23.01.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంకల్పం, వాచా మరియు స్వరూపం ఉన్నతంగా మరియు పవిత్రంగా అవ్వటం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత.

ఉన్నతమైన మరియు పవిత్రమైన శివబాబా బ్రహ్మావత్సలతో మాట్లాడుతున్నారు -

స్వయాన్ని ఉన్నతంగా మరియు పవిత్రంగా భావించి ప్రతి సంకల్పం లేదా కర్మ చేస్తున్నారా? ఉన్నతం అంటే ఉన్నతోన్నత బ్రాహ్మణులు, విరాఠ రూపంలో బ్రాహ్మణులకు పిలక స్థానం ఇచ్చారు. ఎలాగైతే పిలక స్థానం ఉన్నతమైనదో అదేవిధంగా స్థానంతో పాటు స్థితి కూడా ఉన్నతమేనా? ఎలాగైతే పేరు ఉన్నతమైనదో ఆవిధమైన ఉన్నత గౌరవం మరియు ఉన్నతమైన పని ఉండాలి. ఉన్నతోన్నత భగవంతుడు అని బాబా గురించి ఎలాగైతే మహిమ ఉందో అదేవిధంగా పిల్లలకు కూడా ఉన్నతోన్నత బ్రాహ్మణులు అనే మహిమ ఉంది. ఈ ఉన్నత స్థితికి స్మృతిచిహ్నం ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది - ఏదైనా శ్రేష్ఠ కర్తవ్యం లేదా శుభ కార్యాన్ని నామధారి బ్రాహ్మణులతోనే చేయిస్తారు. ఈ సమయంలోని శ్రేష్ఠ కర్మ యొక్క స్మృతిచిహ్నాన్ని చైతన్య సత్యమైన బ్రాహ్మణుల రూపంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు మరియు వింటున్నారు. ఒకవైపు శ్రేష్ఠ కర్మ యొక్క మహిమ లేదా కీర్తన కూడా వింటున్నారు, మరోవైపు స్వయం శ్రేష్ఠ పాత్రను అభినయిస్తున్నారు. స్మృతిచిహ్నం మరియు ప్రత్యక్ష పాత్ర రెండింటినీ వెనువెంట చూస్తున్నారు. మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారో మరియు ఉంటారో ఆ స్మృతిచిహ్నం ద్వారా రుజువవుతుంది. బ్రాహ్మణులు ఎలాగైతే ఉన్నతమైనవారో అదేవిధంగా బ్రాహ్మణుల సమయం కూడా అన్ని యుగాల కంటే సర్వ శ్రేష్ఠ యుగం అంటే సంగమయుగి సమయం అంటే అమృతవేళ లేదా బ్రహ్మముహూర్త సమయం. బ్రాహ్మణులకు ఇంత సర్వ శ్రేష్ఠ స్థితి ఎందుకు తయారయ్యింది? ఎందుకంటే బ్రాహ్మణులే ఉన్నతోన్నత లేదా శ్రేష్ఠ కర్తవ్యంలో సహయోగిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. మీ యొక్క ఇంత ఉన్నత పాత్ర, ఉన్నత తండ్రి, శ్రేష్ట స్థానం మరియు శ్రేష్ట గౌరవం స్మృతిలో ఉంటున్నాయా? ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని కల్పమంతటిలో ఎప్పుడూ ప్రాప్తింప చేసుకోలేరు. ఈ విధంగా ఉన్నతంతో పాటు పవిత్రంగా అయిన స్మృతిచిహ్నాన్ని ఇప్పటికీ వింటున్నారు. ప్రజలు బ్రాహ్మణులకి బదులు మీ దేవతా రూపానికి కూడా మహిమ చేస్తారు. ఉన్నత స్థితి యొక్క మహిమ ఏమిటి? కమల నయనాలు, కమల హస్తాలు, ముఖకమలం...ఈ రూపంలో ఇప్పటికి కూడా మహిమ చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించుకోండి - ప్రతి కర్మేంద్రియం కమలం సమానంగా అతీతంగా అయ్యిందా; కమలం సంబంధ సంప్రదింపుల్లో ఉంటూ కూడా అతీతంగా ఉంటుంది. అదేవిధంగా కర్మేంద్రియాలు, కర్మ మరియు కర్మఫలం యొక్క సంప్రదింపుల్లోకి వస్తూ అతీతంగా ఉంటుందా అంటే దేహం మరియు దేహ సంబంధాలు మరియు ఈ పాత దైహిక ప్రపంచం యొక్క ఆకర్షణకి అతీతంగా ఉంటున్నాయా? ఏ కర్మేంద్రియం యొక్క రసన అనగా చూడాలని, వినాలని