27.01.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మూడు శ్రేష్ఠ ఈశ్వరీయ వరదానాలు.

సదా ఆరోగ్యంగా, ధనవంతంగా, సంతోషంగా తయారయ్యే వరదానం ఇచ్చే వరదాత, ఆత్మిక దృష్టితో అద్భుతం చేసే ఆత్మిక తండ్రి, బీదవారి నుండి రాజుగా తయారు చేసేవారు, పరమ శిక్షకుడు మరియు శూలాన్ని ముల్లుగా చేసే సద్గురువు అయిన శివబాబా అన్నారు -

ఈరోజు అతి పురాతనం మరియు క్రొత్త పిల్లలు తమ యొక్క నిజ స్థానానికి లేదా సాకారం మధుర ఇంటికి, మధువన స్వర్గాశ్రమంలో బాబా మిలనం యొక్క జన్మ సిద్ధ అధికారాన్ని పొంది హర్షిస్తున్నారు. ఇటువంటి హర్షిత ఆత్మలను చూసి బాప్ దాదా కూడా ప్రతి ఆత్మ యొక్క ప్రాప్తి లేదా అదృష్టాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు తండ్రి నుండి వారసత్వం పొంది ఎలాగైతే హర్షిస్తారో అంటే సంతోషిస్తారో అదేవిధంగా బాప్ దాదాకి కూడా చివర వచ్చినా కానీ తీవ్రపురుషార్థులుగా తీవ్ర పురుషార్ధంలో నిమగ్నమవ్వటం చూసి సంతోషం అనిపిస్తుంది. తీవ్ర పురుషార్ధం చేసే వారి ముఖం మరియు నడవడిక బాబా సమానంగా సదా ఆత్మికంగా కనిపిస్తాయి. ఆత్మీయత తప్ప ఇతర ఏ సంకల్పం లేదా స్మృతి ఉండదు. అంటే బాబా ద్వారా ప్రాప్తించిన సర్వశక్తులు స్వరూపంలో కనిపిస్తాయి. వారి యొక్క ప్రతి దృష్టిలో ప్రతి ఆత్మకి దృష్టి ద్వారా అద్భుతం జరిగే ఆత్మీయత కనిపిస్తుంది.

