29.11.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంతుష్టత ద్వారా ప్రసన్నత మరియు ప్రశంస (గౌరవం ) యొక్క ప్రాప్తి.

సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారు చేసే సదా సుఖదాత బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా విశ్వంలో మెరిసే మణులను చూస్తున్నారు. ప్రతీ మణికి తమ తమ మెరుపు ఉంది. ప్రతి మణి తన ద్వారా బాబా యొక్క గుణాలను మరియు కర్తవ్యాన్ని నెంబరు వారిగా ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు. ప్రతి మణి ద్వారా బాప్ దాదా కనిపిస్తున్నారు. ఈ విచిత్ర స్థితినే భక్తులు ఎక్కడ చూసినా నీవే నీవు అని అన్నారు. మహారథీల్లో కూడా బాప్ దాదా కనిపిస్తారు. చివర్లో వచ్చినా కానీ వేగంగా వెళ్ళేవారిలో కూడా బాప్ దాదా కనిపిస్తారు. ప్రతి ఒక్కరి నోటి నుండి బాబా, బాబా... అనే ఒకే మాట యొక్క పాట వినిపిస్తుంది. సర్వ బ్రాహ్మణాత్మల యొక్క నయనాలలో ఒకే తండ్రి వెలుగు వలె ఇమిడి ఉన్నారు. అందువలనే బ్రాహ్మణ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. ఈ అనుభవాన్నే భక్తులు భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పారు. వర్తమాన సమయంలో పిల్లల యొక్క అనుభవం గురించే ఆవిధంగా అన్నారు. ప్రతి సంకల్పం మరియు కర్మలో పరంధామ నివాసి అయిన బాబా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుందా? సదా బాబా తోడుగా ఉన్నట్టు అనుభవం అవుతుందా? ఎలా అనుభవం అవుతుంది? తోడు అనుభవం అవుతుందా లేక సదా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుందా? సర్వులకు తోడుగా ఉంటే సర్వవ్యాపి కాదా? భక్తులు మాటను కాపీ చేసారు కానీ ఎప్పుడు మరియు ఏవిధంగా అనే భావార్ధాన్ని మర్చిపోయారు, కనుకే అది మహిమకు బదులు గ్లాని (నింద) అయిపోయింది.

