16.02.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మాయ మరియు ప్రకృతి ద్వారా సత్కారాన్ని పొందే ఆత్మయే సర్వశ్రేష్ట ఆత్మ.

విశ్వ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింప చేసేవారు, మాయ మరియు ప్రకృతి ద్వారా కూడా సత్కారాన్ని పొందే యోగ్య సర్వ శ్రేష్ట ఆత్మగా తయారు చేసే దయాసాగరుడు శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క నయనాల ద్వారా, మస్తకంలోని రేఖల ద్వారా ఒక విశేష విషయాన్ని చూస్తున్నారు. అది ఏ విషయమై ఉంటుందో తెలుసా? అది ఏమిటంటే ఇతరులకు పరిచయం చెప్పేటప్పుడు మీరు చెప్తారు కదా - 21 జన్మలకు ఏమేమి ప్రాప్తిస్తున్నాయి అని. సదా ఆరోగ్యం, సంపత్తి మరియు సంతోషం ఈ మూడు ప్రాప్తులు వర్తమాన సమయం యొక్క ప్రాప్తి యొక్క లెక్కతో కలిపి 21 జన్మలు లభిస్తాయి అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా? ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖను మస్తకం మరియు నయనాల ద్వారా చూస్తున్నారు. ప్రతిజ్ఞ అనుసారంగా సదా అనే మాట ప్రత్యక్షంగా ఎంత వరకు వచ్చింది అని చూస్తున్నారు. ప్రతిజ్ఞలో కేవలం ఆరోగ్యం, సంపద అని అనరు. సదా ఆరోగ్యం, సదా సంపద ప్రాప్తిస్తాయి అని అంటారు. మొదట వర్తమానం, వర్తమానం ఆధారంగానే భవిష్యత్తు. కనుక సదా అనే మాటను అండర్ లైన్ చేసి ఫలితాన్ని చూస్తున్నారు - ఫలితం ఏమి వచ్చి ఉంటుంది? ఈ మాటలు వర్తమానానివా లేక భవిష్యత్తువా? సేవ కొరకు ఇటువంటి స్థితి వర్తమానంలో అవసరమా లేక భవిష్యత్తు కోసం అవసరమా? ఒకే సమయంలో తనువు, మనస్సు, ధనం మరియు మనసా, వాచా, కర్మణా అన్ని రకాల సేవను వెనువెంట చేయటం ద్వారా సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఎలాగైతే శారీరక వ్యాధి వాతావరణం యొక్క ప్రభావం వలన, వాయుమండలం యొక్క ప్రభావం వలన, ఆహార విహారాల యొక్క ప్రభావం వలన, రోగం యొక్క ప్రభావం వలన వస్తుంది. అదేవిధంగా మనస్సు యొక్క స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. సదా ఆరోగ్యంగా ఉండడానికి బదులు రోగిగా అయిపోతున్నారు. కానీ సదా ఆరోగ్యవంతులు అన్ని విషయాలలో జ్ఞాన సాగరులుగా ఉంటారు, కనుక రక్షణగా ఉంటారు. అదేవిధంగా సదా ఆరోగ్యం అంటే సదా సర్వ శక్తుల యొక్క ఖజానాతో, సర్వ గుణాల ఖజానాతో, జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉంటారు. ఏమి చేయను, ఎలా చేయను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఇలా ఎప్పుడు కూడా శక్తుల యొక్కధనం లేనివారిగా మాట్లాడరు లేదా సంకల్పం చేయరు. స్వయాన్ని సదా సంపన్న మూర్తిగా అనుభవం చేసుకుంటారు మరియు ఇటువంటి సంపన్న మూర్తిని చూసి శక్తులు, ధనం లేని ఇతరాత్మలు కూడా సంపన్నత యొక్క చత్రఛాయలో ఉత్సాహ, ఉల్లాసవంతులుగా అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా సదా సంతోషవంతం అంటే దుఃఖం యొక్క అలను ఉత్పన్నం చేసే ఎటువంటి వాతావరణం అయినా కానీ, నీరస వాతావరణం అయినా కానీ, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణం అయినా కానీ అటువంటి వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు మరియు తమ సంతోషం యొక్క మెరుపు ద్వారా దుఃఖం మరియు ఉదాసీనత యొక్క వాతావరణాన్ని సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసి వెలుగునిచ్చినట్లుగా పరివర్తన చేస్తారు. అంధకారంలో వెలుగుని తీసుకురావటం, అశాంతిలో శాంతిని తీసుకురావటం, నీరస వాతావరణంలో సంతోషం యొక్క మెరుపుని తీసుకురావటమే సదా సంతోషవంతంగా ఉండటం. ఇటువంటి సేవ ఇప్పుడే అవసరం కానీ భవిష్యత్తులో కాదు. ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖను చూస్తున్నారు. రేఖ సదాకాలికంగా మరియు స్పష్టంగా ఉందా? అని. హస్తాల ద్వారా ఆయుష్షు రేఖను చూస్తారు కదా! దీర్ఘ ఆయుష్షు ఉందా, నిరోగిగా ఉంటారా అని చూస్తారు. అదేవిధంగా బాప్ దాదా కూడా రేఖను చూస్తున్నారు. జన్మ తీసుకున్న దగ్గర్నుండి ఇప్పటి వరకు మూడు ప్రాప్తులు అఖండంగా ఉన్నాయా లేక మధ్యమధ్యలో ప్రాప్తి యొక్క రేఖలు ఖండితం అవుతున్నాయా? చాలా సమయం యొక్క రేఖలు ఉన్నాయా లేక అల్పకాలికంగా ఉన్నాయా? అని చూశారు. ఫలితంలో అఖండం మరియు స్పష్టం అనే విషయాలలో లోపం కనిపించింది. అఖండంగా ఉన్నవారు చాలా కొద్దిమంది ఉన్నారు కానీ అఖండంలో కూడా స్పష్టత లేదు, సమానంగా లేవు కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. వర్తమాన సమయంలో విశ్వసేవా వేదికపై హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తున్నారు. కనుక దానిని అనుసరించి ఈ మూడు ప్రాప్తులు మస్తకం మరియు నయనాల ద్వారా సదాకాలికంగా మరియు స్పష్టంగా కనిపించాలి. ఈ మూడు ప్రాప్తుల ఆధారంగానే విశ్వకళ్యాణకారి పాత్రను అభినయించగలరు. ఈ రోజు సర్వాత్మలకు ఈ మూడు ప్రాప్తులు అవసరం, అటువంటి అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తినిచ్చి ప్రతిజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకురండి. దుఃఖి, అశాంతి ఆత్మలు, రోగి ఆత్మలు, శక్తిహీన ఆత్మలు ఒక్క సెకను ప్రాప్తి యొక్క సహాయం కోసం, ఒక్క బిందువు కోసం చాలా దప్పికగా ఉన్నారు. మీ అదృష్టవంతమైన, సంతోషవంతమైన, హర్షిత ముఖాన్ని చూసి వారికి మానవ జీవితం అంటే ఏమిటి అని ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి. ఇప్పుడు జీవిస్తున్నా కానీ నిరాశ అనే చితిపై కూర్చుని ఉన్నారు. అటువంటి ఆత్మలను మరజీవగా తయారుచేయండి. కొత్త జీవితం యొక్క దానం ఇవ్వండి అంటే మూడు ప్రాప్తులతో సంపన్నంగా తయారు చేయండి. ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ద అధికారం అని సదా స్మృతిలో ఉండాలి. మూడింటినీ ప్రత్యక్షంగా ధారణ చేసేటందుకు డబల్ అండర్ లైన్ చేసుకోండి. ప్రభావం వేసేవారిగా అవ్వండి. ప్రకృతి యొక్క వాతావరణం యొక్క పరిస్థితుల ప్రభావానికి వశం కాకండి. ఏవిధంగా అయితే కమలపుష్పం మురికి మరియు నీటి యొక్క ప్రభావంలోకి రాదో అదేవిధంగా ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇంత అయితే తప్పక జరుగుతుంది. ఇలా ఎవరు తయారయ్యారు ఏమిటి... ఇలా ప్రభావంలోకి రాకండి. ఎవరు తయారు కాకపోయినా కానీ మీరు తయారై చూపించండి. ఎలా అయితే మొదటి నెంబరులోకి వచ్చి చూపిస్తాం, విశ్వమహారాజు అయ్యి చూపిస్తాం అని శుద్ద సంకల్పం చేస్తున్నారో అదే విధంగా వర్తమాన సమయంలో కూడా మొదట నేను తయారవుతాను అని అనుకోండి. బాబాని అనుసరించి మొదటి నెంబరులో ఉదాహరణగా అయ్యి చూపిస్తాను అనే లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యంతో పాటు లక్షణాలను కూడా ధారణ చేస్తూ ఉండండి. దీనిలో మొదట నేను అనే దృఢ సంకల్పాన్ని సదా పెట్టుకోండి. ఈ విషయంలో ఇతరులను చూడకండి. స్వయాన్ని చూడండి మరియు బాబాని చూడండి. అప్పుడే ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్ష స్వరూపం సమానంగా అయినట్లు. మంచిది, చాలా చెప్పాను మరియు చాలా విన్నారు. ఈసారి అయితే బాప్ దాదా కేవలం చెప్పడానికి రాలేదు, చూడడానికి వచ్చారు. చూసినప్పుడు ఏమి చూశారో చెప్తున్నారు. తయారవ్వవలసినవారు ఈ ఆత్మలలోనే ఉన్నారు అని బాప్ దాదాకి తెలుసు, అధికారి ఆత్మలు కూడా మీరే కానీ మాటిమాటికి స్మృతి ఇప్పిస్తున్నారు. మంచిది.

ఈవిధంగా విశ్వ రాజ్య భాగ్యానికి అధికారులకు, బాబా ద్వారా సర్వ ప్రాప్తుల యొక్క అధికారులకు, మాయ మరియు ప్రకృతి ద్వారా సత్కారాన్ని పొందే అధికారులకు, సర్వశ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.