14.06.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాప్ దాదా యొక్క దేశ మరియు విదేశ విహారం యొక్క సమాచారం.

సదా బాబా సమానంగా గుణాల యొక్క, జ్ఞానం యొక్క, శక్తుల యొక్క దానం చేసేటువంటి మహాదాని ఆత్మలతో బాప్ దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు -

విదేశం యొక్క విశేషత - ఒకవైపు సృష్టిని పరివర్తన చేసేటువంటి స్థూల సాధనాల పరిశోధనకు నిమిత్తమైన ఆత్మలు వైజ్ఞానికులు తమ పరిశోధన యొక్క లోతుల్లో నిమగ్నమై ఉన్నారు, వైజ్ఞానికులు సంలగ్నత, సమయం మరియు ప్రకృతి యొక్క తత్వాలపై విజయం పొందేటువంటి, అన్ని తత్వాలను తమ వశీభూతం చేసుకునే కోరికలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి వస్తువుని స్వచ్చంగా చేయటంలో స్వయాన్ని విజయీగా భావిస్తున్నారు. ఎలా అయితే కల్పపూర్వం యొక్క స్మృతిచిహ్నంలో కూడా రావణ రాజ్యం యొక్క విశేషత - అన్ని తత్వాలను తమ వశీభూతం చేసుకున్నట్లుగా మహిమ ఉంది. కల్పపూర్వం వలె ఈ కార్యంలో విదేశీ ఆత్మలు నిమగ్నమై ఉన్నారు. వెనువెంట వైజ్ఞానికులు మీ యోగీ ఆత్మల కొరకు మీ యొక్క శ్రేష్ట యోగానికి ఏదైతే ప్రాప్తి ఉందో స్వర్గ రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తిని ఇస్తున్నారు. వచ్చే రాజ్యంలో సర్వసుఖ సాధనాలు మీ రాజయోగి ఆత్మలకు ప్రాప్తిస్తాయి. ఇలా అటువంటి సాధనాలు తెలియనప్పటికీ వాటిని తయారుచేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంటే తెలివైన దేవతలైన మీ కొరకు ప్రకృతి యొక్క సతో ప్రధాన శ్రేష్ట సాధనాలు పరిశోధించటంలో, మీ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఎలా అయితే మీకు చేసేటువంటి ఒకే సంలగ్నత ఉంది, బాబా ద్వారా సర్వప్రాప్తుల యొక్క సంలగ్నతలో ఉంటున్నారో అలాగే విదేశి ఆత్మలు తమ వైజ్ఞానిక బలం ద్వారా సృష్టిని స్వర్గంగా తయారుచేసే కోరికతో ఉన్నారు. స్వర్గం అంటే అక్కడ అప్రాప్తి వస్తువు అనేది ఏదీ ఉండదు. ఈ కార్యం యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉన్న ఆత్మలు డ్రామానుసారం నిమిత్తంగా అయ్యి తమ కార్యం చాలా మంచిగా చేస్తున్నారు, కానీ మీ కొరకే చేస్తున్నారు. వీరందరు మా తయారీలలో నిమగ్నమై ఉన్నారు అని మీకు అనుభవం అవుతుందా? ఎంత స్వచ్ఛత, సత్యతతో సేవ చేసేవారు! ఒకవేళ వారి యొక్క కార్యం, సంలగ్నత చూస్తే సేవా కార్యంలో నమ్మకంతో రాత్రి, పగలు ఎంత మంచిగా నిమగ్నమై ఉన్నారు అనేది అనుభవం అవుతుంది. సేవాధారులు ఒకే సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇప్పుడు ఆత్మలందరు సర్వ సుఖ, సాధనాలు పొందేవారు, విశ్వరాజ్యం యొక్క అధికారిగా అయ్యేవారు. ఈ సంలగ్నతలో నిమగ్నమై ఉంటున్నారా లేదా విఘ్నం సంలగ్నతను అవినాశిగా ఉండనివ్వటం లేదా? సంలగ్నత యొక్క అగ్ని అవినాశిగా ప్రజల్వితం అవుతుందా? ఇప్పుడిప్పుడే సంలగ్నత లేదా ఇప్పుడిప్పుడే విఘ్నాలు ఉంటున్నాయా?

