01.04.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిరంతర యోగులే నిరంతరం తోడుగా ఉంటారు.

లండన్ సేవా కేంద్రం యొక్క ప్రముఖులు అయిన జానకి దాదీతో మరియు ఇతర మహారథీ అక్కయ్యలు, అన్నయ్యలతో అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మహావాక్యాలు -

సదా వీరులుగా మరియు సదా కిరీటం మరియు సింహాసనాధికారిగా తయారు చేసేటటువంటి ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో శ్రేష్ట త్యాగం చేయించి, శ్రేష్ట భాగ్యం తయారు చేయించేవారు, సర్వ ఖజానాలతో సంపన్నంగా చేసేటటువంటి శివబాబా మాట్లాడుతున్నారు..

ఈరోజు ఇది మాయాజీత్ విజయీ రత్నాల విశేష సంఘటన. ఈరోజు సంఘటనలో బాప్ దాదా ఎవర్ని చూస్తున్నారు? ఆది నుండి అంతిమం వరకు సదా నిశ్చయబుద్ధి, సదా బాబా యొక్క అడుగులో అడుగు వేసేవారికి, సదా సహయోగి మరియు సదా తోడుగా ఉండేవారిని చూస్తున్నారు. ప్రతి సమయం బాబా మరియు సేవలో నిమగ్నమయ్యేవారికి, సదా శ్రేష్ట మర్యాదల యొక్క రేఖ నుండి సంకల్పం నుండి కూడా బయటకు రాని మర్యాదా పురుషోత్తములు అయిన వారికి సదా ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో జన్మ జన్మలకు తోడుగా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే బాబాతో నీతోనే కూర్చుంటాను, ప్రతి సెకను, ప్రతి కర్మలో తోడుని నిలుపుకుంటాను అని ప్రతిజ్ఞ నిలబెట్టుకునే సుపుత్రులు అయిన పిల్లలకు బాబా కూడా జన్మ జన్మాంతరాలుగా తోడుగా ఉండే వరదానం ఇప్పుడే ఇస్తున్నారు. సాకార బాబాతో భిన్న భిన్న నామరూపాలతో పూజ్య స్థితిలో మరియు పూజారి స్థితిలో తోడుగా ఉంటారు. జ్ఞానీ ఆత్మ అవ్వటంలో కూడా తోడుగా ఉంటారు మరియు భక్తాత్మలు అవ్వటంలో తోడుగా ఉంటారు. ఇలా వెంట ఉండే లేదా తతత్వం యొక్క వరదానం విశేషాత్మలకు ఇప్పుడే లభిస్తుంది.

