24.01.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిరంతర సేవాధారి.

సదా మహాదాని మరియు వరదాని, నిరంతర యోగి లేదా నిరంతర సేవాధారిగా తయారు చేసే కళ్యాణకారి సద్గురువు శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ యొక్క మస్తకం మధ్యలో మెరిసే సితార అని అనండి లేదా వజ్రం అనండి, అది చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి మెరుపు అతీతం మరియు అతిప్రియం. మెరిసే ఈ సితారల ద్వారా ప్రతి ఆత్మ యొక్క అదృష్ట రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తప్పిపోయిన పిల్లలు తమ భాగ్యాన్ని తయారు చేసుకునేటందుకు ఎంత గుప్తంగా మరియు ప్రత్యక్షంగా ఎటువంటి పురుషార్ధం చేస్తున్నారో అని బాప్ దాదాకి గర్వంగా ఉంది. పిల్లల యొక్క నషా మరియు తీవ్ర పురుషార్థాన్ని చూసి బాబా కూడా పిల్లలకు బలిహారం అయిపోతున్నారు అంటే పిల్లల కంఠహారంగా అయిపోతున్నారు. హారం సదా కంఠానికే ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా పిల్లల ముఖంలో, నయనాలలో, బుద్ధిలో బాబాయే ఇమిడి ఉన్నారు అంటే బాబాని తమ కంఠహారంగా చేసేసుకున్నారు. ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క పాట పాడుతున్నారు. ఈరోజు ఏ పాట పాడారు? పిల్లల మహిమ యొక్క పాట. ప్రతి బిడ్డ బాబాని ప్రత్యక్షం చేయాలనే ఉల్లాసంలో ఉన్నట్లుగా బాబా చూశారు. పిల్లలు లేకుండా బాబా కూడా ప్రత్యక్షం కాలేరు. అంటే బాబాని కూడా ప్రత్యక్షం చేసేవారంటే ఎంత శ్రేష్టమైనవారు అయ్యారు? ఇంత నషా లేదా సేవా స్మృతి సదా ఉండాలి. ఎలా అయితే బాబా అవినాశి, ఆత్మ అవినాశి, సంగమయుగం యొక్క సర్వ ప్రాప్తులు అవినాశియో అదేవిధంగా స్మృతి లేదా నషా కూడా అవినాశిగా ఉందా? తేడా ఉండకూడదు. తేడా రావటం అంటే మంత్రాన్ని మర్చిపోవటం. మంత్రం జ్ఞాపకం ఉంటే నషాలో తేడా రాదు.

ఈరోజు బాప్ దాదా కలుసుకోవడానికి వచ్చారు, చెప్పటం అయితే చాలా చెప్పారు. కానీ ఈరోజు చెప్పిన దాని యొక్క స్వరూపాన్ని చూడడానికి వచ్చారు. అయితే స్వరూపంలో ఏమి చూస్తున్నారు? సేవ చాలా బాగా చేశారు, అనేక అజ్ఞాని ఆత్మలకు స్మృతి అనగా జాగృతినిచ్చారు. ఢిల్లీ యొక్క భూమి సర్వ బ్రాహ్మణాత్మలకు అలజడిలోకి తీసుకువచ్చింది. వీరు ఎవరు? వీరి కర్తవ్యం ఏమిటి? అని అందరికీ ప్రశ్న వచ్చింది. ఎలాగైతే నిద్రపోయేవారిని మేల్కొల్పితే కళ్ళు తెరిచినా కానీ కొద్దిగా నిద్ర యొక్క నషా ఉంటుంది కనుక ఎవరు? ఏమిటి? అని అడుగుతారు. అదేవిధంగా ఢిల్లీలోని అజ్ఞాని ఆత్మలకు కూడా వీరు ఎవరు? ఏమిటి? అనే ప్రశ్న తప్పక వచ్చింది. వినటం మరియు చూడటంలో తేడాను అనుభవం చేసుకున్నారు. అందరు బ్రాహ్మణులను చూసి అద్భుతం అని ఇంత వరకు అనుభవం చేసుకున్నారు. సాధారణ కన్యలు, మాతలు గుప్తంగా ఇంత సేనను తయారుచేశారా! అని. ఇలా ఎప్పుడు అనుకోలేదు, అర్థం చేసుకోలేదు అని అనుభవం చేసుకున్నారు. అందరి దివ్యత యొక్క ముఖాలు కర్తవ్యం ద్వారా బాప్ దాదా యొక్క మూర్తిని ప్రజల ముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు వారిలో కేవలం అలజడిని తీసుకువచ్చారు. ఎలా అయితే మొదట భూమిని దున్నుతారు కదా, దున్నిన తర్వాత విత్తనాలు వేస్తారు. అదేవిధంగా మీ భవిష్య రాజధానిలో లేదా మీ ఆది భూమిలో అలజడి తీసుకువచ్చారు. అంటే భూమిని దున్నారు. వీరిలో ఏదో బలం ఉంది, శక్తి ఉంది, సాధారణ వ్యక్తులు కాదు అనే అలజడితో పాటు ఈ బీజాన్ని వేశారు. ఎదురుగా చూడకపోయినా కానీ వీరు ఎవరు, ఏమిటి అని నలువైపుల సందడి చేశారు. గవర్నమెంట్ వారి చెవుల వరకు కూడా ఈ ధ్వని చేరింది. ఇప్పుడు ఈ బీజాన్ని వాణి ద్వారా, స్మృతి శక్తి ద్వారా ఫలీభూతం చేయాలి. ఇప్పటి వరకు చేసింది బాగా చేశారు.

