06.02.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కుడి భుజం, ఎడమ భుజం లాంటి వారే బాబాకి సహయోగులు.

రాత్రిని పగలుగా పరివర్తన చేసేవారు, పాతది క్రొత్తగా చేసేవారు, విశ్వ పరివర్తకుడు, విశ్వానికి హితకారి మరియు విశ్వ కళ్యాణి బాబా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా పిల్లలందరిని ఈ రోజు విశేషించి సహయోగీ రూపంలో చేస్తున్నారు. బాబాకి సహయోగులుగా అయ్యిన దానికి చూపే స్మృతిచిహ్నం మీకు తెలుసా? చూసారా? సహయోగీ స్వరూపాన్ని భుజాల రూపంలో చూపిస్తారు. ఏవిధంగా అయితే శరీరం యొక్క విశేష కార్యకర్తలు భుజాలో అదేవిధంగా బాప్ దాదా యొక్క కర్తవ్యంలో కార్యకర్తలు నిమిత్తంగా పిల్లలైన మీరే. సదా బాబాకి సహయోగి అంటే స్వయాన్ని బాబా యొక్క భుజాలుగా భావించి కార్యం చేస్తున్నారా? భుజాలలో కూడా కుడి, ఎడమలు ఉంటారు. అదేవిధంగా కర్తవ్యంలో సదా యదార్థ రూపంలో తోడు నిలుపుకునే వారిని సహయోగులను వీరు మా కుడి భుజం అంటారు. కాబట్టి ఒకరు కుడి భుజం, రెండవవారు ఎడమ భుజం. కానీ ఇద్దరూ సహయోగులే. అందువలన సాకార బ్రహ్మబాబాకి అనేక భుజాల యొక్క ప్రసిద్ధత ఉంది. కుడి భుజం అని ఎవరిని అంటారు? అందరూ భుజాలే. చేతులు లేకుండా ఏ పని చేయలేరు కదా! అందువలన సాకార ప్రపంచంలో కూడా అంటారు. ఈ కార్యంలో మీ వ్రేలుని కూడా ఇవ్వండి అని. లేకపోతే ఈ కార్యంలో చేతులు కలపండి అని అంటారు. చేతులు అంటే భుజాలకి, వ్రేలు అంటే సహయోగానికి గుర్తు. అందరూ సహయోగులే కానీ నెంబర్ వార్.

కుడి భుజం యొక్క విశేషత సదా స్వచ్ఛంగా అంటే శుద్ధంగా, శ్రేష్ఠముగా ఉంటారు. ఏవిధంగా అయితే ఏదైనా శ్రేష్ఠ కార్యం లేదా శుద్ధ కార్యం కుడి చేతితోనే చేస్తారు కదా! అదేవిధంగా బాప్ దాదాకి సహయోగి అయిన కుడి భుజం అయిన వారి మాటలో, కర్మలో, సంపర్కంలో శ్రేష్ఠముగా మరియు శుద్ధంగా అంటే పవిత్రంగా ఉంటారు. అంటే సదా శ్రేష్ఠ కార్యార్థం స్వయాన్ని నిమిత్తంగా భావించి నడుస్తారు. ఏవిధంగా అయితే మమూలు భుజాలు చేసేవి, చేయించేది ఆత్మ కదా? అదేవిధంగా కుడి భుజంగా ఉన్న సహయోగులు సదా చేసి చేయించే బాబా స్మృతిలో అంటే కేవలం నిమిత్తంగా భావించి చేస్తారు. స్వయమే చేస్తున్నట్లు భావించరు. అందువలన ప్రతీ కర్మలో అతీత స్థితి, నిరహంకారత్వం, నమ్రత, నవ నిర్మాణం యొక్క శ్రేష్ఠత నిండియుంటుంది. ప్రతి సెకను, ప్రతీ సంకల్పం సంపూర్ణ పవిత్రంగా అంటే స్వచ్ఛంగా ఉంటాయి. దీనినే స్వచ్ఛత, సత్యత అని అంటారు. కుడి భుజం అయిన వారు విశేష శక్తిశాలిగా ఉంటారు. ఏధైనా విశేష బాధ్యత తీసుకోవటానికి కుడి చేతినే ఉపయోగిస్తారు కదా! అదేవిధంగా బాబాకి కుడి భుజం అయిన సహయోగీ ఆత్మ సదా విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన యొక్క బాధ్యత చాలా సహజ రీతిలో తీసుకుంటుంది. తమకు తానే బాధ్యత వహిస్తారు. సదా మాష్టర్ సర్వ శక్తివాన్ అనుభవం చేసుకుంటారు. కుడి భుజం యొక్క విశేషత కార్యాన్ని తీవ్రంగా చేస్తారు. ఈ కుడి భుజం అయిన సహయోగీ ఆత్మ ప్రతీ సబ్జెక్టు యొక్క ధారణలో లేదా ఆచరణలో పురుషార్థిగా ఉంటారు. సదా తయారుగా (ఎవర్‌ రెడీ) ఉంటారు. ఇదే కుడి భుజం యొక్క విశేషత.

