28.01.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక సితారల యొక్క సభ.

ప్రకృతి మరియు మాయపై విజయాన్ని పొందేలా తయారు చేసేవారు, సఫలతా లక్షణాలను ఇచ్చేవారు, సర్వ శక్తులకు అధికారిగా చేసే శివబాబా మాట్లాడుతున్నారు --

ఈరోజు బాప్ దాదా సితారల యొక్క ఆత్మిక సభను చూస్తున్నారు. సభలో విశేషంగా మూడు రకాలైన సితారలు ఉన్నారు. ప్రతీ ఒక సితారకి నేను ఏ సితారను అనేది తెలుసు. 1 సఫలతా సితార 2 అదృష్ట సితార 3 ఆశా సితార. ఇప్పుడు ప్రతీ ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి - నేను ఏ సితార? రోజంతటి దినచర్యలో సంకల్పం, శ్వాస, సమయం, మాట, కర్మ మరియు సంబంధ సంప్రదింపుల్లో సఫలతామూర్తి అనగా సఫలతా సితారగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఏవిధంగా అయితే బాబా ద్వారా సుఖం, శాంతి, జ్ఞాన రత్నాల యొక్క సంపద, జన్మ సిద్ధాధికారంగా ప్రాప్తించిందో అదేవిధంగా ప్రతీ విషయంలో ప్రతి సమయం సఫలత కూడా జన్మ సిద్ధాధికారంగా అనుభవం అవుతుందా అనగా సహజంగానే ప్రాప్తిస్తుందా లేక శ్రమ చేసిన తర్వాతా? శ్రమ ఎక్కువ సఫలత తక్కువగా వస్తుందా? ఎంత ఆలోచిస్తున్నారో, చేస్తున్నారో అంత కర్మ యొక్క ప్రత్యక్షఫలం ప్రాప్తిస్తుందా? లేక అయిపోతుందిలే! ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవుతుంది.... ఇలా భవిష్య ఫలం యొక్క కోరిక పెట్టుకుని నడుస్తున్నారా? సంకల్పం ఉత్పన్నం కావటంతోనే సఫలత లభించే తీరుతుందనే నిశ్చయంతో కూడిన సంకల్పం ఉంటుందా? ప్రతీ అడుగులో పద్మాల (కోటానుకోట్లు) సంపాదన అని మహిమ ఉంది కదా! అదేవిధంగా ప్రతి అడుగులో సఫలత నిండి ఉండాలి. సంకల్పం లేదా కర్మ అనే బీజంలో సఫలత అనే వృక్షం ఇమిడి ఉంది. నీడ వలె కర్మ వెంటే సఫలత ఉన్నట్లు అనుభవం అవుతుందా?అటువంటి వారినే సఫలతా సితార అని అంటారు.

రెండవవారు - అదృష్ట సితారలు. వీరిలో కూడా నెంబర్ ఉంది. అదృష్ట సితారల యొక్క విశేషత ఏమిటంటే వారు ఏ సంకల్పం చేసినా, కర్మ చేసినా దానిలో నిమిత్తమాత్ర కష్టం చేస్తారు. కానీ ఫల ప్రాప్తి శ్రమ కంటే ఎక్కువ ఉంటుంది. అదృష్ట సితారలు తమ అదృష్టాన్ని తెలుసుకుని ప్రతి సమయం బాప్ దాదాకి లక్షలసార్లు ధన్యవాదాలు చెప్తారు. నా అదృష్టం యొక్క తాళం తెరిచావు అంటారు. అదృష్ట సితారల యొక్క వాణీలో మహాన్ గా తయారుచేసే బాబా యొక్క మహిమ మనస్సు నుండి స్వతహాగానే వస్తూంటుంది. మరియు వారి రూపంలో సంతోషపు మెరుపు విశేషంగా కనిపిస్తుంది. వారి విశేష ప్లాన్ (పద్ధతి) ఏమిటంటే సదా బాబా పేరుని ప్రసిద్ధి చేయాలని, బాబాకి బదులు ఇవ్వాలని ఉంటుంది అంటే బాబా యొక్క ప్రతీ కార్యం వారి జీవితం ద్వారా ప్రత్యక్షం చేయాలనుకుంటారు. సదా బాబాకి స్నేహీగా ఉంటారు మరియు బాబాకి స్నేహిగా చేసేవారిగా ఉంటారు. సదా ఇదే సూక్తి స్మృతిలో లేదా వాణీలో ఉంటుంది - ఓహో బాబా! ఓహో అదృష్టం!! ఈవిధంగా మిమ్మల్ని మీరు అదృష్ట సితారలుగా భావిస్తున్నారా?

