02.01.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారల యొక్క మెరుపు.

పిల్లలను సర్వ శ్రేష్ఠ అదృష్ట వంతులుగా, వర్తమానం మరియు భవిష్యత్తులో సింహాసనాధికారులుగా, పదమాపతులుగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా తన ప్రియమైన (లవ్లీ) మరియు అదృష్టవంతులైన (లక్కీ) పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో అదృష్టం యొక్క సితార మెరుస్తూ చూస్తున్నారు. సాకార సృష్టిలోని ఆత్మలు ఆకాశం వైపు చూస్తారు. కానీ ఆకాశానికి కూడా అతీతంగా ఉండే బాబా సాకారీ సృష్టిలో భూమి యొక్క సితారలను చూడటానికి వచ్చారు. ఎలా అయితే చంద్రునితో పాటు సితారల యొక్క మెరుపు చాలా సుందరంగా అనిపిస్తుందో అలాగే బ్రహ్మ చంద్రుడు, పిల్లలు అంటే నక్షత్రాలతో అలంకరించబడతారు. తల్లి స్నేహం, పిల్లల స్నేహం కంటే ఎక్కువ ఉంటుందా లేక పిల్లల స్నేహం తల్లి స్నేహం కంటే ఎక్కువ ఉంటుందా? అంటే బ్రహ్మకి ఎక్కువా లేక బ్రాహ్మణులకి ఎక్కువా? ఎవరికి ఎక్కువ? పిల్లలు ఆటలలో పడిపోతే తల్లిని మర్చిపోతారు. మరలా తల్లి యొక్క మమత పిల్లలకు జ్ఞాపకం చేయిస్తుంది. అలాగే స్నేహం లేకపోతే పిల్లలకి ఏమీ ప్రాప్తి ఉండదు.

ఈరోజు అమృతవేళ విశేషంగా ఈ సమయంలో మధువనంలో సంఘటితంగా వచ్చిన ఆత్మలు బాబా యొక్క స్మృతితో పాటు బ్రహ్మ తల్లి యొక్క స్మృతిలో ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు వతనంలో కూడా సూర్యుడైన శివబాబా గుప్తంగా ఉన్నారు, కానీ చంద్రుడు అంటే బ్రహ్మ పెద్ద తల్లి తన బ్రాహ్మణ పిల్లలను లేదా సితారలను కలుసుకోవటంలో లవలీనం అయ్యి ఉన్నారు. ఈరోజు వతనంలో ఏమి దృశ్యం ఉంది? తల్లి, తండ్రి మరియు పిల్లల యొక్క సంభాషణ సదా నడుస్తుంది. కానీ ఈ రోజు తల్లి తండ్రికి ఏమి సంభాషణ జరిగిందో తెలుసా?

ఈరోజు అమృతవేళ బ్రహ్మ విశేషంగా పిల్లల యొక్క స్నేహంలో ఉన్నారు. ఎందుకంటే మధువనం సాకారి బ్రహ్మ యొక్క కర్మ భూమి, సేవా భూమి లేదా తల్లి, తండ్రి ఇద్దరు సాకారంలో పిల్లలను కలుసుకునే భూమి. ఇలా స్వయం యొక్క తనువు మరియు మనస్సు ద్వారా అలంకరింపబడిన ఈ భూమిపై ఉన్న మెరుపును చూసి ఈ రోజు విశేషంగా బ్రహ్మాబాబాకు లేదా తల్లికి సాకార రూపంలో ఉన్న సాకారి సృష్టి జ్ఞాపకం వచ్చింది. బ్రహ్మ అన్నారు - చంద్రుడు , సితారలతో సమాన రూపంలో కలుసుకునే సమయం ఇంకా ఎంత ఉంది? అని. అంటే వ్యక్తం మరియు అవ్యక్త రూపం యొక్క కలయిక ఎంత వరకు అని. సమాధానం ఏమి లభించి ఉంటుంది?

బాబా చెప్పారు - అందరు తయారైపోయారు అని. తల్లి చెప్పేంత వరకు అని. అందువలన బ్రహ్మాబాబాను పరిక్రమణకు పంపించారు. నలువైపుల చక్రం తిరుగుతూ ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క ఆత్మీయతని చూసారు. అలా చక్రం తిరిగిన తర్వాత మరలా వతనంలో ఆత్మిక సంభాషణలో బ్రహ్మ అన్నారు - నా పిల్లలు లక్ష్యంలో నెంబర్ వన్, అందరు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సమయం వస్తే అందరూ తయారైపోతారు అని. అప్పుడు బాబా అన్నారు - "రాజధాని తయారైపోయిందా?” అని. బ్రహ్మ ఈరోజు బ్రాహ్మణ పిల్లల వైపు తీసుకువెళ్తున్నారు. 16,108 మాల తయారైపోయింది అని బ్రహ్మ చెప్పారు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత అని చెపున్నారు? 50 వేల మందిలో 16, 108 మంది రారా? మణులు తయారే, కానీ నెంబర్ వారీగా గ్రుచ్చటం యొక్క చివరి ఘడియ మిగిలి ఉంది. మణులు నిర్ణయించబడిపోయారు కానీ స్థానం నిర్ణయించబడలేదు. స్థానంలో చివరి వారు కూడా ముందుకు వచ్చేస్తారు. ఇలా ఈరోజు బ్రహ్మాబాబా 16,108 మణులను అంటే సహయోగీ ఆత్మల అదృష్టం యొక్క రేఖను నిర్ణయించారు. అందువలననే భాగ్యవిధాత లేదా భాగ్యాన్ని పంచేవాడు అని బ్రహ్మనే అంటారు. మరియు స్మృతిచిహ్న రూపంలో కూడా జన్మదినం, నామకరణం, జన్మపత్రం కూడా బ్రాహ్మణులే తయారుచేస్తారు. ఈరోజు బ్రహ్మాబాబా 16,108 మణుల యొక్క నిశ్చితమైన అదృష్టాన్ని వినిపించారు. మీరందరు కూడా దానిలో ఉన్నారు కదా!