బాప్ దాదా విదేశాల నుండి వచ్చిన పిల్లలకు, భారతదేశం నుండి వచ్చిన పిల్లలకు, ఎవరైతే సేవలో తమ వ్రేలునిచ్చారో అంటే తమ రాజ్యం యొక్క పునాదిని వేసుకున్నారో వారిని చూసి హర్షిస్తున్నారు. ఈ కాన్ఫెరెన్స్ బ్రాహ్మణులను తమ తమ రాజధానికి అధికారులుగా తయారుచేసే శంకుస్థాపనా మహోత్సవం. అందువలనే విదేశాల సేవాకేంద్రం యొక్క ఆత్మలు లేదా భారతదేశం యొక్క సేవాకేంద్రాలలో ఏ జోన్ వారు మిగలలేదు. ఇక్కడ చేసిన గుప్త సేవ కొద్ది సమయంలో ప్రత్యక్ష రూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు గుప్త వేషంలో శంకుస్థాపన చేశారు అంటే బీజం వేశారు కానీ సమయానుసారంగా ఈ బీజమే ఫలం రూపంలో మీరందరు చూస్తారు. ఈ ప్రాపంచిక ప్రజలే మిమ్మల్ని ఆహ్వానిస్తారు. (అందరి దగ్గు యొక్క ధ్వని వినిపిస్తుంది) బాగా శ్రమించారా ఏమిటి? ప్రకృతి యొక్క ప్రభావం కూడా ఎక్కువైపోయింది, దీనికి కూడా ఫలం లభిస్తుంది. విదేశీ ఆత్మలు ఎటువంటి వాతావరణమో ఆవిధంగా స్వయాన్ని నడిపించుకోగలిగే అనుభవం చేసుకోవటం కూడా తప్పనిసరి. ఈ అనుభవం కూడా ఉండాలి. ఈ సేవలో చిన్న, పెద్ద అందరికీ గొప్పతనం ఇచ్చారు. శ్రమ కూడా మంచిగా చేశారు, మొదట పునాదిలో ప్రశ్న ఉదయించింది, ఇప్పుడు రెండవసారి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ రోజు బాప్ దాదా ఈ ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఎలా అయితే ఇక ముందు కొరకు నిరంతర యోగి భవ! అనే వరదానం బాబా ద్వారా లభించిందో అలాగే నిరంతర సేవాధారి భవ! నిద్రపోతున్నా కానీ సేవ చేయాలి. నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తే మీ ముఖం నుండి శాంతి, ఆనందం యొక్క తరంగాలను అనుభవం చేసుకోవాలి. అందువలనే అతి మధురమైన నిద్ర అని అంటారు. నిద్రలో కూడా తేడా ఉంటుంది. ప్రతి సంకల్పం, ప్రతి కర్మలో సదా సేవ నిండి ఉండాలి, అటువంటి వారినే నిరంతర సేవాధారి అని అంటారు. బాబా మరియు సేవ. బాబా ఎలాగైతే అతిప్రియంగా అనిపిస్తారో, బాబా లేకుండా జీవితం లేదు, అదేవిధంగా సేవ లేకుండా జీవితం లేదు. ఇటువంటి నిరంతర యోగి మరియు నిరంతర సేవాధారులు సదా విఘ్నవినాశకులుగా ఉంటారు. బాబా స్మృతి మరియు సేవ అనే డబుల్ తాళం పడిపోతుంది. అందువలన మాయ రాలేదు. కనుక డబుల్ తాళం వేసి ఉందా అని సదా పరిశీలించుకోండి. ఒకే తాళం వేస్తే మాయ రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన బాబా స్మృతి మరియు సేవలో తత్పరమై ఉన్నానా? అని మాటిమాటికీ ధ్యాస పెట్టుకోండి. సదా సర్వ కర్మేంద్రియాల ద్వారా బాబా స్మృతిని ఇప్పించే సేవ చేస్తున్నానా? అని గుర్తు ఉంచుకోండి. ప్రతి సంకల్పం ద్వారా విశ్వకళ్యాణం అంటే లైట్‌హౌస్ యొక్క కర్తవ్యం చేస్తున్నానా? శక్తిశాలి వృత్తి ద్వారా ప్రతి సెకను నలువైపుల శక్తిశాలి తరంగాలను వ్యాపిస్తూ ఉన్నానా అంటే వాయుమండలాన్ని పరివర్తన చేస్తున్నానా? అని పరిశీలించుకోండి. ప్రతి కర్మ ద్వారా ప్రతి ఆత్మకి కర్మయోగి భవ! అనే వరదానాన్ని ఇస్తూ ఉన్నానా? ప్రతి అడుగులో స్వయం కోసం కోటానుకోట్ల సంపాదన జమ చేసుకుంటున్నానా? ఇలా సంకల్పం, సమయం, వృత్తి మరియు కర్మ నాల్గింటినీ సేవలో ఉపయోగించండి. అటువంటి వారినే నిరంతర సేవాధారి అని అంటారు. మంచిది.

