22.06.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సితారల ప్రపంచం యొక్క రహస్యం.

విశ్వానికి లైట్, మైట్ ఇచ్చేటందుకు నిమిత్తమైన సర్వ మెరిసే చైతన్య సితారలతో జ్ఞానసూర్యుడు ఉచ్ఛరించిన మహావాక్యాలు -

ఈరోజు బాప్ దాదా సితారలందరిని మెరిసే రూపంలో చూస్తున్నారు. సితారలందరు మెరుస్తున్నారు కానీ మెరుపులో కూడా నెంబర్ ఉంది. సితారల ప్రపంచం అంటే మీ యొక్క ప్రపంచం చూసారా? సితారల ప్రపంచం గురించి పాట పాడతారు. కానీ అది ఏ సితారల ప్రపంచం యొక్క మహిమ, ఈ రహస్యాన్ని మీరందరు తెలుసుకుంటున్నారా? ప్రతి సితారకు వాటి,వాటి ప్రభావాన్ని చూపిస్తారు. సితారల ఆధారంగా జన్మపత్రం మరియు భవిష్యత్తు చెప్తారు. చైతన్య రూపంలో జ్ఞానసితారలైన మీరు మొత్తం కల్పం యొక్క ప్రతి ఆత్మ యొక్క జన్మపత్రానికి ఆధారమూర్తులు. జ్ఞానసితారల శ్రేష్టజన్మ మరియు వర్తమాన జన్మ ఆధారంగా ప్రాలబ్దం యొక్క జన్మ అనగా రాజ్యపదవి యొక్క జన్మ మరియు పూజ్యస్థితి ఆధారంగా పూజారి జన్మ ఇలా 84 జన్మల కథ ఆధారంగా ఇతర ధర్మాత్మల జన్మపత్రం ఆధారపడి ఉంటుంది. మీ జన్మపత్రంలో వారి జన్మపత్రం నిర్ణయించబడి ఉంది. హీరో, హీరోయిన్ పాత్రధారులైన మీ ఆధారంగా మొత్తం డ్రామా నిర్ణయించబడి ఉంది.

మీ యొక్క పూజారి స్థితి ప్రారంభం అవ్వటం అంటే ఇతర ధర్మాత్మల ధర్మాలు స్థాపన అవ్వటం. పూర్వీకులైన మీ ద్వారానే చిన్న చిన్న బంధువర్గాల వారు వస్తారు. అందువలనే స్మృతిచిహ్నంలో కూడా హద్దు యొక్క సితారల ఆధారంగా భవిష్యదర్శి తయారు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు త్రికాలదర్శిగా అవుతున్నారు, చైతన్య సితారలైన మీరు త్రికాలదర్శులు. ప్రతి ఆత్మ యొక్క భవిష్యత్తుని తయారు చేయడానికి నిమిత్తంగా అయ్యారు. ముక్తి అయినా లేదా జీవన్ముక్తి అయినా కానీ జీవన్ముక్తి యొక్క ద్వారం తెరిచేటందుకు జ్ఞానసూర్యుడైన బాబాతో పాటు జ్ఞానసితారలైన మీరే నిమిత్తంగా అవుతారు. అందువలనే మీ జడ స్మృతిచిహ్నాలైన సితారలు కూడా భవిష్యదర్శిగా అయ్యాయి. అంటే భవిష్యత్తు చూపించేటందుకు నిమిత్తంగా అయ్యాయి. ఇప్పుడు జడ స్మృతిచిహ్నాలైన సితారలను చూస్తూ మీ సితార యొక్క స్వరూపం స్మృతిలోకి వస్తుందా? సితారలలో కూడా వేర్వేరు వేగాన్ని చూపిస్తారు. చక్రం తిరిగే వేగం కొన్నింటికి చాలా వేగంగా చూపిస్తారు మరియు కొన్నింటికి తక్కువ వేగం చూపిస్తారు. కొన్ని సితారలను సంఘటిత రూపంలో చూపిస్తారు, కొన్ని సితారలను ఒకదానికొకటి కొంచెం దూరంగా చూపిస్తారు. కొన్ని మాటిమాటికి స్థానం మారుతూ ఉంటాయి మరియు కొన్ని తోకచుక్కలు కూడా ఉంటాయి. ఇవన్నీ చైతన్య సితారల యొక్క స్థితి, పురుషార్ధం యొక్క వేగం, సంఘటిత రూపంలో అలజడి మరియు అచంచల స్థితి యొక్క రూపం, సేవాధారి లేదా సర్వుల స్నేహిత మరియు సహయోగి స్వరూపం, శ్రేష్ట గుణాలు మరియు కర్తవ్యం యొక్క స్వరూపానికి స్మృతిచిహ్నంగా చూపించారు.

