28.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారి సమాన పిల్లల యొక్క లక్షణాలు.

సదా బాబాకి స్నేహి, సదా సహయోగి,హృదయ సింహాసనాధికారి, రాజ్య సింహాసనాధికారి పిల్లలతో ఉచ్చరించిన మహావాక్యాలు -

బాప్ దాదా సమీప మరియు సమాన సితారలను చూస్తున్నారు. బాబాకి సదా స్మృతి ఉంటుంది. ఎలా అయితే పిల్లలు స్మృతిస్వరూపులో అలాగే బాబా కూడా తన సమీప పిల్లల యొక్క స్మృతి స్వరూపులు. ఎలా అయితే స్మృతి స్వరూపం అవ్వటం ద్వారా సమర్ధ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారో అలాగే బాప్ దాదా స్వయం సమర్ధ స్వరూపంగా ఉంటూ కూడా సమాన పిల్లల యొక్క సహయోగం లేదా స్మృతితో స్వయం యొక్క స్వరూపంలో ఇంకా వృద్ధి అవుతున్నారు. అందువలనే సాకార బ్రహ్మాబాబాకు సహయోగి స్వరూపానికి గుర్తుగా వేల భుజాలు చూపించారు. భుజాలు సహయోగానికి గుర్తు. బాబాతో పాటు ఎవరైతే సదా సహయోగి పిల్లలు ఉన్నారో వారికి గుర్తుగానే భుజాల రూపంలో చూపించారు. ఇలా సమాన పిల్లల యొక్క స్థానం ఏమిటి? ఏ స్థానంలో వారు నివసిస్తారు? వారు సదా స్వయాన్ని హృదయ సింహాసనాధికారిగా మరియు విశ్వరాజ్య సింహాసనాధికారిగా భావిస్తారు. అంటే ఆ స్థితిలో స్థితులవుతారు. ఎలా అయితే ఉన్నతోన్నతమైన మహాన్ ఆత్మలు ఎప్పుడు కూడా భూమిపై పాదం పెట్టరు, ఇక్కడ కూడా చూడండి, ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తున్నప్పుడు పూర్తిగా మార్గంలో మెట్లపై కూడా తివాచీలు పరుస్తారు. అలాగే శ్రేష్ట ఆత్మల పాదం కూడా భూమిపై ఉండదు. ఈ గుర్తు ఎవరిది? ఎక్కడ నుండి ప్రారంభం అయ్యింది? ఇక్కడైతే వారి పాదం కేవలం తివాచీలపై పెడతారు. కానీ బాబా సమాన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి బుద్ధి రూపి పాదం సింహాసనం నుండి క్రింద పెట్టరు. వారిని సింహాసనాధికారులు అని అంటారు అంటే సదా సింహాసనంపైనే ఉంటారు, క్రిందికి రారు. ఇలా ఎవరైతే సదా హృదయ సింహాసనాధికారిగా లేదా రాజ్య సింహిసనాధికారిగా ఉంటారో వారికి సర్వాత్మల నుండి బదులుగా ఏమి లభిస్తుంది? స్నేహం అయితే లభిస్తుంది కానీ హృదయ సింహాసనాధికారులు ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా మనస్సులో ఎలా నిండిపోతుంది అంటే ఎలా అయితే బాబా ద్వారా ఏది వచ్చినా అది సదాకాలికంగా స్మృతిచిహ్నంగా అవుతుంది. అందరి హృదయాలలో ఇమిడి పోతుంది, స్మృతచిహ్నంగా ఉండిపోతుంది. మరలా అర్థకల్పం తర్వాత గీత రూపంలో స్మృతిచిహ్నంగా అవుతుంది. బాబా యొక్క మహావాక్యాలు స్మృతిచిహ్న రూపంలో ఉన్నతంగా అయిపోతాయి. అలాగే ఎవరైతే హృదయ సింహాసనాధికారి పిల్లలు ఉన్నారో వారు ఏ ఆత్మ పట్ల సంకల్పం చేస్తారో వారి మనస్సుకి చేరుకుంటుంది. మీరు ఏ ఆత్మ పట్ల అయినా శుభభావన, శుభకామన పెట్టుకుంటే వారి మనస్సుకి వీరు నిజంగా నా పట్ల శుభభావన, శుభకామన పెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఒకటి పైపైకి ఇవ్వటం, రెండు నిమిత్తంగా అయిన స్థానం కనుక గౌరవం ఇవ్వటం, మూడు మనస్సుతో స్వీకరించటం.

