03.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కర్మల యొక్క అతిగుహ్య గతి.

సంగమయుగీ బ్రాహ్మణుల యొక్క విచిత్ర లీలను చూస్తూ బాబా మట్లాడుతున్నారు -
బాప్ దాదా బేహద్, అనాది, అవినాశి డ్రామా యొక్క దృశ్యాలలో ఏ దృశ్యం చూసి సంతోషిస్తున్నారు? తెలుసా? వర్తమాన సమయంలో బాప్ దాదా బ్రాహ్మణుల యొక్క లీల విచిత్రంగా మరియు సంతోషించేదిగా చూస్తున్నారు. ఎలా అయితే పిల్లలు హే ప్రభూ! నీ లీల అపరం అపారమైనది అంటారో అలాగే బాబా కూడా పిల్లల యొక్క లీల అద్భుతమైనది మరియు వైరైటీ (భిన్నమైనది) అంటున్నారు. అన్నింటికంటే అద్భుతమైన లీల ఏమిటో తెలుసా? ఇప్పుడిప్పుడే చాలా కొంచెం అంటారు కానీ ఏమి చేస్తున్నారు? అది స్వయం అర్ధం చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు. ఏ ఆత్మకు లేదా ఏ వికారానికి అయినా వశీభూతమైన ఆత్మ, పరవశ ఆత్మ, తెలివి తక్కువ ఆత్మ ఏమి చేస్తుందో ఏమీ అర్ధం చేసుకోలేదు ఇలాంటి లీల బ్రాహ్మణులు కూడా చేస్తున్నారు.

బాప్ దాదా ఇటువంటి లీలను చూసి దయాహృదయులుగా కూడా అవుతున్నారు మరియు వెనువెంట ఉన్నత న్యాయాధికారిగా కూడా అవుతున్నారు అంటే ప్రేమ మరియు నియమం రెండింటి సమానత ఉంచుకుంటున్నారు. ఒకవైపు దయాహృదయులుగా అయ్యి తండ్రి సంబంధంతో ప్రేమ కూడా ఇస్తున్నారు అంటే ఒకటి, రెండు, మూడు సార్లు క్షమిస్తున్నారు కూడా! రెండవవైపు ఉన్నత న్యాయాధికారి రూపంలో కళ్యాణకారి అయిన కారణంగా, పిల్లల కళ్యాణం కోసం ఈశ్వరీయ నియమాలు కూడా చెప్తున్నారు. అన్నింటికంటే ఉన్నతమైన అనాది నియమం ఏమిటి? డ్రామా ప్లాన్ ప్రకారం ఒకటికి లక్ష రెట్లు ప్రాప్తి మరియు పశ్చాత్తాపం లేదా శిక్ష ఈ నియమం స్వతహాగా నడుస్తూ ఉంటుంది. బాబా విధానం ప్రకారం క్షమించమని అడగటం, క్షమించటం జరుగదు. ఈ కర్మకు ఈ ఫలం, ఈ కర్మకు ఈ శిక్ష అని ఉంటుంది. ఇది స్వతహాగా నడిచే మిషనరీ, ఈ మిషనరీని కొంతమంది పిల్లలు తెలుసుకోవటం లేదు అందువలనే కర్మల గతి గుహ్యమైనది అని మహిమ ఉంది.

బాబాని తెలుసుకున్నారు, పొందారు లేదా వారసత్వం కూడా పొందారు, బ్రాహ్మణ పరివారంలో స్వయాన్ని బ్రాహ్మణులుగా అంగీకరించారు, బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు అని బిరుదు కూడా వచ్చింది, ఈశ్వరీయ సేవార్థం నిమిత్తమయ్యారు. సహజరాజయోగులు అని కూడా పిలిపించుకుంటున్నారు, ప్రాప్తి యొక్క అనుభవం కూడా చేసుకుంటున్నారు, ఈశ్వరీయ నషా, ప్రాప్తి యొక్క నషా కూడా ఉంది, ప్రాలబ్దం యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి కానీ ముందు ఏమౌతుంది? మాయా ప్రతిజ్ఞను సఫలతా పూర్వకంగా ఎదుర్కోలేకపోతున్నారు. మాయ యొక్క భిన్న, భిన్న రూపాలను పరిశీలించలేకపోతున్నారు. అందువలన కొంతమంది మాయ యొక్క బలాన్ని చూసి మేము విజయీగా కాగలమా? అని బలహీనం అయిపోతున్నారు. కొంతమంది ఎదుర్కుంటూ, ఎదుర్కుంటూ అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు విజయం అనుభవం చేసుకుంటున్నారు, అలసిపోతున్నారు. అలసిపోయి, ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అక్కడ ఆగిపోతున్నారు.