సితారలకు చంద్రునితో సంబంధం ఉన్నట్లుగా చూపించారు. కొన్ని చంద్రునికి సమీపంగా ఉంటాయి మరియు కొన్ని దూరంగా ఉంటాయి. జ్ఞానసూర్యుని పిల్లలుగా అయినప్పటికీ చంద్రునితో చిత్రం ఎందుకు తయారయ్యింది? దీనికి కూడా రహస్యం ఉంది. చంద్రుడు అంటే పెద్ద తల్లి అని బ్రహ్మని అంటారు. జ్ఞానసూర్యుని నుండి సర్వశక్తుల యొక్క జ్ఞానమనే లైట్ తప్పకుండా తీసుకుంటారు, కానీ డ్రామాలో పాత్ర అభినయించడంలో సాకార రూపంలో ఆదిపిత బ్రహ్మ మరియు బ్రాహ్మణులే కలిసి ఉంటారు. జ్ఞానసూర్యుడు ఈ చక్రానికి అతీతంగా ఉంటారు. అందువలనే అనేక జన్మలలో రకరకాలైన నామ, రూపాలతో చంద్రుడు మరియు జ్ఞానసితారలే కలిసి ఉంటారు. అందువలనే స్మృతిచిహ్న చిత్రంలో కూడా చంద్రునికి మరియు సితారలకు సంబంధాన్ని చూపించారు. నేను ఏ సితారను? అని స్వయాన్ని అడగండి. సంఘటిత రూపంలో సర్వులకు స్నేహిగా మరియు సదా సహయోగిగా అయ్యే స్థితి ఉంటుందా? లేదా సంఘటనలో స్వభావం, సంస్కారాలు, స్థితి మారిపోతుందా అంటే స్థానం మార్చుకుంటున్నారా? సదా మెరుస్తూ విశ్వానికి వెలుగునిచ్చే సితారలేనా? లేదా స్వయానికి స్వయం కూడా జ్ఞానం యొక్క లైట్ మరియు స్మృతి యొక్క శక్తిని ఇచ్చుకోలేకపోతున్నారా? ఇతరాత్మల లైట్ మరియు మైట్ ఆధారంగా నిలబడి ఉన్నారా? సదా స్వయాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులు చేసుకుంటున్నారా? ఇలా స్వయాన్ని పరిశీలించుకోండి. మూడు రకాలైన సితారల గురించి చెప్పాను కదా! 1. సదా అదృష్ట సితార, 2. సదా సఫలతా సితార. 3. ఆశా సితార. ఈ మూడింటిలో నేను ఎవరు? అని స్వయాన్ని అడగండి. నేను ఎవరు? అనేది స్వయానికి స్వయం తెలుసుకుంటున్నారు కదా! చిక్కు ప్రశ్న పరిష్కారం అయిపోయింది కదా? స్వయానికి స్వయమే నిర్ణయించుకోండి. మంచిది, ఈరోజు మురళి చెప్పడానికి రాలేదు. కలుసుకునేటందుకు వచ్చాను. ఈ కలయికయే కల్పకల్పం నిర్ణయించబడి ఉంది. ఈ కలయిక యొక్క స్మృతిచిహ్నమే ప్రతి స్థానంలో అనేక రూపాలలో మేళా జరుపుతున్నారు. మంచిది.

సదా బాబాతో కలయిక జరుపుకునేవారికి, సంకల్పం, మాట మరియు కర్మలో సఫలతా సితారలకు, సదా బాబాని తోడుగా చేసుకునే సమీప సితారలకు, ప్రతి సంకల్పం ద్వారా విశ్వానికి ప్రకాశాన్ని మరియు శక్తిని ఇచ్చేవారికి, సదా మెరిసే సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.