లేదా మాట్లాడాలని ఇలా ఏ కర్మేంద్రియం తనకి వశీభూతం చేసుకోవటం లేదు కదా? వశీభూతం అవ్వటం అంటే పవిత్రులకి బదులు భూతంగా అవ్వటం, భూతంగా అయిపోతే, భూతాల కర్తవ్యం ఏమిటి? దుఃఖించటం మరియు దుఃఖపెట్టడం. ఉన్నత బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతున్నారు. అందువలన నేను ఉన్నతమైన మరియు పవిత్రమైన ఆత్మను అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైతే ఇది ప్రత్యక్ష రూపంలో అంటే సంకల్పం మరియు స్వరూపంలో కూడా స్మృతి ఉంటుందో అప్పుడే ప్రత్యక్షతా సంవత్సరాన్ని జరుపుకోగలరు. ఎంత వరకు స్వయం ఉన్నతంగా మరియు పవిత్ర స్వరూపంగా అవ్వరో అంత వరకు ఉన్నతోన్నతమైన బాబాని ఏవిధంగా ప్రత్యక్షం చేయగలరు? స్వయంలో బాబా సమానమైన గుణాలు మరియు కర్తవ్యాన్ని ప్రఖ్యాతి చేయటమే బాబాని ప్రత్యక్షం చేయటం. ఉన్నతమైన పని ద్వారానే ఉన్నతమైన బాబాకి పేరు వస్తుంది. మీ ఆత్మిక మూర్తి ద్వారా ఆత్మిక తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ప్రతి ఆత్మ ప్రతి బ్రాహ్మణాత్మలో బ్రహ్మాబాబాని చూడాలి. రచన తన ద్వారా రచయితను చూపాలి. ప్రతి ఒక్కరి నోటి నుండి స్వయం భగవంతుడు వీరిని ఇంత అదృష్టవంతులుగా తయారుచేశారు అనే మాట రావాలి. ప్రతి ఒక్కరి అదృష్టం బాప్ దాదా యొక్క చిత్రాన్ని ప్రసిద్ది చేయాలి. ప్రతి ఒక్కరు స్వయాన్ని దివ్యమైన స్వచ్చమైన దర్పణంగా తయారుచేసుకోండి. ఆ దర్పణం ద్వారా అనేకులకి బాప్ దాదా సాక్షాత్కారం అవ్వాలి. సాక్షాత్తు బాబా సమానమైన స్థితియే బాబాని సాక్షాత్కారం చేయించగలదు.
ప్రత్యక్షతా సంవత్సరం జరుపుకోవటం అంటే స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోవటం. ఈ స్థూల సాధనాలు నిమిత్తమాత్రపు సాధనాలు. సిద్ది స్వరూపమే సదాకాలిక సాధనం. వీరిని ఉన్నతంగా తయారుచేసింది ఉన్నతోన్నతమైన భగవంతుడు అని సిద్ధి స్వరూపమే స్వతహాగానే బాబాని సిద్ధి చేస్తుంది. అందువలన సాధనాలతో పాటు సిద్ధి స్వరూపాన్ని తయారుచేస్కోండి. సంకల్పం, వాచా మరియు స్వరూపం మూడూ ఉన్నతంగా మరియు పవిత్రంగా ఉండాలి. ఉల్లాసాలు, శ్రేష్ఠ సంకల్పం, శ్రమ మరియు సంలగ్నతను చూసి హర్షిస్తున్నారు కూడా. కానీ ఇక ముందు కొరకు సహయోగం ఇచ్చేటందుకు ప్లాన్ చెప్తున్నారు. అందరి సంకల్పం ఒకటే, ఒకే సంకల్పంలో మహాశక్తి ఉంటుంది. ఏకరస స్థితిలో స్థితులై ఈ సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి. కల్పకల్పం విజయం యొక్క అదృష్టచిత్రానికి ఇప్పటికీ మహిమ ఉంది మరియు స్థిరంగా ఉంది. మంచిది.

ఈవిధంగా మీ అదృష్టం ద్వారా బాప్ దాదా యొక్క చిత్రాన్ని చూపించేవారికి, సదా కమలం సమానంగా అల్పకాలిక ఆకర్షణల నుండి అతీతంగా ఉండేవారికి, బాబా సమానంగా ఉన్నతమైన మరియు పవిత్రమైన స్వమానంలో స్థితుల్లో ఉండేవారికి, ప్రతి ఆత్మలో బాబా యొక్క స్నేహాన్ని, స్వరూపాన్ని మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేసేవారికి, సర్వ శ్రేష్ఠ ఉన్నతోన్నత బ్రాహ్మణులకు ఉన్నతోన్నతమైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.