కొంతమందికి డైరెక్ట్ బాబా నుండి తోడు మరియు సహయోగం తీసుకునే ధైర్యం లేక మార్గంలో నడిచే సహాయోగుల పండాగా చేసుకుంటున్నారు అంటే వారి ద్వారానే తోడు మరియు సహయోగం యొక్క ప్రాప్తి లభిస్తుంది అని భావిస్తున్నారు. బాబాకి బదులు ఏదోక ఆత్మను తోడుగా భావిస్తున్నారు. అందువలనే బాబా నుండి వేరు అయిపోతున్నారు. గడ్డిపరకను తమ తోడుగా భావిస్తున్న కారణంగా మాటి మాటికి తుఫానులలో చలిస్తూ ఉంటారు మరియు పడిపోతూ ఉంటారు మరియు బాబా తోడుని దూరంగా అనుభవం చేసుకుంటారు. అలాగే ఏదోక వ్యక్తి యొక్క తోడు లేదా ఏవోక సాధనాల ఆధారంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉంటే లేదా అలా ఉంటే పురుషార్ధం చేస్తాము, ఇది లభిస్తే పురుషార్ధం చేస్తాము, ఇలా సాధనాల రూపి కర్ర ఆధారంగా నడుస్తూ ఉంటారు. అవినాశి బాబా యొక్క ఆధారాన్ని తీసుకోకుండా, అనేక అల్పకాలిక ఆధారాలను ఆధారంగా చేసుకుంటున్నారు. ఆ ఆధారాలు వినాశి మరియు పరివర్తనాశాలి. వాటిని ఆధారంగా చేసుకుంటున్న కారణంగా స్వయం కూడా సర్వప్రాప్తుల యొక్క అనుభవాన్ని వినాశి సమయమే అనుభవం చేసుకుంటున్నారు మరియు స్థితి కూడా ఏకరసంగా ఉండదు, మాటి మాటికి పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే చాలా సంతోషంలో, ఆనందంలో ఉంటారు, ఇప్పుడిప్పుడే వాడిపోయినవారిగా, ఉదాసీనంగా మరియు నీరసంగా అయిపోతారు. కారణం ఏమిటి? ఆధారమే అటువంటిది. కొంతమంది పిల్లలు చాలా ఉల్లాసంతో, ఉత్సాహంతో, ధైర్యంతో మరియు బాబా సహయోగంతో చాలా ముందుకి వెళ్తూ గమ్యం వరకు చేరుకుంటున్నారు. కానీ 63 జన్మల కర్మలఖాతా ఇక్కడే పూర్తి అవ్వాలి కనుక స్వయం యొక్క పాత స్వభావ, సంస్కారాలు ప్రత్యక్షం అవ్వవలసిందే, సదాకాలికంగా సమాప్తి అవుతున్నాయి. కనుక అన్నీ ప్రత్యక్షం అవుతాయి కానీ ఈ కర్మల గుహ్యగతి తెలియని కారణంగా చివరి వరకు ఇలానే నడుస్తుందా? అని భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వ్యర్దసంకల్పాల అలజడి కారణంగా ప్రేమ ఉంచుకోలేకపోతున్నారు. ఆలోచించటంలోనే సమయం వ్యర్ధం చేసుకుంటున్నారు మరియు కోట్లలో కొద్దిమంది తుఫానులను కూడా డ్రామా యొక్క కానుకగా భావించి, స్వభావ, సంస్కారాల గొడవలను ముందుకు వెళ్ళే ఆధారంగా భావించి, మాయను పరిశీలిస్తూ దాటుతూ, బాబాని సాథీగా చేసుకుని సాక్షి అయ్యి ప్రతి పాత్రను చూస్తూ సదా హర్షితంగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు చేరుకుంటాము అనే నిశ్చయం సదా ఉంటుంది. ఇన్ని రకాలైన లీలలను పిల్లలలో బాబా చూస్తున్నారు.

