11.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపన్న స్వరూపానికి గుర్తు - శుభచింతన మరియు శుభచింతక స్థితి.

బాబా సమానమైన సంపూర్ణ స్వరూప పిల్లలను చూస్తూ బాబా మాట్లాడుతున్నారు -
బాప్ దాదా సదా పిల్లలను సంపూర్ణ స్వరూపంలో చూస్తారు. ప్రతి బిడ్డ బాబా సమానంగా ఆనంద, ప్రేమ స్వరూప, సుఖ, శాంతి స్వరూపులు. ప్రతి ఒక్కరి మస్తకంలో, నయనాలలో ఏమి కనిపిస్తుంది? బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లలలో కనిపిస్తున్నాయా? ప్రతి ఒక్కరు గుణాలు మరియు శక్తుల బండారా, స్వయాన్ని సదా ఈ విధంగా భావించి నడుస్తున్నారా? సంపన్న స్వరూపం యొక్క గుర్తు సర్వ ఆత్మలకు రెండు విషయాలలో కనిపిస్తుంది. ఆ రెండు విషయాలు ఏమిటీ? ఆవిధమైన సంపన్న ఆత్మ సదా స్వయం పట్ల శుభచింతనలో ఉంటుంది మరియు ఇతరాత్మల పట్ల శుభచింతకులుగా ఉంటుంది.

శుభచింతన మరియు శుభచింతకులు ఈ రెండు గుర్తులు సంపన్న ఆత్మలలో కనిపిస్తాయి. సంపన్న ఆత్మకు అశుభచింతన లేదా వ్యర్థచింతన స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే శుభచింతన యొక్క ఖజానా, సత్య జ్ఞానం ఆ ఆత్మ దగ్గర చాలా ఉంటుంది. ఉన్నత కుటుంబీకుల రాజా పిల్లలు అశుభ చింతన, వ్యర్థచింతన అనే రాళ్ళతో లేదా మట్టితో ఆడుకోరు.