ఈ రోజు విశేషంగా బ్రహ్మ ద్వారా దేశ, విదేశీ పిల్లల యొక్క మహిమ యొక్క గుణగానం జరుగుతుంది. ఎలా అయితే ఆదిలో వచ్చిన పిల్లల భాగ్యానికి మహిమ ఎలా ఉందో అలాగే అవ్యక్తరూపంలో పాలన తీసుకుంటున్న క్రొత్త పిల్లలకు కూడా అంత మహిమ ఉంటుంది. ఆదిలో ఎవరి జీవితం యొక్క ప్రత్యక్ష ప్రభావం లేదు, కేవలం ఒక బాబా యొక్క స్నేహమే ఉదాహరణ. భవిష్యత్తులో ఏమి అవుతుంది, ఇది కూడా స్పష్టంగా తెలియదు, గుప్తంగా ఉండేది. కానీ ఆత్మలు దీపానికి పూర్తి ఆహుతి అయిపోయారు. ఇప్పుడు క్రొత్త పిల్లల ముందు అనేక జీవితాల యొక్క ఉదాహరణ ఉంది. ఆది, మధ్య, అంత్యాలు స్పష్టంగా ఉన్నాయి. 84 జన్మల జన్మపత్రం స్పష్టంగా ఉంది. పురుషార్థం మరియు ప్రాలబ్దం రెండు స్పష్టంగా ఉన్నాయి కానీ బాబా అవ్యక్తంగా ఉన్నారు. బాబా యొక్క పాలన అవ్యక్తరూపంలో ఉన్నా కానీ వ్యక్తరూపం యొక్క అనుభవం చేయిస్తుంది. అవ్యక్తాన్ని వ్యక్తంగా అనుభవం చేసుకోవటం, సమీపంగా, తోడుగా ఉన్నట్లు అనుభవం చేసుకోవటం ఇదే క్రొత్త పిల్లల యొక్క అద్భుతం. ఎలా అయితే ఆదిలోని పిల్లలు అద్భుతాలు చేసారో అలాగే చివర వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోయే పిల్లలది కూడా అద్భుతమే. ఇలా అద్భుతం యొక్క గుణగానం చేస్తున్నారు. ఈ రోజు యొక్క ఆత్మిక సంభాషణ విన్నారా?

నిందల మాలలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నిందల మాలలను బ్రహ్మాబాబా స్నేహ రూపంగా తయారుచేసుకుంటున్నారు. ఈ రోజు విశేషంగా బ్రహ్మాబాబా పిల్లల స్నేహంలో ఇమిడి ఉన్నారు అని చెప్పాను కదా! స్నేహ మూర్తిగా ఉంటూ కూడా డ్రామా అనే సీట్ పై సెట్ అయ్యి ఉన్నారు. అందువలనే స్నేహాన్ని ఇముడ్చుకుంటున్నారు. మీరు కూడా సాగరుని పిల్లలు అంటే ఇముడ్చుకునేవారే కదా! చూపించగలుగుతున్నారు కూడా మరియు లీనం చేసుకోగలుగుతున్నారు కూడా! గుప్తంగా ఉంచటం మరియు ప్రత్యక్షం చేయటం రెండు మంచిగా తెలుసు కదా! ఎందుకంటే మీరు హీరో పాత్ర ధారులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధారణ చేయగలుగుతున్నారు అంటే పాత్రను అభినయించగలుగుతున్నారు. మంచిది.
ఈవిధంగా సదా స్నేహి, సర్వ శక్తులతో సంపన్నులు, సదా అతీతంగా మరియు అతి ప్రియంగా ఉండేవారికి, సదా తమ మెరుస్తున్న అదృష్ట సితారను చూసుకునే సర్వ శ్రేష్ఠ అదృష్టవంతులకు, వర్తమానం మరియు భవిష్య సింహాసనాధికారులకు, పదమాపతులకు, సెకనులో స్వయాన్ని, సర్వులను పరివర్తన చేసే విశ్వకళ్యాణకారి పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.