సత్యమైన బాబాకి మీ జీవితమనే నౌకను ఇచ్చారు, సత్యమైన తోడు ఉన్న నావ ఊగుతుంది కానీ మునగదు అనేది స్మృతి ఉంచుకోండి. బాబాకి బాధ్యత ఇచ్చేసిన తర్వాత తిరిగి తీసుకోకండి. నేను నడవగలను అంటున్నారు, ఈ నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అనేది తొలగించుకోవటం అంటే బాబా వారిగా అవ్వటం. ఇదే పొరపాటు చేస్తున్నారు మరియు అదే పొరపాటులో స్వయం కదులుతూ అలజడి అవుతున్నారు. నేను చేస్తున్నాను లేదా నేను చేయలేను ఈ దేహాభిమానం యొక్క నాది అనే దానిలో అభావంగా అవ్వండి. ఈ భాషను మార్చండి. ఎప్పుడైతే మనం బాబా వారిగా అయిపోయామో ఇక బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీ బాధ్యత ఒకటే అదేమిటంటే - బాబా ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. ఏ స్థితి అనే స్థానంలో బాబా కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాను. శ్రీమతంలో నాది అనేది కలపను, పశ్చాత్తాపానికి అతీతంగా, ప్రాప్తి స్వరూపంగా మరియు పురుషార్థం యొక్క సహజ గతిని పొందుతాను అంటే సద్గతిని పొందుతాను అని. స్వయాన్ని మరియు ఇతరులను చూసి భయపడకండి. ఏమౌతుంది? ఇలా కూడా అవుతుందా? భయపడకండి కానీ లోతులోకి వెళ్ళండి. ఎందుకంటే వర్తమానంలో అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా అనేక రకాలుగా మిగిలిపోయిన కర్మల ఖాతాలు, స్వభావ, సంస్కారాలు, లేదా ఇతరుల సంబంధ, సంపర్కాల ద్వారా అన్ని బయటికి వస్తాయి. అంటే అంతిమ వీడ్కోలు తీసుకుంటాయి. బయటికి వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూపి రోగాలను చూసి భయపడకండి. ఈ అతి అంతిమానికి గుర్తుగా భావించండి. రెండవ వైపు అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా కర్మల గతి యొక్క మిషనరీ కూడా చాలా వేగంగా ఉంటుంది. ధర్మరాజ పురికి వెళ్ళకముందే ఇక్కడే కర్మ మరియు దాని శిక్ష ఇక్కడే, ఇప్పుడే సాక్షాత్కారం అవుతుంది. ఇక ముందు కూడా అవుతుంది. సత్యమైన బాబా యొక్క సత్యమైన పిల్లలుగా అయ్యి సత్యమైన స్థానం యొక్క నివాసిగా అయ్యి, కొద్దిగా అయినా అసత్య కర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష యొక్క సాక్షాత్కారం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రాహ్మణ పరివారంలో, బ్రాహ్మణ భూమిలో పాదం పెట్టలేరు. ప్రతి మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది, దాయలేరు. స్వయం పొరపాటు చేసిన కారణంగా మనస్సు అలజడి అయిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. స్వయానికి స్వయమే శిక్షకు అర్హులుగా అవుతారు. ఇవన్నీ జరుగవలసిందే. వీటికి జ్ఞానసాగరులుగా అయ్యి భయపడకండి. అర్ధమైందా! మాస్టర్ సర్వశక్తివంతులు భయపడరు.

కర్మల గతిని తెలుసుకునేవారికి, సదా ప్రతి సెకను, ప్రతి సంకల్పం, బాబా శ్రీమతంపై నడిచేవారికి, తమ జీవితం యొక్క బాధ్యతను బాబాకి అర్పణ చేసేవారికి, సదా బాబా యొక్క తోడుని ఎదురుగా ఉంచుకుని సర్వ విఘ్నాలను దాటేవారికి, సంపూర్ణ స్థితి యొక్క గమ్యాన్ని సదా ఎదురుగా ఉంచుకునేవారికి, ఇలా ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహంలో సదా ఉండేవారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.