ఇటువంటి శ్రేష్ట స్థితిని ప్రాప్తింప చేసుకోవడానికి సదా రెండు విషయాలను స్మృతిలో పెట్టుకోండి. 1. స్వయాన్ని అకాలమూర్తిగా భావించండి 2. స్వయాన్ని సదా త్రికాలదర్శి మూర్తిగా భావించండి. అకాల సింహాసనాధికారి లేదా అకాలమూర్తి అంటే నిరాకారి స్థితి, త్రికాలదర్శి లేదా త్రిమూర్తి బాబా యొక్క సింహాసనాధికారి అంటే సాకారి కర్మయోగి స్థితి. ప్రతి సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చే ముందు ఈ రెండు విషయాలను పరిశీలించుకోండి. నిరాకారి మరియు సాకారి రెండు స్వరూపాల్లో ఉన్నానా? ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సమర్ధ స్వరూపంగా అయిపోతారు. అంటే ప్రతి సమయం ఆరోగ్యం, ధనం మరియు సంతోషం అనుభవం అవుతాయి.
శారీరక కర్మభోగం శూలం కంటే ఎంత పెద్ద రూపంలో ఉన్నా కానీ సదా స్వయాన్ని సాక్షిగా భావించటం ద్వారా కర్మభోగానికి వశమవ్వరు. ప్రతి కర్మభోగం శూలం నుండి ముల్లుగా అనుభవం అవుతుంది. భవిష్యత్తులో జన్మజన్మాంతరాలు కర్మభోగం నుండి ముక్తులవుతాం అనే సంతోషం ఈ జన్మలోని కర్మభోగాన్ని సమాప్తి చేసే ఔషదంగా అయిపోతుంది. సంతోషమే మందుగా మరియు ఆహారంగా అయిపోతుంది. ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి - నేను సదా ఆరోగ్యంగా ఉంటున్నానా? సదా ఆరోగ్యభవ! అనే వరదానాన్ని నేను ప్రాప్తింప చేసుకున్నానా? వరదాత బాబా ద్వారా మూడు వరదానాలు - సదా ఆరోగ్యంగా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే వరదానాన్ని ప్రాప్తింప చేసుకున్నానా? వారసత్వాన్ని సదాకాలికంగా ప్రాప్తింప చేసుకున్నానా లేక అల్పకాలికంగానా? ఏ రకమైన మాయా రోగానికి వశమై సదా ఆరోగ్యంగా ఉండే వారసత్వాన్ని పోగొట్టుకోవటం లేదు కదా? బాబా ద్వారా సదా సంపన్నం అంటే సర్వశక్తులనే ఖజానాతో సంపన్నంగా ఉండే వరదానాన్ని పొందారా? స్వయాన్ని సర్వ ఖజానాలకు యజమానిగా అనుభవం చేసుకుంటున్నారా? అంటే మీకు ఏ శక్తి లోటు లేదు - ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? దేవతల ఖజానాలో ఏ వస్తువు లోటుగా ఉండదు అనే మహిమ ఉంది. కానీ దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణుల మహిమ ఏమిటంటే బ్రాహ్మణుల ఖజానాలో ఏ శక్తి యొక్క అప్రాప్తి ఉండదు. ఈ విధంగా సదా సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? సదా సంపన్నంతో పాటు స్వయాన్ని సదా సంతోషంగా అంటే సదా హర్షితంగా అనుభవం చేసుకుంటున్నారా? మాయ యొక్క లేదా ప్రకృతి యొక్క ఏ ఆకర్షణ లేకపోతే సదా హర్షితంగా ఉంటారు. ఇలా సదా హర్షితంగా ఉండేవారికి సదా ఒకే సంకల్పం స్మృతిలో ఉంటుంది - పొందవలసినదేదో పొందాను, పొందవలసింది ఇక ఏమీ లేదు. ఈ సంకల్పంలో స్థితులయ్యే వారి అంటే సదా సంతోషంగా ఉండేవారి గుర్తు ఏమిటి? సదా హర్షితంగా ఉండేవారు మనసా, వాచా, కర్మణా ద్వారా సర్వాత్మలకు సదా సంతోషాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. ఏ ఆత్మ గురించి అయినా బాబా సమానంగా దుఃఖహర్త, సుఖకర్తగా ఉంటారు, సదా నిశ్చింతా చక్రవర్తిగా అనుభవం చేసుకుంటారు. చక్రవర్తి అంటే దాత. ఇలా హర్షితముఖిగా ఉండే ఆత్మ యొక్క సంకల్ప తరంగాల ద్వారా, ఒక్క సెకను యొక్క ఆత్మిక దృష్టి ద్వారా, ఒక్క సెకండు వారిని సంప్రదించినా, నోటి యొక్క ఒక మాట ద్వారా అయినా దుఃఖిగా లేదా చింతలో ఉన్న ఆత్మ స్వయాన్ని సుఖీగా లేదా సంతోషంగా అనుభవం చేసుకుంటుంది. సుఖం ఇవ్వటం మరియు తీసుకోవటమే వారి కర్తవ్యం. యోగ్యమైన రాజుని చూసి ప్రజలు ఎలాగైతే సంతోషిస్తారో అదేవిధంగా సదా ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండే ఆత్మను చూసి ఎటువంటి దుఃఖి ఆత్మ అయినా కానీ సుఖాన్ని అనుభవం చేసుకుంటుంది. దాతని చూసి అప్రాప్తి ఆత్మ కూడా ప్రాప్తి యొక్క సంతోషంలో నాట్యం చేయటం మొదలు పెడుతుంది. ఈవిధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇచ్చేటటువంటి దాత యొక్క పిల్లలు కనుక బాబా సమానంగా దాతలేనా లేక భక్తుల సమానంగా తీసుకునేవారిగా ఉన్నారా? లేక ఇవ్వటం మరియు తీసుకోవటం రెండూ వెనువెంట చేస్తున్నారా? తీసుకునేదే ఇచ్చేటందుకు, ఖజానా ఉన్నదే పంచేటందుకు మరియు దాంతోపాటు విశ్వకళ్యాణం కొరకు. ప్రతి సెకను తీసుకోవటంతో పాటు ఇచ్చే దాతగా కూడా అవ్వండి, అప్పుడే విశ్వకళ్యాణకారిగా పిలవబడతారు. మీ యొక్క ఇచ్చిపుచ్చుకునే ఖాతాను పరిశీలించుకోండి. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నారా మరియు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారా? ఇవ్వటం మరియు తీసుకోవటం వెనువెంట మరియు సమానంగా ఉంటున్నాయా? ఇటువంటి విశ్వకళ్యాణకారులే విశ్వ మహారాజుగా కాగలరు.

ఈవిధంగా మహాదాని, సర్వప్రాప్తుల ద్వారా సర్వాత్మలను సంపన్నంగా చేసేవారికి, బికారులను అధికారిగా తయారుచేసేవారికి, నిర్భల ఆత్మలను శక్తిశాలిగా తయారు చేసేవారికి, సదా ఆరోగ్యంగా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే ఆత్మలకు లేదా సర్వ శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.