31.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వకళ్యాణం చేసేటందుకు సహజ సాధనం - శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఏకాగ్రత.

మాస్టర్ సర్వశక్తివాన్, సదా మాయాజీత్ నుండి జగత్ జీత్, సదా జ్ఞానస్వరూపులు, శక్తిస్వరూప స్థితుల్లో ఉండేటువంటి విజయీ రత్నాలతో బాబా మాట్లాడుతున్నారు -

మీ యొక్క నిరాకారి మరియు సాకారి రెండు స్థితుల గురించి మంచిగా తెలుసుకున్నారా? రెండు స్థితులలో స్థితులవ్వటం సహజంగా అనుభవం అవుతుందా లేదా సాకార స్థితిలో స్థితులవ్వటం సహజంగా మరియు నిరాకారి స్థితిలో స్థితులవ్వటం కష్టంగా అనిపిస్తుందా? సంకల్పం చేయగానే ఆ స్థితిలో స్థితులవ్వాలి. సెకను యొక్క సంకల్పం ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరం చేస్తుంది. సంకల్పమే ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి లేదా క్రిందికి తీసుకువచ్చే ఆత్మిక లిఫ్ట్. దీని ద్వారా సర్వశ్రేష్ఠమైన అంటే ఉన్నత గమ్యానికి చేరుకోండి అంటే నిరాకారి స్థితిలో స్థితులైపోండి, ఆకారి స్థితిలో కావాలంటే ఆకారి స్థితిలో స్థితులవ్వండి, సాకార స్థితిలో కావాలంటే సాకార స్థితిలో స్థితులవ్వండి. ఇటువంటి అభ్యాసాన్ని అనుభవం చేసుకుంటున్నారా? సంకల్పశక్తిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలుగుతున్నారా? ఎందుకంటే ఆత్మ ఈ సూక్ష్మశక్తులకు యజమాని. మాస్టర్ సర్వశక్తివాన్ అంటే ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే అలా కార్యంలో ఉపయోగించాలి. ఇలా యజమాని స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? సంకల్పాన్ని రచించే రచయితగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? రచనకు వశీభూతం అవ్వటంలేదు కదా? ఒక సెకనులో ఏ స్థితిలో స్థితులవ్వాలో సలహా లభించగానే ఆ స్థితిలో స్థితులయ్యే అభ్యాసం ఉందా? లేక యుద్ధంలోనే సమయం గడిచిపోతుందా? ఒకవేళ యుద్ధం చేస్తూ సమయంలో గడిపేసారు, స్వయాన్ని స్థితులు చేసుకోలేకపోతున్నారు అంటే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారా లేక క్షత్రియులు అని అంటారా? క్షత్రియులు అంటే చంద్రవంశీయులు.

వర్తమాన సమయంలో విశ్వకళ్యాణం చేసే సహజ సాధనం - మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా భ్రమించే సర్వాత్మల బుద్ధిని ఏకాగ్రం చేయాలి. మొత్తం విశ్వంలో సర్వాత్మలు విశేషంగా ఇదే కోరిక పెట్టుకుంటున్నారు - భ్రమించే బుద్ది ఏకాగ్రం అవ్వాలి లేదా చంచల మనస్సు ఏకాగ్రం అవ్వాలి అని. విశ్వం యొక్క ఈ కోరికను ఎలా పూర్తి చేస్తారు? స్వయమే ఏకాగ్రంగా లేకపోతే ఇతరులను ఏవిధంగా ఏకాగ్రం చేస్తారు? అందువలన ఏకాగ్రత అంటే సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు ఇలా నిరంతరం ఏకరస స్థితిలో స్థితులయ్యే విశేష అభ్యాసం చేయండి. దీని కొరకు చెప్పాను కదా! ఒకటి వ్యర్ధ సంకల్పాలను శుద్దసంకల్పాలలోకి పరివర్తన చేసుకోండి, రెండు మాయ ద్వారా వచ్చే అనేక రకాలైన విఘ్నాలను స్వయం ఈశ్వరీయ సంలగ్నత యొక్క ఆధారంతో సహజంగా సమాప్తి చేసుకుంటూ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి. విఘ్నాలకు భయపడడానికి ముఖ్య కారణం ఏమిటి? ఎప్పుడైనా విఘ్నం వచ్చినప్పుడు, విఘ్నం రాగానే ఇది మర్చిపోతున్నారు - బాప్ దాదా మనకి మొదటే ఈ జ్ఞానం ఇచ్చారు - సంలగ్నత యొక్క పరీక్షలో ఇవన్నీ వస్తాయి అని. మరి మొదటే విఘ్నం రావలసిందే అని తెలిసినప్పుడు ఇక భయపడవలసిన అవసరం ఏముంది? క్రొత్త విషయంగా ఎందుకు భావిస్తున్నారు?