ఎడమ భుజంగా ఉన్నవారు సదా సహయోగిగా ఉంటారు. కాని స్వచ్ఛతతో పాటు అస్వచ్చత అంటే సంకల్పం, వాణీ, కర్మలో అప్పుడప్పుడు ఎంతో కొంత అశుద్ధత ఉండిపోతుంది. అంటే సంపూర్ణ స్వచ్చత ఉండదు. పురుషార్థంలో తీవ్రత తక్కువగా ఉంటుంది. చేస్తారు, ఆలోచిస్తారు. కానీ ఆలస్యంగా సహయోగం చేస్తారు. కార్యం చేస్తారు. కానీ పూర్తి బాధ్యత తీసుకోవటానికి ధైర్యం ఉండదు. సదా ఉల్లాసం, ధైర్యం ఉంటుంది. కాని అవి నిరాధారంగా ఉండవు. వారి స్థితి ఎక్కువగా న్యాయవాదిలా (లాయర్) ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ తక్కువే పొందుతారు. స్వయం స్వయానికి నిర్ణయం చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి నిర్ణయం తీసుకోవటానికి వేరొక జడ్జి కావాల్సి ఉంటుంది. కానీ కుడి భుజం లాంటి వారు నియమపూర్వకంగా (లా ఫుల్) జడ్జిగా ఉంటారు. కానీ న్యాయవాదిగా కాదు.

ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను కుడి భుజాన్నా? ఎడమ భుజాన్నా? అని. న్యాయవాదిగా ఉన్నారా లేక నియమపూర్వకంగా ఉన్నారా? బాప్ దాదాకి అయితే ఇద్దరూ సహయోగులే. సదా మిమ్మల్ని మీరు సహయోగిగా భావిస్తే స్వతహాగానే సహజ యోగిగా అయిపోతారు. చేసి చేయించే వారు బాబా. కేవలం మేం నిమిత్తులం అని భావిస్తే సదా నిశ్చింతగా, హర్షితంగా ఉండగలం. ఈ రోజు బాప్ దాదా తన సహయోగీ భుజాలను చూస్తున్నారు. అందరూ భుజాలే కదా! అందరి మనస్సులో ఈ శుభ సంకల్పం సదా ఉంటుంది కదా? మేం అందరం విశ్వ నవ నిర్మాణం చేసే విశ్వ పరివర్తకులం అని. విశ్వానికి పరివర్తన చేసే ముందు స్వయం సంపూర్ణ పరివర్తన అయ్యారా? ఎంతెంత స్వ పరివర్తనలో లోపం ఉంటే అంతంత విశ్వపరివర్తనలో కూడా లోపం ఉంటుంది. స్వపరివర్తన తోనే సమయాన్ని కూడా పరివర్తన చేయగలం. స్వయాన్ని చూసుకున్నట్లయితే సమయం గురించి తెలిసిపోతుంది. పరివర్తన సమయం యొక్క గడియారం మీరే. కాబట్టి స్వయం యొక్క గడియారంలో సమయం చూసుకోండి. మొత్తం విశ్వం అంటే సర్వాత్మల యొక్క ధ్యాస అంతా ఇప్పుడు నిమిత్తం అయిన సమయం యొక్క గడియారాలు అయిన మీపైనే ఉంది. ఇప్పుడు ఇంకా సమయం ఎంత ఉంది అని. అందువలన ఈ పాత ప్రపంచం యొక్క సమయంను సమాప్తి చేయటానికి నిమిత్తంగా స్వయాన్ని భావించి స్వయం సంపన్నం చేసుకోండి. మంచిది. అర్థమైందా?

ఈవిధంగా విశ్వ పరివర్తకులకు, రాత్రిని పగలుగా పరివర్తన చేసేవారికి, పాతది కొత్త చేసే వారికి, బాప్ దాదాకి శ్రేష్ఠ సహయోగి అంటే సదా సహయోగులకు, సదా విశ్వానికి హితకారి విశ్వ కళ్యాణి శ్రేష్ఠ ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఈ మురళీ యొక్క సారం :-
1. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి కుడి భుజాన్నా, ఎడమ భుజాన్నా అని. న్యాయవాదులా (లాయర్) లేక నిమయపూర్వకంగా ఉండేవారా? సదా మిమ్మల్ని మీరు సహయోగిగా భావించటం వలన సహయోగిగా కాగలం. చేసి చేయించేవాడు బాబా, కేవలం నేను చేసే నిమిత్తుడను అని భావిస్తే సదా హర్షితంగా, నిశ్చింతగా ఉండగలం.
2. స్వపరివర్తనలోనే విశ్వ పరివర్తన చేయగలం. అందువలన ఈ పాత ప్రపంచం యొక్క సమయాన్ని సమాప్తి చేసే నిమిత్తంగా భావించి స్వయాన్ని సంపన్నం చేసుకోండి.
3. ఎవరైతే చేసి చేయించేవాడు బాబా మేం చేసే నిమిత్తులం అని భావిస్తారో, వారి ప్రతి కర్మలో అతీత స్థితి మరియు నిరహంకారత్వం మరియు నమ్రత నవ నిర్మాణం యొక్క శ్రేష్ఠత నిండి ఉంటుంది.
4. విశ్వ పరివర్తనకి ముందు స్వయాన్ని సంపూర్ణ పరివర్తన చేసుకోవాలి. ఎంతెంత స్వపరివర్తనలో లోపం ఉంటుందో అంతంత విశ్వ పరివర్తనలో కూడా లోపం వస్తుంది.