ఎలాగైతే మధువనంలో మేళా జరుగుతుందో అలాగే అంతిమంలో ఆత్మల యొక్క మేళా జరగనున్నది. మధువనం మంచిగా అనిపిస్తుందా లేక విదేశం మంచిగా అనిపిస్తుందా? మధువనం అని దేనిని అంటారు? ఎక్కడైతే బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనం. కనుక ప్రతి విదేశీ స్థానాన్ని మధువనంగా తయారుచేయండి. మధువనం తయారుచేస్తే బాప్ దాదా కూడా వస్తారు. ఎందుకంటే బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే మధువనంలో రావటం. ఎక్కడ మధువనం ఉంటుందో అక్కడ బాప్ దాదా ఉంటారు. మున్ముందు చాలా అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు ఎలాగైతే భారతదేశంలో సంఖ్య పెరుగుతూ ఉందో అదేవిధంగా కొద్ది సమయంలో విదేశాల యొక్క సంఖ్యను పెంచండి. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ నలువైపుల ధ్వని వ్యాపించాలి. వీరు ఎవరు, ఏమిటి అనే ప్రశ్న ఉదయించాలి. ఇటువంటి సంఘటన తయారుచేస్తే ఎక్కడ సంఘటన ఉంటుందో అక్కడ బాప్ దాదా కూడా హాజరవుతారు.

అక్కడ ఉంటున్నా కానీ సంతోషం ఉంటుందా లేక ఇక్కడికి వస్తేనే సంతోషం ఉంటుందా? ఎంత చెప్పినా కానీ పెద్దది పెద్దదే, చిన్నది చిన్నదే. ఎందుకంటే మధువనం అంటే స్వయంగా సాకార తనువు యొక్క జన్మభూమి మరియు కర్మభూమి, చరిత్రభూమి కనుక విశేష గొప్పతనం ఉంటుంది. అందువలనే భక్తిలో ఏమీ లేకపోయినా కానీ స్థానానికి గొప్పతనం ఇస్తారు. అక్కడ విగ్రహం పాతదిగా ఉంటుంది, ఇంట్లో అయితే చాలా సుందర విగ్రహం ఉంటుంది. అయినా కానీ భక్తిలో కూడా స్థానానికి విలువనిస్తారు. కనుక స్థానానికి గొప్పతనం ఉంటుంది కానీ మీ పూలతోటను పెంచండి. మధువనం పోలికతో ఉన్న చిత్రాన్ని తయారుచేయండి. చిన్న మధువనం వలె ఉంటే చూడడానికి అందరు ఆకర్షితం అవుతారు. మంచిది.

వర్తమాన సేవ గురించి బాప్ దాదా కృతజ్ఞతలు చెప్తున్నారు మరియు భవిష్య సేవ కొరకు స్మృతిని ఇప్పిస్తున్నారు. బాప్ దాదాకి పిల్లలపై బాగా స్నేహం అనండి లేదా శుద్ద మమత అనండి, తల్లికి పిల్లలపై మమకారం ఉంటుంది కదా, తపించరు కానీ లీనమైపోతారు. ఉదాసీనం అవ్వరు కానీ పిల్లలను ఎదురుగా ప్రత్యక్షం చేసుకుని స్నేహ సాగరంలో లీనమైపోతారు. బాబాకి స్నేహం అందుకే మీకు కూడా స్నేహం ఉత్పన్నం అవుతుంది కదా! స్నేహం ఉంది కనుకే అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వస్తున్నారు.

ఈవిధంగా స్నేహం యొక్క బంధనలో బంధించేవారికి, స్నేహంతో బాబాని ప్రత్యక్షం చేసేవారికి, సేవ ద్వారా విశ్వకళ్యాణార్ధం నిమిత్తమైన సదా మహాదాని మరియు వరదాని, నిరంతర యోగి, నిరంతర సేవాధారి ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.