మూడవవారు - ఆశా సితారలు. వారి విశేషత ఏమిటి? కొంతమంది ఆశా సితారల నుండి సఫలతామూర్తులుగా కూడా అయిపోతున్నారు. ఆశా సితారలు సదా బాబా యొక్క శ్రేష్ట ఆత్మల యొక్క తోడుని తీసుకుని నడుస్తూ ఉంటారు. ప్రతీ అడుగు సహాయం ఆధారంగా వేస్తారు. ప్రతీ సంకల్పంలో మరియు కర్మలో అవుతుందో అవ్వదో, శ్రేష్టమో లేక సాధారణమో, చేయనా వద్దా... ఇలా నిర్ణయ శక్తి ఉండదు. అంటే స్వయం నిర్ణయించుకోలేరు. నిర్ణయం చేయటానికి మాటిమాటికి ఎవరో ఒక న్యాయమూర్తి కావలసి ఉంటుంది. శ్రేష్ఠ సంకల్పాలు చేసే వారిగా ఉంటారు కాని దృఢ సంకల్పాలు చేయలేరు. ప్రతీ పరిస్థితిలో, సేవా కార్యంలో ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి కానీ ధైర్యం తక్కువ ఉంటుంది. వారికి ధైర్యం ఇచ్చే తోడు ఎవరో ఒకరు కావాలి. పద్ధతులు చాలా మంచివి తయారుచేస్తారు. సంకల్పాలు సమర్ధంగా చేస్తారు కానీ స్వరూపంలోకి పూర్తిగా తీసుకురాలేరు. వాణి ద్వారా లేదా కర్మ ద్వారా సగమో లేదా పావు వంతో పూర్తి చేయగలరు. కానీ వారికి ఒక విశేషత ఉంటుంది. ప్రతీ సమయంలో తోడు తీసుకున్న కారణంగా బాబా స్మృతి ఉంటుంది. వారి నోటి నుండి నషాతో, నిశ్చయంతో ఇవే మాటలు వస్తాయి - మా బాబా మా తోడుగా ఉన్నారు. ఆఖరికి ఆ రోజు రానే వస్తుంది, సంకల్పాలని కర్మలోకి తీసుకువచ్చి చూపిస్తాం అనే ఆశ ప్రతీ సమయం ఉంటుంది. మానసికంగా బలహీన పడరు. సంబంధ సంప్రదింపుల్లో కూడా అందరినీ గౌరవం ఇస్తారు. అందువలన అందరికీ స్నేహిగా ఉంటారు. వారి ముఖంలో పరివారం యొక్క తోడు మరియు స్నేహం యొక్క మెరుపు కనిపిస్తుంది. ఇటువంటి ఆశా సితారలు ఒక విశేష మాయా యుద్ధం నుండి రక్షణగా ఉంటారు. ఆ ఒక్క విషయం ఏమిటి? వారు దేహాభిమానంలోకి ఎప్పుడూ రారు. దేహాభిమానం అంటే తెలివి యొక్క అభిమానం, బుద్ది యొక్క అభిమానంలోకి రారు. వారు దీని నుండి రక్షణగా ఉంటారు. అంటే వారి బుద్ధిలో ఏమీ నడవదు అని కాదు. పద్దతులు (ప్లాన్స్) తయారు చేస్తారు. సంకల్పాలు వస్తాయి. కానీ దృఢత లేని కారణంగా ఎవరో ఒకరిని తోడు తీసుకోవలసి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మూడు రకాల సితారలు ఎవరో? ఆశా సితారలపై బాబాకి కూడా ఆశ ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు వీరు ముందుకు దుమకగలరని (హై జంప్). నిరాశవంతులు అందరి ఆశలను తమపై పెట్టుకునేటందుకు నిమిత్తమవుతారు. కానీ వీరు ఆశావంతులు. ఆశావంతులపై ఆశ పెట్టుకోవటం ఇలా డ్రామాలో అద్భుత పాత్ర తయారై ఉంది. మంచిది.

సదా స్వయంలో సఫలతా సితారగా అయ్యే లక్ష్యం, లక్షణాలు చూపించేవారికి, బాబా యొక్క సర్వశక్తుల అధికారులకి, బాబా యొక్క సర్వ ప్రాప్తుల అధికారులకి, బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధికారులైన వారికి, ప్రకృతి మరియు మాయపై విజయం పొందేవారికి, విజయీ సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.