27.11.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అల్పకాలిక పేరు గౌరవానికి అతీతులే సర్వులకు ప్రియంగా కాగలరు.

సదాకాలికంగా ఇచ్చామాత్రం అవిద్యాగా తయారు చేసే బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా విశేషంగా పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఎలాగైతే పిల్లలు నిరంతరయోగిగా అంటే బాబా యొక్క స్నేహసాగరంలో సదా లవలీనమై ఉంటారో అలాగే బాబా కూడా పిల్లల యొక్క స్నేహంలో నిరంతరం పిల్లల యొక్క గుణాలను పాడుతూ ఉంటారు. ప్రతి బిడ్డ యొక్క గుణాల మాల మరియు ప్రతి బిడ్డ యొక్క శ్రేష్ట చరిత్ర బాప్ దాదా దగ్గర ఉంటుంది. బాప్ దాదా దగ్గర చాలా పెద్ద, చాలా సుందర చైతన్య మూర్తుల మందిరం లేదా చిత్రశాల సదా ఎదురుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి చిత్రం మరియు మాలను సదా బాబా చూస్తూ ఉంటారు. కొందరి మాల పెద్దది, కొందరి మాల చిన్నది. మీరందరు అయితే ఒకే బాబాని జ్ఞాపకం చేయవలసి ఉంటుంది. కానీ బాప్ దాదా అయితే పిల్లలందరినీ జ్ఞాపకం చేయవలసి ఉంటుంది, ఒక్కరిని కూడా మర్చిపోరు. ఒకవేళ మర్చిపోతే నిందల మాల వేసుకోవల్సి వస్తుంది. పిల్లలు నిందల మాలను వేస్తున్నారు, కానీ బాబా విజయీ మాల వేస్తున్నారు. చాలా తెలివైన పిల్లలు! సహాయం తీసుకోవటంలో తెలివైనవారు, ధైర్యం పెట్టుకోవటంలో నెంబరువారీ. వినటం చాలా విన్నారు. ఇక ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు ఇక కేవలం కలయిక జరుపుకుంటూ ఉండాలి. ఎలాగైతే ఇప్పటి కలయిక సంపన్న స్థితిని అనుభవం చేయిస్తుందో అదేవిధంగా నిరంతరం కలయిక జరుపుకోండి. విన్నదానికి బదులుగా సదా బాబా సమానంగా సంపన్న స్వరూపంగా తయారై చూపించండి. దప్పికతో ఉన్న అనేకాత్మల నిరీక్షణ సమాప్తి చేయండి. సంపన్న దర్శనీయమూర్తిగా అయ్యి అనేకులకు దర్శనం చేయించండి. ఇప్పుడు దుఃఖం మరియు అశాంతి యొక్క అనుభూతి అతిలోకి వెళ్తుంది. మీ అంతిమ స్థితి ద్వారా దీనిని సమాప్తం చేసే కార్యాన్ని అతి వేగంగా చేయండి. మాస్టర్ రచయిత స్థితిలో స్థితులై మీ రచన యొక్క బేహద్ దుఃఖం మరియు అశాంతి యొక్క సమస్యను సమాప్తి చేయండి. దుఃఖహర్త, సుఖకర్త యొక్క పాత్రను అభినయించండి. సుఖ, శాంతి యొక్క ఖజానాతో మీ రచనకు మహాదానం మరియు వరదానం ఇవ్వండి. రచన యొక్క పిలుపు వినిపిస్తుందా! లేక మీ జీవిత కథను చూడటం మరియు వినటంలోనే బిజీగా ఉన్నారా? మీ జీవితం యొక్క కర్మల కథను తెలుసుకునే త్రికాలదర్శి అయ్యారు కదా! ఇప్పుడు ప్రతి కర్మ ఇతరాత్మల కళ్యాణం కోసం కార్యంలో ఉపయోగించండి. నాకు కూడా కొంచెం చేయండి, నాది కూడా వినండి, నా గురించి నిర్ణయించడానికి కొంచెం సమయం ఇవ్వండి ఇలా మీ కథను ఎక్కువ వర్ణన చేయకండి, ఇప్పుడు అనేకుల యొక్క నిర్ణయాన్ని చేసేవారిగా అవ్వండి. ప్రతి ఒక్కరి కర్మలగతిని తెలుసుకుని గతి సద్గతిని ఇవ్వడానికి నిర్ణయించండి. సౌకర్యాలను స్వీకరించకండి. దాతగా