శుభచింతన కొరకు లెక్కలేనంత ఖజానా లభించింది. దాని గురించి తెలుసు కదా? లెక్కలేనంత ఖజానా కదా! శుభచింతన అంటే సమర్థ సంకల్పం. ఎలా అయితే రాత్రి, పగలు రెండు కలిసి ఉండవో అలాగే సమర్ధం మరియు వ్యర్ధం రెండు కలిసి ఉండవు. అమృతవేళ మేల్కొంటూ, కళ్ళు తెరుస్తూనే, ఏ శుభసంకల్పం లేదా చింతన చేయాలి అనేది కూడా బాబా చెప్పారు. అమృతవేళ శక్తిశాలి బాబా యొక్క స్నేహంతో ఏ శుభసంకల్పం చేస్తారో దాని ప్రభావం మొత్తం రోజంతటిపై పడుతుంది. ఎందుకంటే అమృతవేళ ఆదికాలం, సతో ప్రధాన సమయం. బాబా ద్వారా పిల్లలకు విశేష వరదానాలు లేదా విశేష సహయోగం లభించే సమయం. అందువలనే అమృతవేళ యొక్క మొదటి సంకల్పం యొక్క ప్రభావం మొత్తం రోజంతటి దినచర్యపై ఉంటుంది. బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టి రచించారు అని మహిమ ఉంది కదా! సంకల్పానికి ఇంత గొప్పతనం చూపించారు. బ్రహ్మ ఆది కాలంలో రచన రచిస్తారు, అలాగే బ్రహ్మణులైన మీరు ఆదికాలం అంటే అమృతవేళ ఏ సంకల్పం చేస్తారో అలా మొత్తం రోజంతటి దినచర్య రూపి సృష్టి స్వతహాగా తయారవుతూ ఉంటుంది. బ్రాహ్మణుల మొదటి సంకల్పం ఏమిటి? ఆ సమయంలో ఏ స్థితి ఉంటుంది? బాబా సమాన స్థితిలో స్థితులై కలుసుకుంటున్నారు కదా? కళ్ళు తెరుస్తూనే ఏ సంకల్పం వస్తుంది? బాబా తప్ప ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? శుభోదయం చెప్పేటప్పుడు కూడా బాబాకి బిడ్డగా భావించి బాబాకి శుభోదయం చెప్తున్నారు కదా! పిల్లలు అంటే యజమానులు. బాబా కూడా పిల్లలకు ఏమి బదులు ఇస్తున్నారు! పిల్లల నుండి యజమానిగా అయ్యే పిల్లలు, బాబా యొక్క శిరోకిరీటాలు అని బదులు ఇస్తున్నారు అంటే మొదటే సమర్థ సంకల్పం అయ్యింది కదా! మొదటి కలయిక బాబాతో జరుగుతుంది మరియు మొదటి కలయికలోనే బాబా ప్రతి రోజు సమానభవ అనే వరదానం ఇస్తున్నారు. దీనిలో అన్ని వరదానాలు ఇమిడి ఉన్నాయి. ఎవరి ప్రారంభమే ఇంత మహాన్ గా ఉంటుందో ఇక వారి రోజంతా ఎలా ఉంటుంది? వ్యర్థం అవుతుందా?
ఇటువంటి శ్రేష్ట కలయిక సదా ఎవరు చేసుకోగలరు? ఎవరి సంకల్పం మరియు సంసారం బాబాయో వారే చేసుకోగలరు. ఇలా బాబాకి సమీపంగా ఉండేవారి కలయిక కూడా సమీపంగా జరుగుతుంది. సమీప కలయిక లేకపోతే ఎదురుగా కలుసుకుంటారు. పిల్లలందరు కలయిక తప్పకుండా చేసుకుంటున్నారు. కానీ మొదటి నెంబర్ పిల్లలు సమీపంగా అంటే తోడు యొక్క అనుభవం చేసుకుంటారు, ఆ తోడు కూడా ఇద్దరిగా కాదు, ఒకటిగా అనిపిస్తారు. రెండవ నెంబర్ వారు బాబా యొక్క స్నేహాన్ని, బాబా యొక్క వరదానాలను, బాబా యొక్క కలయికను సమాన స్వరూపంతో కాదు, కానీ సమానంగా అయ్యే' శుభసంకల్ప స్వరూపంగా అయ్యి కలుసుకుంటారు. సన్ముఖంగా అంటే బాబాతో సర్వప్రాప్తులు లభిస్తున్నాయి అనే అనుభూతి చేసుకుంటారు. మొదటి నెంబర్ వారు సమానంగా అయ్యి కలుసుకుంటారు, రెండవ నెంబర్ వారు సమానంగా అవ్వాలనే సంకల్పంతో కలుసుకుంటారు, ఇక మూడవ నెంబర్ వారి విషయమే అడగకండి. మూడవ నెంబర్ వారి లీల విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే పిల్లలుగా అయ్యి కలుసుకుంటారు మరియు ఇప్పుడిప్పుడే అడిగేవారిగా అయిపోతారు. బహురూపిగా ఉంటారు. అప్పుడప్పుడు ఒక రూపంతో, అప్పుడప్పుడు ఒక రూపంతో కలుసుకుంటారు. పిల్లలుగా అయ్యి కలుయిక జరుపుకోవటంలో నెంబర్ వారీగా అయిపోతారు. కానీ ఎవరి సంకల్పమైతే సదా శ్రేష్టంగా ఉంటుందో అంటే బాబా సమాన స్వరూపంతో కలుసుకుంటారో వారి అమృతవేళ యొక్క మొదటి సంకల్పం రోజంతటి దినచర్యపై ప్రభావం వేస్తుంది, అటువంటి ఆత్మలు నిరంతరం శుభచింతనలో స్వతహాగా ఉంటారు. రెండవ నెంబర్ వారు స్వతహాగా ఉండరు కానీ మాటి మాటికి ధ్యాస పెట్టుకోవటం ద్వారా శుభచింతనలో ఉంటారు. మూడవ నెంబర్ వారు శుభచింతన మరియు వ్యర్థచింతన రెండింటి యుద్ధంలో ఉంటారు, అప్పుడప్పుడు విజయీగా, అప్పుడప్పుడు బలహీనంగా అయిపోతారు. సదా శుభచింతనలో ఉండండి. దానికి సాధనమేమిటంటే - ఆదికాలం యొక్క సమర్థ సంకల్పం. ఇలా శుభచింతనలో ఉండేవారు, రోజంతటిలో సంబంధ, సంపర్కంలోకి వచ్చే ఆత్మల పట్ల సదా శుభచింతకులుగా ఉంటారు. ఎటువంటి ఆత్మ అయినా, తమోగుణి ఆత్మ అయినా, సతోగుణి ఆత్మ అయినా సంపర్కంలోకి వస్తే అందరి పట్ల శుభచింతకులుగా అంటే అపకారికి కూడా ఉపకారం చేసేవారు. ఎప్పుడు ఎవరిపట్ల అసహ్య దృష్టి ఉండదు, ఎందుకంటే అజ్ఞానానికి వశీభూతమై ఉన్నారు అంటే తెలివి తక్కువ పిల్లలు అని తెలుసు. తెలివి తక్కువ పిల్లలు ఏ పని చేసినా అసహ్యమనిపించదు, ఇంకా ఆ పిల్లలపై దయ లేదా స్నేహం వస్తుంది. అలాగే శుభచింతకులు సదా స్వయాన్ని విశ్వపరివర్తకులుగా, విశ్వకళ్యాణకారిగా భావిస్తూ ఆత్మలపై దయాహృదయం ఉన్న కారణంగా అసహ్య భావన ఉండదు. కానీ సదా శుభభావం మరియు భావన పెట్టుకుంటారు. అందువలన సదా శుభచింతకులుగా ఉంటారు. వీరు ఎందుకు ఇలా చేసారు అని ఆలోచించరు. కానీ ఈ ఆత్మకు ఎలా కళ్యాణం చేయాలి అనేది ఆలోచిస్తారు. ఈ విధమైన శుభచింతక స్థితి సదా ఉంటుందా? ఒకవేళ శుభచింతన లేకపోతే శుభచింతకులుగా కూడా కాలేరు. రెండింటికి సంబంధం ఉంది. ఇలా సంపన్నంగా అయ్యే లక్ష్యం పెట్టుకునేవారు ఈ రెండు లక్షణాలను ధారణ చేయండి. అర్థమైందా? ఒకవేళ వ్యర్ధ సంకల్పాలు నడిస్తే శుభచింతన స్థితి నడవదు. అందువలన మీ చైతన్య శక్తిని చూసుకోండి. శుభచింతకులుగా అయ్యే అభ్యాసిగా అవ్వండి. మీ శక్తులే కదా!