మాయ ఎందుకు వస్తుంది? వ్యర్థసంకల్పాలు ఎందుకు వస్తాయి? బుద్ది ఎందుకు భ్రమిస్తుంది? వాతావరణం ఎందుకు ప్రభావం వేస్తుంది? సంబంధీకులు ఎందుకు సహయోగి అవ్వటం లేదు? ఇప్పటి వరకు పాత సంస్కారాలు ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ అన్ని ప్రశ్నలు విఘ్నాలను తొలగించడానికి బదులు బాబా యొక్క సంలగ్నత నుండి తొలగించడానికి నిమిత్తం అవుతాయి. ఎంత ముందుకి వెళ్తూ ఉంటారో అంతగా మాయ రకరకాల రూపాలతో పరీక్ష తీసుకోవడానికి వస్తుంది అనే బాబా మహావాక్యాన్ని మర్చిపోతున్నారా! కాని పరీక్ష అనేది ముందుకి తీసుకువెళ్ళే సాధనం కానీ పడవేసేది కాదు. ఎందుకంటే కారణం యొక్క నివారణ చేసుకోవడానికి బదులు ఆలోచించటంలోనే సమయం పోగొట్టుకుంటున్నారు, శక్తిని పోగొట్టుకుంటున్నారు. కారణం గురించి ఆలోచించడానికి బదులు నివారణ ఆలోచించండి మరియు నిర్విఘ్నంగా అవ్వండి. ఎందుకు వచ్చింది? ఇలా ఆలోచించటం కాదు కానీ రావల్సిందే ఈ స్మృతిలో ఉండటం ద్వారా సమర్థ స్వరూపంగా అయిపోతారు.

రెండవ విషయం - చిన్న విఘ్నాలలో ఎందుకు అనే ప్రశ్న రావటం ద్వారా వ్యర్థ సంకల్పాల వరుస ప్రారంభం అవుతుంది. మరియు ఆ వరుసను సమాప్తి చేసుకోవటంలో చాలా సమయంపడుతుంది. ముఖ్యమైన బలహీనత ఏమిటంటే, జ్ఞానస్వరూపం అంటే జ్ఞానసాగర స్థితిలో స్థితులై విఘ్నాలను దాటలేకపోతున్నారు. జ్ఞానులే కానీ జ్ఞానస్వరూపంగా అవ్వాలి.

వాతావరణం కూడా ఎందుకు ప్రభావం వేస్తుంది? దానికి కారణం ఏమిటి? స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయాలి అనేది మర్చిపోతున్నారు. విశ్వపరివర్తకులు అని చెప్తున్నప్పుడు విశ్వపరివర్తనలో వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయాలి. అశుద్ధాన్ని శుద్ధంగా చేయటానికి నిమిత్తులు. మరి ఇక వాయుమండలం అలా ఉంది కనుక బలహీనంగా అయిపోయాము అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది కలియుగం, తమోప్రధానం, ఆసురీ సృష్టి, దీనిలో వాతావరణం అశుద్ధంగా ఉండకపోతే ఇక ఎలా ఉంటుంది? తమోగుణి సృష్టి మధ్యలో ఉంటూ, వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇదే బ్రాహ్మణుల కర్తవ్యం. కర్తవ్యం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా అంటే రచయిత స్థితిలో స్థితులవ్వటం ద్వారా వాతావరణం అంటే రచనకు వశం అవ్వరు. నేను పరివర్తన అయ్యి ఎలా పరివర్తన చేయాలి అని ఆలోచించాలి. కానీ వాతావరణం అలా ఉంది కనుక బలహీనంగా అయిపోయాము, వాతావరణం మారితే నేను మారతాను, వాతావరణం మంచిగా ఉంటే స్థితి మంచిగా ఉంటుంది అంటున్నారు. కానీ వాతావరణాన్ని పరివర్తన చేసేది ఎవరు? ఇది మర్చిపోతున్నారు. దీని కారణంగా కొద్దిగా వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది.

ఇంకా ఏమంటున్నారు? సంబంధీకులు వినటంలేదు, సాంగత్యం మంచిగా లేదు, కనుక శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము అని అంటున్నారు. బాప్ దాదా అయితే మొదటే చెప్పారు - ప్రతి ఆత్మది ఎవరి వేరు వేరుగా ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కొందరిది సతో ప్రధానం, కొందరిది రజోగుణి, కొందరిది తమోగుణి పాత్ర. వెరైటీ ఆత్మలు మరియు వైరైటీ డ్రామా కనుక ఆత్మలందరికి ఒకే విధమైన పాత్ర ఉండదు. ఒకవేళ ఏ ఆత్మదైనా తమోగుణి అంటే అజ్ఞాన పాత్ర అయితే ఆ ఆత్మకు శుభభావన మరియు శుభకామనతో శాంతి మరియు శక్తి యొక్క దానం ఇవ్వండి. ఆ అజ్ఞాని పాత్రను చూసి మీ శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మీ స్థితిని ఎందుకు అలజడి చేసుకుంటున్నారు? సాక్షి అయ్యి పాత్రను చూస్తూ, ఏ శక్తిని దానం ఇవ్వాలో ఆ శక్తి దానం ఇవ్వండి. కానీ భయపడకండి. మీ సతో ప్రధాన పాత్రలో స్థితులై ఉండండి. తమోగుణి ఆత్మ యొక్క సాంగత్యం యొక్క రంగు యొక్క ప్రభావం పడటానికి కారణం - సదా బాబా యొక్క శ్రేష్ఠ సాంగత్యంలో ఉండటం లేదు. సదా శ్రేష్ఠ సాంగత్యంలో ఉండేవారిపై ఇతరులు ఎవరు సాంగత్యం యొక్క ప్రభావాన్ని వేయలేరు. కనుక నివారణ ఆలోచించండి.