అయ్యి ఇవ్వండి. ఏ సేవ గురించి అయినా, స్వయం గురించి అయినా సాధనాల ఆధారంగా స్వయం యొక్క ఉన్నతి లేదా సేవలో అల్పకాలిక సఫలత ప్రాప్తిస్తుంది, కానీ ఈరోజు మహాన్ గా ఉంటారు రేపు మహానత కొరకు దప్పికతో ఉంటారు. సదా ప్రాప్తి యొక్క కోరికతో ఉంటారు. పేరు వస్తుంది, పని అయిపోతుంది కానీ ఇచ్చామాత్రం అవిద్యా స్వరూపంగా కాలేరు. ఎలాగైతే బాబా నామ రూపాలకు అతీతుడు కానీ బాబా పేరుకే అందరికంటే ఎక్కువ మహిమ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా అల్పకాలిక పేరు, గౌరవాలకు అతీతం అవ్వండి, అప్పుడు స్వతహాగానే సదాకాలికంగా సర్వులకి ప్రియంగా అవుతారు. పేరు, గౌరవం కావాలనే బికారి స్థితిని అంశమాత్రంగా కూడా లేకుండా త్యాగం చేయండి. ఇటువంటి త్యాగులే విశ్వానికి భాగ్య విధాతగా కాగలరు. కర్మ ద్వారా లభించే ఫలాన్ని తినేసే అభ్యాసిగా ఎక్కువ ఉన్నారు. అందువలన పచ్చి ఫలాన్నే తినేస్తున్నారు. జమ చేసుకోవటం లేదు అంటే ముగ్గనివ్వటం లేదు. పచ్చి ఫలాన్ని తింటే ఏమౌతుంది? ఏదోక అలజడి జరుగుతుంది కదా! అదేవిధంగా ఇక్కడ స్థితిలో అలజడి వస్తుంది. కర్మకి ఫలం అనేది స్వతహాగానే సంపన్న స్వరూపంలో మీ ఎదురుగా వస్తుంది. ఒక శ్రేష్ట కర్మ చేసిన దానికి వందరెట్లు సంపన్న ఫలం స్వరూపంలో లభిస్తుంది. కానీ అల్పకాలిక కోరికలతో అవిద్యాగా ఉండాలి. త్యాగం చేస్తే భాగ్యం స్వతహాగానే మీ వెనుక వస్తుంది. కోరిక అనేది శ్రేష్ట కర్మను సమాప్తి చేసేస్తుంది. అందువలన కోరికంటే ఏమిటో తెలియనివారిగా (ఇచ్చామాత్రం అవిధ్యా) అవ్వండి. ఈ విద్యతో అవిద్య అవ్వాలి. మహాన్ జ్ఞానీ స్వరూపులు కనుక దీనిలో అతి తెలివైనవారిగా అవ్వకండి. ఇది జరిగే తీరాలి, నేను చేశాను కనుక నాకే లభించాలి ఇలా దీనిని న్యాయంగా భావించకండి. నాకు కొంచెం అయినా న్యాయం జరగాలి. భగవంతుని ఇంట్లోనే న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది? కనుక ఎప్పుడు ఇలా న్యాయం అడిగేవారిగా కాకండి. ఏ రకంగానైనా అడిగే వారు స్వయాన్ని తృప్తి ఆత్మగా అనుభవం చేసుకోలేరు. అందువలన సదా సర్వ ప్రాప్తులతో తృప్తి ఆత్మగా అవ్వండి. మాస్టర్ సర్వశక్తివంతుల ఖజానాలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి అనేది లేనే లేదు అని బ్రాహ్మణ జీవితం యొక్క సూక్తి ఉంది. కనుక ఈ సూక్తిని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు గుహ్య జ్ఞానంతో పాటు పరివర్తన కూడా గుహ్యంగా చేస్కోండి. కష్టంగా అనిపిస్తుందా ఏమిటి? మీరు అనేకుల కష్టాలను సహజం చేసే ముక్తి సేన.

ఈవిధంగా సదా మహాదాని, వరదాని, అల్పకాలిక కోరికలంటే ఏమిటో తెలియనివారికి, స్వయం యొక్క త్యాగం ద్వారా సర్వుల భాగ్యాన్ని తయారు చేసే విధాతలకు, సదా సంపన్నం మరియు సంతుష్టంగా ఉండేవారికి, సర్వుల సమస్యలను సమాధాన పరిచేవారికి, ఈ విధమైన బాప్ సమాన మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.