విదేశం యొక్క వైజ్ఞానికులలో నిరంతరం తమ కార్యం యొక్క సంలగ్నత యొక్క విశేషత చూసారు. కనుక మీ సేవాధారులలో ఏదైతే గుణం ఉందో అది విశ్వయజమానిగా అయ్యే వారిలో ఉండే గుణం కదా! స్వయాన్ని పరిశీలన చేసుకోండి - రెండవ వైపు విదేశంలో పరమాత్మ జ్ఞానీ పిల్లలలో కూడా వర్తమాన సమయంలో ఒకే ధృడసంకల్పం యొక్క సంలగ్నత ఉంది - ఇప్పుడు త్వరత్వరగా బాబా సందేశం ఇవ్వాలనే ఉత్సాహ, ఉల్లాసాలు కూడా ఉన్నాయి. విదేశీయుల ద్వారా నిమిత్తమైన ఆత్మలు ఏ ఆత్మల యొక్క అనుభవం యొక్క ధ్వని ద్వారా భారతవాసీ కుంభకర్ణులు మేల్కొంటారో అలా నిమిత్తంగా అయిన ఆత్మలను బాబా ఎదురుగా ప్రత్యక్షం చేయాలి. అంటే సంబంధ, సంపర్కంలోకి తీసుకురావాలి. సమయం యొక్క సమీపత యొక్క సూచన విదేశం ద్వారా భారతదేశంలో వ్యాపించాలి. ఈ ఒకే సంలగ్నతలో ధృడసంకల్పం యొక్క కంకణంతో బంధించబడి ఉన్న పరమాత్మ జ్ఞానీ పిల్లలను చూసారు. వారికి కూడా రాత్రి పగలు రెండూ సమానం. ఈ సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు.