ఎవరైతే సేవ చేస్తారో అటువంటి సేవాధారులపై బాబాకి సదా విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకంటే త్యాగమూర్తులు కదా! త్యాగానికి భాగ్యం స్వతహాగానే లభిస్తుంది. ఏమి లభిస్తుంది మరియు ఎలా లభిస్తుంది అనేది తెలుసు కదా? ఒకటి, శ్రమ చేసి సంపాదించటం మరియు రెండవది అకాస్మాత్తుగా లాటరీ లభిస్తే తమ పురుషార్థం యొక్క శక్తులను లేదా సర్వగుణాలను అనుభవం చేసుకోవటం. ఇదైతే అందరు చేసుకుంటున్నారు కానీ విశేషంగా సహయోగానికి ప్రత్యక్షఫలం నా పురుషార్ధం యొక్క స్థితి కంటే ప్రాప్తి ఎక్కువ అని అనుభవం అవుతుంది. ఏ అనుభూతుల కోసం చాలా సమయం నుండి పురుషార్ధంలో లక్ష్యం పెట్టుకున్నారో ఆ అనుభూతులు చాలా సహజంగా మరియు శక్తిశాలిగా అవుతాయి. అప్పుడు అనుకోనప్పటికీ అద్భుతం బాబా అని మనస్సు నుండి వస్తుంది. ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు అనుకుంటారు. అది సాకారంలో అనుభవం అవుతుంది. ఇలా బాబా యొక్క విశేష వరదాన ప్రాప్తి యొక్క అనుభవం, సహయోగి ఆత్మలకు అవుతుంది. ఇటువంటి అనుభవీ జీవితం ఒక విశేష స్మృతిచిహ్నంగా అవుతుంది. మంచిది.

ఇలా సదా బాబాకి సహయోగి ఆత్మలకు, ప్రతి అడుగులో తండ్రిని అనుసరిస్తూ బాబాని ప్రత్యక్షం చేసేవారికి, సదా స్వయం గుణాల ప్రాప్తి యొక్క అలలలో తేలియాడుతూ హర్షితంగా ఉండేవారికి, బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండే వారికి, సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.