25.06.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పవిత్రత యొక్క సంపూర్ణస్థితి.

సదా సత్యమైన హృదయం కలిగినవారు, సత్యత ఆధారంగా సర్వులకు ఆధారమూర్తిగా అయ్యేవారు, ప్రతి అనుభవం మరియు ప్రాప్తి ఆధారంగా తమ జీవితాన్ని శ్రేష్ట మతం ఆధారంగా నడిపించుకునే పురుషార్థీ పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా విశేషంగా పిల్లలందరి రెండు విషయాలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు యోగ్యతను అనుసరించి మరియు శక్తిననుసరించి నిజాయితిగా మరియు పవిత్రంగా ఎంత వరకు అయ్యారు అని. ప్రతి పురుషార్ధి ఆత్మ తండ్రి యొక్క సంబంధంలో నిజాయితి అంటే బాబాతో నమ్మకదారిగా, సత్యమైన మనస్సు కలిగిన వారిగా అయ్యే లక్ష్యం పెట్టుకుని నడుస్తున్నారు. కానీ నిజాయితీగా అవ్వటంలో కూడా నెంబర్ వారీగా ఉంటున్నారు.

1. ఎంత నిజాయితిగా ఉంటారో అంత పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా అయ్యేటందుకు ముఖ్య విషయం - బాబాతో సత్యంగా ఉండాలి. కేవలం బ్రహ్మచర్యాన్ని ధారణ చేయటం ఇది పవిత్రత యొక్క ఉన్నత స్థితి కాదు. కానీ పవిత్రత అంటే సత్యత. ఇలా సత్యమైన హృదయం ఉన్నవారు మనోభిరాముని హృదయసింహాసనాధికారులు మరియు హృదయసింహాసనాధికారి పిల్లలే రాజ్య సింహాసనాధికారిగా అవుతారు.

2. నిజాయితి అంటే నమ్మకదారి అని ఎవరిని అంటారు అంటే బాబా ద్వారా లభించిన ఖజానాలను బాబా యొక్క సలహా లేకుండా ఏ కార్యంలో ఉపయోగించరు. ఒకవేళ మన్మతం లేదా పరమతం ప్రమాణంగా సమయాన్ని మాటను, కర్మను, శ్వాసను లేదా సంకల్పాన్ని పరమతం లేదా సాంగత్యదోషంలోకి వచ్చి వ్యర్ధంగా పోగొట్టుకుంటున్నారు, స్వ చింతనకు బదులు పరచింతన చేస్తున్నారు, స్వమానానికి బదులు ఏదోక రకమైన అభిమానంలోకి వస్తున్నారు, ఈరకంగా శ్రీమతానికి విరుద్ధంగా అంటే శ్రీమతానికి బదులు మన్మతం ఆధారంగా నడుస్తున్నారు అంటే వారిని నిజాయితి ఆత్మలు లేదా నమ్మకదారి అని అనురు. ఆ ఖజానాలన్నీ బాప్ దాదా విశ్వకళ్యాణ సేవార్థం ఇచ్చారు. కనుక ఏ కార్యార్థం ఇచ్చారో ఆ కార్యానికి బదులు ఒకవేళ ఇతర కార్యాలలో ఉపయోగిస్తున్నారు అంటే ఇది తాకట్టు వస్తువులో నాది అనేది కలపటం. అందువలన అన్నింటికంటే ఉన్నతోన్నతమైన పవిత్ర స్థితి - నిజాయితిగా అవ్వటం. ప్రతి ఒక్కరు మేము ఎంత వరకు నిజాయితిగా అయ్యాము? అని స్వయాన్ని పరిశీలించుకోండి.

3. నిజాయితి యొక్క మూడవ లక్షణం - సదా సర్వుల పట్ల శుభభావన లేదా సదా శ్రేష్ట కామన ఉంటుందా?

4. నిజాయితి అంటే సదా సంకల్పం, మాట మరియ కర్మ ద్వారా సదా నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉంటారు.

5. నిజాయితి అంటే ప్రతి అడుగులో సమర్ధ స్థితి యొక్క అనుభవం ఉండాలి. సదా ప్రతి సంకల్పంలో బాబా యొక్క తోడు మరియు సహయోగం యొక్క చేయి అనుభవం అవ్వాలి.

6. నిజాయితి అంటే ప్రతి కర్మలో ఎక్కేకళ అనుభవం అవ్వాలి.