సమాన పిల్లల సంకల్పం కూడా బాణం సమానంగా మనస్సుకి తగులుకుంటుంది. ఎలా అయితే భూమిలో బాణం వేస్తారు, ఎవరిపై బాణం పడుతుందో వారు బాణంతో సహితంగా క్రిందికి పడిపోతారు. అలాగే హృదయ సింహాసనాధికారులు 1. వారు ఏ ఆత్మ పట్ల మనస్సుతో సంకల్పం చేస్తారో ఆ వ్యక్తి అంటే ఆత్మ స్వయం తన మనస్సు యొక్క భావాన్ని ప్రకటితం చేసేటందుకు ఎదురుగా వస్తుంది. 2. ఆ స్థితిలో స్థితులై ఏ మాట మాట్లాడతారో వారి రెండు మాటలు మనస్సుకి మార్గం చూపేవిగా ఉంటాయి. రెండు మాటలే మాట్లాడారు కానీ మనస్సుకి మార్గం లభించింది, ఆహారం లభించింది అని అనుభవం చేసుకుంటారు. 3. అటువంటి ఆత్మలను దూరంగా ఉన్నప్పటికీ మనస్సుతో జ్ఞాపకం చేస్తారు. మనస్సుతో జ్ఞాపకం చేసిన దానికి స్మృతిచిహ్నం ఏమి ఉంటుంది? తోడుగా, సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు, దూరంగా ఉన్నట్లుగా కాదు. వీరు ఆబూలో ఉన్నారు, మేము వేరే దేశంలో ఉన్నాము అని అనుకోరు. సదా సన్ముఖంగా మరియు తోడుగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. బాబాని మనస్సుతో జ్ఞాపకం చేస్తే ఏమి అనుభవం అవుతుంది? దూరంగా అనిపిస్తుందా? తోడు యొక్క అనుభవం అవుతుంది కదా? ఇలా ఎవరైతే హృదయ సింహసనాధికారి పిల్లలు ఉంటారో వారికి కూడా ప్రత్యక్షంగా బదులు కనిపిస్తుంది. దీనినే ప్రత్యక్షఫలం అని అంటారు. 4. వారు హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. హృదయ సింహాసనాధికారులుగా ఎవరు అవుతారు? ఎలా అయితే ఎవరైనా పెద్దవారు ఉంటే అందరు వారిని తమ వారిగా భావిస్తారు. చిన్నవారు పెద్దవారిని మా వారు అని భావిస్తారు. అలాగే హృదయ సింహాసనాధికారి పిల్లల గుర్తు ఏమిటంటే, వారిని ప్రతి ఒక్కరు తమ పెద్దవారిగా భావిస్తారు. తమవారిగా అనుభవం చేసుకుంటారు. మా పూర్వీకులు, పెద్దవారు అని భావిస్తారు. ఈ మాట భక్తి మార్గానికి సంబంధించినదే కానీ పూర్వీకులం అనే నషా ఉంటుంది కదా! వీరు మా పూర్వీకులు మరియు పూజ్యులు అని. అలాగే ఏ ఆత్మ సంపర్కంలోకి వచ్చినా వీరే మా పూర్వీకులు మరియు పూజ్యులు అని అనుభవం చేసుకుంటారు. తమవారిగా అనుభవం

చేసుకుంటారు. ఇలా హృదయ సింహాసనాధికారులుగా ఎంతమంది అవుతారు? కొద్దిమందే అవుతారు. ఇదే అష్టరత్నాల యొక్క విశేషత. 100 మందిలో ఇది ఉండదు. దానిలో(అష్టరత్నాలు) తల్లి, తండ్రి ఉంటారు, అయిన్నటికీ నెంబర్ ఉంటుంది కదా! ఎప్పుడైతే మొదటి యుగంలో కూడా నెంబర్ ఉంటుందో వెనుక వచ్చే వారిలో కూడా నెంబర్ ఉంటుంది కదా! మంచిది.