09.02.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బిందురూప స్థితి యొక్క ప్రాప్తి.

ప్రశ్న: సర్వ విషయాలు (పాయింట్స్) అన్నింటికీ సారం ఏమిటి?

జవాబు:: పాయింట్స్ యొక్క సారం పాయింట్ రూపంగా అవ్వటం అంటే బిందురూపంగా అవ్వటం.

ప్రశ్న: బిందురూప స్థితి ద్వారా ఏ డబుల్ ప్రాప్తి లభిస్తుంది?

జవాబు: బిందురూప స్థితి అంటే శక్తిశాలి స్థితి. దీనిలో వ్యర్థ సంకల్పాలు నడవవు మరియు బిందువు కూడా పెట్టగలం. అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని. దీనితో కర్మ కూడా శ్రేష్టంగా అవుతుంది. మరియు వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా పురుషార్థం యొక్క గతి తీవ్రం అవుతుంది. అందువలన జరిగిపోయింది ఏదో జరిగి పోయింది అని భావించాలి. వ్యర్థం చూడటం, వినటం, మాట్లాడటం అన్నీపోతాయి. సాక్షి స్థితిలో ఉండండి.

ప్రశ్న: కమల పుష్ప సమానంగా అయ్యే యుక్తి ఏమిటి?

జవాబు: ఎవరిలోనూ ఏ లోపం చూసి దాని వాతావరణం యొక్క ప్రభావంలోకి రాకూడదు. దీని కోసం ప్రతీ ఆత్మ పట్ల దయా దృష్టి, వృత్తి ఉండాలి. కానీ ఎదుర్కోనే శక్తి కాదు. ఈ ఆత్మ పొరపాటుకి వశం అయిపోయింది. వీరి దోషం ఏమీ లేదు అనే సంకల్పంలో ఉంటే ఆ వాతావరణానికి లేదా విషయానికి ప్రభావం అవ్వము. దీనినే కమలపుష్ప సమానం అవ్వటం అంటాము.

ప్రశ్న: సఫలతా మూర్తులుగా కావాలంటే ఏమి చేయాలి?

జవాబు: ఇతరులను మార్చటం కాదు, స్వయం మారాలి. మహావీరులుగా అవ్వాలి కానీ మల్లయోధులుగా కాదు. మల్ల యుద్ధం చేయటం అంటే ఏదైనా విషయం చెప్తే దాని గురించే సంకల్పాలు నడవటం. ఇది ఏం చేసారు? ఇలా ఎందుకు అన్నారు? ఇలా అనుకోవటం. దీనిలో మనస్సులో లేదా వాచాలో మల్లయుద్ధం చేయటం అని. నమస్కారం చేయటం అంటే తలవంచటం. ఎప్పుడైతే మనం సమస్కారం చేస్తామో అప్పుడే నమస్కారం చెప్తారు. ఇలా అనుకోకండి మేం ఎప్పుడూ వంగే ఉంటున్నాం కానీ మాకు ఎవరూ గౌరవం ఇవ్వటం లేదు. అబద్దం చెప్తూ వంగకుండా ఉన్నవారికే గౌరవం ఇస్తున్నారు అని. ఇది అల్పకాలికం కానీ ఇప్పుడు దూరదేశీ బుద్ది పెట్టుకోండి. ఎక్కడ ఎంతెంత తలవంచుకుని ఉంటారో అంతే నమ్రతని ధారణ చేస్తారో అంత మొత్తం కల్పం సర్వ ఆత్మలు మీకు సమస్కారం చేస్తాయి. సత్య, త్రేతా యుగాల్లో మనస్సుతో, ద్వాపర కలియుగాల్లో చేతులతో సమస్కారం చేస్తారు.

ఈ మురళీ సారం -
1. బిందురూప స్థితిలో కర్మ శ్రేష్టంగా అవుతుంది. మరియు వ్యర్థ సంకల్పాలు కూడా నడవవు. దీని కారణంగా పురుషార్థం యొక్క గతి తీవ్రం అవుతుంది. బిందువు పేట్టేయటం అంటే జరిగిపోయినది ఏదో జరిగిపోయింది అనుకోవటం.
2. ఎవరిలోనైనా ఏదైనా లోపాన్ని చూసి ఆ వాతావరణం యొక్క ప్రభావంలోకి రాని వారినే కమలపుష్ప సమానంగా అతీతులు అంటారు.
3. సఫలతా మూర్తులుగా అయ్యేటందుకు ఇతరులను మార్చటం కాదు, స్వయం మారాలి.
4. సదా స్మృతిలో ఉంచుకోండి. ఎంతెంత మనం తలవంచటం అంటే నమ్రతని ధారణ చేస్తే అంత మొత్తం కల్పంలో సర్వ ఆత్మలూ నా ముందు నమస్కారం చేస్తాయి అని.