7. నిజాయితి అంటే బాబా ఎవరు, ఎలా ఉన్నారో అలా పిల్లల ముందు ప్రత్యక్షం అయ్యారో పిల్లలు కూడా ఎవరు, ఏవిధంగా ఉన్నారో అలాగే బాబా ముందు స్వయాన్ని కూడా ప్రత్యక్షం చేసుకోండి. బాబాకి అన్నీ తెలుసు అని అనుకోకండి, కానీ బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోవటం అన్నింటికంటే ఉన్నతోన్నతమైన సహజంగా ఎక్కేకళకు సాధనం. బుద్ధిపై ఉన్న అనేక రకాలైన బరువులను సమాప్తి చేసుకునే సరళయుక్తి లేదా స్వయాన్ని స్పష్టం చేసుకోవటం అంటే పురుషార్ధ మార్గం స్పష్టంగా ఉండటం. స్వయాన్ని స్పష్టతతో శ్రేష్టంగా తయారుచేసుకోవాలి. కానీ ఏమి చేస్తున్నారు? కొన్ని చెప్తున్నారు, కొన్ని దాచేస్తున్నారు మరియు ఆ చెప్పటం కూడా ఏదోక సహాయం యొక్క ప్రాప్తి యొక్క స్వార్ధంతో చెప్తున్నారు. చతురతతో తమ కేసుని అలంకరించి మన్మతం లేదా పరమతంతో ప్లాన్ మంచిగా తయారుచేసి బాబా ముందు లేదా నిమిత్త ఆత్మల ముందు ఎదుర్కుంటున్నారు. బాబాని భోళానాథునిగా భావించి మరియు నిమిత్త ఆత్మలను కూడా భోళాగా భావించి చతురతతో స్వయాన్ని సత్యంగా సిద్ది చేయటం ద్వారా ఫలితం ఏముంటుంది? బాప్ దాదా మరియు నిమిత్త ఆత్మలు అన్నీ తెలిసినప్పటికీ సంతోషపరిచేటందుకు అల్పకాలికంగా అలాగే అనే పాఠం చదువుకుంటారు. ఎందుకంటే ప్రతి ఆత్మకు సహనశక్తి, ఎదుర్కునేశక్తి ఎంత వరకు ఉంటుంది అనేది వారికి తెలుసు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా కోపంలోకి రారు. వారికి ఇంకా ముందుకి వెళ్ళే యుక్తి చెప్తారు. రాజీ కూడా చేస్తారు కానీ రహస్యంతో రాజీ చేయటం, మనస్సుతో రాజీ చేయటంలో తేడా ఉంటుంది. చతురంగా అవ్వాలనుకుంటారు కానీ భోళాగా అయిపోతున్నారు. కొద్దిలో రాజీ అయిపోతున్నారు, ఓటమిని విజయంగా భావిస్తున్నారు. అది జన్మజన్మల ఓటమి కానీ అల్పకాలిక ప్రాప్తిలో రాజీ అయిపోయి స్వయాన్ని గొప్పవారిగా మరియు తెలివైనవారిగా బావించి విజయీగా భావించి కూర్చుంటున్నారు. బాబాకి అటువంటి పిల్లలపై దయ కూడా వస్తుంది. తెలివైనవారము అనే పరదాలో ఉంటూ స్వయానికి సదాకాలికంగా అకళ్యాణానికి నిమిత్తం అవుతున్నారు. అయినప్పటికీ బాప్ దాదా ఏమంటారు? శ్రేష్ట పురుషార్థం యొక్క పాత్ర లేదు అనుకుంటారు.

8. నిజాయితి అంటే ఏ విషయాల ఆధారంగా పునాది ఉండకూడదు. ప్రతి విషయం యొక్క అనుభవం ఆధారంగా, ప్రాప్తి ఆధారంగా పునాది ఉండాలి. విషయం మారిపోతే పునాది మారిపోతుంది. నిశ్చయం నుండి సంశయంలోకి వచ్చేస్తున్నారు మరియు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలోకి వచ్చేస్తున్నారు. వీరిని ప్రాప్తి ఆధారంగా అనుభవీ అయినవారు అని అనరు. ఇలా బలహీన పునాది చిన్న విషయంలో అలజడి సృష్టిస్తుంది. ఈ రోజుల్లో ఒక రమణీయకమైన విషయాన్ని బాబా ముందు పెడుతున్నారు. - 1977 వరకు పవిత్రంగా ఉంటాము, ఇప్పుడు ఎక్కువ సమయం పవిత్రంగా ఉండటం కష్టం అంటున్నారు. అందువలన బాబాపై విషయం పెట్టేసి స్వయాన్ని నిర్దోషిగా చేసుకుని భగవంతుడిని దోషిగా చేస్తున్నారు. కానీ పవిత్రత అనేది బ్రాహ్మణాత్మల నిజ సంస్కారం. హద్దు యొక్క సంస్కారం కాదు. హద్దు యొక్క పవిత్రత అంటే ఒక జన్మ వరకు పవిత్రత అనేది హద్దు సన్యాసం. బేహద్ సన్యాసులు జన్మ జన్మలకు అపవిత్రతను సన్యాసం చేయాలి. బాప్ దాదా పవిత్రత కొరకు ఎప్పుడైనా సమయం యొక్క లెక్క ఇచ్చారా ఏమిటి? బాబా నుండి సదాకాలికంగా పవిత్రత, సుఖ, శాంతి యొక్క వారసత్వం తీసుకోండి అని సూక్తిలో కూడా ఇదే వ్రాస్తారు కదా! సమయం ఆధారంగా పవిత్రంగా ఉండటం దీనిని ఏ పవిత్ర స్థితి అని అంటారు? దీని ద్వారా స్వయం యొక్క అనుభవం లేదా ప్రాప్తి ఆధారంగా పునాది లేదు అని ఋజువు అవుతుంది. ఇది నిజాయితి ఆత్మల లక్షణం కాదు. నిజాయితి అంటే సదా పవిత్రులు. కనుక నిజాయితి అని దేనిని అంటారో అర్థమైందా? మంచిది.

ఇలా సదా సత్యమైన హృదయంతో ఉండేవారికి, సత్యత ఆధారంగా సర్వులకు ఆధారమూర్తిగా అయ్యేవారికి, ప్రతి అడుగు మరియు ప్రాప్తి ఆధారంగా తమ జీవితం యొక్క ప్రతి అడుగుని నడిపించుకునేవారికి, సదా శ్రేష్టమతం మరియు శ్రేష్టగతిపై నడిచేవారికి ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.