అని అంటారు. బాల్యంలో సమయాన్ని స్వయం కోసం ఉపయోగించుకుంటారు కానీ భాద్యత గల ఆత్మల యొక్క సమయం సేవ కోసం ఉపయోగపడాలి. గుఱ్ఱపుసవారి లేదా కాలిబలం అయిన వారి సమయం ఎక్కువగా స్వయం కోసం ఉపయోగించబడుతుంది. స్వయమే ఒకొక్కసారి గొడవపడతారు, ఒకొక్కసారి ధారణ చేస్తారు, ఒకొక్కసారి ధారణలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఒకొక్కసారి తీవ్ర పురుషార్థంలో, ఒకొక్కసారి సాధారణ పురుషార్థంలో ఉంటారు. ఒకొక్కసారి ఒక సంస్కారంతో మరోసారి మరో సంస్కారంతో యుద్ధం చేస్తూ ఉంటారు. వీరు స్వయం కోసం ఎక్కువ సమయాన్నిపోగొడతారు. కానీ మహారథీలు ఆవిధంగా చేయరు. పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటారు. వాటిని తయారుచేసుకుంటారు, తిరిగి పాడు చేస్తారు కూడా. అదేవిధంగా వీరు కూడా తమ సంస్కారాలనే ఆటబొమ్మలతో ఒకొక్కసారి ఆడుకుంటారు, ఒకొక్కసారి పగులగొడతారు. ఒకొక్కసారి తయారుచేస్తారు. ఒకొక్కసారి వాటికి వశం అయిపోతారు, ఒకొక్కసారి వాటిని వశం చేసుకుంటారు. కానీ ఇవన్నీ బాల్యానికి గుర్తులు కానీ మహారథీలది కాదు. మంచిది.