బాప్ దాదా పిల్లలందరి యొక్క వర్తమాన స్వరూపంలో ధారణా స్వరూపాన్ని చూస్తూ విశేషంగా ఒక విషయాన్ని చూస్తున్నారు. అది ఏమిటి? పిల్లలందరిలో సదా సంతుష్టమణులు ఎంత మంది ఉన్నారు? అని చూస్తున్నారు. అన్నింటికంటే విశేష గుణం లేదా ముఖంలో మెరుపుగా కనిపించేది - సంతుష్టత. సంతుష్టత అనేది మూడు రకాలుగా ఉండాలి. 1. బాబాతో సంతుష్టం 2. సదా స్వయంతో స్వయం సంతుష్టం 3. సర్వ సంబంధ సంపర్కాలలో సంతుష్టం. దీనిలో చైతన్య ఆత్మలు మరియు ప్రకృతి రెండు వస్తాయి. సంతుష్టతకు గుర్తు - ప్రసన్నత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. ఈ ప్రసన్నత ఆధారంగా ఇటువంటి ఆత్మకు సదా స్వతహాగా సర్వుల నుండి ప్రశంస ప్రత్యక్ష ఫలంగా లభిస్తుంది. విశేషత - సంతుష్టత, దానికి గుర్తు - ప్రసన్నత, దానికి ప్రత్యక్ష ఫలం - ప్రశంస. ఇప్పుడు స్వయాన్ని చూస్కోండి. ప్రసన్నత ద్వారానే ప్రశంసను పొందగలరు. ఎవరైతే సదా స్వయం సంతుష్టంగా లేదా ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు. నడుస్తూ నడుస్తూ పురుషార్ది జీవితంలో సమస్యలు లేదా పరిస్థితులు డ్రామానుసారం రావలసిందే. జన్మ తీసుకుంటూనే ముందుకి వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకోవటం అంటే పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించటం. మీరు ఆహ్వానించిన ఆహ్వానాన్ని మర్చిపోతున్నారు. మార్గంలో పయనించాలంటే ఆ మార్గంలో దృశ్యాలు లేకుండా ఉంటాయా? ఆ దృశ్యాలను చూస్తూ ఆగిపోతున్నారు. అందువలనే గమ్యాన్ని దూరంగా అనుభవం చేసుకుంటున్నారు. దృశ్యాలను చూస్తూ వాటిని దాటి వెళ్ళిపోవాలి కానీ ఆ దృశ్యాలను చూసి ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఇలా కాదు, అది అలా కాదు... ఇలా విషయాలలో ఆగిపోతున్నారు. ప్రతి దృశ్యాన్ని సరి చేయటంలో నిమగ్నం అయిపోతున్నారు. దాటడానికి బదులు సరిదిద్దటంలో నిమగ్నమైపోతున్నారు. అందువలన బాబా స్మృతి యొక్క సంబంధాన్ని లూజ్ చేసేసుకుంటున్నారు. మనోరంజనానికి బదులు మనస్సుని వాడిపోయినట్లు చేసేసుకుంటున్నారు. ఓహో దృశ్యాలు! ఓహో!! అనడానికి బదులు ఎక్కువగా అయ్యో! అని అంటున్నారు. అయ్యో! అంటే ఆశ్చర్యార్ధకం! అందువలన నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారు. అలిసిపోయిన కారణంగా అప్పుడప్పుడు బాబాపై మధురాతి మధుర నిందలు వేస్తూ రాయల్ రూపంలో బాబాతో కూడా అసంతుష్టం అయిపోతున్నారు. కొంతమంది పిల్లలు ముందుగా ఎందుకు చెప్పలేదు? సహజ మార్గం అన్నావు కానీ సహన మార్గం అనలేదు కదా అని అంటున్నారు. అంటే వారు సహజ మార్గానికి బదులు సహన మార్గంగా అనుభవం చేసుకుంటున్నారు. కానీ సహించటమే ముందుకి వెళ్ళటం. వాస్తవానికి అది సహించటం కాదు కానీ స్వయం యొక్క బలహీనత కారణంగా సహనంగా అనుభవం అవుతుంది. ఉదాహరణకి అగ్ని యొక్క గుణం కాల్చటం, ఆ గుణం గురించి తెలియని వారు దాని ద్వారా లాభాన్ని పొందడానికి బదులు నష్టపోతే సుఖానికి బదులు సహించవలసి వస్తుంది. ఎందుకంటే వస్తువుకి బదులు స్వయాన్ని కాల్చేసుకుంటున్నారు. గుణం యొక్క జ్ఞానం లేని కారణంగా సుఖానికి బదులు సహించాల్సి వస్తుంది. అదేవిధంగా సమస్యలు లేదా పరిస్థితులు రావడానికి గల కారణం లేదా వాటి జ్ఞానం లేని కారణంగా ముందుకి వెళ్తున్నట్లు సుఖం యొక్క అనుభవం చేసుకోవడానికి బదులు సహనంగా అనుభవం చేసుకుంటున్నారు.

అందువలనే సహజ మార్గానికి బదులు సహన మార్గంగా అనుభవం చేసుకుంటున్నారు. ఇటువంటి పిల్లలు బాబాతో అంటే బాబా యొక్క జ్ఞానంతో లేదా జ్ఞానం యొక్క ధారణా మార్గంతో అసంతుష్టంగా ఉంటారు. మరియు స్వయంతో స్వయం కూడా అసంతుష్టంగా ఉంటారు మరియు సర్వుల సంబంధ సంపర్కాలతో కూడా అసంతుష్టంగా ఉంటారు. దీని కారణంగా ప్రసన్నంగా అంటే సదా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే సంతుష్టంగా అంటే ప్రసన్నచిత్త్ గా మరియు ఇప్పుడిప్పుడే అసంతుష్టంగా ఉంటారు. అందువలన సంగమయుగం యొక్క విశేష ఖజానా అయిన అతీంద్రియసుఖాన్ని అనుభవం చేసుకోలేకపోతున్నారు. కనుక ఈరోజు నుండి సదా సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేష వరదానం స్వయం కూడా తీస్కోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి. ఈ విధంగా బాబా యొక్క లేదా మీ యొక్క ప్రశంస జరుగుతుంది. ప్రశంసకి శ్రేష్ట సాధనం - ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క ప్రసన్నత, ఏ కార్యంలోనైనా సర్వుల ప్రసన్నత ఆధారంగానే ప్రశంస లభిస్తుంది. ఈ యజ్ఞం యొక్క అంతిమ ఆహుతి - సర్వ బ్రాహ్మణుల సదాకాలిక ప్రసన్నత. అప్పుడే ప్రత్యక్షత అంటే ప్రశంస యొక్క ధ్వని మారు మ్రోగుతుంది అంటే విజయం యొక్క జెండా ఎగురుతుంది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా? సదా ప్రసన్నంగా ఉండండి మరియు సదా సర్వులను ప్రసన్నం చేయండి. మంచిది.

ఈవిధంగా సదా బాబా యొక్క ఆజ్ఞాకారులకు, సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండేవారికి, సర్వులకు సదా ప్రసన్నత యొక్క వరదానాన్ని ఇచ్చే మహాదాని, వరదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.