వర్తమాన సమయంలో సంలగ్నతలో చాలా మంది విఘ్నముక్త ఆత్మలు ఒకరికొకరు స్నేహం మరియు సహయోగం యొక్క దారంలో గ్రుచ్చబడిన మాల యొక్క మంచి మెరిసే మణులుగా కనిపిస్తున్నారు. క్రొత్తవారైనా లేదా పాతవారైనా ప్రతి ఆత్మలో ఒకే ఉత్సాహం ఉంది. ఈ శ్రేష్ట కార్యంలో మేము కూడా వ్రేలు ఇవ్వాలి అని. ఏదోకటి చేసి చూపించాలి అని. అయితే ఏమి చూసారు? సందేశం పొందిన ఆత్మలు, కోరికతో ఉన్న ఆత్మలు అంటే జిజ్ఞాస ఉన్న ఆత్మలు కొద్ది సమయంలో శాంతి మరియు శక్తి యొక్క బిందువు పొంది చాలా సంతోష పడుతున్నారు. నిమిత్తంగా అయిన ఆత్మలను పరమాత్మ ద్వారా పంపబడిన అలౌకిక ఫరిస్తాగా అనుభవం చేసుకుంటున్నారు, కొద్దిగా తీసుకున్న సేవకు కూడా బదులు ఇవ్వటంలో కూడా తమ సంతోషాన్ని అనుభవం చేసుకుంటున్నారు మరియు వెంటనే బదులు ఇస్తున్నారు. కొద్దిగా చేసిన సేవకు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు. వర్తమాన సమయం యొక్క పరమాత్మ జ్ఞానీలకు, నిమిత్తంగా అయిన శ్రేష్టాత్మలకు ఈ సేవ యొక్క చక్రంలో చక్రవర్తిగా అయ్యేటువంటి పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఈ పాత్రలో స్థాపన మరియు వినాశనం యొక్క రహస్యానికి చాలా సంబంధం ఉంది. ఈ కొద్ది సమయం యొక్క సేవ చేయటం మరియు చక్రవర్తిగా అయ్యి తమ దృష్టి ద్వారా, వాణీ ద్వారా, సంపర్కం ద్వారా లేదా సూక్ష్మ శుభభావన, శుభకామన యొక్క వృత్తి ద్వారా ఇలా అనేక రకాలుగా రాజధాని యొక్క తయారీలకు నిమిత్తమైనటువంటి సేవాధారి ఆత్మలకు, సేవకు ఫలంగా సేవాధారి అయ్యే కార్యంలో అందరి దృష్టిలో సర్వశ్రేష్ట ఆత్మగా నిమిత్తంగా అయిన ఆత్మలు జ్ఞానీ లేదా విజ్ఞానిగా ప్రసిద్ధం అవుతున్నారు. కనుక రహస్యాన్ని అర్ధం చేసుకున్నారా? భారతదేశంలో అయితే మీ భక్త ఆత్మలు లభిస్తారు. కానీ మూడు రకాలైన ఆత్మలు 1. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేటువంటి మరియు ప్రజలుగా అయ్యే ఆత్మలు 2.భక్త ఆత్మలు 3.మీ రాజధాని తయారుచేసే ఆత్మలు. సేవాధారులు సర్వ సుఖాల సాధనాలు మరియు సామాగ్రిని తయారు చేసేటందుకు నిమిత్తంగా అవుతారు, మీరు ప్రాప్తిని అనుభవిస్తారు. ఈ పంచతత్వాలు మరియు పంచతత్వాల ద్వారా తయారైన స్వచ్ఛమైన వస్తువులు అన్నీ మీ సేవకు నిమిత్తంగా అవుతాయి. ఇంత శ్రేష్టస్వమానం స్మృతిలో ఉంటుందా లేక ఇప్పటి వరకు కూడా స్మృతి మరియు విస్మృతి యొక్క ఆటలోనే నడుస్తున్నారా? స్మృతి స్వరూపం నుండి సమర్థీ స్వరూపంగా అవ్వండి. విదేశం యొక్క సమాచారం విన్నారు కదా? వర్తమాన చక్రవర్తి ఆత్మలకు చక్రం తిరగడానికి కూడా రహస్యం ఉంది. ఎక్కడెక్కడ పరమాత్మ జ్ఞానీ ఆత్మలు ఈశ్వరీయ సేవాస్థానం తెరవడానికి నిమిత్తంగా అవుతారో మరియు ఇక ముందు కూడా అవుతారో ఇప్పటి విదేశీ సేవాస్థానాలు భవిష్యత్తులో విహారస్థానాలుగా అవుతాయి. ఎలా అయితే భారతదేశంలో స్మృతిచిహ్న స్థానాలు మందిరాలు ఉన్నాయి కానీ అవి ద్వాపమయుగం తర్వాత ఉంటాయి. అందువలన విదేశీ ఆత్మలకు కూడా భవిష్య స్థాపనలో సంబంధం ఉంది. అర్ధమైందా? ఈరోజు విదేశం యొక్క సమాచారం వినిపించాను. తర్వాత భారతదేశం గురించి చెప్తాను. ఈ సమాచారాలు అన్నీ విన్న తర్వాత ఏమి చేయాలి? కేవలం వినటమేనా లేక కొంచెం చేయాలా? ఇలా సర్వ సాధనాలను పొందేటందుకు స్వయాన్ని సదా విశ్వం యొక్క యజమానిగా అయ్యే యోగ్యంగా చేసుకోండి. నిరంతర యోగిగా అవ్వటమే యోగ్య ఆత్మగా అవ్వటం. ఇలా స్వయాన్ని భావిస్తున్నారా? తీవ్రపురుషార్ధిగా అయ్యి స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోండి మరియు నిమిత్తంగా అయినటువంటి సేవాధారీ ఆత్మలకు కూడా కార్యంలో సంపన్నంగా అయ్యే ప్రేరణ ఇవ్వండి. అప్పుడే విశ్వపరివర్తన అవుతుంది.

సదా సంలగ్నత ద్వారా విఘ్నాలను వినాశనం చేసుకునే విఘ్నవినాశక ఆత్మలకు, సదా తమ దృష్టి మరియు వృత్తి ద్వారా కూడా విశ్వసేవలో తత్పరులై ఉండే ఆత్మలకు, సదా బాబా సమానంగా గుణాల యొక్క జ్ఞానం యొక్క శక్తుల యొక్క దానం చేసే మహాదాని ఆత్మలకు, ఆత్మిక దృష్టి ద్వారా వరదానం ఇచ్చే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.