25.01.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


డబల్ లైట్ స్వరూపంగా అవ్వండి.

నిరంతర యోగిస్థితి వరకూ చేరుకునే మార్గం చెప్పేవారు, సదా డబల్ లైట్ స్వరూపంగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు -

భక్తిమార్గంలో లక్ష్మిని మహాదానిగా చూపిస్తారు. మహాదానికి గుర్తుగా ఏమి చూపిస్తారు? (లక్ష్మిదేవి చేయి తెరిచి, ఇచ్చే రూపంలో చూపిస్తారు) చేతిలో ధనం మెరుస్తూ ఉంటుంది. ఇది శక్తుల యొక్క స్మృతిచిహ్నం. లక్ష్మి అంటే ధనదేవి. ఇది స్థూల ధనం కాదు. జ్ఞాన ధనం, శక్తుల ధనం ఇచ్చే దేవి. దేవి అంటే ఇచ్చేవారు. చిత్రం ఎలా తయారుచేశారో అలాంటి ధనదేవీగా అవ్వాలి. జ్ఞానం అయినా ఇవ్వాలి, శక్తులు అయినా ఇవ్వాలి. స్మృతిచిహ్న చిత్రం ఎలా ఉందో అలా చైతన్యంగా మీలో అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైనా ఒక్క సెకండు కొరకు అయినా మీ ఎదురుగా వస్తే మీ దృష్టి ద్వారా ఎలా అనుభవం చేసుకోవాలంటే - నేను ఏదో పొందానని, అప్పుడే ఇచ్చే దేవి అని అంటారు. ఇప్పుడు ఇలాంటి సేవ కావాలి. అప్పుడే విశ్వ కళ్యాణం అవుతుంది. ఇంతమంది ఆత్మలకి తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చే స్వరూపం సూక్ష్మం మరియు చాలా శక్తిశాలి. సమయం తక్కువ, ప్రాప్తి ఉన్నతం. ఇలా ఇచ్చేటటువంటి శక్తులు, దేవిలు ఎంతమంది తయారయ్యారు? ఇలాంటి దేవీలు ఎంతమంది ఉంటారు? దీనిని అనుసరించే స్మృతిచిహ్నంలో కూడా నెంబర్ ఉంది. కొంతమంది ప్రతీ సమయం ఇచ్చేవారు, కొంతమంది అప్పుడప్పుడే ఇచ్చేవారు, కొంతమంది కొంతమందికే ఇచ్చేవారు, కొంతమంది అందరికీ ఇచ్చేవారు. కొంతమంది అంటారు అవకాశం లభిస్తే చేస్తాం, సహయోగం లభిస్తే చేస్తాం అని. అయితే వారి స్మృతిచిహ్నం ఏమిటి? వారి స్మృతిచిహ్నంలో కూడా తిథి, తారీఖు నిర్ణయించబడుతుంది. సదా చేసేవారికి పూజ కూడా సదా జరుగుతుంది. ఎవరైతే సమయం లేదా సహయోగం యొక్క ఆధారంతో అవకాశం తీసుకుంటారో వారి స్మృతిచిహ్నానికి కూడా తారీఖు నిర్ణయించబడుతుంది. కొంతమంది దేవీలకు వస్త్రములు మారుస్తారు, ప్రతీ కర్మకీ పూజ జరుగుతుంది. దాని ద్వారా ఏమి రుజువు అయ్యిందంటే వారు ప్రతీ కర్మ చేస్తూ కూడా మొత్తం సమయం అంతా దానం చేసారు అని, వారినే మహాదాని అని అంటారు. అందువలన వారికి పూజ కూడా మహాన్‌గా, స్మృతిచిహ్నం కూడా మహాన్‌గా తయారయ్యింది. ఒకరు సదా వెంట ఉంచుకుంటారు. వారితోనే స్నేహం పెట్టుకుని నడుస్తారు. రెండవ వారు వెంటే ఉన్నా కానీ స్నేహాన్ని పెట్టుకోరు. వారి స్మృతిచిహ్నంలోమొత్తం సమయానికి పూజారులు దొరకరు. ఎవరైతే ఇక్కడికి స్వార్ధంతో వస్తారో వారి స్మృతిచిహ్నంలో కూడా స్పష్టం అయిపోతుంది - ఇది ఎవరి స్మృతిచిహ్నమో. ఇది కూడా రహస్యం. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. సదా తోటివారి పట్ల సదా స్నేహాన్ని నిలుపుకోవాలి. కేవలం సమయాన్నిబట్టి కాదు, సదాకాలికంగా తోడు నిలుపుకోవాలి. స్వార్థంతో లేదా పని చేయించుకోవటానికి కాదు, స్నేహంతో సదాకాలికంగా తోడు నిలుపుకోవాలి. మంచిది.