ఇంకా ఏమంటున్నారు? మా సంబంధీకుల బుద్ధి తాళం తెరవండి అని. బాబా అయితే సర్వాత్మల బుద్దితాళం తెరిచే తాళంచెవి పిల్లలకు మొదటే ఇచ్చారు. మరి తాళంచెవిని ఎందుకు ఉపయోగించటం లేదు? మీ కార్యాన్ని మర్చిపోయిన కారణంగా బాబాకి కూడా మాటి మాటికి తాళం తెరవండి లేదా బుద్ధిని పరివర్తన చేయండి అని బాబాకి కూడా స్మృతి ఇప్పిస్తున్నారు. బాబా అయితే సర్వాత్మల పట్ల సదా విశ్వకళ్యాణకారియే. మరి మాటిమాటికి బాబాకి ఎందుకు స్మృతి ఇప్పిస్తున్నారు? బాబాని మీ వలె మర్చిపోయేవారిగా అనుకుంటున్నారా ఏమిటి? చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీకైతే మీ హద్దు పాత్ర యొక్క సంబంధీకుల ఆలోచన ఉంటుంది, కానీ బాబా అయితే సదా పిల్లల సంబంధంలో ఉంటారు. కనుక బాబా పిల్లలను మర్చిపోరు. కానీ బాబాకి తెలుసు, ప్రతి ఆత్మకు తమ, తమ సమయంలో పాత్ర ఉంటుంది. కొంతమందికి ఆదిలో పాత్ర ఉంటుంది, కొంతమందికి మధ్యలో ఉంటుంది, కొంతమందికి అంతిమంలో ఉంటుంది. కొంతమందికి భక్తి యొక్క పాత్ర ఉంటుంది, కొంతమందికి జ్ఞానంలో పాత్ర ఉంటుంది. అందువలన మాటిమాటికి తాళం ఎప్పుడు తెరుస్తారు? అని చింతించకండి. కానీ తాళం తెరిచే సాధనం - మీ మనసా సంకల్పం ద్వారా సేవ, మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ, మీ జీవిత పరివర్తన యొక్క సేవ ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సేవ యొక్క కర్తవ్యాన్ని నిలుపుకోండి. ఇప్పుడిక మాటిమాటికి తాళం తెరవండి అని అనకండి. మీ తాళం తెరుచుకుంది. కనుక వారిది కూడా తెరుచుకుంటుంది. ముఖ్యంగా మూడు విషయాలు మాటిమాటికి అంటున్నారు లేదా వ్రాస్తున్నారు - యోగం ఎందుకు కుదరటంలేదు? తాళం ఎందుకు తెరవటంలేదు? మరియు మాయ ఎందుకు వస్తుంది? అని. చాలా ఆలోచిస్తున్నారు. అందువలనే మాయకు కూడా మజా వస్తుంది. ఎలా అయితే మల్లయుద్ధంలో కూడా కొద్దిగా అయినా పడిపోతే ఇతరులకు కూడా ఇంకా పడేసి పైకి రావాలి అని మజా వస్తుంది, మాయ వచ్చేసింది, మాయ ఎందుకు వచ్చింది? ఇలా మాయ మనం భయపడటం చూసి ఇంకా యుద్ధం చేస్తుంది. అందువలనే మాయ రావల్సిందే అని చెప్పాను. మాయ రావటం అంటే విజయీగా అవ్వటానికి నిమిత్తంగా అవ్వటం. శక్తుల యొక్క ప్రాప్తులను అనుభవంలోకి తీసుకువచ్చేటందుకు మాయ నిమిత్తంగా అవుతుంది. ఒకవేళ శత్రువు లేకపోతే విజయీ అని ఎలా అంటారు? విజయీ రత్నాలుగా అయ్యేటందుకు ఈ చిన్న,చిన్న మాయా రూపాలు నిమిత్తం అవుతాయి. అందువలన మాయాజీతుగా భావించి, విజయీరత్నంగా భావించి, మాయపై విజయాన్ని పొందండి. అర్ధమైందా? మాస్టర్ సర్వశక్తివంతులు బలహీనంగా అవ్వకండి. మాయకు ప్రతిజ్ఞ చేసేవారిగా అవ్వండి. మంచిది.

సదా మాయాజీత్ నుండి జగత్ జీత్ ఆత్మలకు, స్వయం యొక్క సమర్థ వృత్తి ద్వారా వాతావరణాన్ని సతో ప్రధానంగా చేసేవారికి, శ్రేష్ఠ బాబా యొక్క సాంగత్యం ద్వారా అనేక మాయా సాంగత్య దోషాల నుండి అతీతంగా ఉండేవారికి, సదా జ్ఞానస్వరూప, శక్తి స్వరూప స్థితిలో ఉండేవారికి, ఇలా సదా విజయీ రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.