24.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబా యొక్క డైరెక్ట్ పిల్లలే డబుల్ పూజ్యులుగా అవుతారు.

పదమాపదమ్ భాగ్యశాలి, డైరెక్ట్ బాబా యొక్క మొదటి రచన, డబుల్ పూజకి అధికారులు, బాబా శిరోకిరీటాలు అయిన శ్రేష్టాత్మలతో మాట్లాడుతున్నారు -

బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మొత్తం విశ్వంలో కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది బాబాని పొందారు. కేవలం తెలుసుకోవటమే కాదు కానీ తెలుసుకోవటంతో పాటు వెనువెంట ఏది పొందాలో అది పొందారు. ఇలా బాబాకి అతి స్నేహి, సహయోగి పిల్లలు భాగ్యాన్ని చూస్తున్నారు. సర్వాత్మలు బాబా పిల్లలే కానీ మీరు డైరెక్ట్ పిల్లలు. శివవంశీ బ్రహ్మాకుమారీ, కుమారులు. విశ్వమంతటిలో ఇతరాత్మలు ధర్మక్షేత్రంలో లేదా రాజకీయ క్షేత్రంలో మహాన్ గా లేదా ప్రసిద్ధమైనవారిగా అయ్యారు. ధర్మపితలుగా అయ్యారు, జగత్ గురువులుగా కూడా అయ్యారు. కానీ తల్లి, తండ్రి యొక్క సంబంధంతో అలౌకిక జన్మ మరియు పాలన ఎవ్వరికి లభించదు. అలౌకిక తల్లి,తండ్రి యొక్క అనుభవాన్ని కలలో కూడా చేసుకోరు మరియు శ్రేష్టాత్మలైన మీరు, పదమాపదమ్ భాగ్యశాలి ఆత్మలైన మీరు ప్రతి రోజు తల్లి, తండ్రి యొక్క మరియు సర్వ సంబంధాల యొక్క ప్రియస్మృతులు తీసుకునేటందుకు పాత్రులు. ప్రతి రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా! కేవలం ప్రియస్మృతులే కాదు కానీ సర్వశక్తివంతుడైన బాబా పిల్లలైన మీకు సేవకునిగా అయ్యి ప్రతి అడుగులో తోడుని నిలుపుకుంటున్నారు. అతి స్నేహంతో శిరోకిరీటాలుగా చేసుకుని వెంట తీసుకువెళ్తున్నారు. ఇటువంటి భాగ్యం జగద్గురువులకు లేదా ధర్మపితలకు కూడా ఉండదు. ఎందుకంటే శ్రేష్టాత్మలైన మీరు సన్ముఖంగా బాబా యొక్క

శ్రీమతాన్ని తీసుకునేవారు. ప్రేరణ ద్వారా కాదు, ముఖవంశావళి. డైరెక్ట్ గా నోటి ద్వారా వింటున్నారు. ఇటువంటి భాగ్యం ఏ ఆత్మలకు ఉంటుంది? ఎక్కువమందికి భారతవాసీ బీద పిల్లలకు, అమాయక పిల్లలకే ఉంటుంది. బాబా మనకి ఎప్పుడైనా దొరుకుతారా అని నిరాశతో ఉన్నవారికే ఈ విధమైన శ్రేష్టభాగ్యం లభించింది. ఎవరైనా నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయితే లేదా అసంభవ విషయం సంభవం అయితే ఎంత నషా మరియు సంతోషం ఉంటుంది! ఇలా మీ భాగ్యం సదా స్మృతి ఉంటుందా?

విశ్వమంతటిలో ధర్మాత్మలను చూడండి మరియు స్వయాన్ని చూసుకోండి మహాన్ తేడా ఉంటుంది. మొదటి విషయం చెప్పాను కదా! డైరెక్ట్ పిల్లలు, తల్లి, తండ్రి లేదా సర్వ సంబంధాల సుఖాన్ని అనుభవం చేసుకునే డైరెక్ట్ పిల్లలుగా అయిన కారణంగా విశ్వరాజ్యం యొక్క వారసత్వం సహజంగా ప్రాప్తిస్తుంది. సృష్టి యొక్క ఆదికాలం సత్యయుగం అంటే స్వర్గం యొక్క సతోప్రధాన, సంపూర్ణప్రాప్తి మీకే లభిస్తుంది. మిగిలిన సర్వాత్మలు మధ్యకాలంలో వస్తారు. శ్రేష్టాత్మలైన మీరు అనుభవించిన సుఖం లేదా రాజ్యం రజోప్రధాన రూపంలో పొందుతారు. మీకు ధర్మం మరియు రాజ్యం రెండు లభిస్తాయి. కానీ ఇతరాత్మలకైతే ధర్మం ఉంటే రాజ్యం ఉండదు, రాజ్యం ఉంటే ధర్మం ఉండదు. ఎందుకంటే ద్వాపరయుగం నుండి ధర్మం మరియు రాజ్యం రెండు పురులు వేరు వేరుగా ఉంటాయి. మొత్తం డ్రామాలో డబుల్ కిరీటధారులు కేవలం మీరే. ఇక ఎవరినైనా చూసారా? ఇంకా విశేషతలు ఉన్నాయి. సంపూర్ణ ప్రాప్తి అంటే తనువు, మనస్సు, ధనం మరియు ప్రకృతి యొక్క సర్వ సుఖాలు ఉంటాయి. దీనిలో అప్రాప్తి వస్తువు ఏదీ ఉండదు. దు:ఖమనేది నామమాత్రంగా కూడా ఉండదు. ఇటువంటి శ్రేష్ట ప్రాప్తి ఇక ఏ ఆత్మకు లభించదు. డైరెక్ట్ పిల్లలుగా అయిన కారణంగా, ఉన్నతోన్నతమైన బాబా సంతానం అయిన కారణంగా, పరమపూజ్య తండ్రి యొక్క సంతానం అయిన కారణంగా మీరు కూడా డబుల్ రూపంలో పూజింపబడుతున్నారు. ఒకటి సాలిగ్రామాల రూపంలో, రెండు దేవీ లేదా దేవత రూపంలో, ఈ విధమైన విధిపూర్వక పూజ్యులుగా ఏ ధర్మపిత లేదా ప్రసిద్ధమైన ఆత్మ అవ్వదు. కారణం ఏమిటి? ఎందుకంటే మీరు డైరెక్ట్ వంశావళి. ఎంత భాగ్యశాలులో అర్థమైందా! స్వయం భగవంతుడు మీ భాగ్యాన్ని గొప్పగా తయారుచేస్తున్నారు. సదా మీ యొక్క అటువంటి భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. బలహీన పాటలు పాడకండి. భక్తులు బలహీనతల పాటలు పాడతారు మరియు పిల్లలు భాగ్యం యొక్క పాటలు పాడతారు కనుక నేను భక్తుడినా లేక పిల్లవాడినా అని స్వయాన్ని అడగండి. మీ శ్రేష్ట భాగ్యాన్ని అర్ధం చేసుకున్నారా? మంచిది.

ఇలా పదమాపదమ్ భాగ్యాశాలులకు, డైరెక్ట్ బాబా యొక్క మొదటి రచనకు, సర్వ సంబంధాల సుఖం యొక్క అధికారులకు, సర్వప్రాప్తులకు అధికారులకు, రాజ్యభాగ్యం యొక్క అధికారులకు, డబుల్ పూజకు అధికారులకు, బాబా యొక్క శిరోకిరీటాలకు, ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.