ప్రతీ మహారథీ స్వయాన్ని పరిశీలించుకోండి - వర్తమాన సమయంలో బాప్ దాదా యొక్క గుణాలు, జ్ఞానం మరియు సేవలో ఎంత సమానత మరియు సమీపత ఉంది అని. సమానతయే సమీపతని తీసుకువస్తుంది. ఇప్పటి స్థితి భవిష్యత్తులో ప్రతి సెకను యొక్క తోడుని మరియు జన్మ జన్మాంతరాలు కూడా రకరకాలైన నామాలు, రూపాల సంబంధంతో అనుభవం చేసుకోవటానికి నిమిత్తం అవుతుంది. వికర్మాజీతులుగా అవ్వటంలోను తోడు ఉంటారు మరియు రాజా విక్రమాదిత్యుని సమయంలో కూడా తోడుగా ఉంటారు. ప్రతి పాత్రలో, ప్రతి వర్గంలో వెనువెంటే ఉంటారు. దీనికే నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను అని మహిమ ఉంది. అంటే వెంట ఎక్కుతారు, వెంట దిగిపోతారు. ఎక్కేకళలో, దిగిపోయే కళలో, రాత్రిలో, పగలులో నిరంతర యోగులే నిరంతరం తోడుగా ఉంటారు. ఎంత సంగమయుగంలో బాబా యొక్క తోడుని నిలుపుకోవటంలో సంపూర్ణంగా ఉంటారో అంతంత సమీప సంబంధీకులు అవ్వటంలో కూడా సమీపంగా ఉంటారు. విశ్వంలోని నెంబర్ వన్ శ్రేష్ట ఆత్మకి డ్రామాలో చాలా గొప్పతనం ఉంటుంది అలాగే నెంబర్ వన్ ఆత్మ యొక్క సంబంధంలో ఉండే ఆత్మలకి కూడా గొప్పతనం ఉంటుంది. ఈ రోజుల్లో అల్పకాలిక పదవులలో ఉన్న ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వారితో పాటు వారి కుటుంబానికి కూడా చాలా గొప్పతనం ఉంటుంది కదా! అలాగే సదాకాలిక శ్రేష్ట ఆత్మ యొక్క సంబంధంలో ఉండే ఆత్మలకు ఇంక ఎంత ఉన్నతమైన గొప్పతనం ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కొద్దిగా అలజడి జరిగినప్పుడు ఆది నుండి ఉన్న పాత ఆత్మలు సదా తోడుగా ఉండే సంబంధం నిలుపుకున్న దానికి ఎంత గొప్పతనం ఉంటుందో చూడండి! వస్తువు పాతది అయితే గొప్పతనం ఇస్తారు. విలువైనదిగా భావిస్తారు. ఇలా మీ ఆత్మల యొక్క విలువని వర్ణన చేస్తూ చేస్తూ గుణగానం చేస్తూ స్వయాన్ని ధన్యులుగా అనుభవం చేసుకుంటారు. స్వయాన్ని ఈవిధమైన శ్రేష్ట ఆత్మలుగా భావిస్తున్నారా? మీరు ఎంతెంతగా బాబా యొక్క గుణాలను పాడుతూ ఉంటారో అంతగానే బదులుగా మీ యొక్క గుణాలను మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు మహిమ చేయటంలేదు? సేవ ఇప్పుడు చేస్తున్నా కానీ సంపూర్ణ ఫలం అంతిమంలో ఎందుకు లభిస్తుంది? ఇప్పుడు కూడా లభిస్తుంది కానీ తక్కువ. దీనికి కారణం తెలుసా? ఇప్పుడు ఒక్కొక్క సారి బాబాని మరియు అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు కలిపేసుకుంటున్నారు. బాబా యొక్క గుణగానం చేస్తూ చేస్తూ మీ గుణగానం కూడా ప్రారంభిస్తున్నారు. భాష చాలా మధురంగా ఉంటుంది కానీ నాది అనే భావన ఉన్న కారణంగా ఆత్మలలో భావన సమాప్తి అయిపోతుంది. ఇదే అన్నింటికంటే గొప్ప సూక్ష్మాతి సూక్ష్మమైన త్యాగం. ఈ త్యాగం ఆధారంగానే నెంబర్ వన్ ఆత్మ నెంబర్ వన్ భాగ్యాన్ని తయారుచేసుకుంది మరియు అష్ట రత్నాలలో నెంబర్ పొందడానికి కూడా ఈ త్యాగమే ఆధారం. ప్రతి సెకను, సంకల్పంలో బాబా, బాబా అనే స్మృతి ఉండాలి. నేను అనే భావన సమాప్తి అయిపోవాలి. ఎప్పుడైతే నేను అనేది ఉండదో అప్పుడు నాది అనేది కూడా ఉండదు. నా స్వభావం, నా సంస్కారం, నా పని, నా బాధ్యత, నా పేరు, నా గౌరవం ఇలా ఈ నేను అనేది సమాప్తి అయిపోతే నాది, నాది అనేది కూడా సమాప్తి అయిపోతుంది. నాది మరియు నేను అనేది సమాప్తి చేసుకోవటమే సమానత మరియు సంపూర్ణత. స్వప్నంలో కూడా నేను అనే భావన ఉండకూడదు. దీనినే అశ్వమేధ యజ్ఞంలో నాది అనే భావనను అంటే అశ్వాన్ని స్వాహా చేయటం అంటారు. ఇదే అంతిమ ఆహుతి. దీని ఆధారంగానే అంతిమ విజయీ నగాడా మ్రోగుతుంది. సంఘటన రూపంలో ఈ అంతిమ ఆహుతి యొక్క ధ్వనిని మనస్సుతో వెదజల్లండి. అప్పుడు పంచతత్వాలు కూడా అధికారులైన మీకు సఫలతా మాలలు వేస్తాయి. ఇప్పటి వరకు తత్వాలు కూడా అక్కడక్కడ సేవలో విఘ్న రూపంగా అవుతున్నాయి కానీ స్వాహా అంటే ఆహుతి అవ్వటంలో హారతి ఇస్తాయి. సంతోషం యొక్క బాజాలు మ్రోగిస్తాయి. సర్వాత్మలు తమ చాలాకాలం యొక్క కోరికలు పూర్తి అయిన కారణంగా మహిమ అనే గజ్జెలు కట్టుకుని నాట్యం చేస్తారు. అప్పుడే అంతిమ భక్తి సంస్కారం నిండుతుంది. ఇటువంటి భక్తి ఆత్మలకి, భక్తి యొక్క వరదానం ఇప్పుడు ఇష్ట దేవతలైన మీ ద్వారానే లభిస్తుంది. కొంతమందికి భక్తి ఆత్మగా అయ్యే వరదానం, కొంతమందికి ఆత్మ జ్ఞానిగా అయ్యే వరదానం, సర్వాత్మలకు ఇప్పుడే వరదానిగా అయ్యి వరదానం ఇస్తారు. సాకారంలో రాజ్యం చేసేవారికి రాజ్య పదవి యొక్క వరదానం ఇస్తారు. ఇలా వరదానీ మూర్తులుగా, కామధేనువులుగా అయ్యారా? ఏ ఆత్మ ఏది అడిగినా తధాస్తు అనాలి. ఇటువంటి ఆత్మలనే సదా సమీపం మరియు తోడుగా అంటారు.

సదా ఈవిధంగా మహావీరులుగా, సదా కిరీటము, సింహాసనాధికారులకు, ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో శ్రేష్ట త్యాగం ద్వారా శ్రేష్ట భాగ్యం తయారు చేసుకునేవారికి, ప్రతి అడుగులో బ్రహ్మాబాబాను అనుసరించేవారికి, సర్వ ఖజానాలతో సంపన్నంగా తరగని ఖజానాలతో సదా సంపూర్ణంగా ఉండేవారికి, సదా లక్ష్యం మరియు లక్షణాలు సంపూర్ణంగా ఉంచుకునేవారికి ఈ విధమైన సంపూర్ణ శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.